code 1 title దేవునిస్తుతియించుడి యెల్లప్పుడు *ref దేవునిస్తుతియించుడి యెల్లప్పుడు దేవుని స్తుతియించుడి - ఆ...ఆ... *1 ఆయన బలమును - ప్రసిద్ధి చేయు- ఆకాశ విశాలమందు -ఆ..ఆ..||దేవుని|| *2 ఆయన పరాక్రమ- కార్యములను బట్టి ఆయన ప్రభావమును-ఆ..ఆ.. ||దేవుని|| *3 బూర ధ్వనితో - ఆయనన్‌ స్తుతించుడి స్వరమండలములతో-ఆ...ఆ.. ||దేవుని|| *4 సన్నని తంతుల - సితారతోను చక్కని స్వరములతో-ఆ...ఆ... ||దేవుని|| *5 పిల్లన గ్రోవిని - చల్లగ నూది ఎల్ల ప్రజలు చేరి - ఆ...ఆ.. ||దేవుని|| *6 తంబురతోను - నాట్యముతోను తంతి వాద్యముతోను - ..ఆ..||దేవుని|| *7 మ్రోగు తాళములతో - ఆయనన్‌ స్తుతించుడి గంభీర తాళముతో - ఆ...ఆ... ||దేవుని|| *8 సకల ప్రాణులు-యెహోవాన్‌స్తుతించుడి హల్లెలూయ ఆమెన్‌-ఆ...ఆ... ||దేవుని|| === code 2 title యెహోవా - నా బలమా *ref యెహోవా - నా బలమా యధార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీమార్గం *1 నా శత్రువులు నను చుట్టినను నరకపు పాశము లరికట్టినను వరదవలె భక్తిహీనులు పొర్లిన విడువక నను ఎడబాయనిదేవా ||యె|| *2 దయగల వారిపై దయచూపించును కఠినుల యెడలను వికటము చూపును గర్విష్టుల యొక్క గర్వము నణచును సర్వము నెరిగిన సర్వాధికారి ||యె|| *3 మరణపు టురులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తన యాలయములో నా మొర వినెను అదరెను ధరణి భయకంపముచే ||యె|| *4 పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులువణకెను తన నోట నుండి వచ్చిన యగ్ని దహించి వేసెను వైరులనెల్ల ||యె|| *5 మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగ జేయును ఉరుములు మెరుపులు మెండుగజేసి అపజయమిచ్చును అపవాదికిని ||యె|| *6 నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగగ జేయును జలరాసులనుండి బలమైన చేతితో వెలుపల జేర్చిన బలమైన దేవుడు||యె|| *7 నా కాళ్ళను లేడి కాళ్ళగజేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి రక్షణ కేడెము నాకందించి అక్షయముగ తన పక్షము జేర్చిన ||యె|| *8 యెహోవా జీవముగల దేవా బహుగా స్తుతులకు అర్హుడవీవె అన్య జనులలో ధన్యత జూపుచు హల్లెలూయ స్తుతి గానము చేసెద ||యె|| === code 3 title ఎల్లవేళలందు - కష్టమందైనను *ref ఎల్లవేళలందు - కష్టమందైనను కృతజ్ఞాస్తుతులు - చెల్లింతున్‌ యేసువా నిన్ను నే - స్తుతింతున్‌ స్తుతింతున్‌ జీవిత - మంతయు - స్తుతింతున్‌ *1 ఆదియు నీవే - అంతము నీవే జ్యోతియు నీవే-నా శాంతియు నీవే ||ఎ|| *2 తల్లి దండ్రియు - దాతవు నీవే కోటయు నీవే-నా బాటయు నీవే ||ఎ|| *3 వ్యాధిలో నీవే - వృద్ధిలో నీవే బాధలో నీవే - నా సాధకుడవు ||ఎ|| *4 రక్షణ నీవే - దీక్షయు నీవే కాపరి నీవే - నా కర్తవు నీవే ||ఎ|| *5 ఆధారం నీవే - ఆనందం నీవే మోక్షము నీవే - నిరీక్షణ నీవే ||ఎ|| *6 దివిలో నీవే - భువిలో నీవే అపాయములో-సహాయము నీవే ||ఎ|| *7 దైవము నీవే - జీవము నీవే రాజువు నీవే - నా సర్వము నీవే ||ఎ|| === code 4 title స్తోత్రము యేసునాథా - నీకు సదా *ref *1 స్తోత్రము యేసునాథా - నీకు సదా స్తోత్రము యేసునాథా స్తోత్రము చెల్లింతుము - నీదు దాసులము - పిత్ర పుత్రాత్మలకు *2 నేడు నీదు నామ మం - దున మేము చేరి స్తుతించునట్లు చేసిన కృపకై - నీకే నిరతము - స్తోత్రము చేసెదము *3 నీదు రక్తధారచే - కలిగిన - సజ్జీవ నవ మార్గము దాసులము తండ్రి - సన్నిధి చేరను నిత్యము స్వతంత్రము *4 ఇట్టి ప్రభావమైన - పదవిని పురుగుల మగు మాకు ఇంత దయతోడ - నిచ్చిన కృప మా కెంతయో నాశ్చర్యము *5 దూతల సైన్యములు – శృంగార గీతముల నెప్పుడు రాజాధిరాజా నీకు - స్తుతులు పాడుచు - నార్భటించుచుందురు *6 నీవు తప్ప మాకు - పరమందున వేరెవ్వరు గలరు ఇద్ధరయందు - నీవు తప్ప మాకు ఆదరణ యెవరు === code 5 title కర్తా నిన్‌ స్తుతించెదము *ref కర్తా నిన్‌ స్తుతించెదము పరిశు...ద్ధ సంఘము పాడి కొనియాడి ఇహ మందెన్నడు కానని ఆశ్చర్య కార్యముల్‌ మాకై చేసితి వనుచు ||కర్తా|| *1 సీయోను సంతసించు పరమానందము నీకు లభించె గాన సీయోను సంతసించు రక్షకుడేసుని - మనసార మ్రొక్కి పరవశమొందు-ధన్యత నిచ్చిన ||కర్తా|| *2 కన్నార చూచితిమి - దైవ రక్షణను రుచియించి యెరిగితి కన్నార చూచితిమి లెక్కింపలేని - కృపలతో నిన్ను దర్శించి - దీవింప నిశ్చయించిన||కర్తా|| *3 పవిత్ర సంఘమా - యేసు వెదకి వెంటాడి స్వంతము చేసిన పవిత్ర సంఘమా సత్తులేకుండా - పడియున్న నీకు రక్తము నిచ్చి - జీవింపజేసిన ||కర్తా|| *4 అన్యురాలా! సీయోనూ! - నిన్ను తృణీకరించక చేతనెత్తికొనె అన్యురాలా! సీయోనూ! యేసుని నీతి - ధరింప జేసి పెండ్లి కుమార్తె సౌందర్యమిచ్చిన ||కర్తా|| *5 శృంగార కన్యలారా! - పరిశు...ద్ధ గానముతో స్తుతించుడి శృంగార కన్యలారా! సాటి లేని - పెండ్లి కుమారుడేసుని మహిమ పరచు-భాగ్యంబు నొసగిన === code 6 title నా యాత్మా! నా యంతరంగమా! *ref నా యాత్మా! నా యంతరంగమా! నీ ప్రభువును స్తుతియించుము యిన్నాళ్లు-ప్రేమించి - కాపాడిన నీ ప్రభువును - స్తుతియించుము *1 పరలోక వాసుల్‌ - భూలోక వాసుల్‌ కొనియాడ తరమే-నీ మహిమన్‌||నా|| *2 తరతరములకు - మార్పు చెందని అంతములేని - దేవుని ||నా|| *3 నీ దోషములు - లోపములన్నియు క్షమియించి - మరచుదేవుని ||నా|| *4 వ్యాధిలో బాధలో - దయ చూపించి స్వస్థత నిచ్చిన - దేవుని ||నా|| *5 కరుణను - కిరీటముగా నీకు ధరియింప - జేసిన దేవుని ||నా|| *6 అనుదినము - నా హృదయమా నీవు స్తుతియించు-ప్రభుని మనసార ||నా|| === code 7 title సాగిలపడి మ్రొక్కెదము - *ref సాగిలపడి మ్రొక్కెదము - సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని - ఆ....ఆ....ఆ.... *1 మోషే కంటె శ్రేష్టుడు - అన్ని మోసముల నుండి విడిపించున్‌ వేషధారులను ద్వేషించున్‌ ఆశతో మ్రొక్కెదము ||సాగి|| *2 అహరోను కంటె శ్రేష్టుడు మన ఆరాధనకు పాత్రుండు ఆయనే ప్రధాన యాజకుడు అందరము మ్రొక్కెదము ||సాగి|| *3 ఆలయము కన్న శ్రేష్టుడు – నిజ ఆలయముగ తానే యుండెన్‌ ఆలయము మీరే యనెను ఎల్లకాలము మ్రొక్కెదము ||సాగి|| *4 యోనా కంటె శ్రేష్టుడు ప్రాణదానముగా తన్ను అర్పించెన్‌ మానవులను విమోచించెన్‌ ఘనపరచి మ్రొక్కెదము ||సాగి|| *5 సొలోమోను కన్న శ్రేష్టుడు సర్వజ్ఞానమునకు ఆధారుండు పదివేలలో అతి ప్రియుండు పదిలముగా మ్రొక్కెదము ||సాగి|| *6 రాజులకంటె శ్రేష్టుడు యాజకులనుగా మనలను చేసెన్‌ రారాజుగ త్వరలో వచ్చున్‌ రయముగను మ్రొక్కెదము ||సాగి|| *7 అందరిలో అతి శ్రేష్టుడు – మన కందరికి తానే ప్రభువు హల్లెలూయకు పాత్రుండు అనుదినము మ్రొక్కెదము ||సాగి|| === code 8 title యేసు పరిశుద్ధ నామమునకు *ref యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే *1 ఇహపరమున మేలైన నామము శక్తి గలిగి నట్టి నామమిది పరిశుద్ధులు స్తుతించు నామమిది పరి... ||యేసు|| *2 సైతానున్‌ - పాతాళమును జయించు వీరత్వము గల నామమిది జయమొందెదము ఈ నామమున జయ... ||యేసు|| *3 నశించు పాపుల రక్షింప లోక మున కేతెంచిన నామమిది పరలోకమున చేర్చు నామమిది పర... ||యేసు|| *4 ఉత్తమ భక్తులు పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామమిది లోకమంతా ప్రకాశించు నామమిది లోక... ||యేసు|| *5 శోధన గాధల కష్ట సమయాన ఓదార్చి నడుపు నామమిది ఆటంకము తీసివేయు నామమిది ఆటం... ||యేసు|| === code 9 title తేనియ కంటెను-యేసుని నామం *ref తేనియ కంటెను-యేసుని నామం దివ్య మధుర - మౌను నీవు పరుగిడి రమ్ము-దివ్య సన్నిధికి దినము - ఓ మనసా! *1 లోకములోన - కష్టములెల్ల యేసుడు - భరియించెన్‌ పాపకీడును బాపెన్‌ - శాపము మాపెన్‌ తెలిసికో ఓ మనసా! ||తేనియ|| *2 పాపిన్‌ రక్షింప - ప్రాణము నిచ్చెన్‌ యేక కుమారుండు ఇది యెంతటి కరుణ నిరంతర ముండున్‌ స్తుతించుము ఓ మనసా! ||తేనియ|| *3 అరుణోదయమున - మంచువలె నీ లోకము మాయమగున్‌ నీవు యేసుని నామం నిరతము నమ్ము హత్తుకో ఓ మనసా! ||తేనియ|| *4 కష్టములోన – సంతోషమిచ్చు మిత్రుడు ఆ ప్రభువే తన రెక్కల క్రింద ఆశ్రయమిచ్చున్‌ నిశ్చయం ఓ మనసా! ||తేనియ|| *5 భూలోక వాసుల్‌ - పరలోక వాసుల్‌ ప్రభువుని - స్తుతియించుడి యేసు నెరిగిన వారే పరమున చేర తగుదురు ఓ మనసా! ||తేనియ|| === code 10 title ఎల్లప్పుడు స్తుతించు - నా యాత్మ *ref ఎల్లప్పుడు స్తుతించు - నా యాత్మ దేవుని ఎల్లప్పుడు స్తుతించు ఇన్నాళ్ళ వరకు - దేవుడు చేసిన(2) ఎన్నలేని మేళ్ళన్‌ మరువకుండ నీవు *1 నీ పాపంబులన్నియు - క్షమియించి మరచి నీ పాపంబులన్నియు నాశనకరంబైన వ్యాధిన్‌ తొలగించె (2) పృధివిన్‌ చూపిన ఇట్టి ప్రేమ నెంచి *2 ఎంత కృప జూపెను-నీ బ్రతుకునందు ఎంత కృప జూపెను నిత్యము-నీ తలపై కిరీటముంచి (2) చావకుండ నీదు ప్రాణంబున్‌ కాపాడె *3 మేలుతో - నీ నోటిని తృప్తి పరచెను మేలుతో - నీ నోటిని పక్షిరాజువలె నీదు యౌవనమున్‌ (2) క్రొత్తదగుచుండు నట్లుగ జేసెను *4 భూమికి - ఆకాశము - యెంత దూరమున్నదో భూమికి - ఆకాశము ఆయన-యందు-భయభక్తులున్నట్టి(2) వారియెడ నంత - కృపనధికంబు *5 మన్నింపు మహిమయు మన దేవుడిచ్చును మన్నింపు మహిమయు తూర్పునకు-పడమరకెంత దూరమో(2) నీ పాపంబులట్లు దూరంబు జేసెగా *6 తండ్రి జాలి పడడా? తన పిల్లలయందు తండ్రి జాలి పడడా? నీవు రక్షకుని - నమ్ముకొనినచో (2) ముదిమి వరకు - నిన్నెత్తి కొనును === code 11 title స్తోత్రింతుము నిను-మాదు తండ్రీ *ref స్తోత్రింతుము నిను-మాదు తండ్రీ సత్యముతో నాత్మతో నెపుడు పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం ||స్తో|| *1 ధవళ వర్ణుడ - రత్న వర్ణుడ సత్యరూపి యనబడువాడ నను రక్షించిన రక్షకుండ నాథ నీకె శరణం శరణం ||స్తో|| *2 శ్రేష్టయీవుల నిచ్చినందున శ్రేష్ట యీవుల ఊట నీవె త్రిత్వమై యేకత్వమైన త్రి యేకదేవా శరణం శరణం ||స్తో|| *3 పాపి మిత్రుడ పాప నాశుడ పరమ వాసుడ ప్రేమ పూర్ణుడ వ్యోమపీఠుడ స్వర్గ పూజ్యుడ పరిశుద్ధాంగుడ శరణం శరణం ||స్తో|| *4 సంఘమునకు శిరస్సు నీవె రాజ నీకె నమస్కారములు ముఖ్యముగను మూలరాయి కోట్ల కొలది శరణం శరణం ||స్తో|| *5 నీదు సేవకుల పునాదిది జ్ఞానమునకు మించిన తెలివి అందముగను కూడుకొనుచు వేడెదము శరణం శరణం ||స్తో|| *6 రాజ నీకె స్తుతి స్తోత్రములు గీతముల మంగళ ధ్వనులు శుభము శుభము శుభము నిత్యము హల్లెలూయ ఆమెన్‌ ఆమెన్‌ ||స్తో|| === code 12 title జై జై జై జై రాజుల రాజ *ref జై జై జై జై రాజుల రాజ పాత్రుడ నీవే మా ప్రభు నీవే జై జై జై జై రాజుల రాజా *1 అన్ని కాలములలో నీ నామము మహోన్నతంబౌ - మహోన్నతుండ వాగ్దానము నెరవేర్చిన దేవ మాట తప్పని మహోపకారి ||జైౖ|| *2 దూతల మాదిరి గీతముల్‌ పాడుచు సతతము నిన్నే స్తోత్రించెదము గొల్లలు గాంచిన ఘన కాపరి మా ఉల్లములందు ఉల్లసించెదము ||జైౖ|| *3 తూర్పున తారను గాంచిన జ్ఞానులు రాజుల రాజ నీవే యనుచు బంగారము సాంబ్రాణి బోళమును అర్పించి ఆరాధించిరిగా ||జైై|| *4 ధనవంతుడ వగు ఓ మా ప్రభువా ధనహీనుడుగా నైతివ మాకై - మా దారిద్య్రము తీసివేయ నరరూపమున - జన్మించితివా ||జై|| *5 యేసు ప్రభుండ రక్తము కార్చి ఎంచి మమ్ము విమోచించితివా ఎంచలేము నీ మేలుల నెపుడు ఎన్నదగిన మా దేవుడ వీవె ||జైౖ|| *6 మాకై సిలువలో మరణించితివా మరణపు ముల్లును విరచిన ప్రభువా యుగయుగములకు నీకె మహిమ నిరతము స్తోత్రము హల్లెలూయ ||జైౖ|| === code 13 title 1 ఎంత ఆనందము - ఎంత ఆనందము *ref *1 ఎంత ఆనందము - ఎంత ఆనందము చెప్ప శక్యమా ? రాజైన క్రీస్తు నా పాపంబులన్నియు మన్నించి వేసెగా *2 పాడెదం - ఆడెదం - కూడెదం మేము జయమార్భాటింతుము పాపము మన్నించి - జీవము నిచ్చిన యేసుని - స్తుతించెదం *3 పాపము - కోపము -శాపములన్నియు పరిహరించెను దేవాది దేవా ! నా యెదలో కేతెంచి ఆదరణ నిచ్చెన్‌ *4 అక్షయమైన రక్షణతో - తన పక్షము చేర్చెను నిశ్చయముగను - సాక్షులైయుండి యేసుని - చాటింతుము *5 ధవళ వస్త్రము - బంగరు మకుటం వాద్యముల తోను ఇహము కేతెంచి - పరము చేరిన రాజును - స్తుతింతుము === code 14 title సర్వమేసువే - నాకు సర్వమేసువే *ref సర్వమేసువే - నాకు సర్వమేసువే సర్వ దుఃఖ నష్ట పరిహార మేసువే *1 కాపరి - నన్‌ మేపును కాపుదల నిచ్చును భావశుద్ధి - భాగ్యమొసగు రక్షకుండేసుడే ||సర్వ|| *2 తల్లిదండ్రుల్‌-సోదరుల్‌ సర్వము నాకేసువే బంధువర్గం - మిత్రులు సంపూర్ణ భాగ్యమేసువే ||సర్వ|| *3 దుఃఖములో - ఆదరణ చీకటిలో జ్యోతియు అన్ని వ్యాధి బాధల్‌ మాన్పు చెంతనుండు ఔషధం ||సర్వ|| *4 బోధకుండు - సాధకుండు యేసుడు నా నాథుడే రాకపోకలందు నాకు తోడుగుండు మిత్రుడే ||సర్వ|| *5 అందము - సుగంధము ఆస్థియు నా స్వాస్థ్యము విమోచించి-హత్తుకొను ప్రియ మధ్య వర్తియే ||సర్వ|| *6 జీవాహార మయ్యెను వాంఛలన్ని తీర్చును జ్ఞానము - నిరీక్షణయు అంతులే నానందము ||సర్వ|| === code 15 title యేసయ్య నామం - శక్తిగల నామం *ref యేసయ్య నామం - శక్తిగల నామం సాటిలేని నామం - మధుర నామం *1 పాపము పోవును - భయమును పోవును పరమ సంతోషము - భక్తులకీయును *2 పరిమళ తైలము - యేసయ్య నామం భువిలో సువాసన - యిచ్చెడి నామం *3 మోకాళ్ళన్నియు - వంచెడి నామం సూటిగా ఒకటిగా - ప్రకాశించె నామం *4 దివిలో భువిలో - యేసయ్య నామం సైన్యాధిపతియగు - యేసయ్య నామం *5 నిన్న నేడు - మారని నామం నమ్మిన వారిని - విడువని నామం *6 సాతాను సేనను - జయించెడి నామం పాప పిశాచిని - తరిమెడి నామం *7 మధురం మధురం - యేసయ్య నామం జీవము నిచ్చును - యేసయ్యనామం === code 16 title స్తోత్రము చేసెదను *ref స్తోత్రము చేసెదను రక్షకుని స్తోత్రము చేసెదను(3) కరుణ గల ప్రభు ప్రేమస్వరూపుడు యూదాగోత్రపు సింహము నీవు *1 కన్య మరియ సుతుడై పశువుల తొట్టిలో పరుండెను (3) పశువుల పాకలో బాలయేసుని స్తుతియించి పూజించి కీర్తించెదను||స్తో|| *2 జ్ఞానులు వెదకిరి సర్వోన్నత జ్ఞానమూర్తిని (3) ఆకాశవీధిని సింహాసనాసీనున్‌ ప్రేమాస్వరూపిని ఆరాధించిరి ||స్తో|| *3 పొత్తిగుడ్డలతోడ చుట్టబడినట్టి రక్షకుని (3) దూతలు ఆరాధించిరి గొల్లలు వచ్చిరి మహిమను చూచిరి ఆరాధించిరి సంతోషించిరి ||స్తో|| *4 పాపుల కొరకై వచ్చిన పాపనాశకుడు (3) ఇదిగో లోకపు పాపము మోసిన రక్షకుడైన దేవుని గొఱ్ఱెపిల్ల ||స్తో|| === code 17 title లెక్కింపలేని స్తోత్రముల్‌ - దేవా *ref లెక్కింపలేని స్తోత్రముల్‌ - దేవా ఎల్లప్పుడు నే పాడెదన్‌ ఇంతవరకు నా బ్రతుకులో - నీవు చేసిన మేళ్ళకై (2) ||లె|| *1 ఆకాశ మహాకాశముల్‌ - దాని యందున్న సర్వంబును భూమిలో కనబడు వన్నీ - ప్రభువా నిన్నే కీర్తించును ||లె|| *2 అడవిలో నివసించుచున్నవన్నీ - సుడిగాలియు మంచును భూమిపై నున్న వన్నీ - దేవా నిన్నే పొగడును ||లె|| *3 నీటిలో నివసించు ప్రాణుల్‌ - ఈ భువిలోని జీవరాసులు ఆకాశమున ఎగురున వన్నీ - ప్రభువా నిన్నే కీర్తించున్‌ ||లె|| === code 18 title 1. హల్లెలూయ యేసు ప్రభున్‌ *ref *1 హల్లెలూయ యేసు ప్రభున్‌ ఎల్లరు స్తుతియించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి బలమైన పనిచేయు బలవంతున్‌ స్తుతియించుడి ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతియించుడి పః రాజులరాజైన యేసురాజు భూజనుల నేలును హల్లెలూయ హల్లెలూయ దేవుని స్తుతియించుడి *2 తంబురతోను వీణతోను ప్రభువును స్తుతియించుడి పాపమును రక్తముతో తుడిచెను స్తుతియించుడి బూరతోను తాళములన్‌ మ్రోగించి స్తుతియించుడి నిరంతరము మారని యేసుని స్తుతియించుడి *3 సూర్యచంద్రులార ఇల దేవుని స్తుతియించుడి హృదయమును వెలిగించిన యేసుని స్తుతియించుడి అగ్నివడగండ్లార మీరు కర్తను స్తుతియించుడి హృదయమును ఛేదించిన నాధుని స్తుతియించుడి *4 యువకులారా,పిల్లలారా దేవుని స్తుతియించుడి జీవితముల్‌ ప్రభుపనికై సమర్పించి స్తుతియించుడి పెద్దలారా ప్రభువులారా యెహోవాను స్తుతియించుడి ఆస్తులను యేసునికై అర్పించి స్తుతియించుడి *5 అగాధమైన జలములారా యెహోవాను స్తుతియించుడి అలలవలె సేవకులు లేచిరి స్తుతియించుడి దూతలారా భక్తులారా దేవుని స్తుతియించుడి పరమందు పరిశుద్ధులు ఎల్లరు స్తుతియించుడి === code 19 title కృతజ్ఞతతో స్తుతింతు ఎల్లప్పుడు *ref కృతజ్ఞతతో స్తుతింతు ఎల్లప్పుడు యేసుని స్తుతియింతు శక్తిమంతుడు, శ్రేష్టుడును సత్యవంతుడునగు ప్రభు *1 యెరికో గోడలు యెదురొచ్చినా మార్గదర్శి యేసు ప్రభువే భయపడకు, వెనుకాడకు స్తుతియించిన కూలును *2 ఎఱ్ఱ సముద్రము దాట వచ్చినా, సిలువ నీడలో సాగిపో పాడెదము, స్తుతించెదము మార్గము తెరువబడును *3 శరీరం, జీవం, ఆత్మయును అలసిన సమయములో యెదస్తుతితో నిండినచో దివ్య బలమొందెదము === code 20 title యేసు నీ దివ్య పాదాలకు *ref యేసు నీ దివ్య పాదాలకు శరణం శరణం శరణం ఆత్మనాథ పూజార్హుడవు శరణం శరణం శరణం *1 దూతలు కొనియాడు పరిశుద్ధుడవు మహారాజువు మానాధుడవు భయమెల్ల పారద్రోలు సహాయుడవు శరణం శరణం శరణం ||యేసు|| *2 విశ్రాంతి నిచ్చు దేవుడవు మాకష్టంబుల్‌ బాపువాడవు పేదనైన నన్ను ఆదరించుము శరణం శరణం శరణం ||యేసు|| *3 కృంగిన నన్ను బలపర్చువాడవు బలమిచ్చి నడిపించువాడవు నా శరీరాత్మల నర్పింతును శరణం శరణం శరణం ||యేసు|| === code 21 title సుందర పరమదేవ కుమారుడైన *ref సుందర పరమదేవ కుమారుడైన యేసుక్రీస్తున్‌ స్తోత్రించి పొగడి నిత్యం కొనియాడెదం అందలం భువికి తెచ్చి ప్రాణమును ధారబోసెను ఆదరించి మమ్ములను ఐక్యపర్చెన్‌ ఆత్మను కుమ్మరించెన్‌ కృపలతో నాదరించెన్‌-స్తుతి ||స్తు|| *1 పాపకూపమున పడి పాప శాపము నొందిన పాపులను రక్షింపను ప్రాణమిచ్చెను దేవుని కిష్టులైన ప్రజలుగ మార్చిన మెస్సయ్యాను విశ్వసించు భక్తులార నీతిపరుడైన న్యాయాధిపతి పాదముల చేరుడి, పశ్చాత్తాపమొందుడి జయోత్సవం చేయుడి స్తుతి చెప్పి పాడుడి-పాడుడియంచు ||స్తు|| *2 ఆకాశపు జ్యోతులన్ని లెక్కలేని దూతసైన్యం అద్భుతముగ క్రీస్తును ఆరాధించిరి మంటిలోని జాతులన్ని శ్రేష్టమైన వస్తువులన్ని శక్తిమంతుడని స్తుతి పాడి పొగడిరి అందరికి తండ్రి యొకే పావన కుమారుని కీర్తించను పాదములు మ్రొక్కను అనేకులు చేరను - స్తుతి గీతి పాడుడి - పాడుడి యంచు ||స్తు|| *3 రాజులు జ్ఞానులు మేధావులు యందరును కలసి కృపతో జీవించుచుండగాను ఏ ప్రాంతభక్తులైన విశ్వాసులందరును సమాధానంతో జీవించుచుండగా సద్బోధకులు సత్యసంఘములు లేచి జీవించిన సైతాన్‌ పారిపోవును జయం మనది యగును యని పాడి పాడుడి - పాడుడి యంచు ||స్తు|| === code 22 title నీ పాదం మ్రొక్కెదన్‌ నిత్యము స్తుతించి *ref నీ పాదం మ్రొక్కెదన్‌ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా(2) *1 పరిశుద్ధమైన పరవశమే పరమ యేసుని కృపావరమే (2) వెదకి నన్ను కనుగొంటివి పాడుటకు పాట నిచ్చితివి(2) ||నీ|| *2 మా హృదయ దీపము నీవు మాదు రక్షకా నా ప్రార్థన (2) ప్రేమించెదన్‌ యేసు నాథా ప్రేమ ముఖము దర్శించెదను(2) ||నీ|| *3 పరిశుద్ధమైన కీర్తితోను ప్రకాశమైన శిఖరముపై (2) శ్రీఘ్రముగా చేర్చెదవు సీయోనులో నిన్ను కీర్తించెదన్‌(2) ||నీ|| === code 23 title కుతూహల మార్భాటమే *ref కుతూహల మార్భాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నాయేసుని సన్నిధిలోన *1 పాపమంత పోయెను - రోగమంతా తొలగెను-యేసుని రక్తములో క్రీస్తునందు జీవితం-కృపద్వారా రక్షణ పరిశుద్ధ ఆత్మలో ||కుతూ|| *2 దేవాది దేవుడు ప్రతిరోజు నివసించె దేవాలయం నేను ఆత్మలోన దేవుడు గుర్తించె నన్ను అద్భుత మద్భుతమే ||కుతూ|| *3 శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు జయంపై జయమిచ్చును ఏకముగా కూడి హోసన్నా పాడి ఊరంతా చాటెదము ||కుతూ|| *4 బూరాధ్వనితో పరిశుద్ధులతో యేసు రానై యుండే ఒక్క క్షణములోనే రూపాంతరము పొంది మహిమలో ప్రవేశిద్దాం ||కుతూ|| === code 24 title 1 స్తుతించి పాడను పాత్రమైన *ref *1 స్తుతించి పాడను పాత్రమైన పావన యేసుని నామమదే స్తుతుల మధ్యలోన వాసంచేయు పవిత్రుని భక్తితో స్తోత్రింతుము ఆ..అద్భుతమే - ఆ...నడుపుదల ఆనందమే పరమానందమే కృతజ్ఞ-స్తుతితో యెద పొంగుచుండె మనం హల్లెలూయా స్తుతి చాటెదము *2 గతించినట్టి కాలమెల్లన్‌ కంటి పాపగ మము కాపాడెన్‌ ప్రభువు నే నమ్మి జీవించగా కృపను చూపెన్‌ స్తోత్రింతుము *3 అగ్ని మధ్యను నడచినను లోతైన జలమును దాటినను శోధనలు ఎన్నో పెరిగినను జయం మనదేయని స్తోత్రింతుము *4 ఈ అరణ్య యాత్రలో మంచి యేసు మనతో నుండును మన రాకపోకలయందును కాచును గావున స్తోత్రింతుము === code 25 title ఆనందం -ఆనందం *ref ఆనందం -ఆనందం దినదినం ఆనందం యేసురాజు నా స్వంతమాయెను ఈలోకమందు నా బంధువాయనే నామదిలో స్వంతమాయెను (2) ఆ...ఆనందమే-పరమానందమే ఇది మహా గొప్ప భాగ్యమే ||ఈ|| *1 చిన్న ప్రాయమునే - నన్నెరిగియుండెన్‌ తప్పిపోయినన్‌ కనుగొనెను (2) తనదు ప్రాణము నాకర్పించి జీవం పొందుమని చెప్పెను *2 ఏ స్థితిలోనైన ప్రభుప్రేమతో నన్ను విడువక కాపాడును తాను నమ్మి నాకు ఇచ్చిన పనిని ప్రభు వచ్చువరకు-కాచుకొందును *3 ప్రభు వచ్చు దినమున-తనచేయి చాచి ప్రేమతో పిలిచి చేర్చుకొనును ప్రభు సమూహమందు అచ్చటాయనతో ఆడిపాడి సంతోషించెదన్‌ === code 26 title ఆయనే నా సంగీతము *ref ఆయనే నా సంగీతము బలమైనకోటయును జీవాధిపతియు ఆయనే జీవితకాలమంత స్తుతించెదను *1 స్తుతుల మధ్యలోన వాసంచేసి దూతలెల్ల పొగడె దేవుడాయనే వేడుచుండు భక్తుల మొరలు విని దిక్కులేని పిల్లలకు దేవుడాయనే *2 ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన వుండెదననిన నా దేవుని కరములు చాచి నిత్యము స్తుతించెదను *3 సృష్టికర్త క్రీస్తు యేసు నామమును జీవిత కాలమంత కీర్తించెదను రాకడలో ప్రభుతో నిత్యముందును మ్రొక్కెదను కీర్తింతును పొగడెదను === code 27 title ఆరాధింతున్‌ నేనారాధింతున్‌ *ref ఆరాధింతున్‌ నేనారాధింతున్‌ నా ప్రభు యేసుని ఆరాధింతున్‌ *1 బలమైన దేవుని ఆరాధింతున్‌ నిజమైన దేవుని ఆరాధింతున్‌ ||ఆరా|| *2 చూస్తున్న దేవుని ఆరాధింతున్‌ కాపాడు దేవుని ఆరాధింతున్‌ ||ఆరా|| *3 పరిశుద్ధమనస్సుతో ఆరాధింతున్‌ సాష్టాంగపడి నేనారాధింతున్‌ ||ఆరా|| *4 ఆత్మతో నేను ఆరాధింతున్‌ సత్యముతో నేనారాధింతున్‌ ||ఆరా|| *5 దూతలతో నేనారాధింతున్‌ స్తుతియాగములతో ఆరాధింతున్‌ ||ఆరా|| === code 28 title మహిమ ప్రభు నీకే *ref మహిమ ప్రభు నీకే ఘనత ప్రభు నీకే స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభు నీకే ఆరాధన, ఆరాధన నా ప్రియుడు యేసునికే నా ప్రియుడు దేవునికే *1 అమూల్యమైన నీ రక్తముతో విడుదల నిచ్చితివి రాజులవలె యాజకులవలె నీకై పిలిచితివి ||ఆరా|| *2 వెలుగుగ త్రోవన్‌ తోడైయుండి నడిపించు దైవమా ప్రేమశక్తితో అగ్నితో వెలిగించు అభిషేక నాథుడా ||ఆరా|| *3 ఏ వేళ వున్నట్టి రాబోవుచున్నట్టి మా గొప్పరాజువు నీ నామం హెచ్చున్‌ నీ రాజ్యం వచ్చున్‌ నీ చిత్తం నెరవేరును ||ఆరా|| === code 29 title 1. జీవమైన యేసయ్య రమ్ము *ref *1 జీవమైన యేసయ్య రమ్ము జీవమార్గమందు నడుపుము జీవ జల ఊటబుగ్గల జీవదాత నన్ను నడుపుమూ... యేసయ్యా గొప్ప దేవుడా యేసయ్యా పరిశుద్ధుడా యేసయ్యా మంచి దేవుడా యేసయ్యా శక్తి మంతుడా యేసు నీకు ఆరాధనా చెల్లింతుమూ నిరతమూ *2 మేము పాపద్రోహులమయ్యా పాప ఆదాము జనులము పాపులబ్రోవ పాపముగనూ పరిహరింప సిలువ నొందితివా ||యే|| *3 పాపపు ప్రజల కోసము పారె నీ రక్తధారలు అంత బాధ నొంది నీవు ప్రేమగల ఆత్మనొసగితివా ||యే|| *4 వాగ్దాన జనులమయ్యా మేము మారని దేవుడ వీవు నీవు మాకు రక్షకుడవు నిన్ను మేము కొలుతుము సదా ||యే|| === code 30 title ప్రేమా - ప్రేమా *ref ప్రేమా - ప్రేమా ప్రేమా ప్రియుడవు నీవే ఆనందమానందమే *1 నీ ప్రేమ రుచియించిననాడే నన్ను నేను మరచితినయ్యా నీ ప్రేమధికమయ్యా నా పై నీ ప్రేమధికమయ్యా ||ప్రేమా|| *2 పరలోక ప్రశస్తరాజా ప్రేమతో నేతెంచినావా ప్రేమ తెలియగలనా నీ ప్రేమ లోతు నెరుగగలనా ||ప్రేమా|| *3 ద్రోహినై ఎన్నాళ్ళో నిన్ను గాంచక తిరిగితినయ్యా ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగలించితివే ||ప్రేమా|| *4 ఇహలోక సకల మహిమ పువ్వులవలె వాడిపోవున్‌ వాడదే అయ్యా నీ ప్రేమ వాడిపోదయ్యా ||ప్రేమా|| *5 నీ ప్రేమ మాధుర్యమును వివరింప తరమౌనే నాకు అతి సులభముగానే పరమున వివరించగలను ||ప్రేమా|| === code 31 title నా నోటన్‌ క్రొత్త పాట *ref నా నోటన్‌ క్రొత్త పాట నా యేసు యుంచెను ఆనందించెదను - ఆయననే పాడెదన్‌ జీవిత కాలమంత - హల్లెలూయ *1 పాపపు బురద నుండి - లేవనెత్తెను జీవ మార్గమున నన్ను - నిలువబెట్టెను *2 వ్యాధి బాధలందు నన్ను - ఆదుకొనెను కష్టములన్ని తొలగించి- శుద్ధీకరించెను *3 తల్లిదండ్రి బంధుమిత్రు-దూరమాయెనే నిందనుభరించి ఆయన మహిమ చాటెదన్‌ *4 ఇహలోక శ్రమలు - నన్నేమి చేయును పరలోక జీవితమునే - వాంఛించెదను === code 32 title ప్రభుపై భారమెల్ల మోపుమయా *ref ప్రభుపై భారమెల్ల మోపుమయా కలత చెందకుమా కాపాడు ప్రభుడొక్కడున్నాడయా కనుపాపలా కాచునూ *1 నీతిమంతుడు పడిపోడయ్యా నిత్యము కాపాడి నడిపించును ||ప్రభు|| *2 నీడగ ఉండి కాపాడును ఆశ్రయమిచ్చి ఆదుకొనును ||ప్రభు|| *3 తల్లియు తండ్రియు విడిచిననూ కౌగిలిలో నన్ను దాచుకొనును ||ప్రభు|| *4 మన పక్షమున ప్రభువుండగా కదలక మెదలక నేనుందును ||ప్రభు|| === code 33 title ఎవరు నన్ను చేయి విడిచినన్‌ *ref ఎవరు నన్ను చేయి విడిచినన్‌ యేసు చేయి విడువడు చేయి విడువడు నిన్ను చేయి విడువడు *1 తల్లియాయెనే తండ్రియాయెనే లాలించును పాలించును ||ఎవ|| *2 వేదన శ్రమలు ఉన్నప్పుడెల్ల వేడుకొందునే కాపాడునే ||ఎవ|| *3 రక్తముతోడ కడిగివేశాడే రక్షణ సంతోషము నాకు ఇచ్చాడే||ఎవ|| *4 ఆత్మచేత అభిషేకించి వాక్యముచే నడుపుచున్నాడే ||ఎవ|| === code 34 title ఎవని అతిక్రమము - మన్నింపబడెనో *ref ఎవని అతిక్రమము - మన్నింపబడెనో పాప పరిహార మెవడొందేనో వాడే ధన్యుండు *1 యెహోవాచే నిర్దోషిగా - తీర్చబడియు ఆత్మ - లో కపటములేని వాడే ధన్యుండు ||ఎవని|| *2 మౌనియైయుండ దినమెల్ల నే చేసినట్టి ఆర్త - ధ్వనిచే నా యెముకలు - క్షీణించెను ||ఎవని|| *3 దివారాత్రులు నీ చెయ్‌ నాపై బరువైయుండ నా సారము వేసవిలో ఎండినట్లాయె ||ఎవని|| *4 నేను నా దోషమును - కప్పుకొనక నీ యెదుట నా పాపము నొప్పుకొంటిని ||ఎవని|| *5 నీ సన్నిధి నా యతిక్రమము నొప్పు కొనగా నీవు నా దోషమును మన్నించితివిగా ||ఎవని|| *6 కావున నీ దర్శన- కాలమందు భక్తి గలవారందరు నిన్ను ప్రార్థింతురు ||ఎవని|| *7 విస్తారము జలప్రవాహము పొర్లినను నిశ్చయముగా నవి వారి మీదికి రావు ||ఎవని|| === code 35 title యేసుని కుటుంబమొకటున్నది *ref యేసుని కుటుంబమొకటున్నది ప్రేమతో నిండిన స్థలమొకటున్నది రాజాధిరాజైన యేసు నిరంతరం పాలించును (2) *1 హెచ్చు తగ్గుల్‌ అక్కడసలె లేవు పేద గొప్ప బేధములే లేవు ||రా|| *2 పాపం లేదు అక్కడ, శాపం లేదు వ్యాధిలేదు, ఆకలసలే లేదు ||రా|| *3 సంతోషము, సమాధానముంది విజయముంది, స్తుతి గీతముంది ||రా|| === code 36 title దాసులార ధరణిని యేసుకు *ref దాసులార ధరణిని యేసుకు ప్రేమతో స్వంతము చేసెదం ప్రేమతోయేసుని చాటెదం ప్రభుని చూపింతుం చీకటి పోగొట్టి వెల్గు ప్రకాశింప *1 ప్రయాసపడి భారము మోయువారిని అతి ప్రేమతో ఆహ్వానింతుము పాప భారమెల్ల ప్రభువు మనో దుఃఖముల సర్వాధికారముతో మోసి తీర్చెను ||దాసు|| *2 ఆకలి వ్యాధులు గలవారికి ప్రేమతో సాయము జేసెదం ఉచితముగ మేళ్లతో నిండి తనను తానే మరచి యేసు ఓర్పుతో తిరిగెన్‌ ||దాసు|| *3 ఇరుకులు ఇబ్బందులు గలవారిని నీచులన్‌ ఘనులుగ మార్చెదం సహించలేని కష్టములలో నిష్ఠూరములలో అగాధ గోతిలో పడినవారిని ||దాసు|| *4 హిందూదేశ స్త్రీ పురుషులను వింత వెలుగునకు మార్చెదం సుందర సుగుణ శీలుఁడై అధిక జ్ఞానుండై బంధంబుల్‌ దెంచి ప్రవర్థమానుండై ||దాసు|| *5 మార్గము తప్పి నడుచువారిని సత్య మార్గములో చేర్చెదం పట్టుతో ప్రార్థన చేతుము ఆరాధింతుము సేవను జేతుము జయమొందెదం ||దాసు|| === code 37 title 1 ఉన్నత దేవుని - చాటున *ref *1 ఉన్నత దేవుని - చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను - విశ్రమించున్‌ ఆహా! పరమ ధన్యత యిదియే! (2) తన రెక్కల క్రింద ఆశ్రయము తన రెక్కలతో కప్పును (2) *2 దేవుడే నా ఆశ్రయం నా కోటయు దుర్గమును ఆయనే సత్యము - నా కేడెమును నే నమ్ముకొను దేవుడు (2) ||తన|| *3 రాత్రిలో భయముకైన పగటి బాణముకైన చీకటిలో తిరుగు తెగులుకైనను భయపడనే భయపడను(2) ||తన|| *4 వందలు వేలైన నీ ప్రక్కను కూలినను ఆయనే నీదు విమోచకుడు అపాయము తాకదు (2) ||తన|| *5 దేవుడే నీ ఆశ్రయం ఆయనే నీ నివాస స్థలం అపాయము తెగులు గుడారమును చెంతకు సమీపించవు (2) ||తన|| *6 నీ...దు మార్గము లన్నిటన్‌ తన దూతలు కాపాడున్‌ పాదమునకు రాయి తగులకుండా వారు నిన్నెత్తికొందురు (2) ||తన|| *7 కొదమ సింహము నణచి నాగు పాములన్‌ త్రొ....క్కి అతడు నన్ను ప్రేమించెను అతనికి జయమిత్తున్‌ (2) ||తన|| *8 నా...నామము నెరిగెన్‌ అతని ఘనపరచెదను శ్రమలో నేనతనికి తోడైయుండి నే నుత్తర మిచ్చెదను (2) ||తన|| === code 38 title 1 పాపమునకు జీతము మరణం *ref *1 పాపమునకు జీతము మరణం ఓ పాపి భయపడవా చూచునదెల్ల నశించు నిశ్చయం చూడనిదే నిత్యము యేసురాజు వచ్చును ఇంకాకొంత కాలమే మోక్షమందు జేరుదుము *2 లోక సుఖము నమ్మకు నమ్మకు ఆ యిచ్ఛలన్ని మాయమగును నీ జీవము పోవు సమయమున చిల్లిగవ్వ వెంటరాదు ||యేసు|| *3 నీ కాలమెల్ల వ్యర్థమగుచున్నది లోకమాయలలో - చిక్కినందున దైవకోపము దిగివచ్చుటకు ముందు నీ రక్షకుని జేరుము ||యేసు|| *4 దేవుని ప్రేమ పారుచున్నది కల్వరి గిరి నుండి యిదిగో నీ పాప మెల్లపోవును అందున స్నానము చేసినట్లయిన ||యేసు|| *5 మహా పాపినైన నన్నును నన్నును నా మిత్రుడంగీకరించెనే ఓ పాపి నీవు పరుగిడుమా దేవ దీవెనలు పొందుమా ||యేసు|| *6 కష్ట దుఃఖము లెక్కుడగుచో ఇష్టు డేసుని వీడకు వీడకు సిగ్గులేక చేరుము దేవుని చెంత నెప్పుడు వసించుము||యేసు|| *7 నీ పాపములకై మనస్తాపము బొంది యేసు నొద్దకు వేగరా భయమును పోగొట్టి మన్నింపగా స్తుతిపాడు హల్లెలూయా ||యేసు|| === code 39 title సంతోషం పొంగెను - సంతోషం పొంగెను *ref సంతోషం పొంగెను - సంతోషం పొంగెను సంతోషం పొంగిపొర్లెను... హల్లెలూయ యేసునన్ను రక్షించెన్‌... నా పాపము కడిగెన్‌ సంతోషం పొంగి పొర్లెను *1 త్రోవ తప్పి తిరుగుచుంటిని ఆ త్రోవలోనే పడిపోతిని అయినన్‌ యేసు కరుణించెన్‌ తానె నన్ను రక్షించెన్‌(2) ఇంత వరకు కాచినాడు మంచి యేసుడే ||సంతోషం|| *2 దేవుని సెలవు పొంది సాతాను శోధించును అయినన్‌ యేసు విడువడు తానె వచ్చి రక్షించును (2) ఇంత మంచి యేసు నాకు స్వంతమాయెను ||సంతోషం|| *3 మారుమనసు లేని ప్రజలు పాతాళ మందు ప్రలాపింతురు నేను పరమందున క్రొత్త గీతం పాడెదన్‌ నాలోనున్న యేసుతో నిరంతరముందును ||సంతోషం|| === code 40 title లెమ్ము తేజరిల్లుము నీకు *ref లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది యెహోవా మహిమ నీపై ప్రకాశముగా నుదయించె ||లెమ్ము|| *1 జనములు నీదు వెలుగునకు పరుగెత్తి వచ్చెదరు రాజులు నీదు ఉదయ కాంతికి వచ్చెదరు ||లెమ్ము|| *3 సముద్ర వ్యాపారము నీవైపు త్రిప్పబడును జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును ||లెమ్ము|| *4 దేవదారు సరళ గొంజి చెట్లు నా ఆలయమునకు తేబడును నాదు పాద స్థలము మహిమ పరచెదను ||లెమ్ము|| *5 నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగ జేతున్‌ బహుతరములకు సంతోష కారణముగ జేసెదను ||లెమ్ము|| *6 వారిలో ఒంటరియైన వాడు పది వందలగును ఎన్నిక లేనివాడు బలమైనట్టి జనమగును ||లెమ్ము|| === code 41 title భయమేల జనులారా *ref భయమేల జనులారా ప్రియ రక్షకుని చేర జయశీలుండౌ యేసున్‌ భయభక్తులతో ప్రార్థింపన్‌ *1 వేష భాషలు మాని మోస మార్గము వీడి దోషంబులను బాపున్‌ నీ సురక్షకుని యాసించు ||భయ|| *2 తిన్నని మార్గము విడిచి అన్న యేసుని మరచి ఎన్నాళ్ళు పాపములో నీదులాడుచు నుండెదవు? ||భయ|| *3 మన కలుషంబులు గడుగన్‌ మన గాయంబులు మాన్పన్‌ తన రక్తంబును గార్చెన్‌ మనకై తన ప్రాణము బెట్టెన్‌ ||భయ|| *4 సిలువలో నీ కొరకై కలిగించె రక్షణను పలుమారు గాయములన్‌ - తలచుచు ధ్యానించుము ప్రభుని ||భయ|| *5 హృదయంబు మోసంబు హృదయంబు ఘోరంబు హృదయ వ్యాధిని మాన్ప యెద నేరికైనను దరమే ||భయ|| *6 హృదయ మంతటినిచ్చి హృదయ శుద్ధిని బొంది హృదయ మంతటితోను సదయుండేసుని భజియింపన్‌ ||భయ|| *7 జీవంబు మార్గంబు సత్యంబులను జూపెన్‌ భావంబులను మార్చి జీవజలంబులు దయచేయున్‌ ||భయ|| *8 కోరుదువా యా ప్రభుని జేరుదువా యీ క్షణమే కోరెడు వారిని నేడే కోరిక దీరను రక్షించున్‌ ||భయ|| === code 42 title యేది నీ సాక్ష్యము *ref యేది నీ సాక్ష్యము యేది నీ త్యాగము యేసు వార్తను చాటింపను యేల నిర్లక్ష్యము లేచి రారమ్ము ఓ క్రైస్తవ *1 అపొస్తలులు శిష్యులు అపనిందలు హింసలు అన్నిటి భరియించిరి ఆత్మలు రక్షించిరి ||యేది|| *2 అగ్నికి ఆహుతియై అసువుల నర్పించిరి ఆరని నరకాగ్నికి దూరంబుగా నుండిరి ||యేది|| *3 ప్రాణాలు బలిచేసిరి ప్రభునెంతో సేవించిరి సింహాలకెరయైనను చింతేమి లేకుండిరి ||యేది|| *4 ఆపదలు అపనిందలు నిర్భంధమో బంధము చెఱసాల సంకెళ్ళును నీకేమి లేదిప్పుడు ||యేది|| *5 కోతెంతో విస్తారము కోసెడి వారెవ్వరు కొంతైన చేయంగను కోరిక గలిగుండాలి ||యేది|| === code 43 title 1. చీకటి కాలము వచ్చుచుండె *ref *1 చీకటి కాలము వచ్చుచుండె కృపకాలము నుపయోగించు తలుపులు తెరచి యుండగనే విరిగి మనస్సుతో సాగెదవా తలుపులు తెరచియుండగనే విరిగిన మనస్సుతో సాగెదవా? కాలమపాయముగా నుండే సమయము సద్వినియోగించు *2 బీడు భూములధికముగా చూచిన నీవు సాగిరా యేసుని వారికి చూపించు ప్రేమా వార్తను చాటించు ||తలు|| *3 ఎన్నో రాజ్యములీనాడు దేవుని పనికి మూయబడె తెరచిన తలుపులు యెదురుండన్‌ ప్రవేశింతురు జ్ఞానులు ||తలు|| *4 విశ్వాసుల సహవాసమున ప్రేమా ఐక్యత గలదు అని చెప్పెడి దినములు మన మధ్యకు రావలెను ||తలు|| *5 రానైయున్న బాధ్యతలు మన కధికము ప్రియులారా మనకు జయము కలుగుటకై వినయమున పోరాడెదము ||తలు|| *6 మాదు హృదయముల నింపు నీదు ప్రేమతో మా ప్రభువా హిందూ దేశపు వీధులలో నాథా నిన్నే చాటెదము ||తలు|| === code 44 title కుమ్మరీ ఓ కుమ్మరీ... *ref కుమ్మరీ ఓ కుమ్మరీ... జగదుత్పత్తిదారీ... జిగట మన్నయిన నా వంక చల్లగ చూడుమయా ||కుమ్మరీ|| *1 పనికి రాని పాత్రననీ-పారవేయకుమా పొంగి పొరలు పాత్రగచేసి-నన్ను నింపుమా సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసునే పొగడుచుండ సాక్షిగ నుండు పాత్రగ జేసి సత్యముతో నింపుము తండ్రీ ||కుమ్మరీ|| *2 విలువలేని పాత్రను నేను కొనువారు లేరెవ్వరూ వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగ జేసి ఆటంకములనుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా ||కుమ్మరీ|| *3 లోకాశలతో నిండి ఉప్పొంగుచు మార్గంబు నే తప్పితిన్‌ మనుషేచ్ఛలన్నియును స్థిరమనుచునే మనశ్శాంతి కోల్పోతిని పోగొట్టుకున్న పాత్ర యనుచు పరుగెత్తి నిను పట్టితి ప్రాణంబు నాలో నున్నప్పుడే నీ పాదంబుల్‌ నే బట్టితిన్‌ ||కుమ్మరీ|| === code 45 title ఉన్నత దేవుడు నీతో నుండగ *ref ఉన్నత దేవుడు నీతో నుండగ దిగులెందుకే మనసా! ఎంతో మంచివాడు శక్తి సంపన్నుడు మేళ్లకు కొదువలేదే ||ఉన్నత|| *1 పాపిగానున్న నిన్ను పరిశుద్ధ పరచెనుగా లేమిలోనున్న నిన్ను తన దయతో లేపెనుగా ||ఉన్నత|| *2 ఆనాడు మొఱ్ఱపెట్టిన ఆ హన్నా ప్రార్థన వినెను అనాధగానుండిన ఆ హాగరు నోదార్చెను ||ఉన్నత|| *3 యేసు నీ ముందు నడిస్తే ఆ యోర్దానున్‌ దాటగలవు విశ్వాసం నీకుంటే ఆ యెరికోనే కూల్చగలవు ||ఉన్నత|| === code 46 title 1. ఏలీయా దేవుడు మన దేవుడు *ref *1 ఏలీయా దేవుడు మన దేవుడు బలమైన దేవుడు మన దేవుడు (2) దాసుల యొక్క మొఱలు విని పరాక్రమకార్యముల్‌ చేయువాడు(2) యెహోవాయే దేవుడు (2) యంచు ఆర్భాటింతుం యెహోవాయే దేవుడు (2) యంచు ఆర్భాటింతుము *2 వేడుచుండు భక్తుల మొఱను విని వడగండ్లనాపిన గొప్ప దేవుడు కరువులోను విధవ యింట పాత్రలను ఆయనాశీర్వదించెన్‌ *3 గగనము తెరచిన గొప్ప దేవుడు అగ్నితోను బదులిచ్చెన్‌ జీవదేవుడు ఆ ప్రభువే దేవుడంచును సాగిలపడిరి దైవప్రజలు === code 47 title నీకు సాటి ఎవరు నా యేసు నాథా *ref నీకు సాటి ఎవరు నా యేసు నాథా ఈ లోకమందున నీకు సాటి ఎవరు? పాపపు ఊబిలో చిక్కి నేనుంటిన్‌ దేవా నీ ప్రేమతో నన్ను మన్నించితివి *1 లోకము శరీరం సాతాను క్రిందను బానిసగానే పాపిన్‌ జీవించితిని నెమ్మది లేకయే అపవిత్రునిగా నడిచితిని, మోసపోతినిగా వెదకితివా-నన్ను అయ్యా యేసునాథా నిన్ను మరచిన ఒక ద్రోహినయ్యా వెదకితివా-నన్ను అయ్యా యేసునాథా నీకే నేనిక దాసుడను *2 ఈ నాడు నే చేయు ఈ తీర్మానమును కాపాడుకొనను ఆత్మతో నింపుము విరచు, మలచు, వంచుము, నింపుము పరిమళమిచ్చి పవిత్రపరచుము పంచేంద్రియములు నీలో నిమగ్నమై యేసు నీ యాత్మతో నింపుము జయ జీవితము కలిగియుండను అగ్నితో నన్ను దహించుము. *3 ఇంటను బయటను వెళ్ళు ప్రతిచోటను శోధనల్‌ వచ్చిన ప్రభువా కాయుము మెస్సీయా వచ్చు కాలము వరకు కొందరిన్‌ సిలువ యొద్దకు ఆకర్షింపచేయుం మోకాళ్ళ మీదను వాక్యము ధ్యానింప దిన దినము కృపనిమ్ము నీకును నాకును అడ్డు ఏమి లేకుండ ఎప్పుడు కాపాడు నన్నును === code 48 title 1. నా హృదయము వింతగా మారెను(3) *ref *1 నా హృదయము వింతగా మారెను(3) నాలో యేసు వచ్చినందున సంతోషమే సమాధానమే (3) చెప్పనశక్యమైన సంతోషం *2 తెరువబడెను నా మనోనేత్రము యేసు నన్ను ముట్టినందున ||సం|| *3 ఈ సంతోషము నీకు కావలెనా నేడే యేసు నొద్దకు రమ్ము ||సం|| *4 సత్య సమాధానం నీకు కావలెనా నేడే యేసు నొద్దకు రమ్ము ||సం|| *5 నిత్యజీవము నీకు కావలెనా నేడే యేసు నొద్దకు రమ్ము ||సం|| *6 మోక్ష భాగ్యము నీకు కావలెనా నేడే యేసు నొద్దకు రమ్ము ||సం|| *7 యేసు క్రీస్తును నేడే చేర్చుకో ప్రవేశించు నీ యుల్లమందు ||సం|| === code 49 title లోయలెల్ల పూడ్చబడాలి *ref లోయలెల్ల పూడ్చబడాలి కొండలు కోనలు కదలిపోవాలి వక్రమార్గము సక్రమవ్వాలి కరకు మార్గము నునుపవ్వాలి (2) రాజు వస్తున్నాడు ఆయత్తమవుదాం(2) యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం (2) *1 ఫలం ఇవ్వని చెట్టులెల్ల నరకబడి అగ్నిలో వేయబడును (2) *2 గోధుమను వేర్పరచి గింజలను చేర్చి పొట్టును నిప్పులో కాల్చివేయును (2) *3 పరిశుద్ధులుగా మచ్చలు లేక ప్రభుకై జీవించి సాగిపోదాం (2) *4 రోజు రోజు మేల్కొని ప్రార్ధించెదం అభిషేక తైలముతో నింపబడెదం (2) === code 50 title యేసు నీ ప్రియ నామ-శబ్దం *ref యేసు నీ ప్రియ నామ-శబ్దం వి-శ్వాసుని చెవికి దివ్య-మైన ప్రీతి నిచ్చున్‌ ఆహా ఎంతో మధురం *1 ఆకలి-బాధన్‌ తీర్చు ఆత్మా- హారం అదియే గాయపడి-నట్టి-ఆత్మన్‌ ఆదరించు నామం *2 చింతలను బాపి బాధ-లన్ని-యు తీర్చున్‌ యేసు నామమందు భయమంతా పారిపోవున్‌. *3 గాయపడిన ఆత్మకు బలమొసగెడి నామం పాపకూపము-నుండి విడుదల - నిచ్చెడి నామం *4 ఎల్ల-ల్లేని-విస్తార కృప నొసగెడి నామం కాలమెల్ల స్థిరమైనట్టి ఆస్థి యేసు నామం. *5 మూర్ఛిల్లు వారికి ఆత్మీయ-భోజనం మాయ లోకమందు తన జ్ఞాన ధనమిచ్చున్‌ *6 నా ప్రభువా - నా జీవమ నా మార్గము-మరియు స్తుతి గీతి-స్తుతి- స్తోత్రము లంగీకరించుం === code 51 title సర్వశక్తుడు నా సొంతమయ్యెను *ref సర్వశక్తుడు నా సొంతమయ్యెను మృత్యుంజయుడు నా జీవమయ్యెను - 2 అహహా ఇది అద్భుతమేగా ఓహోహో ఇది నిజమేగా *1 కనుగొంటిని ఐశ్వర్యము చేపట్టితి ఒక గనిని యేసుడే నా రక్షకుడు యేసుడే నా రారాజు *2 సంతోషము సమాధానము నా మదిలో పొంగునయా పాపమంతా పెకిలించే భయమంతా తొలగించే *3 పరలోకములో నా పేరు వ్రాశాడు నా యేసు బ్రతుకంతా ఒక ఆశ యేసునికై నే జీవిస్తా === code 52 title రమ్మూ నీ తరుణమిదే పిలుచుచున్నాడు *ref రమ్మూ నీ తరుణమిదే పిలుచుచున్నాడు నీ ప్రభువైన యేసు నొద్దకు - రమ్మూ *1 జీవితమంతయు వ్యర్థముగాను దుఃఖముతోను గడుపుటయేల వచ్చి ఆయన శరణుజొచ్చినచో వాంఛతో నిన్ను స్వీకరించున్‌ ||రమ్మూ|| *2 కట్టిన యిల్లు ధన ధాన్యములు కనబడు బంధు మిత్రాదులును గూడు విడచి నీవు పోయినచో వెంట నీతో రారెవరు ||రమ్మూ|| *3 అందము మాయ నిలకడలేనిది దాని నమ్మకుము మోసగించును మరణము ఒకనాడు వచ్చున్‌ మరువకు నీ ప్రభువును ||రమ్మూ|| *4 మిన్ను క్రిందన్‌ భూమి మీదన్‌ మిత్రుడు యేసునామముగాక రక్షణ పొందు దారిలేదు రక్షకుడేసే మార్గము ||రమ్మూ|| *5 తీరని పాప వ్యాధులను మారని నీదు బలహీనతను ఘోర సిలువలో మోసి తీర్చెన్‌ గాయములచే బాగుపడన్‌ ||రమ్మూ|| *6 సత్యవాక్కును నమ్మిరమ్ము నిత్యజీవము నీకు యిచ్చును నీ పేరు జీవపుస్తకమునందు నిజముగ ఈనాడే వ్రాయున్‌ ||రమ్మూ|| === code 53 title బిడ్డా ! నీహృదయము నాకిమ్ము *ref బిడ్డా ! నీహృదయము నాకిమ్ము నిత్య జీవము నిచ్చెదనని- యెరుగవా *1 అంతరంగంబెల్ల - కడిగెదన్‌ అపవిత్రతన్‌ - దొలగించి కృప నిత్తున్‌ *2 నీ పాపమంత పరిహరింప నాదు ప్రాణము నీకై - బలి చేసితి *3 పాపంబు నుండి - పారిపోదువా నిత్య జీవము - నేడే నీవు పొందవా *4 ఇహ లోకాశనుండి - తొలగిపో ఊహకందని - యానందమునే నిత్తును *5 నీదు యాత్మను-నా కర్పించుము అందు నిత్యము వసింప నాకు స్థలమిమ్ము === code 54 title కన్నతల్లి చేర్చునట్లు *ref కన్నతల్లి చేర్చునట్లు నన్ను చేర్చు నా ప్రియుడు హల్లెలూయ (4) *1 కౌగిటిలో హత్తుకొనున్‌ నా చింతలన్‌ బాపును *2 చేయిపట్టి నడుపును శిఖరముపై నిలుపును *3 నా కొరకై మరణించె నా పాపం భరియించె *4 చేయి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు === code 55 title భూమియు దాని - సంపూర్ణత *ref భూమియు దాని - సంపూర్ణత లోకము దాని - నివాసు - లెహోవావే *1 ఆయన సముద్రము మీద దాని పునాది వేసెను ప్రవాహ జలముల మీద దాని స్థిర పరచెను ||భూమి|| *2 యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడెవడు? ఆయన పరిశుద్ధ - స్థలములలో నిలువదగినవాడెవడు? ||భూమి|| *3 వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు నిర్దోష చేతులు - శుద్ధ హృదయము కలిగిన వాడే ||భూమి|| *4 వాడాశీర్వాదము నీతి మత్వము నొందును నిన్నాశ్రయించి - నీ సన్నిధిని వెదకెడువాడే ||భూమి|| *5 గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి పురాతన తలుపులారా మహిమగల ఈ రాజు ప్రవేశింప మిమ్ము లేవనెత్తుకొనుడి ||భూమి|| *6 మహిమ గల ఈ రాజెవడు బల శౌర్యముగల ప్రభువే యుద్ధ శూరుడైన యెహోవా ప్రరాక్రమము గల ప్రభువే ||భూమి|| *7 మహిమగల ఈ రాజెవడు సై-న్యముల యెహోవాయే ఆ..య..నే ఈ మహిమగల రాజు హల్లెలూయ ఆమెన్‌ ||భూమి|| === code 56 title యేసు కూడా వచ్చును *ref యేసు కూడా వచ్చును అద్భుతములెన్నో చేయును *1 శ్రమలను సైతానున్‌ వెళ్లగొట్టును కుమిలియున్న హృదయాన్ని ఆదరించును *2 వేదన శోకము తీర్చి వేయును సమాధానము సంతోషము నాకిచ్చును *3 అప్పు బాధ కష్టాలను తొలగించును కంటినుండి కన్నీరు తుడిచివేయును *4 తలంచిన కార్యములో జయం పొందుదున్‌ శత్రువైన సాతానును ఓడించెదన్‌ === code 57 title నేను నా ఇంటివారలం *ref నేను నా ఇంటివారలం యెహోవానే సేవింతుం నీవు సేవింతువా - నీవు సేవింతువా *1 యెహోవనే సేవించుట అసాధ్యమని తలచిన ఏ దేవుని నీవు సేవింతువో ఈనాడే తీర్మానించు *2 దాస్యములో నున్న మనలన్‌ యెహోవ రక్షించెను గొప్ప సూచనలెన్నో చేసినట్టి దేవుని సేవింతువా *3 మన త్రోవలో కాపాడుచు యెహోవ నడిపించెన్‌ దేవుడిచ్చిన యాశీర్వాదం చూచి కీర్తించి సేవింతువా *4 మేలైనట్టి ఈవులను దేవాది దేవుడిచ్చెన్‌ ఆయన స్వరంబుకు లోబడి సాక్షిగా జీవింతువా === code 58 title ప్రభుయేసు నా రక్షకా *ref ప్రభుయేసు నా రక్షకా నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను జూడ అల్ఫయు నీవె ఓమేగయు నీవే||ప్రభు|| *1 ప్రియుడైన యోహాను పత్మాసులో ప్రియమైన యేసుని స్వరూపము ప్రియమార జూచి బహు ధన్యుడయ్యె ప్రియప్రభు నిను జూడనిమ్ము ||ప్రభు|| *2 లెక్కలేని మార్లు పడిపోతిని దిక్కులేనివాడనేనైతిని చక్క జేసి నా నేత్రాలు దెరచి గ్రక్కున నిను జూడనిమ్ము ||ప్రభు|| *3 ఎరిగి ఎరిగి నే చెడిపోతిని యేసు నీ గాయము రేపితిని మోసపోతి నేను దృష్టి దొలగితి దాసుడ నిను జూడనిమ్ము ||ప్రభు|| *4 ఎందరేసునివైపు చూచెదరో పొందెదరు వెల్గు ముఖమున సందియంబులేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదరు ||ప్రభు|| *5 విశ్వాస కర్త ఓ యేసు ప్రభూ కొనసాగించువాడ యేసు ప్రభూ వినయముతోనేను నీవైపు జూచుచు విసుగక పరుగెత్తనేర్పు ||ప్రభు|| *6 కంటికి కనబడనివెన్నియో చెవికివినబడని వెన్నియో హృదయ గోచరము కాని వెన్నియో సిద్ధపరచితివా నాకై ||ప్రభు|| *7 లోకభోగాలపై నా నేత్రాలు సోకకుండునట్లు కృప జూపుము నీ మహిమ దివ్యస్వరూపమును నిండార నను జూడనిమ్ము ||ప్రభు|| === code 59 title జయ జెండా పట్టుకొనెదం *ref జయ జెండా పట్టుకొనెదం మనం వీరులుగ నడిచెదము (2) *1 వెల్లువై సాతానొచ్చిన ఆత్మతానే జెండా పైకెత్తును జడియకు నా సోదరా నీవు జడియకు నా సోదరి *2 వేవేలు శ్రమలొచ్చినన్‌ శోకముల్‌ దరికిరావు ఆత్మఖడ్గముచే మనం సాతానున్‌ జయించితిమి *3 గుట్టలైన మిట్టలైననూ ప్రభువును వెంబడించెదం నాగటిపై చేయి వేశాము మనం వెనుకకు తిరిగిచూడము === code 60 title నీ పాద సన్నిధికి *ref నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచూ దేవా నే వచ్చితిని (2) ||నీ|| *1 విశ్రాంతి నిచ్చెడు దేవా శ్రమలెన్నో తీర్చుమయా (2) సిలువాయే నా ఆశ్రయము హాయిగా నచటుండెదను (2) ||నీ|| *2 ప్రార్థించు మంటివి ప్రభువా సంకాట సమయములో (2) దయ చూపి నను కరుణించి ప్రేమతో ఆదరించుమయా ||నీ|| *3 దీవించు వరమౌనట్లు జయజీవితం నిమ్ము (2) క్షమియించి ఆశీర్వదించుటకై ప్రభువా నీ కృప నిమ్ము (2) ||నీ|| === code 61 title సహాయం చేయు శిఖరములను *ref సహాయం చేయు శిఖరములను చూచెదను భూమి ఆకాశము చేసిన కర్తను చూచెదను *1 కాలు తల్లడిల్ల విడువను కాచే దేవుడు కునుకడు ఇశ్రాయేలున్‌ కాచువాడు ఎన్నడు నిద్రించడు లల్లల్లా లల్లల్లా *2 ప్రభువు నన్ను గాచును నాకు నీడగా ఉండును పగలంతా రాత్రియంతా కాచుచున్నాడు *3 ప్రభువే పలు కీడులన్ని తప్పించి నన్ను కాపాడును ఆయనే ఆత్మను అనుదినం కాపాడును *4 పోవునప్పుడు కాచును వచ్చునప్పుడు కాచును ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడు కాచును. === code 62 title సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము *ref సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము (2) అమూల్యమైన రక్తము యేసు రక్తము(2) *1 సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము సంధిచేసి చేర్చును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము(2) ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము (2) *2 సమాధానపరచును యేసు రక్తము సమస్యలన్ని తీర్చును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము (2) సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము (2) *3 నీతి మంతులుగా చేయును యేసు రక్తము దుర్నీతినంత బాపును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము (2) నిబంధన నిలుపు రక్తము యేసు రక్తము (2) *4 రోగములను బాపును యేసు రక్తము దురాత్మల పారద్రోలును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము (2) శక్తి బలము నిచ్చును యేసు రక్తము (2) సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము === code 63 title ప్రియ యేసు రాజును నే చూచిన చాలు *ref ప్రియ యేసు రాజును నే చూచిన చాలు మహిమలో నేనాయనతో నుంటే చాలు నిత్యమైన మోక్ష గృహమునందు చేరి భక్తులగుంపులో హర్షించిన చాలు *1 యేసుని రక్తమందు కడుగబడి వాక్యముచే నిత్యం భద్ర పరచబడి నిష్కళంక పరిశుద్ధులతో పేదన్‌ నేను బంగారు వీధులలో తిరిగెదను *2 దూతలు వీణెలను మీటునపుడు గంభీర జయధ్వనులు మ్రోగునపుడు హల్లెలూయ పాటల్‌ పాడుచుండ ప్రియయేసుతోను నేను యుల్లసింతున్‌ ||ప్రియ|| *3 ముండ్ల మకుటంబైన తలను జూచి స్వర్ణకిరీటంబెట్టి యానందింతున్‌ కొరడాతో కొట్టబడిన వీపున్‌ చూచి ప్రతి యొక్క గాయమును ముద్దాడెదన్‌ ||ప్రియ|| *4 హృదయము స్తుతులతో నింపబడె నా భాగ్య గృహమును స్మరించుచుంటే హల్లెలూయ ఆమెన్‌ హల్లెలూయ వర్ణింప నా నాలుక చాలదయ్యా *5 ఆహా యా బూర ఎపుడు ధ్వనించునో ఆహా నా యాశ ఎపుడు తీరుతుందో తండ్రి నా కన్నీటిని తుడుచునెపుడో ఆశతో వేచియుండె నా హృదయం === code 64 title ఆశీర్వదించు - మా తండ్రీ *ref ఆశీర్వదించు - మా తండ్రీ ఆ-నందం - పొంగను నీ ముఖకాంతి వీరిపై ప్రకాశింప నీ! దేవా! పంపు నీ యాశీర్వాదము నీ దీవెన నిత్యముండును తరతరముల వరకు పొర్లి - పారును *1 దంపతులతో నీవుండి ని...త్యం నడిపించు నిన్నే వెంబడించునట్లు దారి చూపుమా ఇహమే మోక్షముగ చేయు దేవా ప్రేమయు విశ్వాసములతో నీలో వసించి తరించ కృపనీయుమా! *2 ఐక్యపర్చుము వీరిని నీదు చిత్తములో జ్ఞానులై దీనులై నిన్ను ధరన్‌ సేవింప జయశాలులుగాను జీవింపను పాలించు వీరి హృదయముల్‌ నీ మహిమను చాటింప దేవా! దీవించుమా === code 65 title మంగళ మర్పింప కృపను ఇమ్మయా *ref మంగళ మర్పింప కృపను ఇమ్మయా మంగళ నాథుడా! *1 నిత్యమంగళము నీవే ప్రభూ మంగళమునకు ప్రభుడవు స్తోత్రపాత్రుడవు, స్తుతికియర్హుడవు ఉత్తమ భక్తులు నిత్యము స్తుతించు శ్రేష్ఠ ప్రభువును అన్నిటిమించిన అబ్రహాం దేవుడవు *2 పెండ్లి కుమారుడు..................కు పెండ్లి కుమార్తైన................కు మహానుభావునకు, ఇమ్మానుయేలునకు భక్తితో బుద్ధిని చేర్చుము నా ప్రభు నిత్యుడగు తండ్రి నడిపించు సత్యంలో వేద వాక్యంతో === code 66 title బెత్లెహేములో పుట్టెనేసు *ref బెత్లెహేములో పుట్టెనేసు స్తుతియించుము మనసా - నేడే (2) *1 సర్వమును సృష్టించిన - సృష్టికర్తయే తానే తాలిమితో తల్లి ఒడిలో తలనాన్చెను ||బెత్లె|| *2 సింహాసనా సీనుడైన దేవపుత్రుడే తానే పసివానిగ పశుల తొట్టిలో పవళించెను ||బెత్లె|| *3 లేఖనములు చెప్పినట్లు- నెరవేర్చుటకై తానే మోక్షం వీడి దీనునిగా దిగివచ్చెను ||బెత్లె|| *4 పరలోక దూతలతో - పరవశించెను తానే మన కొరకే పశుల పాకలో జనియించెను ||బెత్లె|| *5 ఇంత గొప్ప ప్రేమ చూపినా యేసుని మనం సంతసముగ కలసి వెళ్లి స్తుతియించెదం ||బెత్లె|| === code 67 title హోసన్నా పాడెదం - దేవుని దాసులం *ref హోసన్నా పాడెదం - దేవుని దాసులం దావీదు కుమారునికి ఘనమైన - హోసన్నా *1 యెరుషలేము - పిల్లలంత సంతసించి పాడిరి వారి పోలె - మేమీనాడు స్తుతులను - పాడెదం ||హోస|| *2 ఆనాడు గాడిద మీద స్వారి చేసి పోయెను ఈనాడు నా హృదయ రాజ్యమును పాలించును ||హోస|| *3 పాపము - పరిహరింప నన్ను నుద్ధరింపను ప్రేమ మూర్తి - యేసునాథ పయనమై పోయెను ||హోస|| *4 బాలల గీతముల్‌ విని యేసు సంతసించెను పాదములన్‌ ముద్దిడి మే మేసు నారాధింతుము ||హోస|| *5 మట్టలాది వారము ప్రభుని కొనియాడెదం ఆయన కృప కొరకు మేము వేడుకొందుము ||హోస|| === code 68 title యేసురాజు వచ్చుచున్నాడు *ref యేసురాజు వచ్చుచున్నాడు హోసన్నా గీతం పాడెదం (2) త్వరగా వెళ్లెదము(2) హోసన్నా జయమే (2) హోసన్నా జయం మనదే (2) *1 యోర్దాను పొంగి పొర్లినా యెరికో కోట ఎదురైనా భయము లేదు కలత లేదు (2) రక్షకుడున్నాడు... *2 శ్రమలు చుట్టినను కష్టనష్టాలు వచ్చినను భయము లేదు కలత లేదు (2) ప్రభువు వున్నాడు... *3 హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు హల్లెలూయ స్తుతి మహిమ యేసు రాజు మనకు ప్రభువు కీర్తింతు... మెల్లప్పుడు === code 69 title క్రీస్తు యేసు నాదు రాజా! *ref క్రీస్తు యేసు నాదు రాజా! నీ సిలువే నా మహిమ (2) రమ్యమైనవి భూమి మీద ఎంత యధికముగా నుండినను||క్రీస్తు|| *1 మిగుల ఆస్థి - అధిక విద్య పలుకుబడి ఎంతో ఉండినను సిలువన్‌ జూడ - నాదు సర్వ గర్వమంతయు వ్యర్థంబేను ||క్రీస్తు|| *2 జీవపూట - నీదు సిలువ జీవనది లోక మంతటికి శుద్ధ రక్త - ఊటలోన మునిగి నేను - శుద్ధుడనైతిన్‌ ||క్రీస్తు|| *3 కాలు సేతుల్‌ - శిరము నుండి చిందుచుండె రక్తంబదిగో యేసు రాజా! ఇట్టి ప్రేమ నాదు బ్రతుకున గాంచలేదు ||క్రీస్తు|| *4 ఇంత వింత ప్రేమ కొరకై యేమి కానుక చెల్లించెదను కోటి యాస్తుల్‌ సాటి కావు నన్ను నేను సమర్పింతు ||క్రీస్తు|| === code 70 title ఏ పాప మెరుగని - యో పావన *ref ఏ పాప మెరుగని - యో పావన మూర్తి పాప - విమోచకుండ నా పాలి దైవమా - నా పాపముల కొర-కీ పాట్లు నొందినావా *1 ముళ్ళతో ఁ గిరీట - మల్లి నీ శిరముపైఁ జల్లాటమున మొత్తిరా ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మ సిల్లిపోతివి రక్షకా ||ఏ|| *2 కలువరి గిరి దనుక - సిలువ మోయలేక - కలవరము నొందినావా సిలువ నీతో మోయ - దులువలు వేరొకని దోడుగా నిచ్చినారా ||ఏ|| *3 చెడుగు యూదులు బెట్టు పడరాని పాట్లకు - సుడివడి నడచినావా కడకు కల్వరిగిరి - కడకేగి సిల్వను గ్రక్కున దించినావా ||ఏ|| *4 ఆ కాల కర్ములు భీకరంబుగ నిన్ను నా కొయ్యపై నుంచిరా - నీ కాలు సేతుల నా కొయ్యకే సూది మేకులతో గ్రుచ్చినారా ||ఏ|| *5 పలువిధంబుల శ్రమలు-చెలరేగఁ దండ్రికి-నెలుగెత్తి మొరలిడితివా సిలువపై బలుమారు - కలుగుచుండెడి బాధ - వలన దాహము నాయెనా ||ఏ|| *6 బల్లిదుండగు బంటు బల్లెమున నీ ప్రక్క - జిల్లిబడ బొడిచినాడా ఉల్లోలముల వలె - నల్ల నీ రుబుకంగ - జల్లారె గద కోపము ||ఏ|| *7 కటకటా పాప సంకటముఁబాపుట కింత - పటు బాధ నొందినావా ఎటువంటి దీ ప్రేమ యెటువంటి దీశాంత మెటుల వర్ణింతు స్వామి ||ఏ|| === code 71 title నీ రక్తమే జయం - కల్వరి యేసు *ref నీ రక్తమే జయం - కల్వరి యేసు కరుణ యేసు - నీ రక్తమే జయం *1 పాపాన్ని కడిగిన రక్తమే జయం శాపాన్ని మాపిన రక్తమే జయం పరిశుద్ధ పరచిన రక్తమే జయం శాంతిని నొసగిన రక్తమే జయం *2 విడుదల నిచ్చిన రక్తమే జయం కొరతలు తీర్చిన రక్తమే జయం జయము నిచ్చిన రక్తమే జయం బలము నొసగిన రక్తమే జయం *3 ద్వేషము తీర్చిన రక్తమే జయం ప్రేమతో నింపిన రక్తమే జయం అధికారమొసగిన రక్తమే జయం ఆశ్రయదుర్గమైన రక్తమే జయం *4 సాతానుని బంధించిన రక్తమే జయం నా కోసము క్రయమైన రక్తమే జయం సందేహము తీర్చిన రక్తమే జయం పరలోక మార్గమైన రక్తమే జయం === code 72 title ప్రేమ కల్వరి ప్రేమ నిన్ను చూడగానే *ref ప్రేమ కల్వరి ప్రేమ నిన్ను చూడగానే నా హృదయం పగిలెనయ్యా *1 దాహం దాహమంటివి నా కోసం వేచితివి పాపాలన్ని మోసి పరిహారబలియైతివి ||ప్రేమ|| *2 గాయాలు చూస్తున్నాను కన్నీరు కార్చుచున్నాను పరిశుద్ధమైన రక్తం తల్లడిల్లె తల్లి హృదయం ||ప్రేమ|| *3 కౌగలించు కరములలో మేకులా స్వామి స్మరించి ధ్యానింప నా హృదయము కరిగెనయ్యా ||ప్రేమ|| *4 యెదలో ఒక ఊట నదిలా పారెనయ్యా జనులెల్ల మునగాలి మరుజన్మ పొందాలి ||ప్రేమ|| === code 73 title 1. లోకులు నిన్ను ద్వేషించినా *ref *1 లోకులు నిన్ను ద్వేషించినా లోతైన ప్రేమను పొందెదవా బంధువులే నిన్ను వెలివేసినా నిందతో సిలువను మోసెదవా.. నిందతో నీ కొరకై మరణించితిని నా కొరకేమి చేసితివి నీ కొరకై మరణించితిని నా కొరకేమి చేసితివి నా కొరకేమి చేసితివి *2 లోక ఘనత వట్టిదని లోకపు యాస్థి వ్యర్థమని హృదయమంతటితో నీవు సేవను చేయ వచ్చెదవా...సేవను *3 కాపరి లేని మంద వలె పాపపు గడ్డిని మేయుచున్నారు... కాపరి యేసును ఎరిగి నీవు ఉన్నత పదవులు వెదకెదవా...ఉన్నత *4 యేసు అంటే ఎవరు యని అడిగెడివారు ఎంతమందో ఆకలితోను ఉన్నవారికి జీవాహారం యిచ్చెదవా?...జీవా === code 74 title 1 ఓ ఘోర పాపములు *ref *1 ఓ ఘోర పాపములు నా చేతులు చేసినవి నీ చేతులలో స్రవియించు - రక్తంతో నా చేతులు కడుగు మయా *2 ఓ ఘోర పాపములు నా కాళ్ళు చేసినవి నీ కాళ్ళలో స్రవియించు రక్తంతో నా కాళ్ళను కడుగుమయా *3 ఓ ఘోర పాపముతో నా హృదయము చెడి పోయెన్‌ నీ యెద నుండి స్రవియించు - రక్తంతో నా హృదయము కడుగుమయా *4 ఓ ఘోర పాపములు నా తలతో తలంచినవి నీ శిరస్సున స్రవియించు - రక్తంతో నా శిరస్సును కడుగుమయా === code 75 title యేసు-అనుభవించితివా సిలువను *ref యేసు-అనుభవించితివా సిలువను కలువరి మెట్టపై పలుమారు శ్రమలను అనుభవించితివా-నా యేసు ||యేసు|| *1 ప్రభో - పలుమారు నిన్నునే గొట్టితి వలదని చెప్పిన - వినక నే జేసితి పలునిందలు మోపితి - నీ మీద ||యేసు|| *2 నీదు - పవిత్ర మోము పైనే నిన్ను నాదు ఉమ్మివేసి - హద్దు లేక జేసి నీచపర్చితినయ్యా - నా యేసు ||యేసు|| *3 కృప - తో నిండి వచ్చిన నిన్నునే కాలు చేతులు గట్టి-సీలలతో గొట్టి మెట్టపై బెట్టితి - నేనిన్ను ||యేసు|| *4 ప్రేమ - తో నిండి వచ్చిన నిన్నునే నాదు చెడు తలంపులతో నీదు శిరస్సుపైని ముల్లుల కిరీటము గొట్టితిని ||యేసు|| *5 మేళ్ళ - తో నిండి వచ్చిన నిన్నునే నాదు చెడు నడతలతో నీదు ప్రక్కలోన బళ్ళెంపు పోటును బొడిచితిని ||యేసు|| *6 ఇన్ని - చేసినగాని నన్ను నీవు చేపట్టి బుజ్జగించితివయ్యా నా తండ్రి నాకు తెలియకున్నది - నీ ప్రేమ ||యే|| === code 76 title పాపిని కృప జూపవయ్యా - దాపు *ref పాపిని కృప జూపవయ్యా - దాపు జేరితిని యేసయ్యా పాప భారము క్రింద శ్రమపడి కృంగియున్నాను యేసయ్యా *1 వేషభాషల తోడ నిండి మోసపోయితిని యేసయ్యా దోసిలొగ్గి నిన్ను జేరితి దాసునిగ బ్రోవు మేసయ్యా ||పాపిని|| *2 నీతిలేని నాదు జీవిత మేల నికనయ్యా యేసయ్యా నీతి గరపి బ్రోవుమయ్యా నీతి నిడవయ్యా యేసయ్యా ||పాపిని|| *3 నీదు సిలువలోని ప్రేమ నెంచదరమౌనె యేసయ్యా నాదు కలుషమంత బాపి కనికరింపుమా యేసయ్యా ||పాపిని|| *4 నీదు రక్తధారలే యిల పాపికాశ్రయము యేసయ్యా నీతిమంతుల జేయుమయ్యా నీతి సూర్యుండా యేసయ్యా ||పాపిని|| *5 దాపుగోరిన వారలకు నీ పాప్రు జూపితివి యేసయ్యా పాపశాపము బాపి నిత్య జీవమిడవయ్యా యేసయ్యా ||పాపిని|| *6 శాంతి గోరువారలెల్ల నీ చెంత కరిగినచో యేసయ్యా చింతలెల్ల దీర్చగలవు శాంతి నొసగెదవు యేసయ్యా ||పాపిని|| *7 పరమ రక్షకా నీదు ప్రేమ నెరుగ దరమౌనె యేసయ్యా పరులమైన మమ్ము బ్రోవ వేచియున్నావా యేసయ్యా ||పాపిని|| *8 నాదు హృదయము నీదె సుమ్మా నీవె గైకొనుమా యేసయ్యా శుద్ధ హృదయము జేసినను నీ సుతునిగా జేయు మేసయ్యా ||పాపిని|| === code 77 title అపరాధిని యేసయ్యా *ref అపరాధిని యేసయ్యా కృప జూపి బ్రోవుమయ్యా నెపమెంచకయె నీ క ృపలో నపరాధములను క్షమించు *1 సిలువకు నిను నే గొట్టితిని తులువలతో జేరితిని కలుషంబులను మోపితిని దోషుండ నేను ప్రభువా ||అప|| *2 ప్రక్కలో బళ్ళెపు పోటు గ్రక్కున బొడిచితి నేనే మిక్కిలి బాధించితిని మక్కువ జూపితివయ్యా ||అప|| *3 ముళ్ళతో కిరీటంబు నల్లి నీ శిరమున నిడితి నా వల్ల నేరమాయె చల్లని దయగల తండ్రి ||అప|| *4 దాహంబు గొనగా చేదు చిరకను ద్రావనిడితి ద్రోహుండనై జేసితిని దేహంబు గాయంబులను ||అప|| *5 ఘోరంబుగా దూరితిని నేరంబులను జేసితిని క్రూరుండనై గొట్టితిని ఘోరంపు పాపిని దేవా ||అప|| *6 చిందితి రక్తము నాకై పొందిన దెబ్బల చేత నిందలు పెట్టితినయ్యో సందేహ మేలనయ్యా ||అప|| *7 రక్షణ దెచ్చితివయ్యా శిక్షకు పాత్రుడనయ్యా అక్షయ భాగ్యమునియ్య మోక్షంబు జూపితివయ్యా ||అప|| === code 78 title యుదా రాజ సింహం - తిరిగి లేచెను *ref యుదా రాజ సింహం - తిరిగి లేచెను తిరిగి లేచెను మృతిన్‌ గెలిచి లేచెను *1 నరక శక్తులన్ని - ఓడిపోయెను ఓడిపోయెను - అవి - వాడిపోయెను *2 దూత సైన్యమంత - స్తుతించుచుండ స్తుతించుచుండ యేసున్నుతించుచుండ *3 మరణ సంకెళ్ళను - త్రెంచి వేసెను త్రెంచి వేసెను వాటిన్‌ వంచి వేసెను *4 యేసు లేచెనని - మ్రోగుచున్నది మ్రోగుచున్నది భయమున్‌ ద్రోలుచున్నది *5 వనితల్‌ దూత వార్త - విశ్వసించిరి విశ్వసించిరి మదిన్‌ సంతసించిరి *6 పునరుత్థానుడిక-మరణించడు మరణించడెన్నడు మరణించడు *7 యేసూ! నీదు పాదం - మ్రొ...క్కెదము మ్రొక్కెదము మము ముద్రించుము === code 79 title గీతం గీతం - జయ జయ గీతం *ref గీతం గీతం - జయ జయ గీతం చేయి తట్టి పాడెదము యేసు రాజు లేచెను - హల్లెలూయ జయ మార్భటించెదము *1 చూడు సమాధిని - మూసిన రాయి దొరలుచు పొరలిడెను అందు వేసిన ముద్ర - కావలి నిల్చున దైవ సుతుని ముందు ఆ..ఆ.. ||గీతం|| *2 వలదు వలదు - ఏడువ వలదు పరుగిడి ప్రచురించుడి తాను చెప్పిన విధమున - తిరిగి లేచెను వెళ్ళుడి గలిలయకు ఆ..ఆ.. ||గీతం|| *3 అన్న కయప - వారల సభయును అదరుచు పరుగిడిరి - ఇంకా దూతగణముల - ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి ఆ..ఆ.. ||గీతం|| *4 గుమ్మముల్‌ తెరచి - చక్కగ నడువుడి జయవీరుడు రాగా - మీ మేళతాళ - బూర వాయిద్యము లెత్తి ధ్వనించుడి ఆ..ఆ.. ||గీతం|| === code 80 title 1. పరమ జీవము నాకు నివ్వ... *ref *1 పరమ జీవము నాకు నివ్వ... తిరిగి లేచెను నాతో నుండ నిరంతరము నడిపించును మరల వచ్చి యేసు కొని పోవును యేసు చాలును యేసు చాలును యే సమయమైన యే స్థితికైనా నా జీవితములో యేసు చాలును *2 సాతాను శోధన లధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్లెదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను ||యేసు|| *3 పచ్చిక బయలులో పరుండ జేయున్‌ శాంతి జలము చెంత నడిపించును అనిశము ప్రాణము తృప్తిపరచున్‌ మరణలోయలో నన్ను కాపాడును ||యేసు|| *4 నరులెల్లరు నన్ను విడిచినను శరీరము కుళ్ళి కృశించినను హరించినన్‌ నా ఐశ్వర్యము విరోధివలె నను విడిచినను ||యేసు|| === code 81 title సిలువను మోసి ఈ లోకమును *ref సిలువను మోసి ఈ లోకమును తలక్రిందులు చేయు తరుణమిదే *1 లే లెమ్ము సోదరుడా నిద్ర నుండి ప్రకటించను యేసు నామమును సోమరి యేల నిద్రించెదవు ఈ ధరను లేపెడు సమయమిదే ||సి|| *2 పరిశుద్ధాత్మ కవచముతొడిగి నీ నడుము కట్టి తయ్యారగుమా సోదరుడా ప్రతి వీధికి వెళ్లి సువార్తను చాటెడు సమయమిదే ||సి|| *3 లోక రక్షణకై ప్రభు యేసు వీకతో నరుదెంచెను ఈ ధరకు వెలుగును మనకు నిచ్చెను యేసు తన స్తుతులను పాడెడు సమయమిదే||సి|| *4 పాతాళమునకు కొనిపోయెడి నీ పాత నిద్రను విడనాడు మిక సిలువ మర్మము నెరుగుమిపుడే కునికెడు సమయము కాదిది ప్రియుడా||సి|| *5 రక్షింపబడుట కాశించినచో పశ్చాత్తాపపడు మీ దినమే కలుషాత్ముండా తడవేల నికన్‌ కనుమా నీ తీర్పు సమయమిదే ||సి|| === code 82 title దేవ దేవుని సన్నిధిలో *ref దేవ దేవుని సన్నిధిలో సముహముగా ఉన్నదెవరో అధిపతి ప్రభు యేసుని సైన్యములో నిలచిన ఈ ధీరులెవరో (2) ||దేవ|| *1 ఒక్క తలాంతో రెండు ఉన్నవో ఐదు ఉన్నను వాడినవారు చిన్న పనిలో పెద్ద పనిలో ఇచ్చినట్టి పనిని చేసినవారు ||దేవ|| *2 అడవులలో పయనించి ప్రభుని ప్రేమ పంచినవారు కలిమిలోను లేమిలోను పట్టుదలగా ప్రార్థించువారు ||దేవ|| *3 ఒంటరితనం పేదరికంలో లాజరులా నిలబడిరి యాచించిన పోషించిన విశ్వాసము వీడనివారు ||దేవ|| *4 జాతులన్నియు గోత్రాలన్నియు భాషలన్నియు మాట్లాడువారు సిలువ క్రింద యేసు రక్తంలో మంచి పోరాటం పోరాడినారు ||దేవ|| === code 83 title బూరాధ్వని ఆకాశములో ధ్వనియించగా *ref బూరాధ్వని ఆకాశములో ధ్వనియించగా మా యేసు మహా రాజు-వచ్చుచుండెను *1 ఆ దినం మిక్కిలి సమీపం శుద్ధులుఅందరు చేరెదరు (2) దేవుని బూర ధ్వనియించగా దేవాది దేవుని సంధించెదము(2) ||బూర|| *2 ఆకాశం భూమియు మారినను శక్తిమంతుని వాగ్దానం మారదు దేవుని బూర ధ్వనియించగా దేవాది దేవుని దర్శించెదము ||బూర|| *3 దొంగలు అటు యిటు తిరుగుచును దేవుని వాక్యాన్ని మార్చుచున్నారు ఓ దేవారమ్ము వాంఛను తీర్చుము మెలకువతో వేచియున్నాము ||బూర|| *4 కనురెప్పపాటున మారెదము మోక్షంలో అందరము చేరెదము కన్నీరుదిగులు అచ్చటలేవు దేవుడు తానే వెలుగై యుండును ||బూర|| === code 84 title ప్రకాశమైన - ఆశ్చర్యదేశము *ref ప్రకాశమైన - ఆశ్చర్యదేశము ప్రియుని దేశము ప్రేమించు దేశము *1 పాపరహిత దేశము ఏ శాపము కనబడదు నిత్యానందం - ఆగని గీతము ఆకాశమందు హోసన్నా హల్లెలూయ *2 సూర్యచంద్రులు లేరు కాని చీకటి కనబడదు దైవకుమారుడు - తేజోమయుడు నిత్యము వెలుగిచ్చును పగలెప్పుడు *3 పలువిధ బోధలతో నుండు గుంపుల పేరుండదు యేక కుటుంబము ఒక నాయకుడే ప్రేమామయ దేశము ప్రియులు వెళ్ళు *4 ప్రశ్నలు యేవుండవు ఎట్టి కలవరమే వుండదు జాతి, రంగు - భాష భేదము కలవారెవరు లేరు ప్రేమే పల్కున్‌ *5 పలువిధ ప్రణాళికలు పరిపాలించు చట్టములు చెరసాలలు - శిక్షయు లేవు నరుల పరిపాలన అందుండదు *6 సంత వీధులు లేవు కర్మాగారములే లేవు ధనికులు దరిద్రులు - చిన్నలు పెద్దలు అనుబేధము లేదు అందరు సమం *7 యేసుని రక్తమందు పాపం కడిగిన చేరుదువు ఈ గొప్ప ధన్యత - పోగొట్టుకొను వారెవరును కావలదు నేడే రమ్ము === code 85 title సీయోను పాటలు సంతోషముగ *ref సీయోను పాటలు సంతోషముగ పాడుచు సీయోను వెళ్ళుదము *1 లోకాన శాశ్వతానంద మేమియు లేదని చెప్పెను ప్రియుడేసు పొందవలె నీ లోకమునందు కొంతకాల మెన్నో శ్రమలు ||సీయో|| *2 ఐగుప్తును విడిచినట్టి మీరు అరణ్య వాసులె ఈ ధరలో నిత్య నివాసములే దిలలోన నేత్రాలు కానాను పై నిల్పుడి ||సీయో|| *3 మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్ననేమి నీ రక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాట నమ్ము ||సీయో|| *4 ఐగుప్తు ఆశలన్నియు విడిచి రంగుగ యేసుని వెంబడించి పాడైన కోరహు పాపంబు మాని విధేయులై విరాజిల్లుడి ||సీయో|| *5 ఆనందమయ పరలోకంబు మనది అక్కడనుండి వచ్చు నేసు సీయోనుగీతము సొంపుగ గలిసి పాడెదము ప్రభు యేసునకు ||సీయో|| === code 86 title యెహోవా నీ నామము *ref యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో ఘనమైనది *1 మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులనాపితివి ||యెహో|| *2 నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా అగ్నిలో పడవేసినా భయమేమి లేకుండిరి ||యెహో|| *3 పేతురును బంధించినా చెఱసాలలో వేసినా సంఘము ప్రార్థించగా సంకెళ్లువిడిపోయెను ||యెహో|| *4 సింహాల బోనులకైనా సంతోషముగా వెళ్లిరి ప్రార్థించినా వెంటనే రక్షించే నీ హస్తము ||యెహో|| *5 చెఱసాలలో వేసినా సంకెళ్లు బిగియించినా పాటలతో ప్రార్థించగా చెఱసాల బ్రద్ధలాయె ||యెహో|| *6 మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము ||యెహో|| === code 87 title స్తోత్రం చెల్లింతుము *ref స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నాథుని మేలులు తలంచి *1 దివారాత్రములు కంటిపాపవలె కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి ||స్తోత్రం|| *2 గాఢాంధకారములో కన్నీటి లోయలలో కృశించిపోనీయక కృపలతో బలపరచితివి ||స్తోత్రం|| *3 సజీవ యాగముగా మా శరీరముల్‌ సమర్పించి సంపూర్ణ సిద్ధినొంద శుద్ధాత్మను నొసగితివి ||స్తోత్రం|| *4 సీయోను మార్గములో పలుశోధనలు రాగా సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి ||స్తోత్రం|| *5 సిలువను మోసికొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి ||స్తోత్రం|| *6 పాడెద హల్లెలూయ మరనాత హల్లెలూయ సదపాడెద హల్లెలూయ ప్రభు యేసుకె హల్లెలూయ||స్తోత్రం|| === code 88 title మన కొరకై వచ్చాడు *ref మన కొరకై వచ్చాడు తన ప్రాణం పెట్టాడు నిన్ను నన్ను యేసు ప్రేమించాడు తన అరచేతిలో నిన్ను చెక్కుకున్నాడు తన అరచేతిలో నన్ను చెక్కుకున్నాడు *1 స్వంత జనం మరచినను మరువడాయన నీతి సూర్యుడైన తండ్రి యేసు దేవుడే పరిస్థితులు మారినను యేసు నిన్ను మరచిపోడు సిలువలో ప్రాణం బెట్టె సమయంలో మరువలేదే *2 పనికిరాని వాడవని త్రోసివేసినా అబ్రాహాము దేవుడు నిన్ను త్రోసివేయడు దిక్కులేని వారినంతా చేర్చుకొనే రక్షకుడు జడియకు నా బిడ్డలారా యంటు ఆదరించు *3 వ్యాధి గలవాడవని నెట్టి వేశారు సూటి పోటి మాటలతో గాయపరిచారు చావనా బ్రతకనాయని నీవేడ్చి కుమిలిపోతే బ్రతికే వుండాలని నీ వ్యాధిని తీసివేసె *4 కష్టపడెటప్పుడు ఎవ్వరు సాయం చేయరు అప్పులను తీర్చువారు అసలే లేరు ఇష్టమైన దేవతలను పూజించి చూశాము మన కష్టాలను తీర్చ అవి ముందుకు రాలేదు ఈ లోక దేవతలు అన్నియును వట్టివండి యేసుక్రీస్తు ఒక్కడే నిజమైన దేవుడండి పాపములన్ని బాపి రక్షించే దేవుడండి === code 89 title చూడుము గెత్సెమనే *ref చూడుము గెత్సెమనే తోటలో నా ప్రభువు పాపి నాకై వి-జ్ఞాపన చేసెడి ధ్వని వినబడుచున్నది పాపి నీకై విజ్ఞాపన చేసెడి ధ్వని వినబడుచున్నది *1 దేహమంతయు నలిగి శోకము చెందినవాడై దేవాది దేవుని ఏకైక సుతుడు పడు వేదనలు నా కొరకే *2 తండ్రి ఈ పాత్ర తొలగున్‌ నీ చిత్తమైన యెడల ఎట్లయినను నీ చిత్తము చేయుటకు నన్నప్పగించితివనెను *3 రక్తపు చెమట వలన మిక్కిలి బాధనొంది రక్షకుడేసు హృదయము పగులగ విజ్ఞాపనము చేసెనే *4 ముమ్మారు భూమి మీదపడి మిక్కిలి వేదనచే మనయేసు ప్రభువు తానే వేడుకొనెను పాపుల విమోచన కొరకే *5 ప్రేమామృత వాక్కులచే ఆదరించెడి ప్రభువు వేదన సమయమున బాధపరచెడి వారి కొరకు ప్రార్థన చేసెనే *6 నన్ను తన వలె మార్చెడి ఈ మహా ప్రేమను తలచి తలచి హృదయము కరుగగ సదా కీర్తించెదను === code 90 title నీ రక్తమే-నీ రక్తమే-నన్‌ శుద్ధీకరించున్‌ *ref నీ రక్తమే-నీ రక్తమే-నన్‌ శుద్ధీకరించున్‌ నీ రక్తమే నా బలము *1 నీ రక్తధారలే యిల పాపి కాశ్రయం బిచ్చును పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పావన పర్చుము ||నీరక్తమే|| *2 నశించు వారికి నీ సిలువ వెఱ్ఱితనముగ నున్నది రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తియైయున్నది ||నీరక్తమే|| *3 నీ సిలువలో కార్చినట్టి విలువయిన రక్తములోన పరమపావన కడుగుము పవిత్ర పరచుము పాపిని ||నీరక్తమే|| *4 పందివలె పొర్లిన నన్ను కుక్కవలె తిరిగిన నన్ను ప్రేమతో చేర్చుకొంటివి ప్రేమార్హ నీకె స్తోత్రము ||నీరక్తమే|| *5 నన్‌ వెంబడించు సైతానున్‌ నన్‌ బెదరించు సైతానున్‌ దునుమాడేది నీ రక్తమే దహించేది నీ రక్తమే ||నీరక్తమే|| *6 స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును స్తుతి పాత్ర నీకే చెల్లును స్తోత్రార్హ నీకెే తగును ||నీరక్తమే|| === code 91 title ఓ యేసు నీ ప్రేమ *ref ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము ఆకాశ తార పర్వత సముద్ర ముల కన్న గొప్పది *1 ఆగమ్య ఆనందమే హృదయము నిండెను ప్రభుని కార్యములు గంభీరమైనవి ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు స్తుతికి యోగ్యములు ||ఓయేసు|| *2 సంకట సమయములో సాగలేకున్నాను దయచూపు నా మీద అని నేను మొఱ్ఱ పెట్టగా వింటినంటివి - నా మొఱ్ఱకు ముందే తోడు నుందు నంటివి తోడు నుందు నంటివి ||ఓయేసు|| *3 మరణాంధకారంపు లోయనే సంచరించినా నిరంతరము యేసు నాదు కాపరియై కరము నిచ్చి నన్ను కాయుచు నడుపును కరుణ గల ప్రభువా కరుణ గల ప్రభువా ||ఓయేసు|| *4 కొదువ లెన్నియున్న భయపడను నే నెపుడు పచ్చిక బయలులో పరుండ జేయును భోజన జలములతో తృప్తి పరచుచు నాతో నుండు యేసు నాతో నుండు యేసు ||ఓయేసు|| *5 దేవుని గృహములో సదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో సదా భజించెదను స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయ ఆమెన్‌ హల్లెలూయ ఆమెన్‌ ||ఓయేసు|| === code 92 title మందలో చేరని గొఱ్ఱెలెన్నో *ref మందలో చేరని గొఱ్ఱెలెన్నో కోట్ల కొలదిగా కలవు యిల ఆత్మల కొరకై వేదనతో వెదకెదము రమ్ము ఓ సంఘమా రమ్మనె యేసు రాజును చేరా-నడిపించు *1 అడవులలో పలు స్థలములలో నా ప్రజలెందుకు చావవలెన్‌ వారి నిమిత్తమై శ్రమపడితిన్‌ మరి వారిని వెదకెడి వారెవరు రమ్మనె యేసు రాజును చేరా-నడిపించున్‌ ||మంద|| *2 ప్రకటించని స్థలములు కలవు చాటించు వారు కలరిచ్చట పిలువబడిన వారందరును మన ప్రభువాజ్ఞకు లోబడుడి రమ్మనె యేసు రాజును చేరా-నడిపించున్‌ ||మంద|| *3 నాకై పలికెడు నాలుకలు నా వలె నడిచెడి పాదములు నన్ను ప్రేమించెడి హృదయములు కావలె నాకవి నీవిచ్చెదవా రమ్మనె యేసు రాజును చేరా-నడిపించున్‌ ||మంద|| === code 93 title ఎన్ని తలచినా - ఏది అడిగినా *ref ఎన్ని తలచినా - ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా నీ వాక్కుకై - వేచి యుంటిని నా ప్రార్థన ఆలకించుమా - ప్రభువా *1 నీ తోడు లేక నీ ప్రేమ లేక యిలలోన ఏ ప్రాణి నిలువలేదు (2) అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా (2) నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా ||ఎ|| *2 నా యింటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2) ఆరిపోయిన నా వెలుగు దీపము (2) వెలిగించుము నీ ప్రేమలో ప్రభువా ||ఎ|| *3 ఆపదలు నన్ను వెన్నంటియున్న నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2) లోకమంతయు నన్ను విడిచిన (2) నీ నుండి వేరు చేయవు ప్రభువా ||ఎ|| *4 నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి నీదు యాగమే నా మోక్ష భాగ్యము నీ యందే నిత్య జీవము ప్రభువా ||ఎ|| === code 94 title ఎందుకో నన్నింతగా నీవు *ref ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయ యేసయ్య ||ఎందుకో|| *1 నా పాపము బాప నరరూపివైనావు నా శాపము బాప నలిగి వ్రేలాడితివి నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే ||ఎందుకో|| *2 నీ రూపము నాలో నిర్మించియున్నావు నీ పోలికలోనే నివసించుచున్నాను నీవు నన్ను యెన్నుకున్నావు నీ కొరకే నీ కృపలో ||ఎందుకో|| *3 నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు నన్ను నీలో చూచుకున్నావు నన్ను దాచియున్నావు ||ఎందుకో|| *4 నీ సన్నిధి నాలో నా సర్వము నీలో నీ సంపద నాలో నా సంతసము నీలో నీవు నేను ఏకమగువరకు నన్ను విడువనందువే ||ఎందుకో|| *5 నా మనవులు ముందే నీ మనస్సులో నెరవేరె నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండె ఏమి అద్భుత ప్రేమ-సంకల్పం నేనేమి చెల్లింతు ||ఎందుకో|| === code 95 title అత్యున్నత సింహాసనముపై *ref అత్యున్నత సింహాసనముపై ఆశీనుడవైన నా దేవా అత్యంత ప్రేమ స్వరూపివినీవే ఆరాధింతును నిన్నే ఆహాహా హల్లెలూయా (3) ఆ..మేన్‌ *1 ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్తా స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం ||ఆహా|| *2 కృపాసత్యసంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితివే స్త్తోత్రం నీరక్తమిచ్చి విమోచించినావే నా రక్షణ కర్తా స్తోత్రం ||ఆహా|| *3 స్తుతులపై ఆసీనుడా స్తోత్రం సంపూర్ణుడా నీకు స్తోత్రం మా ప్రార్థనలను ఆలించువాడా మా ప్రధాన యాజకుడా స్తోత్రం ||ఆహా|| *4 మృత్యుంజయుడా స్తోత్రం మహా ఘనుడా స్తోత్రం మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం ||ఆహా|| *5 ఆమేన్‌ అనువాడా స్తోత్రం ఆల్ఫా ఓమేగా స్తోత్రం అగ్నిజ్వాలల వంటి కన్నులు కలవాడా అత్యున్నతుడా స్తోత్రం ||ఆహా|| === code 96 title స్తోత్రించి కీర్తింతుము *ref స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము - కొనియాడెదము ఆదరించి - కాపాడువాడు యీడేర్చువాడు ||స్తోత్రి|| *1 మన కింతవరకు - సహాయపడెన్‌ తానప్పగిం - చుకొనె మనకై మనల నడిపెను - సుఖముగను తనదు సత్యము నేర్పించి కనుపాపగ కాచె ఆ...ఆ...ఆ... తనదు సత్యము నేర్పించి... ||స్తోత్రి|| *2 ఈ ధరలోని నరులలో యథార్థ హృదయులకు ముదమున తన చి - త్తము తెలుపన్‌ పదిలముగా ప్రభు కన్నులు పృధివిని పరుగెత్తు ఆ...ఆ...ఆ... పదిలముగా ప్రభు కన్నులు... ||స్తోత్రి|| *3 అన్ని సమయ - ములలో కన్నులతో బోధించును నన్ను మార్చెను తప్పినన్‌ పన్నుగ హృదయము నాదరించె అన్న గురు యేసు ఆ...ఆ...ఆ... పన్నుగ హృదయము... ||స్తోత్రి|| *4 అగ్నివంటి కన్నులు విఘ్నముల నుండి విడిపించున్‌ తగిన సహాయము చేయును ఎక్కాల మందును కునుకవు మక్కువ పిల్లలకు ఆ...ఆ...ఆ... ఎక్కాలమందును... ||స్తోత్రి|| *5 హాగరును చూచిన కన్నులు అనేకుల చూచెను ఇశ్రాయేలును కనికరించె ఎజ్రాకు సహాయపడెన్‌ నిద్రించవు నెపుడు ఆ...ఆ...ఆ... ఎజ్రాకు సహాయ... ||స్తోత్రి|| *6 నీతిమంతు - ల జూచె దాది బోలి కాచెను జ్యోతులవలె నుండును అతి బలమిచ్చును అవసరతన్‌ క్షితి నిను విడువడు ఆ...ఆ...ఆ... అతి బలమిచ్చును అవ... ||స్తోత్రి|| *7 ఏడు కన్నులు - గలవాడు నేడు నాడు కాపాడున్‌ ఎడతెగని చెడుగుల బాపున్‌ ఱేడుల నేర్పరచువాడు పాడుడి హల్లెలూయ ఆ...ఆ...ఆ... ఱేడుల నేర్పరచువాడు ||స్తోత్రి|| === code 97 title స్తోత్రము రాజా ఆ...ఆ... స్తోత్రము రాజా *ref స్తోత్రము రాజా ఆ...ఆ... స్తోత్రము రాజా స్తోత్రము రాజాధి రాజా... *1 స్తోత్రపాత్రుడ పూజ్యనీయుడా నిత్యము నాశ్రితుల పాలుడ సత్యుడా పరలోక వాసుడ నిత్యుడా శ్రీ యేసు నాథుడా ||స్తోత్ర|| *2 ఆకసము నీ మహిమను యిహ లోకమందలి సర్వమును యేకముగ స్తుతియించుచుండ నీ కర్పించెద జిహ్వఫలము ||స్తోత్ర|| *3 యిడుములు కడుసుడుల కైవడి వడివడిగను పెనుగొనంగ విడువను నెడబాయనంచు విజయమిచ్చిన యేసునాథుడా||స్తోత్ర|| *4 మరణచ్ఛాయ లోయలోబడి తెరవు గానక నరుగువేళ పరమ కనికర కరముచే నను సరిగ నడిపిన మాదు ప్రభువా ||స్తోత్ర|| *5 అరయ నాలో నీదు రూపము సరిగ నేర్పడు వరకు నన్ను తరచు శ్రమల యనుభవంబున పొరల జేసిన యేసునాథుడా ||స్తోత్ర|| === code 98 title స్తుతి గీతముల నిలపాడరె *ref స్తుతి గీతముల నిలపాడరె స్తోత్రార్హ ప్రభువునకు మితిలేని ప్రేమచే - పాపుల వెదకియు రక్షింపను వచ్చెన్‌ *1 పరమందు దూతలు పరిశుద్ధులు - ప్రభు సన్నిధినిన్‌ జేరి నిరతంబు యిహమున జరిగిన యీ ఘన - కార్యము దలచెదరు ||స్తుతి|| *2 హల్లెలూయ యనుచును బాడరే ఇమ్మానుయేలునకు కలుషంబులను - బాపను మనకై వెల - సెను కలువరి గిరిపై ||స్తుతి|| *3 జయగీతముల నిల పాడరే జయశీలు డేసునకు జయశీలుడై లేచెను మృతిగెల్చియు మూడవ దివసమున ||స్తుతి|| *4 భూలోక సైన్య సమూహమా ప్రకటింపు మీ ప్రభుని ఏ లోకమందైనను శ్రీ యేసుడె రక్షకుడె యనుచు ||స్తుతి|| *5 పరిశుద్ధుడు సంపూర్ణుడు పరిపూర్ణుడా ప్రభువే నిరతంబు తను గొల్చెడి నరులకు తన - పరిశుద్ధత నిచ్చున్‌ ||స్తుతి|| *6 రా రండి రక్షణ నొంద పరుగిడి రండి ప్రభు కడకున్‌ జేరండి యేసుని జేరిన త్రోయడు చేరెడు వారలను ||స్తుతి|| *7 ఘనతయు మహిమయు చెల్లును గాక ఘనుడగు ప్రభువునకు ఘన తండ్రి కొమర - పరిశుద్ధాత్ముల త్రియేక దేవునకు ||స్తుతి|| === code 99 title సర్వశక్తుని స్తోత్ర గానము *ref సర్వశక్తుని స్తోత్ర గానము సల్పరే జగ మెల్లను నిర్వహించును దాస భారము నిత్యమెద రాజిల్లను *1 ముదముతో నిర్మాణకుండగు మూల కర్తను బాడరే వదన మీక్ష్మాన్వంచి దేవుని వందనముతో వేడరే ||సర్వ|| *2 వేదపారాయణము సేయుచు విశ్వమంత జయింపరే సాదరముగా దేవునిక మీ స్వాంతమున బూజింపరే ||సర్వ|| *3 ఎదను విశ్రాంతిన్‌ పరేశుని హెచ్చుగా నుతిసేయరే సదమలంబగు భక్తితో మీ సర్వ మాయన కీయరే ||సర్వ|| *4 చావు పుట్టుక లేనివాడుగ సతతము జీవించును ఈవులిచ్చుచు దన్ను వేడుమ హేష్టులను రక్షించును ||సర్వ|| *5 దాసులై దేవునికి నెదలో దర్పమును బోగాల్పరే యేసు క్రీస్తుని పుణ్యవస్త్రము నే మరక మైదాల్పరే ||సర్వ|| === code 100 title దేవునికి స్తోత్రము - గానము *ref దేవునికి స్తోత్రము - గానము చేయుటయే - మంచిది మనమందరము స్తుతి - గానము చేయుటయే - మంచిది *1 యెరూషలేము యెహోవయె కట్టుచున్న వాడని ఇశ్రాయేలీయులను ప్రోగు చేయువాడని ||దేవునికి|| *2 గుండె చెదరిన వారిని బాగుచేయువాడని వారి గాయములన్నియు కట్టుచున్న వాడని ||దేవునికి|| *3 ప్రభువు గొప్పవాడును అధికశక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆయనే మితియు లేని వాడని ||దేవునికి|| *4 దీనులకు అండాయనే భక్తిహీనుల కూల్చును సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి ||దేవునికి|| *5 గుఱ్ఱముల నరులందలి బలము నా నందించడు కృపకు వేడువారిలో సంతసించువాడని ||దేవునికి|| *6 యెరూషలేమ యెహోవాను సీయోనూ నీ దేవుని కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని ||దేవునికి|| === code 101 title యెహోవాను గానము *ref యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయెను ఆయన మహిమ పాడెదము ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు మనకు *1 యుద్ధశూరు డెహోవా నా బలము నా గానము నా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా ||యెహోవా|| *2 ఫరో రథముల సేనలను తన శ్రేష్ఠాధి పతులను ఎఱ్ఱసముద్రములోన ముంచివేసె నెహోవా ||యెహోవా|| *3 నీ మహిమాతిశయమున కోపాగ్ని రగులజేసి చెత్తవలె దహించెదవు నీపై లేచువారిని ||యెహోవా|| *4 దోపుడు సొమ్ము పంచుకొని ఆశ తీర్చుకొందును నా కత్తి దూసెదను అని శత్రువనుకొనెను ||యెహోవా|| *5 వేల్పులలో నీ సముడెవడు పరిశుద్ధ మహనీయుడా అద్భుతమైన పూజ్యుండా నీ వంటి వాడెవడు? ||యెహోవా|| *6 ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా సముద్రము మధ్యను ఆరిన నేలను నడిచిరి ||యెహోవా|| === code 102 title కొండల తట్టు - కన్నులెత్తుచున్నాను *ref కొండల తట్టు - కన్నులెత్తుచున్నాను నాకు సహాయ - మెక్కడ నుండి వచ్చును *1 భూమి ఆకాశములను - సృజించిన యెహోవా వలన - సాయము కల్గున్‌ ||కొండ|| *2 నీ పాదము తొట్రిల్ల - నీయడు నిన్ను కాపాడువాడు-కునుకడు ||కొండ|| *3 ఇశ్రాయేలును కాచు - దేవుడు కునుకడు నిద్రపోడు-యెన్నడు ||కొండ|| *4 యెహోవాయే నిన్ను - కాపాడును నీ కుడి ప్రక్క నీడగా - నుండున్‌ ||కొండ|| *5 పగటెండ - రాత్రి వెన్నెల - దెబ్బ నీకు తగులకుండ నిను-గాపాడున్‌ ||కొండ|| *6 ఎట్టి అపాయము రా - కుండగను ఆయన నీ ప్రాణమును - గాపాడున్‌||కొండ|| *7 ఇది మొదలుకొని నిత్యము నీ రాకపోకలందు నిను-గాపాడున్‌ ||కొండ|| === code 103 title యేసు నాదు కాపరి వాని *ref యేసు నాదు కాపరి వాని వాసిగా స్తుతించెదన్‌ యేసు గొఱ్ఱె పిల్లను పోయెదను తనవెంట *1 పచ్చిక పట్లకు - మచ్చికతో నడుపున్‌ స్వఛ్ఛ జలము చెంత నిచ్చును విశ్రాంతిన్‌ ముందు ముందు వెళ్ళుచు పొందుగ రక్షించు నన్ను తన మాధుర్య స్వరంబున తనివి దీర్చును ||యేసు|| *2 మరణ లోయ ద్వారా సరిగా నడిపించును అడవి భయము లెల్ల ఎడబాపి రక్షించున్‌ హత్తి ఒత్తి కట్టి గాయా లెంతో ఆదరించును వింతగు వాని ప్రేమ సేవలో సంతోషింతును ||యేసు|| *3 శత్రుల ముందాహారం సంసిద్ధము జేయును నా గిన్నె నిండించి పొర్లి పారజేసి కడిగి కడిగి శుద్ధిచేసి ఆత్మ దాన మిచ్చెను వడిగ వాని సాయమున జయమున వెళ్ళెదను ||యేసు|| === code 104 title భజన చేయుచు భక్త పాలక *ref భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును వృజినములపై జయము నిచ్చిన విజయుడా నిను వేడుకొందు ||భజన|| *1 దివ్యపదవిని విడిచి నీవు దీనుడవై పుట్టినావు భవ్యమైన బోధలెన్నో బాగుగా ధర నేర్పినావు ||భజన|| *2 నరులగావను పరమునుండి ధరకు నీవు వచ్చినావు పరుడనైన నాకొరకు నీ ప్రాణము నర్పించినావు ||భజన|| *3 చెడినవాడనైన నన్ను జేరదీసి బ్రోచినావు పడిన నాదు గోతి నుండి పైకి లేవనెత్తినావు ||భజన|| *4 ఎంత ప్రేమ యెంత దయ ఎంత కృప యేసయ్య నీకు ఇంతయని వర్ణింప నిలలో నెవరికిని సాధ్యంబు కాదు ||భజన|| === code 105 title హే ప్రభుయేసు - హే ప్రభు యేసు *ref హే ప్రభుయేసు - హే ప్రభు యేసు హే ప్రభు దేవసుతా సిల్వ ధరా, పాప హరా, శాంతికరా *1 శాంతి సమాధానాధిపతీ స్వాంతములో ప్రశాంతనిధీ శాంతి స్వరూపా, జీవనదీపా శాంతి సువార్తనిధీ ||సిల్వ|| *2 తపములు తరచిన నిన్నె గదా జపములు గొలిచిన నిన్నెగదా విఫలులు జేసిన విజ్ఞాపనలకు సఫలత వీవెగదా ||సిల్వ|| *3 మతములు వెదకిన నిన్నె గదా వ్రతములు గోరిన నిన్నె గదా పతితులు దేవుని సుతులని నేర్పిన హితమతి వీవెగదా ||సిల్వ|| *4 పలుకులలో నీశాంతి కథ తొలకరి వానగ గురిసెగదా మలమల మాడిన మానవ హృదయము కలకలలాడెకదా ||సిల్వ|| *5 కాననతుల్య సమాజములో హీనత జెందెను మానవత మానవ మైత్రిని సిల్వపతాకము దానము జేసెగదా ||సిల్వ|| *6 దేవుని బాసిన లోకములో చావుయె కాపురముండెగదా దేవునితో సఖ్యంబును జగతికి యీవి నిడితివి గదా ||సిల్వ|| *7 పాపముచేసిన స్త్రీనిగని పాపులకోపము మండెగదా దాపునజేరి పాపిని బ్రోచిన కాపరి వీవెగదా ||సిల్వ|| *8 ఖాళీ సమాధిలో మరణమును ఖైదిగ చేసిన నీవెగదా ఖలమయుడగు సాతానుని గర్వము ఖండనమాయెగదా ||సిల్వ|| *9 కలువరిలో నీ శాంతి సుధా సెలయేఱుగ బ్రవహించెగదా కలుష యెడారిలో కలువలు పూయుట సిలువ విజయముగదా ||సిల్వ|| === code 106 title భీకరుండౌ మా యెహోవా *ref భీకరుండౌ మా యెహోవా పీఠ మెదుటం గూడరే యేకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గొనియాడరే ||భీక|| *1 మట్టితోనే మమ్ము నెల్ల మానవులుగ సృజించెను ఇట్టి శక్తుండౌ ప్రభున్మే మెచ్చుగా మది నెంతుము ||భీక|| *2 ఏరితోడు లేక మము స ర్వేశ్వరుడు సృష్టించెను ధారుణిందానొక్కడే మా దైవమని పూజింతుము ||భీక|| *3 పుట్టగిట్టంజేయఁదానై నట్టిదేవుని శక్తిని బట్టుగా లోకస్థులారా ప్రస్తుతింపరే భక్తిని ||భీక|| *4 మేటి సంగీతంబులుపై మింట నారవ మొందను జాటరే వేవేల నోళ్లన్‌ సన్నుతుల్‌ ప్రభు వందను ||భీక|| *5 మిక్కిలి కష్టంబులతో మిత్తికిని బాల్పొందను దిక్కులేని గొఱ్ఱెలట్లు దిగరుగజేర్పన్‌ మందను ||భీక|| === code 107 title 1. సర్వచిత్తంబు నీదేనయ్యా *ref *1 సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమ్మరివే సారెపై నున్న మంటినయ్యా సరియైన పాత్రన్‌చేయుమయ్యా సర్వేశ్వరా నేరిక్తుండను సర్వదా నిన్నే సేవింతును ||సర్వ|| *2 ప్రభూ! సిద్ధించు నీ చిత్తమే ప్రార్థించుచుంటి నీ సన్నిధి పరికింపు నన్నీదివసంబున పరిశుభ్రమైన హిమముకన్న పరిశుద్ధున్‌ చేసి పాలింపుమా పాపంబుబోవ నను గడుగుమా ||సర్వ|| *3 నీ చిత్తమే సిద్ధించు ప్రభూ నిన్నే ప్రార్థింతు నా రక్షకా నీచమౌ గాయముల చేతను నిత్యంబు కృంగి అలసియుండ నిజమైన సర్వశక్తుండవే నీ చేత బట్టినన్‌ రక్షింపుమా ||సర్వ|| *4 ఆత్మస్వరూప నీ చిత్తమే అనిశంబు చెల్లు ఇహపరమున అధికంబుగా నన్నీ యాత్మతో ఆవరింపుమో నా రక్షకా అందరు నాలో క్రీస్తుని జూడ ఆత్మతో నన్ను నింపుముదేవా ||సర్వ|| === code 108 title యేసు ప్రభుని స్తుతించుట *ref యేసు ప్రభుని స్తుతించుట యెంతో యెంతో మంచిది *1 మహోన్నతుడా - నీ నామమును స్తుతించుటయే బహు మంచిది హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ- హల్లెలూయ *2 విలువైన రక్తము - సిలువలో కార్చి కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగెను *3 ఎంతో గొప్ప - రక్షణ నిచ్చి వింతైన జనముగ - మము జేసెను *4 మా శైలము - మా కేడెము మా కోటయు - మా ప్రభువే *5 ఉన్నత దుర్గము - రక్షణ శృంగము రక్షించువాడు - మన దేవుడు *6 అతి సుందరుడు - అందరిలోన అతికాంక్షనీయుడు-అతి ప్రియుడు *7 రాత్రింబవళ్ళు - వేనోళ్ళతోను స్తుతించుటయే - బహుమంచిది === code 109 title నీవు చేసిన ఉపకారములకు *ref నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏడాది దూడలనా - వేలాది పొట్టేళ్ళనా *1 వేలాది నదులంత విస్తారతైలము నీకిచ్చినా చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చినా చాలునా ||నీవు|| *2 మరణ పాత్రుడనైయున్న నాకై మరణించితివి సిలువలో కరుణ చూపి నీ దివ్య మార్గాన నడిపించుమో యేసయ్యా ||నీవు|| *3 విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును రక్షణ పాత్రను చేబూని నిత్యము నిను వెంబడించెదను ||నీవు|| *4 ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును కపట మనస్సు లేకుండ హృదయాన్ని నీకిచ్చినా చాలునా ||నీవు|| === code 110 title 1. సర్వకృపానిధియగు ప్రభువా *ref *1 సర్వకృపానిధియగు ప్రభువా సకల చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్తుతించెదను సంతసముగ నిను పొగడెదను హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యనిపాడెదను ఆనందముతో సాగెదను *2 ప్రేమించి నన్ను వెదకితివి ప్రీతితో నను రక్షించితివి పరిశుద్ధముగ జీవించుటకై పాపిని నను కరుణించితివి ||హ|| *3 అల్పకాల శ్రమలనుభవింప అనుదినము కృపనిచ్చితివి నాథుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలిచితివి ||హ|| *4 మరణ శరీరము మార్పునొంది మహిమ శరీరము పొందుటకై మహిమాత్మతో నను నింపితివి మరణ భయములను తీర్చితివి ||హ|| *5 భువినుండి శ్రేష్టఫలముగను దేవునికి నిత్య స్వాస్థ్యముగా భూజనములలో నుండి నను ప్రేమించి క్రయధనమిచ్చితివి ||హ|| *6 ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై హేతువు లేకయే ప్రేమించెను యేసుకు నేనేమివ్వగలను ||హ|| === code 111 title సమస్త దేశములారా *ref సమస్త దేశములారా అందరు పాడుడి అందరు పాడుడి అందరు యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి *1 సంతోషముతో యెహోవాను స్తుతించుడి ఉత్సాహ గానము చేయుచు సన్నిధికి రండి ||సమ|| *2 యెహోవా మీ దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను కలుగజేసెను ||సమ|| *3 మనము ఆయన ప్రజలమైతిమి ఆయన మేపు గొఱ్ఱెలము నైతిమి ||సమ|| *4 గుమ్మములలో కృతజ్ఞతార్పణలతోను ఆవరణములలో కీర్తనలతో ప్రవేశించుడి ||సమ|| *5 ఆయనను స్తుతించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమునకు స్తుతులు చెల్లించుడి ||సమ|| *6 యెహోవా దయాళుడాయన కృప నిత్యము ఆయన సత్యము తరతరములుండును ||సమ|| === code 112 title తరతరాలలో, యుగయుగాలలో *ref తరతరాలలో, యుగయుగాలలో జగజగాలలో దేవుడు... దేవుడు... యేసే దేవుడు ఆ... ఆ... ఆ... ఆ... హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా *1 భూమిని పుట్టించక మునుపు లోకపు పునాది లేనపుడు ||దే|| *2 సృష్టికి శిల్పాకారుడు జగతికి ఆది సంభూతుడు ||దే|| *3 తండ్రి కుమార శుద్ధాత్మయు ఒకటైయున్న దేవుడు ||దే|| === code 113 title 1 ప్రభువా తరతరములనుండి *ref *1 ప్రభువా తరతరములనుండి మాకు నివాస స్థలము నీవే యుగయుగములకును నీవే మా దేవుడవు, దేవుడవు, దేవుడవు, దేవుడవు. *2 పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు గూడ నున్నావు, నున్నావు, నున్నావు, నున్నావు ||ప్రభు|| *3 నరపుత్రులను మంటికి మార్చి తిరిగి రండని సెలవిచ్చెదవు వేయి సంవత్సరములు నీకొక జామువలె, జామువలె, జామువలె, జామువలె ||ప్రభు|| *4 నీదు దృష్టికి వేయి యేండ్లు గతించిన నిన్నటివలె నున్నవి రాత్రియందొక జాముకు సమముగ నున్నవి, నున్నవి, నున్నవి, నున్నవి ||ప్రభు|| *5 నీవు వారిని పారగొట్టగ వరద చేతనైన రీతి గడ్డివలె చిగిరించి వాడి పోయెదరు, పోయెదరు, పోయెదరు, పోయెదరు. ||ప్రభు|| *6 ప్రొద్దుట మొలచి చిగిరించును సాయంత్రమున కోయబడును వాడబారును నీ కోపముచే క్షీణించున్‌, క్షీణించున్‌, క్షీణించున్‌, క్షీణించున్‌ ||ప్రభు|| *7 నీదు కోపము వలన మేము క్షీణించుచున్నాము దేవా నీ ఉగ్రతను బట్టి దిగులు పొందెదము, పొందెదము, పొందెదము, పొందెదము ||ప్రభు|| === code 114 title దేవా - నా దేవుడవు నీవె *ref దేవా - నా దేవుడవు నీవె వేకువనే - వెదకెద నిన్ను *1 నీ బలము ప్రభావములను చూడవలెనని యాశతోడ పరిశుద్ధాలయ మందు నీ తట్టు కనిపెట్టుదును ||దేవా|| *2 నీళ్ళులేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు దాహమొంది దేహము కృశించుచున్నది ||దేవా|| *3 నీ కృప జీవము కన్న ఉత్తమము నా పెదవులు నిన్ను స్తుతించున్‌ జీవితకాలమెల్ల స్తుతింతు నీ నామమును బట్టి చేతులెత్తెదన్‌ ||దేవా|| *4 రాత్రి జాములందు నిన్ను ధ్యానించు తరుణమున క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తినొందుచున్నది ||దేవా|| *5 ఉత్సహించెడు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది నా సహాయ కుడా నీ రెక్కల చాటున ||దేవా|| === code 115 title రండి యుత్సాహించి పాడుదము *ref రండి యుత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే *1 రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికేగుదము సత్ప్రభు నామము కీర్తనలన్‌ సంతోషగానము చేయుదము ||రండి|| *2 మన ప్రభువే మహాదేవుండు ఘన మహాత్మ్యముగల రాజు భూమ్యాగాధపు లోయలును భూధర శిఖరము లాయనవే ||రండి|| *3 సముద్రము సృస్టించె నాయనదే సత్యుని హస్తమే భువిన్‌ జేసెన్‌ ఆయన దైవము పాలితుల మాయన మేపెడి గొఱ్ఱెలము ||రండి|| *4 ఆ ప్రభు సన్నిధిన్‌ మోకరించి ఆయన ముందర మ్రొక్కుదము ఆయన మాటల గైకొనిన నయ్యవి మనకెంతో మేలగును||రండి|| *5 తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక ఆదిని నిప్పుడు నెల్లప్పుడు - నయినట్లు యుగములనౌను ఆమెన్‌ ||రండి|| === code 116 title హల్లెలూయ హల్లెలూయ *ref హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ఇది మా స్తుతిగానము అభినందన సుమగీతమాల అనుదినము నూతన వాత్సల్యముతో నడిసించె నాథుడా నీ మేలులను తలంచుచు హర్షించి స్తుతిపాడెదం *1 అనుదిన భారములన్‌ భరించు దేవుడవు వెలలేని నీ ప్రేమ శాశ్వతమైనది ప్రభువా హృదయాన్ని అర్పించి నీ చిత్తము చేశా *2 మరణపు లోయలలో సంకటసమయములో విడిపించి కాపాడి ఆదరించిన దేవా సంపూర్ణ హృదయముతో సదా స్తుతించెదము === code 117 title అన్ని కాలంబుల - నున్న యెహోవా *ref అన్ని కాలంబుల - నున్న యెహోవా నిన్నెన్నదరంబయో - కన్న తండ్రి వన్నె కెక్కిన మోక్ష - వాసాళి సన్నుతు లున్నతమై యుండ - మున్నె నీకు *1 నిన్ను ప్రకటన సేయ నిఖిల లోకములను - బన్నుగ జేసిన బలుడ వీవే - ఉన్న లోకంబుల నుడుగక కరుణా సం - పన్నతతో నేలు - ప్రభుడ వీవే అన్ని జీవుల నెరిగి యాహార మిచ్చుచు నున్న సర్వజ్ఞుం - డవు నీవే యెన్న శక్యము గాక-ఉన్న లక్షణముల సన్నుతించుటకు నే జాలుదునా ||నన్ని|| *2 పుట్టింప నీవంచు బోషింప నీవంచు గిట్టింప నీవంచు గీర్తింతును వట్టి పనికి మాలి - నట్టి మానవుల చే పట్టి రక్షింప బా - ధ్యుండవంచు - దట్టమైన కృపను - దరిజేర్చ నాకిచ్చి పట్టయి నిలచియుండు - ప్రభుడవంచు గట్టడచే గడ - ముట్టుదనుక నా పట్టుకొలది నిన్ను - బ్రస్తుతింతు||నన్ని|| *3 కారుణ్య నిధి వీవు కఠినాత్ముడను నేను భూరి శుద్ధుడవీవు పాపి నేను సార భాగ్యుడవీవు జగతిలో నాకన్న దారిద్రుడే లేడు - తరచి చూడ సార సద్గుణముల సంపన్నుడవు నీవు ఘోర దుర్గుణ సం - చారి నేను ఏ రీతి స్తుతి యింతు నేరీతి సేవింతు నేరమెన్నక ప్రోవ - నెర నమ్మితి === code 118 title నీతి సూర్యుండ నిను బోలిన *ref నీతి సూర్యుండ నిను బోలిన రక్షకుడెందును గలడె? పాతకములు బాపగ నీతో జాలిన ప్రభుడెవ్వండో భువిలో నీతికి కర్త నిజస్వరూప నిత్యము మము వెలిగించెడు *1 జీవపు వెలుగై జీవులకును నీ జీవంబిచ్చితివా దేవా జీవము నొందగ రారు నీదరికి జీవుల నిరతము బ్రోచెడి ||నీతి|| *2 రక్తము కార్చి విముక్తుల జేసిన రక్షకుడౌ నీవె జగతిన్‌ రక్తము చిందించితి నా కొరకై రక్షణ పాపికి నిచ్చిన ||నీతి|| *3 నిను కనుగొన నిజ యత్నము జేసిన మానవులున్‌ గలరా భువిలో నిను వెదకెడు వారికి దొరికెదవు నిను కనుగొందురు నిజముగ ||నీతి|| === code 119 title స్తుతియించు ప్రియుడా - సదా యేసుని *ref స్తుతియించు ప్రియుడా - సదా యేసుని ఓ... ప్రియుడా - సదా యేసుని *1 నరకము నుండి - నను రక్షించి పరలోకములో - చేర్చుకున్నాడు ఆనంద జలనిధి - నానందించి కొనియాడు సదా యేసుని ||ఆనంద|| *2 సార్వత్రికాధి - కారి యేసు నా రక్షణకై నిరుపేద యాయె ||ఆనంద|| *3 పాప దండన భయమును బాపి పరమానందము మనకొసగెను ||ఆనంద|| *4 మన ప్రియ యేసు - వచ్చుచున్నాడు మహిమ శరీరము మనకొసగును ||ఆన|| === code 120 title నా ప్రాణ ప్రియుడా యేసురాజా *ref నా ప్రాణ ప్రియుడా యేసురాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయ పూర్వక ఆరాధనతో సత్యముగా *1 అద్భుత కరుడా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా బలవంతుడా బహు ప్రియుడా మనోహరుడా మహిమ రాజా స్తుతించెదన్‌ ||నా ఆత్మ|| *2 విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతున్‌ హర్షింతును నే పాడెదను నా ప్రభువా ||నా ఆత్మ|| *3 గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా మరచిన గాని నీ వెన్నడు మరువవు విడువవు ఎడబాయవు కరుణరాజా ||నా ఆత్మ|| *4 రక్షణాలంకారములను అక్షయమగు నీ యాహారమున్‌ రక్షకుడా నా కొసగితివి దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును ||నా ఆత్మ|| *5 నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును కృతజ్ఞతా స్తుతుల తోడ నీ ప్రేమను నే వివరింతును విమోచకా ||నా ఆత్మ|| *6 వాగ్దానముల్‌ నాలో నెరవేరెను విమోచించి నాకిచ్చితివే పాడెదను ప్రహర్షింతును హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ||నా ఆత్మ|| === code 121 title నాదు ప్రాణమా - నాదు ప్రాణమా *ref నాదు ప్రాణమా - నాదు ప్రాణమా దేవుని క్రియల్మరువకుమా ఆయన చేసిన దేనిన్‌ మరువకుమా *1 వ్యర్ధుడవై - నాశనంబౌ నిన్ను రక్షించి మోక్ష నగరు చేర్చను తనదు ప్రాణమిచ్చెనె ఓ నా మనసా ఎంతటిప్రేమ దేవుని క్రియల్మరువకుమా, నీ ||దేవుని|| *2 ప్రియులు లేక - భ్రమసి నీవు పరుడవైనపుడు - ప్రియుడేసు నిన్ను చేరి - సంతసంబిడెనె సమర్పించు - సర్వము తనకై దేవుని క్రియల్మరువకుమా, నీ ||దేవుని|| *3 రక్షణాలం - కార వస్త్రము జీవాహారము - శాంతి సమాధానము నీతి - నీకు నిచ్చెనె ప్రేమ పరిమళ స్తుతులను పాడి దేవుని క్రియల్మరువకుమా, నీ ||దేవుని|| *4 గెత్సెమనెలో కార్చెనేసు రక్త చెమటలను - వేదనతో విజ్ఞాపనము - నీ కొరకు జేసెన్‌ వినుమా మనసా - ఏడ్చెను నీకై దేవుని క్రియల్మరువకుమా, నీ ||దేవుని|| *5 వస్తాననిన - కాలమాయె తామసంబేల - ప్రభుని రాక బూర ధ్వనించు - కాలమెప్పుడో ఆశతో ప్రభుని - రాకను కోరి దేవుని క్రియల్మరువకుమా, నీ ||దేవుని|| === code 122 title మా దేవా ! మా దేవా ! నీదు *ref మా దేవా ! మా దేవా ! నీదు విశ్వాస్యత చాలా గొప్పది మా దేవా *1 దయామయుండగు - తండ్రివి నీవే తల్లిని మించిన దాతవు నీవె మాయా కల్పిత గాథల నుండి మంచిగ మము రక్షించితివి ||మా|| *2 కోడి పిల్లలను కాచెడి పగిది ఆపద లన్నిటి బాపితివయ్య సర్వకాలముల యందున నీకె చక్కగ సంస్తుతులగు నీకె ||మా|| *3 సింహపు పిల్లలు ఆకలి గొనిన సింహపు బోనులో నను వేసినను సిగ్గు కలుగకుండగ నను నీవు కాపాడుచున్నా వీ యిలలో ||మా|| *4 మరణ లోయ లందున నే నున్న తరుణములు నాకు విరోధమైన చరణముల్‌ పాడెడు విధమున నీవు నన్నొనర్చు చున్నావుగా ||మా|| *5 వ్యాధులు నన్ను బాధించినను వ్యాకులములు హృదయములో నున్న వదలవు నన్నిల అనాథునిగ నెప్పుడు నన్ను బ్రోచుచు నుందువుగా ||మా|| *6 నీదు సత్య మాకాశము కంటె అత్యున్నతముగ స్థాపింపబడె నీదు సత్యమును నీచుడనగు నా కనులకు ప్రత్యక్ష పరచితివి ||మా|| *7 పర్వతములు తొలగిన గాని పలువిధ కొండలు తత్తరిల్లినను పావనుడా నీ వెలలేని యట్టి కృప నను విడువదు-హల్లెలూయా ||మా|| === code 123 title జీవితమంత నీ ప్రేమగానం *ref జీవితమంత నీ ప్రేమగానం ప్రణుతింతుము యేసుదేవా ప్రచురింతు మేము నీ కీర్తిన్‌ ఆనంద గానంబుతో ||జీవిత|| *1 సర్వ సమయములలో నీ స్తుతిగానం ఎల్ల వేళలయందు నీ నామ ధ్యానం మాదియే మేలు ఈ జీవితమున స్తుతియింతు నా రక్షకా ||జీవిత|| *2 సృష్టినంతటిని నీ మాటచేత సృజియించితివిగా మా దేవదేవా నీ ఘనమగు మహిమన్‌ వర్ణింపతరమా స్తుతియింతు నా రక్షకా ||జీవిత|| *3 కలుషాత్ములమైన మా కొరకు నీ విలువైన ప్రాణంబు నర్పించితివిగా కల్వరిగిరిపై చూపిన ప్రేమన్‌ స్తుతియింతు నా రక్షకా ||జీవిత|| *4 పరిశుద్ధమైన నీ సన్నిధిలో శాశ్వతమైన నీ రాజ్యంబులో ప్రేమతో నన్ను చేర్చుకొంటివిగా స్తుతియింతు నా రక్షకా ||జీవిత|| === code 124 title దేవుని యందు - నిరీక్షణ నుంచి *ref దేవుని యందు - నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నాప్రాణమా! *1 ఏ అపాయము - రాకుండ నిన్ను దివారాత్రులు - కాపాడువాడు ప్రతిక్షణం - నీ పక్షముండు రక్షకుడు ||దేవుని|| *2 చీకటిని - వెలుగుగ చేసి ఆయన నీ - ముందు పోవువాడు సత్యమగు జీవమగు మార్గము యేసే ||దేవుని|| *3 నీకు సహాయముచేయువాడు సదా ఆదుకొను -వాడు ఆయనే ఆధారము - ఆదరణ ఆయనలో ||దేవుని|| *4 తల్లితన బిడ్డను - మరచినను మరువడు నీ - దేవుడు నిన్ను తల్లికన్న - తండ్రికన్న ఉత్తముడు ||దేవుని|| *5 నీకు విరోధముగా - రూపించిన ఏవిధ ఆయుధమును - వర్ధిల్లదు శత్రువులు మిత్రులుగ మారుదురు ||దేవుని|| *6 పర్వతములు తొలగి - పోయినను తన కృప నిన్ను - ఎన్నడు వీడదు కనికర సంపన్నుడు నీ దేవుడు ||దేవుని|| *7 స్తుతి మహిమలు - నీకే ప్రభు నిత్యము నిన్నే కొనియాడెద హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయ ||దేవుని|| === code 125 title పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా *ref పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూతలైన నిన్‌ - వర్ణింపగలరా *1 పరిశుద్ధ జనకుడ - పరమాత్మ రూపుడ నిరుపమ బల బుద్ధి - నీతి ప్రభావా *2 పరిశుద్ధ తనయుడ - నరరూపధారుడ నరులను రక్షించు - కరుణ సముద్రా *3 పరిశుద్ధమగు నాత్మ-వరము లిడు నాత్మ పరమానంద ప్రేమ - భక్తుల కిడుమా *4 జనక కుమారాత్మ - లను నేక దేవా ఘన మహిమ చెల్లును - దనర నిత్యముగా === code 126 title చూచుచున్నాము నీవైపు *ref చూచుచున్నాము నీవైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీవైపు చూచుచు నీ ప్రేమ - సొంపు సువార్తను జాఁచుచుఁ గరములు-చక్కఁగా నీవైపు *1 మే మరులమై యుంటిమి మార్గము వీడి మేమందరము పోతిమి ప్రేమచేనప్పుడు ప్రియతనయు నంపించి క్షేమమార్గము మాకు బ్రేమను జూపితివి ||చూచు|| *2 నిను నమ్ము పాపులకు వారెవరైన నీ శరణుజొచ్చు వారలకు ఇనుఁడపు కేడెంబు నీ జగతిలో నగుచు ఁగనుపరచుచుందువు ఘనమైన నీ కృపఁ ||చూచు|| *3 నీ భయము మాయెదలను నిలుపుము నీదు ప్రాభవ మొనరంగను నీ భయముచే మేము వైభవ మొందుచు నే భయము లేకుండ నీ భువిని గొన్నాళ్ళు ||చూచు|| *4 దయఁజూచి మము నెప్పుడు మంచివి యన్ని - దయచేయు మెల్లప్పుడు దయచేయరానివి దయచేయుమని కోరఁదయజూపి మన్నించు దయగల మా తండ్రి ||చూచు|| === code 127 title యేసు నీ నామామృతము మా-కెంతో *ref యేసు నీ నామామృతము మా-కెంతో రుచియయ్యా - దేవ మా దోసములను హరించి మోక్షని-వాసులుగ జేయుటకు భాసుర ప్రకాశమైన ||యేసు|| *1 వేడు కలరఁగఁ గూడి నిను గొని యాడు వారికి - దేవ-యెంతో కీడు జేసినపాడు వైరిని- గోడుగోడనంగ వాని తాడనము జేసితివి ||యేసు|| *2 పాపములు హరింప నీవే ప్రాపుమాకయ్యా-దేవ- నీ- దాపు జేరిన వారికందరి-కాపదలు బాపి నిత్య-కాపుగతి జూపినావు ||యేసు|| *3 అక్షయ కరుణేక్ష భువన-రక్షకా నీవే-దేవ -మమ్ము పక్షముగ రక్షించి మోక్షసు- రక్షణకు దీక్షగొని వీక్షితులమైన మాకు ||యేసు|| *4 అందమగు నీ మందిరమున బొందుగా మేము- దేవ-నీ సుందర-కరుణామృతము మా-డెందములయందుగ్రోలు టందుకు సుందరమైన ||యేసు|| === code 128 title హల్లెలూయ- స్తుతి మహిమ *ref హల్లెలూయ- స్తుతి మహిమ ఎల్లప్పుడు - దేవుని స్తుతించెదము ఆ... హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ *1 అల సైన్యములకు - అధిపతియైన ఆ దేవుని స్తుతించెదము అలసాంద్రములను - దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము *2 ఆకాశమునుండి - మన్నాను పంపిన దేవుని స్తుతించెదము బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము *3 పరలోకమునుండి - ధరకేతెంచిన దేవుని స్తుతించెదము నశియించిన దానిని -వెదకి రక్షించిన ఆ యేసుని - స్తుతించెదము === code 129 title త్రాహిమాం క్రీస్తు నాథా *ref త్రాహిమాం క్రీస్తు నాథా దయఁజూడ రావే - నేను దేహీయనుచు నీ పాదములే దిక్కుగా ఁజేరితిని పుడు *1 గవ్వ చేయరాని చెడ్డ కర్మేంద్రియాధీనుడనై రవ్వపాలైనేనెంతో నెవ్వబొందితిఁ త్రవ్వుచున్న కొలదిఁ పెరుఁగుఁ దరగదు నా పాప రాశి యివ్విధమునఁ జెడిపోతినినే నేమి సేతు నోహో హోహో ||త్రాహి|| *2 నీ యందు భయభక్తులు లేని - నిర్లజ్జాచిత్తముఁబూని చేయరాని దుష్కర్మముల - చేసినాఁడను దయ్యాలరాజు చేతిలోఁ జేయివేసి వాని పనులఁజేయసాగినే నిబ్బంగి - జెడిపోయితినే నయ్యయ్యయ్యొ ||త్రాహి|| *3 నిబ్బర మొక్కించుకైన నిజము రవ్వంతైన లేక దబ్బర లాడుటకు ము-త్తాత నైతిని అబ్బురమైన ఘోర పా-పాంధకార కూపమందు దబ్బున బడిపోతినయ్యో దారి చెడి నేనబ్బబ్బబ్బా ||త్రాహి|| *4 నిన్నుఁజేరి సాటిలేని నిత్యానంద మందఁబోవు చున్నప్పుడు నిందలు నా -కెన్ని చేరినా విన్నదము లేకుండ నీవే నా మదికి ధైర్యమిచ్చియన్నిట రక్షించితివి నా యన్న నీకు స్తోత్రమహహా ||త్రాహి|| === code 130 title యేసయ్యా యేసయ్యా యేసయ్యా *ref యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా *1 కొండలలో లోయలలో, అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా ||నిన్నే|| *2 ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగా అండ నీవైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా... ||నిన్నే|| *3 మరణచ్ఛాయలలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరచెనయ్యా నిన్నే ఘనపరతునయ్యా, యేసయ్యా... ||నిన్నే|| *4 వంచన వంతెన ఒరిగిన, భారాన పొసగక విసిగిన విసిరే కెరటాన్న కలలా కడతేర్చినావా నీ వలలో నను మోసినావా, యేసయ్యా... ||నిన్నే|| === code 131 title 1. యెహోవ గద్దె ముందట *ref *1 యెహోవ గద్దె ముందట జనంబూలార మ్రొక్కుడి యెహోవ దేవుడే సుమీ సృజింప జంప గర్తయే *2 స్వశక్తిచేత నాయనే మమున్‌ సృజించె మట్టిచే భ్రమించు గొఱ్ఱె రీతిగా దప్పంగ మళ్లి చేర్చెను *3 సుకీర్తి పాడి గుంపులై ప్రసిద్ధిచేతు మాయనన్‌ జగత్తు వేయి నోళ్లతో స్తుతించు దివ్యమౌ ధ్వనిన్‌ *4 ప్రభుత్వ ముండు నంతకున్‌ ఆగున్‌ నీ ప్రేమ నిత్యము చిరంబు నీదు సత్యము వసించు నెల్లకాలము. === code 132 title స్తోత్రమే మా ప్రాణము *ref స్తోత్రమే మా ప్రాణము స్తుతులె మా ఆహారము సిలువయే మా ధ్యానము ప్రభు పొలములో పనివారము ||స్తో|| *1 యేసు క్రీస్తే మార్గము ప్రభు యేసు క్రీస్తే గమ్యము కొండమీది ప్రసంగము మా జీవితమునకు గమ్యము ||స్తో|| *2 సిలువ వేదం చదువుకుంటు ప్రభు శ్రమల పల్లకి మోసికుంటూ అనుదినము స్తోత్రించుకుంటూ చేరెదం ప్రభు రాజ్యము ||స్తో|| *3 హల్లెలూయ పాడెదం ప్రభు అద్భుతాలను చాటెదం కోటి కాంతుల వెలుగుమయుని కరుణపీఠం చేరెదం ||స్తో|| === code 133 title నీతిగల యెహోవ స్తుతి మీ *ref నీతిగల యెహోవ స్తుతి మీ యాత్మతో నర్పించుడీ యాత్మతో సేవించుడీ దాతయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడీ *1 చదలబుడమిని రవిని జలధిని నదులగిరులను జక్కగా సదమలంబగుదైవ నామము సర్వదా నుతిచేయనీ ||నీతి|| *2 సర్వశక్తుని కార్యములకీ సర్వ రాష్ట్రములన్నియు గర్వముల్‌ విడితలలు వంచుచు నుర్విలో నుతిజేయనీ ||నీతి|| *3 గీత తాండవ వాద్యములచే బ్రీతిపరచెడు సేవతో బాతకంబులు పరిహరించెడు దాతనే సేవించుడీ ||నీతి|| *4 పరమ దూతలు నరులు పుడమిని మొరలుబెట్టుచు దేవుని బరమునందున్నట్టి యేసుని పాదములు సేవింపనీ ||నీతి|| *5 ఇలను భక్తులు గూడుకొనుచును బలము గల్గిన దేవుని వెలయు స్తుతులను నోళ్ళతోడను విసుకకుండగ జేయనీ ||నీతి|| === code 134 title 1. సన్నుతింతుమో ప్రభో *ref *1 సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో కన్నతండ్రి కావుమా కలుషము నెడబాపుమా *2 నీతిసూర్య తేజమా జ్యోతిరత్న రాజమా పాతకజన రక్షకా పతితపావన నామకా *3 మానవ సంరక్షకా దీన నిచయ పోషకా దేవమానవ నందనా దివ్య సుగుణ మందనా *4 ప్రేమ తత్వబోధకా క్షేమదాత వీవెగా కామిత ఫలదాయక స్వామి యేసు నాయక *5 పాపచింతలన్నిటిన్‌ పారదోలుమో ప్రభో నీ పవిత్ర నామమున్‌ నిరతము స్మరియించెదన్‌ === code 135 title నూతన గీతము పాడెదను *ref నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునిలో హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్‌ *1 ఆత్మలోనె పాడెదను ఆర్భటించి పాడెదను అభినయించి పాడెదను అనుభవించి పాడెదను అనుదినము నే పాడెదను అందరిలో నే పాడెదను ||నూతన|| *2 యేసే నా మంచి కాపరి యేసే నా గొప్ప కాపరి యేసే నా ప్రధాన కాపరి యేసే నా ఆత్మ కాపరి యేసే నన్ను కొన్న కాపరి యేసే నాలో వున్న కాపరి ||నూతన|| *3 శత్రుసేనలు ఎదురైనా దుష్టులంతా ఒకటైనా అజేయుడేసుని చేరెదనూ విజయగీతము పాడెదను ధ్వజమునెత్తి సాగెదను భజన చేయుచు పాడెదను ||నూతన|| === code 136 title 1 ప్రతిక్షణం స్తుతియించెద *ref *1 ప్రతిక్షణం స్తుతియించెద ప్రభుయేసు ప్రేమ ఘనత ప్రతి దినము కొనియాడెద ప్రభు యేసు దివ్యచరిత ప్రతి నోట పాడాలి ఒక చక్కని తియ్యనిపాట ప్రతి చోట పాడాలి ప్రభుమేలుల గూర్చి ఓ...దేవ మహాదేవ-నీకె స్తోత్రము సంపూర్ణ హృదయంతో ధ్యానించెదం ఓ దేవ మహరాజ-నీకే చెల్లును ||ప్రతి|| *2 మరణదూత మమ్ములను వెంటాడగా దరిచేర కరముచాచి కాపాడిన దేవా మా బ్రతుకుల జీవమిచ్చి బ్రతికించగా స్తుతి నీకె అర్పింతుము *3 మనుజునిగ అరుదెంచిన మహిమతేజుడా కొనియాడ తరముగాదు నీదు ప్రేమను మా రక్షణకై నీదు రక్తమిచ్చినావు స్తుతి నీకె అర్పింతుము === code 137 title స్తుతి సింహాసనాశీనుడా *ref స్తుతి సింహాసనాశీనుడా యేసురాజా దివ్య తేజా *1 అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభూ నీతి న్యాయములు నీ సింహాసనాధారం కృప సత్యము నీ సన్నిధాన వర్తులు ||స్తు|| *2 బలియు అర్పణ కోరవు నీవు బలియైతివి నా దోషము కొరకై నా హృదయమె నీ ప్రియమగు ఆలయం - స్తుతి యాగమునే చేసెద నిరతం ||స్తు|| *3 బూర ధ్వనులే నింగిని మ్రోగగ రాజాధిరాజా నీవే వచ్చు వేళ సంసిద్ధతతో - వెలిగే సిద్దెతో పెండ్లి కుమారుడా నిన్నెదుర్కొందును ||స్తు|| === code 138 title క్రొత్తయేడు మొదలుబెట్టెను *ref క్రొత్తయేడు మొదలుబెట్టెను మన బ్రతుకునందు క్రొత్త... క్రొత్త మనసుతోడ మీరు క్రొత్త యేట ప్రభుని సేవ దత్తర పడకుండ జేయు టుత్తమోత్తమంబు జూడ ||క్రొత్త|| *1 పొందియున్న మేలులన్నియు బొంకంబు మీఱ డెందమందు స్మరణ చేయుడీ యిందు మీరు మొదలుబెట్టు పందెమందు గెల్వవలయు నందముగను రవిని బోలి నలయకుండ మెలయకుండ ||క్రొత్త|| *2 మేలు సేయ దడ వొనర్పగా మీ రెఱుగునట్లు కాలమంత నిరుడు గడచెగా ప్రాలు మాలి యుండకుండ జాలమేల సేయవలయు జాల జనముల కిమ్మాను యేలు నామ ఘనత కొఱకు ||క్రొత్త|| *3 బలములేని వారమయ్యును బల మొందవచ్చు గలిమి మీఱ గర్త వాక్కున నలయకుండ నడుగుచుండ నలగకుండ మోదమొంది బలమొసంగు సర్వవిధుల నెలమి మీ రొనర్చుచుండ ||క్రొత్త|| *4 ఇద్దరిత్రి నుండునప్పుడే యీశ్వరుని జనులు వృద్ధి బొంద జూడవలయును బుద్ధి నీతి శుద్ధులందు వృద్ధి నొంద శ్రద్ధ జేయ - శుద్ధులైనవారిలో ప్ర-సిద్ధులగుచు వెలుగవచ్చు ||క్రొత్త|| *5 పాప పంకమంటినప్పుడు ప్రభు క్రీస్తు యేసు ప్రాపు జేరి మీరు వేడగా నేపు మీఱ దనదు కరుణ బాప మంత గడిగివేసి పాప రోగ చిహ్నలన్ని బాపివేసి శుద్ధిజేయు ||క్రొత్త|| === code 139 title వందనం బొనర్తుమో ప్రభో - ప్రభో *ref వందనం బొనర్తుమో ప్రభో - ప్రభో వందనం బొనర్తుమో ప్రభో - ప్రభో వందనంబు తండ్రి తనయ, శుద్ధాత్ముడా వందనంబు లందుకో ప్రభో *1 ఇన్నినాళ్ళు ధరను మమ్ము బ్రోచియు గన్న తండ్రి మించి యెపుడు గాచియు ఎన్నలేని దీవెన-లిడు నన్న యేసువా యన్ని రెట్లు స్తోత్రము లివిగో ||వం|| *2 ప్రాత వత్సరంపు బాప మంతయు బ్రీతిని మన్నించి మమ్ము గావుము నూతనాబ్దమునను నీదు నీతి నొసగు మా-దాత క్రీస్తు నాథ రక్షకా ||వం|| *3 దేవమాదుకాలు సేతు లెల్లను సేవకాళి తనువు దినములన్నియు నీ వొసంగు వెండి,పసిడి-జ్ఞానమంత నీ సేవకై యంగీకరించుమా ||వం|| *4 కోత కొరకు దాస జనము నంపుము ఈ తరిమా లోటు పాట్లు దీర్చుము పాతకంబు లెల్ల మాపి-భీతి బాపుము ఖ్యాతి నొందు నీతి సూర్యుడా ||వం|| *5 మా సభలను పెద్ద జేసి పెంచుము నీ సువార్త జెప్పశక్తినీయుము మోసపుచ్చు నంధ కార-మంత ద్రోయుము యేసు కృపన్‌ గుమ్మరించుము ||వం|| === code 140 title ఘనదేవా మా ప్రభువా *ref ఘనదేవా మా ప్రభువా కృతజ్ఞతస్తుతులతో వందన సమర్పణతో ఆరాధింతుము *1 ఒంటరియైన వానిని పిలిచి పదివందలుగా దీవించితివి బలమైన జనముగా జేసి వాగ్దానము నెరవేర్చి (2) ||ఘన|| *2 ఉపవాస కన్నీటి ప్రార్థన బలముతో సహోదర ప్రేమ సమైక్య కృషిలో స్థిరమైన విశ్వాసముతో కట్టితిరీ సహవాసం (2) ||ఘన|| *3 నీ విశ్వాస్యత కరుణామృతము నీ ప్రేమ కృపా వాత్యల్యము స్థిరముగా యున్నందులకు చెల్లింతుము స్తోత్రము (2) ||ఘన|| === code 141 title స్తుతించెదను - నిన్ను నేను మనసారా *ref స్తుతించెదను - నిన్ను నేను మనసారా భజించెదను - నేను నిన్ను దినదినము స్తోత్రార్హుడవు - నీవే ప్రభు సమస్తము నీకర్పించెదను *1 పూజార్హుడవు - పవిత్రుడవు పాపిని క్షమియించె - మిత్రుడవు పరము చేర్చి - ఫలములిచ్చే పావనుడగు మా - ప్రభువు నీవే ||స్తుతి|| *2 కృపాకనికరములు గల దేవా కరుణ జూపి కనికరించు కంటి రెప్పవలె - కాపాడు కడవరకు మమ్ము - కావుమయా ||స్తుతి|| *3 సర్వశక్తిగల - మా ప్రభువా సజీవ సాక్షిగ చేయుమయా స్థిరపరచి మమ్ము బలపరచుము సదా నీకె స్తోత్రాలర్పింతున్‌ ||స్తుతి|| === code 142 title స్తుతియు మహిమా ఘనతా నీకే *ref స్తుతియు మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా *1 మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము మేమందరము ఉత్సహించి సంతోషించెదము కొనియాడెదము మరువ బడని మేలులు చేసెనని ||స్తుతి|| *2 నీ ఒక్కడవే గొప్ప దేవుడవు ఘన కార్యములు చేయుదువు నీదు కృపయే నిరంతరము నిలిచి యుండునుగా నిన్ను మేము ఆనందముతో ఆరాదించెదము ||స్తుతి|| *3 నూతనముగ దినదినము నిలుచు నీదు వాత్సల్యత మాపై ఖ్యాతిగా నిలిచే నీ నామమును కీర్తించెద మిప్పుడు ప్రీతితో మాస్తుతులర్పించెదము దాక్షిణ్యా ప్రభువా ||స్తుతి|| *4 నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి జీవమునిచ్చి నడిపించెదవు నీ ఆత్మ ద్వారా సేవించెదము సమభూమిగల ప్రదేశములలో నిను ||స్తుతి|| *5 భరియించితివి శ్రమలు నిందలు ఓర్చితి వన్ని మా కొరకై మరణము గెలిచి ఓడించితివి సాతాను బలమున్‌ పరము నుండి మాకై వచ్చె ప్రభు యేసు జయమున్‌ ||స్తుతి|| === code 143 title దేవ సంస్తుతి చేయవే మనసా *ref దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయుమా నా జీవమా యెహోవా దేవుని పావన నామము నుతించుమా నా యంతరంగములో వశించునో సమస్తమా ||దేవ|| *1 జీవమా, యెహోవా నీకు జేసిన మేళ్లన్‌ మరువకు నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేవియున్‌ లేకుండ జేయును ఆ కారణముచే ||దేవ|| *2 చావు గోతి నుండి నిన్ను లేవనెత్తి దయను గృపను జీవ కిరీటముగ వేయును నీ శిరసు మీద జీవ కిరీటముగ వేయును ఆ కారణముచే ||దేవ|| *3 యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనె క్రొత్త యౌవనంబై వెలయునట్లుగ మేలిచ్చి నీదు భావమును సంతుష్టి పరచునుగా ఆ కారణముచే ||దేవ|| *4 ప్రభువు నీతి పనులు చేయున్‌ బాధితులకు న్యాయ మిచ్చున్‌ విభుడు మార్గము తెలిపె మోషేకు దన కార్యములను విప్పె నిశ్రాయేలు జనమునకు ఆ కారణముచే ||దేవ|| *5 అత్యధిక ప్రేమ స్వరూపి యైన దీర్ఘ శాంతపరుడు నిత్యము వ్యాజ్యంబు చేయడు ఆ కృపోన్నతుడు నీ పయి నెపుడు కోపముంచడు ఆ కారణముచే ||దేవ|| *6 పామరుల మని ప్రత్యుపకార ప్రతి ఫలంబుల్‌ పంపలేదు భూమికన్న నాకసంబున్న యెత్తుండు దైవ ప్రేమ భక్తి జనుల యందున ఆ కారణముచే ||దేవ|| *7 పడమటికి తూర్పెంత యెడమో పాపములకును మనకు నంత యెడము కలుగ జేసియున్నాడు మన పాపములను యెడముగానే చేసియున్నాడు ఆ కారణముచే ||దేవ|| *8 కొడుకులపై దండ్రి జాలి పడు విధముగా భక్తిపరుల యెడల జాలి పడును దేవుండు తన భక్తిపరుల యెడల జాలిపడును దేవుండు ఆ కారణముచే ||దేవ|| *9 మనము నిర్మితమయిన రీతి తనకు దెలిసియున్న సంగతి మనము మంటివార మంచును జ్ఞాపకము చేసి కొనుచు కరుణ జూపుచుండును ఆ కారణముచే ||దేవ|| *1 పూసి గాలి వీవ నెగిరి పోయి బసను దెలియని వన వాస పుష్పము వలెనె నరుడుండు నరు నాయువు తృణ ప్రాయము మన దేవ కృప మెండు ఆ కారణముచే ||దేవ|| *1 పరమ దేవ నిబంధ నాజ్ఞల్‌ భక్తితో గైకొను జనులకు నిరతమును గృప నిలిచి యుండును యెహోవా నీతి తరముల పిల్లలకు నుండును ఆ కారణముచే ||దేవ|| === code 144 title 1 యెహోవాను స్తుతించుడి *ref *1 యెహోవాను స్తుతించుడి ఆయన దయాళుడు ఆయన కృప నిరంతరముండును ఆయన కృప నిరంతరముండును (2) *2 దేవ దేవునికి స్తుతులు చెల్లించుడి ||ఆయన|| *3 ప్రభువుల ప్రభువుకు స్తుతులు చెల్లించుడి ||ఆయన|| *4 ఆశ్చర్య కార్యములు చేయువాని స్తుతించుడి ||ఆయన|| *5 ఆకాశము జ్ఞానముచే జేసినవాని స్తుతించుడి ||ఆయన|| *6 నీళ్లమీద భూమిని పరచినవాని స్తుతించుడి ||ఆయన|| *7 గొప్ప జ్యోతులను నిర్మించినవాని స్తుతించుడి ||ఆయన|| *8 పగటినేలు సూర్యుని చేసినవాని స్తుతించుడి ||ఆయన|| *9 రాత్రినేలు చంద్రుని చేసినవాని స్తుతించుడి ||ఆయన|| === code 145 title రాజులకు రాజైన యీ మన విభుని *ref రాజులకు రాజైన యీ మన విభుని పూజసేయుటకు రండి యీ జయశాలి కన్న-మన కింక రాజెవ్వరును లేరని ||రాజులకు|| *1 కరుణ గల సోదరుండై-యీయన ధరణి కేతెంచె నయ్యా తిరముగ నమ్ముకొనిన-మనకొసగు బరలోక రాజ్యమ్మును ||రాజులకు|| *2 నక్కలకు బొరియలుండె-నాకాశ పక్షులకు గూళ్లుండెను ఒక్కింత స్థలమైనను-మన విభుని కెక్కడ లేకుండెను ||రాజులకు|| *3 అపహాసములు సేయుచు-నాయన యాననము పై నుమియుచు గృప మాలిన సైనికు-లందరును నెపములెంచుచు గొట్టిరి ||రాజులకు|| *4 కరమునందొక్క రెల్లు-పుడకను దిరముగా నునిచి వారల్‌ ధరణీపతి శ్రేష్ఠుడా-నీకిపుడు దండమనుచును మ్రొక్కిరి ||రాజులకు|| *5 ఇట్టి శ్రమలను బొందిన-రక్షకుని బట్టుదలతో నమ్మిన అట్టహాసము తోడను-బరలోక పట్టణంబున జేర్చును ||రాజులకు|| *6 శక్తి గల రక్షకుండై-మన కొరకు ముక్తి సిద్ధము జేసెను భక్తితో బ్రార్థించిన-మన కొసగు రక్తితో నా ముక్తిని ||రాజులకు|| *7 త్వరపడి రండి రండి-యీ పరమ గురుని యొద్దకు మీరలు దరికి జేరిన వారిని-యీ ప్రభువు దరుమడెన్నడు దూరము ||రాజులకు|| === code 146 title యెహోవా మా తండ్రి గాఁడ *ref యెహోవా మా తండ్రి గాఁడ యేసుఁడు మా యన్న గాఁడ మహిమ గల శుద్ధాత్మ యిట్టి వరుస దెలిపెంగద మా తోడ *1 మోక్ష నగరు మా పుట్టిల్లు ముఖ్య దూతల్‌ మా స్నేహితులు సాక్షాత్కారమైయున్నపుడు లక్ష్యపెట్ట మిహ బాధలకు ||యెహో|| *2 అబ్రాహాము దావీదు మొదలైనట్టి వర భక్తాగ్రేసరులే శుభ్రముగ మా చుట్టా లైనన్‌ హర్షిమిఁక మా కేమి కొదువ ||యెహో|| *3 పేతురాది సకలాపోస్తుల్‌ పేర్మిగల మా నిజ కూటస్థుల్‌ ఖ్యాతి సభలో మేమున్నప్పుడు ఘనతలిక మాకేమి వెలితి ||యెహో|| *4 తనువు బలిపెట్టెను మా యన్న తప్పు ల్విడఁగొట్టెను మా తండ్రి మనసులో సాక్ష్యమిట్లున్న మనుజులెట్లన్నను-మాకేమి ||యెహో|| *5 పరమ విభు జీవ గ్రంథములో బ్రభుని రక్తాక్షరముద్రితమె చిరముగా నుండు మా పేరు చెఱుపు బెట్టెడు వారింకెవరు ||యెహో|| *6 కరములతో నంటరాని కన్నులకు గోచరముగాని పరమ ఫలముల్‌ మాకున్నపుడు సరకు గొన మిక్కడి లేములకు === code 147 title నీతో సమమెవరు? *ref నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు? నీలా క్షమియించేదెవరు యేసయ్యా? నీలా పాపికై ప్రాణంబెట్టిన వారెవరు? *1 లోక బంగారము-ధన ధాన్యాదులు ఒక్క పోగేసినా-నీతో సరితూగునా? జీవ నదులన్నియు, సర్వ సంద్రములు ఒక్కటై యెగసినా నిన్ను తాకగలవా? నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయా నీవేగా మంచి దేవుడవు ||నీతో|| *2 పలు వేదాలలో మతగ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి? పాప పరిహారార్థం సిలువ మరణమొంది తిరిగి లేచినట్టి దైవనరుడెవ్వరు? నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి? నీవేగా విమోచకుడవూ ||నీతో|| *3 నేను వెదుకకున్నా నాకు దొరికితివి నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి నీకు గాయాలు చేసి-తరచు రేపితిని నన్నెంతో సహించి క్షమియించితివి లోక సౌఖ్యాలన్ని ఒక్క చోట కుమ్మరించినా నీవెగా చాలిన దేవుడవు ||నీతో|| === code 148 title యేసయ్య మన దేవుడు *ref యేసయ్య మన దేవుడు లోకాన నిజ దేవుడు అయ్యా యేసయ్యా మన దేవుడు లోకాన నిజ దేవుడు బేధాలే మానెయ్యాలి వాదాలే వదిలెయ్యాలి (2) *1 లోకంలో ఎన్నెన్నో దేవతలున్నా మనుషుల్లో ఎన్నెన్నో మతములున్నా ఈ లోకమంతటికి దేవుడొక్కడే ఆ దేవుడు క్రీస్తై యున్నాడు *2 మనమంతా చేసిన పాపము కోసం తన స్వంత ప్రాణాన్ని అర్పించాడు మృత్యుంజయుడై లేచి వచ్చెను మరణించిన వారిని తిరిగి లేపెను *3 యేసయ్యా అందరికి మంచి కాపరి లోకమంత ఏకమై చాటించాలి రెండవ సారి రానై యున్నాడు సిద్ధముగా ఉండమని సెలవిచ్చాడు === code 149 title 1 క్రీస్తుని నామము - నిత్యము నిల్చున్‌ *ref *1 క్రీస్తుని నామము - నిత్యము నిల్చున్‌ సూర్యుడున్నంత - కాలము చిగుర్చున్‌2 *2 అతనిని బట్టి - మనుష్యులెల్లరు తమ్మును తాము దీవించుకొనెదరు *3 అన్య జను - లందరును యతని ధన్యుడని చెప్పు - కొనుచుందురు *4 దేవుడైన - యెహోవా ఇశ్రాయేలు దేవుడు స్తుతింప - బడును గాక *5 ఆయన మాత్రమె బహు - ఆశ్చర్య కార్య ములు చేయువాడు గాన – స్తోత్రార్హుండు *6 ఆయన మహిమగల - నామము నిత్యమును స్తుతింప-బడునుగాక *7 సర్వభూమి ఆయన - మహిమచే నిండియుండును గాక - ఆమెన్‌ ఆమెన్‌ === code 150 title నన్ను గన్నయ్య రావె నా యేసు *ref నన్ను గన్నయ్య రావె నా యేసు నన్ను గన్నయ్య రావె నా ప్రభువా ||న|| *1 ముందు నీ పాదారవిందము లందు నిశ్చల భక్తి ప్రేమను పొందికగా జేయరావే నా డెందమానంద మనంతమైయుప్పొంగ *2 హద్దులేనట్టి దురాశల నవివేకినై కూడి యాడితి మొద్దులతో నింక కూటమి వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి *3 కాలము పెక్కు గతించెను గర్వాదు లెడదెగవాయెను ఈ లోకమాయ సుఖేచ్ఛలు చాలును జాలును జాలు నోతండ్రి *4 దారుణ సంసార వారధి దరి జూపి ప్రోవ నీ కన్నను కారణ గురువు లింకెవ్వరు లేరయ్య - లేరయ్య లేరయ్య తండ్రి *5 నా వంటి దుష్కర్మ జీవిని కేవలమగు నీదు పేర్మిని దీవించి రక్షింపనిప్పుడే రావయ్య రావయ్య రావయ్య తండ్రి === code 151 title దేవుడే నా కాశ్రయంబు *ref దేవుడే నా కాశ్రయంబు దివ్యమైన దుర్గము మ-హా వినోదు డాపదల స-హాయుడై నన్‌ బ్రోచును అభయ-మభయ-మభయ మెప్పు డానందమానంద మానందమౌగ *1 పర్వతములు కదిలిన నీ యుర్వి మారుపడినను సర్వమున్‌ ఘోషించుచు నీ సంద్రముప్పొంగినన్‌ అభయ-మభయ-మభయ ||దేవుడే|| *2 దేవుడెప్డు తోడుగాగ - దేశము వర్ధిల్లును ఆ-తావునందు ప్రజలు మిగుల ధన్యులై వసింతురు అభయ-మభయ-మభయ ||దేవుడే|| *3 రాజ్యముల్‌ కంపించిన భూ-రాష్ట్రముల్‌ ఘోషించిన పూజ్యుడౌయెహోవ వైరి బూని సంహరించును అభయ-మభయ-మభయ ||దేవుడే|| *4 విల్లు విఱుచు నాయన తెగ బల్లెము నఱకు నాయన చెల్ల చెదర జేసిరిపుల నెల్లద్రుంచు నాయనే అభయ-మభయ-మభయ ||దేవుడే|| *5 పిశాచి పూర్ణబలము నాతో బెనుగులాడ జడియును నశించి శత్రుగణముదేవు నాజ్ఞ వలన మడియును అభయ-మభయ-మభయ ||దేవుడే|| *6 కోటయు నాశ్రయమునై యా కోబు దేవుడుండగ ఏటికింక వెరవవలయు నెప్డు నాకు బండుగ అభయ-మభయ-మభయ ||దేవుడే|| === code 152 title విశ్వాసమే విజయము - విను *ref విశ్వాసమే విజయము - విను ప్రియుడా య-విశ్వాస మపజయము విశ్వాసాయుతమైన - విసుకని సుకార్యములే - విశ్వాసవంతునికి విజయ మొసగును నిజము ||విశ్వా|| *1 భక్తుడందువలననే - బ్రతుకును మరియు - శక్తినొంది నిల్చును యుక్తముగ వర్తించి - యుర్విని జయించి - ముక్తి నొందున టంచు రక్తిగా బాడుదును ||విశ్వా|| *2 మంచి పేరు నొందును - సాతాను నెదిరించి విజయ మొందును మించిన బాధల్స-హించి జయించును సంచిత మరణము - నానందముగ గాంచు ||విశ్వా|| *3 ప్రవిమల మొందెదము - పాపము నుండి - పరిహరింపబడుదుము అవి రతమును మనము నాశ్చర్యముగ ఘనము భువియందున్‌ దివియందున్‌ బుధులతో నొందుదుము ||విశ్వా|| *4 నీతిమంతుల మౌదుము నిశ్చయము ప్ర-ఖ్యాతి బోధను నేర్తుము ఆ తండ్రి దత్తముల-నన్ని యార్జించు యాతని సుభద్రములో -ననయ ముందుము నిజము ||విశ్వా|| *5 పరిపూర్ణ విశ్వాసమే - క్రియలతో నున్న మరి మంచి విశ్వాసమే ధరయందున్‌ బరమందున్‌ ధన్యాత్మునిగ జేయున్‌ - సరగు నద్దానినే - సంపాదించుము ప్రియుడా ||విశ్వా|| === code 153 title ఎన్నడు నెడబాయ - నేకొలది *ref ఎన్నడు నెడబాయ - నేకొలది విడనాడ - ననిన తండ్రి నిరత - మన్ని బాధలయందు - నన్ని దుఃఖములందు నన్ను బ్రోచు *1 పాపుల రక్షింప - బ్రాణమిచ్చిన యేసు బ్రతికి యుండు - తన - ప్రాపుగోరినవారి భారము తా మోసి - ప్రాపయి యుండు ||ఎన్నడు|| *2 ఎల్లకాలంబుల - నేకరీతిగ నుండు యేసునాధు-డాత -డెల్ల విశ్వాసుల నెల్ల - వేళల దలచి - యేలుచుండు ||ఎన్నడు|| *3 తనవారి యక్కఱలు - తానెఱిగి యున్నాడు - తప్పకుండ - నాతడెనలేని దయబూని -వినువారి మనవులు వేడ్కమీఱ ||ఎన్నడు|| === code 154 title యేసువంటి ప్రియబంధుడు నాకిక *ref యేసువంటి ప్రియబంధుడు నాకిక నిహ పరములలో లేడన్న భాసురముగ నిజ భక్తుల కదియను భవ గోచర మెపుడగు నన్న *1 ఊరు పేరు పరువులు మురువులు మరి -యూడగొట్టబడినను గాని కూరిమితో క్రీస్తుడు మాకుండిన కొదువరాదు గొప్పయు పోదు ||యేసు|| *2 ఆడికలు తిరస్కారంబులు మా-కవమానములున్నన్‌ గాని తోడు క్రీస్తుడు మాకుండినను త్రోవ దప్పము ఓడిపోము ||యేసు|| *3 తగ్గుపాటులును సిగ్గుపాటులును దలమీదను వ్రాలినగాని - దగ్గర మా పాలిట ప్రభువుండగ - సిగ్గును బొందము తగ్గున గుందము ||యేసు|| *4 ఎన్నెన్నో శోధనల బాధలు చెల-రేగి మనల జుట్టిన యపుడు - కన్న తండ్రివలె నోదార్చును దన - ఘన వాగ్బలమున దునుమును వానిని ||యేసు|| *5 మనసు క్రుంగి పలు చింతలచేత మట్టబడిన వేళను మాకు తన వాగ్దత్తములను జేతుల లే - వనెత్తి యెంతో సంతసమొసగును ||యేసు|| *6 తల్లిదండ్రులు విడిచిన గాని తాను వదలడెప్పుడు మమ్ము ఉల్లమునెత్తి పిలిచిన వేళ నోహోయనుచు దరికి వచ్చు ||యేసు|| *7 అతడుండని పరమండలము ఇక వెదకినగాని యగపడదు క్షితినాతడు మామతిని వసించిన అతులిత సౌఖ్యం బదియే మోక్షము||యేసు|| === code 155 title మా సర్వానిధీ నీవయ్యా *ref మా సర్వానిధీ నీవయ్యా నీ సన్నిధి కొచ్చామయ్యా బహు బలహీనులము యేసయ్యా మము బలపరచుమో యేసయ్యా యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా ||మా|| *1 మా రక్షకుడవు మా స్నేహితుడవు పరిశుద్ధుడవు మా యేసయ్యా పరిశుద్ధమైన నీ నామమునే స్తుతియింపవచ్చామయ్యా మా స్తుతులందుకో యేసయ్యా మా స్తుతులందుకో యేసయ్యా యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా ||మా|| *2 నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము మా యేసయ్యా జీవపు దాత శ్రీ యేసునాథా స్తుతియింప వచ్చామయ్యా మా స్తుతులందుకో యేసయ్యా మా స్తుతులందుకో యేసయ్యా యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా ||మా|| *3 విరిగితివయ్యా నలిగితివయ్యా కలువరిలో మా యేసయ్యా విరిగినలిగిన హృదయాలతోనే స్తుతియింప వచ్చామయ్యా మా స్తుతులందుకో యేసయ్యా మా స్తుతులందుకో యేసయ్యా యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా ||మా|| === code 156 title క్రీస్తే సర్వాధికారి - క్రీస్తే మోక్షాధికారి *ref క్రీస్తే సర్వాధికారి - క్రీస్తే మోక్షాధికారి క్రీస్తే మహోపకారి - క్రీస్తే ఆ సిల్వధారి *1 ముక్తి విధాత నేత - శక్తినొసంగు దాత భక్తివిలాప శ్రోత - పరమంబు వీడె గాన ||క్రీస్తే|| *2 దివ్యపథంబురోసి - దైవంబుతోడు బాసి దాసుని రూపుదాల్చి ధరణికేతెంచెగాన ||క్రీస్తే|| *3 శాశ్వత లోకవాసి - సత్యామృతంపు రాశి శాప భారంబు మోసి శ్రమల సహించెగాన ||క్రీస్తే|| *4 సైతాను జనము గూల్పన్‌ పాతాళమునకు బంపన్‌ నీతి పథంబు బెంప రుధిరంబు గార్చె గాన ||క్రీస్తే|| *5 మృత్యువు ముల్లు తృంపన్‌ నిత్యజీవంబు బెంపన్‌ మార్త్యాళిభయము దీర్పన్‌ మరణంబు గెలిచెగాన ||క్రీస్తే|| *6 పరమందు దివిజులైన - ధరయందు మనుజులైన ప్రతి నాలుక మోకాలు ప్రభునే భజించుగాన ||క్రీస్తే|| *7 ఈ నామమునకు మించు నామంబులేదటంచు యెహోవ తండ్రి యేసున్‌ హెచ్చించినాడు గాన ||క్రీస్తే|| === code 157 title జై జై యేసు రాజా జై జై *ref జై జై యేసు రాజా జై జై రాజాధిరాజా నీకే జై జై *1 పాప శాపములో బడియున్న నన్ను జూచి చేయి జాచి చక ్కగ దరికి - చేర్చితివి ||జైై|| *2 సిలువ రక్తములో నన్ను కడిగి పాపమంతా పరిహరించిన పావనుడగు నా - ప్రభు యేసు ||జైౖ|| *3 నీతి హీనుడనైన నాకు నీతి రక్షణ వస్త్రములను ప్రీతితో నొసగిన-నీతి రాజా ||జై|| *4 మంటి పురుగునైన నన్ను మంటి నుండి మింట జేర్చిన మహా ప్రభుండా - నీకే జై జై ||జైై|| *5 పాప శాపగ్రస్తుడనై యుండ నన్ను గూడ నీ స్వకీయ సంపాద్యముగా - జేసితివి ||జైౖ|| *6 రాజులైన యాజక గుంపులో నన్ను గూడ నీ సొత్తయిన పరిశుద్ధ జనములో - జేర్చితివి ||జైై|| *7 తల్లియైన మరచిన మరచును నేను నిన్ను మరువననిన నమ్మకమైన నా ప్రభువా ||జైై|| *8 అధిక స్తోత్రార్హుడవైన ఆది యంతము లేని దేవా యుగాయుగములకు-నీకెే జై జై ||జై|| === code 158 title స్వచ్ఛంద సీయోను వాసి *ref స్వచ్ఛంద సీయోను వాసి సర్వాధికారి కస్తూరి పూరాసి వర్తమాన భూత భవి-ష్యత్కాలవాసి అల్ఫా ఓమేగ తానె ఆద్యంతము మన యేసే *1 ఇదిగో నేనొక నిబంధనను అద్భుతముల జేతున్‌ నీ ప్రజలందరి యెదుట పరిశోధింప జాలని మహా పనులెల్ల ప్రభువే లెక్కలేని యద్భుతముల్‌ మక్కువతో చేయువాడు ||స్వచ్ఛం|| *2 సంగీత నాదములతోడ సీయోను పురము సొంపుగను చేరితిమి శాశ్వత సంతోషము మా శిరములపై వెలసెన్‌ దుఃఖము నిట్టూర్పును పోయెన్‌ మిక్కిలి ఆనందము గల్గెన్‌ ||స్వచ్ఛం|| *3 నీలముల పునాదులు వేసి నీలాంజనములతో మాణిక్యమణులతో సువర్ణశునీయముల సూర్యకాంతముతో ప్రశస్త రత్నములతో ప్రవిమలముగ నిను గట్టెదను ||స్వచ్ఛం|| *4 సుమముల హారము సంతోషానంద తైలము నీదే స్తుతివస్త్రమును నీదే ఉల్లాస వస్త్రంబు నీదే విడుదలయు నీదే హితవత్సరము విముక్తి ఆత్మాభిషేకము నీదే ||స్వచ్ఛంద|| *5 జలములలో బడి దాటునపుడు బలమై యుండెదను నీ తోడై యుండెదను నదులలో వెళ్లునప్పుడు నీపై పారవు అగ్ని మధ్యను నడచినను జ్వాలలు నిను కాల్చగలేవు ||స్వచ్ఛంద|| *6 ఇత్తడి తలుపుల బగుల గొట్టెద నినుప గడియలను విడగొట్టెదను నేను అంధకార స్థలములలోనున్నట్టి నిధులను రహస్యములో మరుగైన ధనమును నీకొసంగెదను ||స్వచ్ఛం|| *7 గర్భమున పుట్టినది మొదలు తల్లి యొడిలోన కూర్చుండినది మొదలు నేను చంకబెట్టుకొన్న-నాదు ప్రజలారా ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే ||స్వచ్ఛంద|| === code 159 title విజయ గీతముల్‌ పాడరే - క్రీస్తుకు *ref విజయ గీతముల్‌ పాడరే - క్రీస్తుకు జయ - విజయ గీతముల్‌ పాడరే వృజిన మంతటి మీద - విజయ మిచ్చెడు దేవ - నిజకుమారుని నామమున్‌ హృదయములతో భజన చేయుచు నిత్యమున్‌ ||విజ|| *1 మంగళముగ యేసుడే - మనకు రక్షణ - శృంగమై మరి నిల్చెను నింగిన్‌ విడిచి వచ్చెను - శత్రుని యుద్ధ - రంగమందున గెల్చెను రంగు మీరగ దన రక్తబలము వలన పొంగు నణగ జేసెను సాతానుని బల్‌ కృంగ నలిపి చీల్చెను ||విజ|| *2 పాపముల్‌ దొలగింపను - మనలను దన స్వ - రూపంబునకు మార్చను శాపం బంతయు నోర్చెను - దేవుని న్యాయ - కోపమున్‌ భరియించెను పాపమెరుగని యేసు - పాపమై మన కొరకు - పాప యాగము దీర్చెను దేవుని నీతిన్‌-ధీరుడై నెరవేర్చెను ||విజ|| *3 సిలువ మరణము నొందియు మనలను దనకై - గెలువన్‌ లేచిన వానికి చెలువుగన్‌ విమలాత్ముని ప్రేమను మనలో - నిలువన్‌ జేసిన వానికి - కొలువు జేతుమె గాని ఇలను మరువక వాని - సిలువ మోయుచు నీ కృపా - రక్షణ చాల విలువగలదని చాటుచు ||విజ|| === code 160 title యెహోవా నా మొఱ లాలించెను *ref యెహోవా నా మొఱ లాలించెను దన-మహా దయను నను గణించెను అహర్నిశల దీనహీనుడగు నా దు హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను ||యెహో|| *1 పిశాచి గడిమి బడగొట్టెను దన వశాన నను నిలువ బెట్టెను ప్రశాంత మధుర సు - విశేష వాక్ఫల నిశాంతమున జే - ర్చిసేద దీర్చెను ||యెహో|| *2 మదావళము బోలు నామదిన్‌ దన - ప్రదీప్త వాక్యాం కుశాహతిన్‌ యధేచ్ఛలన్నిటి గుదించి పాపపు మొదల్‌ తుదల్‌ నరి - కిదరికి చేర్చెను ||యెహో|| *3 అనీతి వస్త్ర మెడలించెను యే - సునాధు రక్తమున ముంచెను వినూత్న యత్నమె - ద నూని యెన్నడు గనన్‌ వినన్‌ బ్రేమనాకు చూపెను ||యెహో|| *4 విలాపములకు జెవి నిచ్చెను శ్రమ - కలాపములకు సెలవిచ్చెను శిలానగము పై - కి లాగి నను సుఖ - కళావళుల్‌ మన-సులోన నిలిపెను ||యెహో|| *5 అగణ్య పాపియని త్రోయక న-న్ను గూర్చి తన సుతుని దాచక తెగించి మృతి కొప్పగించి పాపపు నెగుల్‌ దిగుల్‌ సొగసుగా నణంచెను ||యెహోవా|| === code 161 title నీ కన్న నిఁక వేరే - వేల్పులు లేరయ్యా *ref నీ కన్న నిఁక వేరే - వేల్పులు లేరయ్యా నిజముగా నా యేసువా నీ కరుణ యను నెనరు చేతను - నీదు సత్య సువార్త ద్వారా ప్రాకటంబుగ నన్నుఁ బిలిచిన - లోక రక్షక నీకు మ్రొక్కెద ||నీ|| *1 నిన్నుఁ దెలియక మున్ను-నన్య దైవంబుల-ననుసరించిన పాపము-లన్ని పెనగొని నాదు హృదయపు-గన్ను గ్రమ్మి ప్రకాశమియ్యక-యున్న నీ విమలాత్మ వరమున నన్ను వెలిఁగించిన దయానిధి *2 వదలకనే జేయు-తుదలేని పాపము- వదలించి నను బ్రోచితి=తుది దినంబునఁ గలుగు బాధల-దొలగ జేయుట నీవయని నా-హృదయమందున నా నిరీక్షణ - పదిలపరచిన భక్త పాలక *3 నీ వాక్యార్థము నాలో-నివసింపఁ జేసి నీ-సేవకునిగ బ్రోవవే నీవె సత్యము నీవె జీవము నీవె మార్గము నీవె ద్వారము నీవు గాకింకెవ్వరు లేరు - కావవే నను యేసునాయక === code 162 title బహుగా ప్రార్థన చేయుడి *ref బహుగా ప్రార్థన చేయుడి ఇకమీదట బహుగా ప్రార్థనచేయుడి బహుగా ప్రార్థన చేసి-బలమున్‌ సంపాదించి - మహిలో కీడును గెల్వుడి-దేవుని కెపుడు-మహిమ కలుగనీయుడి *1 చెడుగెక్కువగుచున్నది-భూలోకమున చెడుగెక్కువగుచున్నది చెడుగుపై మంచిపై-చేయగలదౌనట్లు విడువక ప్రార్థించుడి-మీ ప్రార్థన కడవరకు బోనీయుడి ||బహుగా|| *2 వాగ్దానములు చూడుడి-దేవుని గ్రంథ వాగ్దానములు జూడుడి వాగ్దానముల్‌ జరుగ వలసిన కార్యంబుల్‌ వాగ్దానములు నమ్ముడి ఈ రీతిగా ప్రభుని సన్మానించుడి ||బహుగా|| *3 విందు నన్న దేవుని-వాగ్దానము విందుగా ధ్యానించుడి విందులో నుండగా-వింతగ నెరవేర్పు బొందియానందింతురు-ఇది రెండవ విందంచు గ్రహింతురు ||బహుగా|| *4 విసుగుదల జెందరాదు-ప్రార్థన నెరవేర్పు తత్‌క్షణమె రాదు విసుగున్నచో సిద్ధి-వెనుకకే పోవును వసియించుడి దేవుని-వాగ్దానమున భటులవలె నిల్వుడి ||బహుగా|| *5 సంశయము పనికిరాదు-లేశంబైన సంశయము పనికిరాదు సంశయింపక దైవ సన్నిధియందు మీ యంశము విడచెప్పుడి-దానికి గొప్ప యంశం బట్టనీయుడి ||బహుగా|| *6 సిద్ధి కనుపింపకున్న-వాగ్దానము సిద్ధియున్నది చూడుడి-సిద్ధి యప్పుడు మీకై సిద్ధవై వెడలి ప్ర-సిద్ధిలోనికి వచ్చును-మీ నమ్మిక వృద్ధిగాంచి నిల్చును ||బహుగా|| *7 సంతోషమందరారె-మన దేవుని సంస్తుతి చేయరారె-సంతోషబలముచే సర్వ కష్టములను-అంతరింపజేతుము మన దేవుని సంతోష పరచెదము ||బహుగా|| *8 అంతయు మనదేగదా-యేసుని కున్నదంతయు మనదె గదా అంతయు మన ప్రభువు ఆర్జించియున్నాడు-స్వంతమని అందుకొనుడి-మీ ఆత్మకు శాంతి జెందనీయుడి ||బహుగా|| *9 విజయ జీవనము మనదె-క్రీస్తిచ్చిన విజయ జీవనము మనదె విజయ జీవనము మనదె విశ్వమంతయు మనదె-భజన సంఘంబు మనదె దేవుడున్న పరలోకమెల్ల మనదె ||బహుగా|| === code 163 title ఆత్మ దీపమును - వెలిగించు *ref ఆత్మ దీపమును - వెలిగించు యేసు ప్రభో - ఆత్మదీపమును *1 మార్గంబంతయు చీకటిమయము స్వర్గ నగరికి మార్గంబెటులో సదయా నీవే నను పట్టుకొని సరిగా నడుపుము ప్రేమపథమున ||ఆ|| *2 వసియించుము నా హృదయమునందు వసియించుము నానయనమునందు అన్నియు నిర్వహించుచున్నావు నన్నును నిర్వహించుము ప్రభువా ||ఆ|| *3 కలుషాత్ములకై ప్రాణము బెట్టి కష్టము లంతరింప జేసి కల్వరిసిలువలో కార్చిన రక్త కాలువయందు కడుగుమునన్ను ||ఆ|| === code 164 title ఇశ్రాయేలు సైన్యములకు *ref ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచినదైవమా నేడు మాతోకూడ నుండి మమ్ము నడిపించుము *1 సొలోమోను దేవాలయములో మేఘమురాగనే యాజకులు నీతేజో మహిమకు నిలువలేకపోయిరి ||ఇశ్రా|| *2 పూర్వపు ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకటించి నన్ను వెదకెడు వారికి దొరికెద నంటివి ||ఇశ్రా|| *3 నరుల యందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి సిల్వరక్తముచేత మమ్ము రక్షించియుంటివి ||ఇశ్రా|| *4 ఆది యపోస్తలులపై నీ యాత్మ వర్షము కుమ్మరించి నట్లు మాపై కుమ్మరించి మమ్మునడిపించుము ||ఇశ్రా|| === code 165 title నీవు తోడైయున్న జాలు-యేసు *ref నీవు తోడైయున్న జాలు-యేసు నిత్యము నా కదిమేలు-నీవు ధరణినుండు-నీచ పాపులనెల్లఁ గావబ్రేమ వచ్చి-ఘన ప్రాణమిడినట్టి *1 నిను బోలు రక్షకుండేడి-క్రీస్తు నను బోలు పాతకుండేడి-నిను నమ్ము వారలకు నీ వొసగుచుందువు-తనర పాపక్షమ- దయచేత నిలలోన ||నీ|| *2 నీ పాటి బలవంతుడేడి-ప్రభు నాపాటి దుర్భలుండేడి-కాపాడుచుందువు కల కాలమును నీవు నీ పాద సేవకుల-నీ నేర్పు రంజిల్ల ||నీ|| *3 నీ వంటి యుపకారి యేడి-కర్త నావంటి కడు దీనుడేడి-జీవులకును గల్గు-జీవంబులిచ్చుచు జీవాధారములొసగి జీవుల బ్రోచెడి ||నీ|| *4 నీవంటి ధనవంతుడేడి-యేసు నావంటి ధనహీనుడేడి-ప్రోవులైయున్నవి యీవులు నీ యందు నీవు వాని నొసంగి నిరతంబునను గావు ||నీ|| === code 166 title నిన్ను నేను విడువను దేవ *ref నిన్ను నేను విడువను దేవ నీవు నను దీవించు వరకు నిన్ను నమ్మిన వారలనెల్ల నీవు చక్కగ దీవించెదవు ||నిన్ను|| *1 నేను శత్రువునైయుండగ నీవు నాపై నెనరు జూపి దానమిచ్చితివి నా కొరకు దారుడౌ నీ ప్రియ పుత్రుని ||నిన్ను|| *2 త్రోవదప్పి తిరుగుచుండ దుడుకునైన నన్ను గాంచి ప్రోవగోరి మదిని నీవు త్రోవను బెట్టితివి నన్ను ||నిన్ను|| *3 నాట నుండి నేటి వరకు నాకు గల్గిన శోధనములలో నేటుగా నను గాచినవాడవు నీవుగావా, ఓ నా తండ్రి ||నిన్ను|| *4 ఇంతకాలము నన్నుగాచి యికను నన్ను విడువ వనుచు సంతసించి మదిని నేను జక్కగ నీదరి జేరితిని ||నిన్ను|| *5 నీవుగాక యెవరున్నారు నేలపైని నను గాపాడ చేవలేని నాకు నీవు చేవ గలుగజేయగలవు ||నిన్ను|| *6 అడుగువారి కిచ్చెద నంచు నానతిచ్చినావు గాన నడిగెద నిను సహాయ్యంబు నాత్మవై యున్నట్టి తండ్రి ||నిన్ను|| *7 నాదు ప్రార్థన లన్నియు నీవు నీదు కృపచే నాలకించి నీదు సరణిని నిల్పి నన్ను నేర్పుదనరగ రక్షించితివి ||నిన్ను|| === code 167 title దాసుల ప్రార్థన *ref దాసుల ప్రార్థన దప్పక యొసగెడు యేసునాయకుడె మా వేల్పు దోసములు సేయు దుర్జనుడైనను దోసిలొగ్గబరవాసి జేయునట *1 జన రహిత స్థల-మున జని వేడెడి మనుజుల ప్రార్థన వినుచుండున్‌ తన పాదమునమ్మిన సాధూత్తమ జనులను జూచిన సంతసమిడునట *2 మది విశ్వాసము-గూడిన ప్రార్థన సదయత వినుటకు-జెవులొగ్గున్‌ హృదయము కనుగొని యుచిత సమయమున-గుదురుగ భక్తుల-కోర్కెలిచ్చునట *3 ముదమున నిద్దరు-ముగ్గురు నొకచో బదిలముగా దను బ్రార్థింపన్‌ వదలక దానట-వచ్చి యుందు నని మృదువుగ బలికిన కృత రక్షణుడట === code 168 title నా ప్రియ యేసు రాజా *ref నా ప్రియ యేసు రాజా ఆదుకొ నన్నెపుడు శోధనలో వేదనలో నినువీడి పోనీయకు ||నా ప్రియ|| *1 కలుషితమగు ఈ లోకం కదిలెను నా కన్నులలో మరణ శరీరపు మరులే మెదిలెను నా హృదయములో కల్వరిలో ఆదరించు ఆదరించు ఆదరించు ||నా ప్రియ|| *2 మరచితి నీ వాగ్దానం సడలెను నా విశ్వాసం శ్రమల ప్రవాహపు సుడులే వడిగా నను పెనుగొనగా కల్వరిలో ఆదరించు ఆదరించు ఆదరించు ||నా ప్రియ|| *3 నేరములెన్నో నాపై మోపెను ఆ అపవాది తీరని పోరాటములో దూరముగా పరుగిడితి కల్వరిలో ఆదరించు ఆదరించు ఆదరించు ||నా ప్రియ|| *4 చాలిన నిన్ను విడచి కోరితి దీవెనలెన్నో భావనలేమో అరసి వదలితి వాక్యాధారం కల్వరిలో ఆదరించు ఆదరించు ఆదరించు ||నా ప్రియ|| *5 నీ కృపలను నే మరచి కృతజ్ఞత వీడితి ప్రభువా హృదయము కఠినమై పోయె కరిగించి దీవించు ప్రభువా కల్వరిలో ఆదరించు ఆదరించు ఆదరించు ||నా ప్రియ|| === code 169 title పరవాసినినే జగమున ప్రభువా *ref పరవాసినినే జగమున ప్రభువా నడచుచున్నాను నా దారిన్‌ నా గురి నీవే నా ప్రభువా నీదరినే చేరెదను-నేను *1 లోకమంతా నాదని యెంచి బంధుమిత్రులే ప్రియులను కొంటిని అంతయు మోసమేగా వ్యర్థము సర్వమును-ఇలలో ||పర|| *2 ధన సంపదలు గౌరవములు దహించి పోవు నీ లోకమున పాపము నిండె జగములో శాపము చేకూర్చుకొనె లోకము ||పర|| *3 తెలుపుము నా అంతము నాకు తెలుపుము నా ఆయువు యెంతో తెలుపుము యెంత అల్పుడనో విరిగి నలిగియున్నాను-నేను ||పర|| *4 ఆ దినము ప్రభు గుర్తెరిగితిని నీ రక్తముచే మార్చబడితిని క్షమాపణ పొందితివనగా మహానందము కలిగె-నాలో ||పర|| *5 యాత్రికుడనే నీలోకములో సిలువ మోయుచు సాగెదనిలలో అమూల్యమైన ధనముగా పొందితిని నేను-యేసుని ||పర|| *6 నా నేత్రములు మూయబడగా నాదు యాత్ర ముగియునిలలో చేరుదున్‌ పరలోక దేశము నాదు గానము యిదియే యిలలో ||పర|| === code 170 title ప్రార్థన వినెడి పావనుడా *ref ప్రార్థన వినెడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ||ప్రార్థన|| *1 శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి పరముడ నిన్ను ప్రణుతించెదము పరలోక ప్రార్థన నేర్పుమయ్యా ||పార్థన|| *2 పరమ దేవుడవని తెలిసి కరము లెత్తి జంటగ మోడ్చి శిరమునువంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా ||పార్థన|| *3 దినదినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవ దీనుడవయ్యు దిటముగ కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా ||పార్థన|| *4 శత్రుమూక నిను చుట్టుకొని సిలువపైని నిను జంపగను శాంతముతో నీ శత్రుల బ్రోవగ సలిపిన ప్రార్థన నేర్పుమయా ||పార్థన|| === code 171 title నడిపించు నా నావ *ref నడిపించు నా నావ నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరియింప ||నడి|| *1 నా జీవిత తీరమున నా యపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప నా నావలో కాలిడుము నా సేవ జేకొనుము ||నడి|| *2 రాత్రంతయు శ్రమపడిన రాలేదు ప్రభూ జయము రహదారులు వెదకినను రాదాయెను ప్రతిఫలము రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లు నాపడవ ||నడి|| *3 ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి ఆశానిరాశాయే - ఆవేద నెదురాయె ఆధ్యాత్మిక లేమి గని అల్లాడె నా వలలు ||నడి|| *4 ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును బొంది ఫలహీనుడనై యిపుడు పాటింతు నీ మాట ||నడి|| *5 లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈ-వులలో లోతైన నాబ్రతుకు లోపింపని యర్పణగా లోకేశ జేయుమయా ||నడి|| *6 ప్రభుయేసుని శిష్యు డనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము జేతు ||నడి|| === code 172 title నీ వాక్యమే నన్ను బ్రతికించెను *ref నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నిచ్చెను కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమైయున్న యేసు వందనమయ్యా *1 జిగటగల ఊబినుండి లేవనెత్తెను సమతలమగు భూమిపై నన్ను నిలిపెను నా పాదములకు దీపమాయెను సత్యమైన మార్గములో నడుపు చుండెను *2 వాడిగల రెండంచుల ఖడ్గము వలెను నాలోని సర్వమును విభజించి శోధించి పాప మాలిన్యము తొలగించి వేయుచు అనుక్షణము క్రొత్త శక్తి నిచ్చుచున్నది *3 శత్రువును ఎదుర్కొనే సర్వాంగకవచమై యుద్ధమునకు సిద్ధమనస్సు నిచ్చుచున్నది అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గమువలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది === code 173 title ప్రియ యేసు నిర్మించితివి *ref ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమార వసియించుము నా హృదయాంతరంగమున *1 నీ రక్త ప్రభావమున నా రోత హృదయంబును పవిత్రపరచుము తండ్రీ ప్రతిపాపమును కడిగి ||ప్రియ|| *2 అజాగరూకుడనైతి నిజాశ్రయంబు విడిచి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి ||ప్రియ|| *3 వికసించె విశ్వాసంబు వాక్యంబును చదువగనే చేరితి నీదు దారి కోరి నడిపించుము ||ప్రియ|| *4 ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయరూపుండా ||ప్రియ|| === code 174 title కనలేని కనులేలనయ్యా *ref కనలేని కనులేలనయ్యా వినలేని చెవులేలనయ్యా నిను చూడ మనసాయెనయ్యా యేసయ్యా ||కన|| *1 ఆకలిగొన్నా ఓ యేసయ్యా నాకై ఆహారముగా మారావయ్యా అట్టి జీవాహారమైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా ||కన|| *2 దాహము గొన్న ఓ యేసయ్యా జీవ జలములు నాకిచ్చావు గదయ్యా అట్టి జీవాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా ||కన|| *3 అభ్యంతర పరచేటి కన్ను కలిగి అగ్నిలోనే మండెకన్నా ఆ కన్నే లేకుండుటయే మేలు నాకు నిను చూసే కన్నివ్వు యేసయ్యా ||కన|| *4 మరణించావు ఓ యేసయ్యా మరణించిన నన్‌ లేపావు గదయ్యా అట్టి మరణాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా ||కన|| *5 రాజ్యమును విడిచిన యేసయ్య నిత్య రాజ్యమునాకిచ్చావు గదయ్యా అట్టి రాజులకు రాజైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా ||కన|| === code 175 title ప్రభు యేసుని వదనములో *ref ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే పాపాత్ముల బ్రోచుటకై కృపలొలికిన కలువరిలో పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం *1 దిశలన్నియు తిరిగితిని నా పాపపు దాహముతో దౌష్ట్యములో మసలుచును దౌర్జన్యము చేయుచును ధనపీడనతో- మృగవాంఛలతో దిగజారితి చావునకు ||ప్రభు|| *2 చెండాడితి బ్రతుకులను దహియించితి గృహములను చెరగవు నా పాపములు తరగవు నా వేదనలు చనిపోయినను ధర వీడినను చల్లారవు శోకములు ||ప్రభు|| *3 పలుమారులు వినుచుంటి నజరేయుని నీతికథ పరిహాసము చేసితిని పరమార్థమే మోసమని పశుప్రాయుడనై జీవించుటచే ప్రాప్తించెను ఈ సిలువ ||ప్రభు|| *4 కలువరి ఆవరణములో కరుణాత్ముని చేరువనే కనుమూసిన కాలములో వెలుగుదయించినవేళ కనుగొంటిని నా దౌర్భాగ్య స్థితి కంపించెను నా హృదయం ||ప్రభు|| *5 యేసూ నీ రాజ్యముతో భువికేతెంచెడి రోజు ఈ పాపిని క్షమియించి జ్ఞాపకముతో బ్రోవుమని ఇలవేడితిని విలపించుచును ఈడేరెను నా వినతి ||ప్రభు|| *6 పరదైసున ఈ దినమే నా యానందములోన పాల్గొందువు నీవనుచు వాగ్దానము చేయగనే పరలోకమే నా తుదియూపిరిగా పయనించితి ప్రభుకడకు ||ప్రభు|| === code 176 title ఎంతజాలి-యేసువా *ref ఎంతజాలి-యేసువా యింతయని-యూహించలేను *1 హానికరుడ హింసకుడను దేవ దూషకుడను నేను అవిశ్వాసినైన నన్ను ఆదరించి నావుగా ||ఎంత|| *2 రక్షకుండా నాకు బదులు శిక్షననుభవించినావు సిలువయందు సొమ్మసిల్లి చావొందితివి నాకై ||ఎంత|| *3 ఏమి నీకర్పించగలను ఏమిలేని వాడనయ్య రక్షణంపు పాత్ర నెత్తి స్తోత్రమంచు పాడెదా ||ఎంత|| *4 నీదు నామమునకు యిలలో భయపడు వారి కొరకై నాథుడా నీవిచ్చు మేలు ఎంత గొప్ప దేసువా ||ఎంత|| *5 నేను బ్రతుకు దినములన్ని క్షేమమెల్ల వేళలందు నిశ్చయముగ నీవు నాకు యిచ్చువాడా ప్రభువా ||ఎంత|| *6 నాదు ప్రాణమునకు ప్రభువా సేద దీర్చువాడా నీవు నాదు కాపరివి నీవు నాకు లేమి లేదుగా ||ఎంత|| *7 అందరిలో అతి శ్రేష్టుండా అద్వితీయుడగు యేసయ్య హల్లెలూయా స్తోత్రములను హర్షముతో పాడెదా ||ఎంత|| === code 177 title మార్గము జూపుము యింటికి *ref మార్గము జూపుము యింటికి నా తండ్రి యింటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి *1 పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించె క్షామము పశ్చాత్తాపమునొంది తండ్రి క్షమ గోరుదు పంపుము క్షేమము ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించె ధైర్యము ||మార్గ|| *2 ధనమే సర్వంబనుచు సుఖమే స్వర్గంబనుచు తండ్రిని వీడితి ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసము జేసె దేవానిన్‌ జేరితి దేహీయని నీవైపు చేతులెత్తిన నాకు దారిని జూపుము ||మార్గము|| *3 దూరదేశములోన బాగుందు ననుకొనుచు తప్పితి మార్గము తరలిపోయిరి నేను నమ్మిన హితులెల్ల తరిమె దారిద్య్రము దాక్షిణ్య మూర్తి నీ దయ నాపై కురిపించి ధన్యుని చేయుము ||మార్గము|| *4 అమ్ముకొంటిని నన్ను అధముడొకనికి నాదు ఆకలి బాధలో అన్యాయమైపోయె పందులు సహ వెలివేయ - అలవడెను వేదన అడుగంటె అవినీతి మేల్కొనియె మానవత ఆశ్రయం జూపుము ||మార్గము|| *5 కొడుకునే కాదనుచు గృహమే చెఱసాలనుచు కోపించి వెళ్లితి కూలివానిగనైన నీ ఇంట పనిచేసి కనికరమె కోరుదు కాదనకు నా తండ్రి దిక్కెవ్వరును లేరు క్షమియించి బ్రోవుమా ||మార్గము|| *6 నా తండ్రి నను జూచి పరుగిడుచు ఏతెంచి నాపై బడి ఏడ్చెను నవజీమును గూర్చి ఇంటికి తోడ్కొని వెళ్లి నన్ను దీవించెను నా జీవిత కథయంత యేసు ప్రేమకు ధరలో సాక్షినైయుందును ||మార్గము|| === code 178 title నాదు హృదయపు ద్వారము తెరచెదను *ref నాదు హృదయపు ద్వారము తెరచెదను యేసు పాపపు రోగికి నీవే గతి *1 యేసు చచ్చిన వారిని లేపితివి మరి కుంటికి కాళ్లను యిచ్చితివి నేను పాపిని రోగిని నీవే గతి నాకు దిక్కిక లేదిక వేరెక్కడ ||నా|| *2 ప్రభు కుష్ఠును ప్రేమతో ముట్టితివి మరి దుష్టుల బుద్ధిని మార్చితివి నాదు పాపపు కుష్ఠును పారద్రోలి పరిశుభ్రత నీయుము నీవె గతి ||నా|| *3 యేసు యాయీరు కుమార్తెను లేపితివి మరి మృతుడగు లాజరు బ్రతికెనుగా నేను చచ్చిన పాపిని శరణు ప్రభు నాకు వేరొక మార్గము లేదికను ||నా|| *4 ప్రభు మార్గము ప్రక్కన కూర్చొనిన ఆ అంధుని ధ్వనిని వింటివిగా నేను పాపిని అంధుని యేసు ప్రభూ నను దాటకు దిక్కికలేదు ప్రభూ ||నా|| === code 179 title దయచేయుము పాప క్షమా *ref దయచేయుము పాప క్షమా దయచేయుము పాపక్షమా యేసుని రక్తము-రక్తము వల్లనే (2) *1 తుడువుము పాపపు డాగులు తుడువుము పాపపు డాగులు ||యే|| *2 అనుగ్రహింపుము జయము సదా అనుగ్రహింపుము జయము సదా ||యే|| *3 ఇమ్ము నిజ సమాధానము ఇమ్ము నిజ సమాధానము ||యే|| *4 పరమపురిని జేరనిమ్ము పరమ పురిని జేరనిమ్ము ||యే|| === code 180 title నీ చేతితో నన్ను పట్టుకో *ref నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము *1 అంధకార లోయలోన సంచరించిన భయము లేదు నీ వాక్యము శక్తి గలది నా త్రోవకు నిత్య వెలుగు ||నీ|| *2 ఘోరపాపిని నేను తండ్రి పాప యూబిలో పడియుంటిని లేవనెత్తుము శుద్ధి చేయుము పొందనిమ్ము నీదు ప్రేమను ||నీ|| *3 ఈ భువిలో రాజు నీవే నా హృదిలో శాంతి నీవే కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము సేవ చేసెదన్‌ ||నీ|| === code 181 title నన్ను దిద్దుము చిన్న ప్రాయము *ref నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా నీవు కన్న తండ్రి వనుచు నేను నిన్ను జేరితి నాయనా ||నన్ను|| *1 దూరమునకు బోయి నీదరి జేరనైతిని నాయనా నేను కారు మూర్ఖపు పిల్లనై కా-రడవి దిరిగితి నాయనా ||నన్ను|| *2 మంచి మార్గము లేదు నాలో మరణ పాత్రుడ నాయనా నేను వంచితుండనైతిని ప్ర-పంచ మందున నాయనా ||నన్ను|| *3 చాలా మారులు తప్పిపోతిని మేలు గానక నాయనా నా చాల మొరల నాలకించుము జాలి గల నా నాయనా ||నన్ను|| *4 జ్ఞాన మంతయు బాడు జేసి కాననైతిని నాయనా నీవు జ్ఞానము గల తండ్రి వంచు జ్ఞప్తి వచ్చెను నాయనా ||నన్ను|| *5 కొద్ది నరుఁడను దిద్దినను నీ యొద్ద చేర్చుము నాయనా నీ యొద్ద జేర్చి బుద్ధి జెప్పుము మొద్దు నైతిని నాయనా ||నన్ను|| *6 ఎక్కడను నీ వంటి మార్గము నెరుగనైతిని నాయనా నీ రెక్క చాటున నన్ను జేర్చి చక్కపరచుము నాయనా ||నన్ను|| *7 శత్రువగు సాతాను నన్ను మిత్రు జేయను నాయనా ఎన్నో సూత్రములు గల్పించెను నా నేత్రములకో నాయనా ||నన్ను|| *8 వాసిగా నేఁ బాపలోకపు వాసుడనో నాయనా నీ దాసులలో నొకనిగా ననుఁ జేసి కావుము నాయనా ||నన్ను|| === code 182 title ఘోర పాపి-నో ప్రభో *ref ఘోర పాపి-నో ప్రభో చేరదీయుము సత్కృపన్‌ *1 జిగట గల నా యూబి నుండి లేవనెత్తె అండగల యొక బండయైన దండి ప్రభుయేసు ఆ...ఆ...ఆ... ||హల్లె|| *2 నీ తలంపులు విస్తారములు విస్తారములు - వాటిని వివరించి చెప్ప - లెక్కలేనివి ఆ...ఆ...ఆ... ||హల్లె|| *3 నీ హస్తములు - బలము గలవి బలము గలవి - నీదు రెక్కలు నీడ గలవి - ఆశ్రయము మాకు ఆ...ఆ...ఆ... ||హల్లె|| *4 నరుడు ఆవిరి వంటి వాడు మంటి వాడు - వాని జ్ఞాపక ముంచుకొనగా - ఎంత వాడు - ప్రభో ఆ...ఆ...ఆ... ||హల్లె|| *5 నీదు మహిమలో - మా యక్కరలు మా యక్కరలు - యిచ్చు వాడవు తీర్చు వాడవు - ఏల భయమింక ఆ...ఆ...ఆ... ||హల్లె|| *6 స్తోత్ర రూపంబైన క్రొత్త కీర్తనలతో - నింపి మా హృదయంబుల రక్షణ - ఆనందముతో ఆ...ఆ...ఆ... ||హల్లె|| === code 183 title ఆనందమానందమాయెను *ref ఆనందమానందమాయెను నాదు ప్రియ కుమారుని యందు నా తనయుని మాట వినండని శబ్దమొక్కటి యా మేఘములో ఉద్భవించె నద్భుతముగ ||మహ|| *1 ప్రేమించుచున్నావు నీతిని దుర్నీతిని ద్వేషించినావు - నీవు అందుచే నీ తోటి వారి కంటె ఆనందతైలముతో తండ్రి నిన్ను అధికంబుగా నభిషేకించెను. ||మహ|| *2 అంత్యదినముల యందున ఆ వింత కుమారుని ద్వారా ఈ మానవుల తోడ మాట్లాడెను సర్వంబునకు తండ్రి తనయుని వారసునిగా నియమించెను ||మహ|| *3 తనయుండె ఆ తండ్రి మహిమ ఆ తత్వంబు రూపంబు తానె ఆ మహాత్మ్యమైనట్టి మాట చేత సమస్తమును నిర్వహించుచు అందరిలో అతి శ్రేష్ఠుండాయె ||మహ|| *4 నీవు నాదు కుమారుండవు నిన్ను ప్రేమించి కన్నాను నేను నేడు దండిగ తనయుని ముద్దాడుడి నిండుగ వాని నాశ్రయించుడి రండి రండి-ధన్యులు కండి ||మహ|| *5 విజ్ఞాన సంపదలెల్లను ఆ సుజ్ఞానిలో గుప్తమాయెను ఆ సంతోషమును పరిశుద్ధత సమాధానము నీతి శక్తియు విమోచనమాయెను యేసు ||మహ|| *6 అందరి కన్న నీ వెంతనో అతి సుందరుడవై యున్నావు నీవు నీ పెదవుల మీద పోయబడి నిండి యున్నది దయారసము నిన్నాశీర్వదించును తండ్రి ||మహ|| *7 దివ్య రారాజై కుమారుడు ఒక వెయ్యి వర్షాలు పాలించును మహా అంతములేని రాజ్యమేలును ఎందరు జయంబు నొందెదరో అందరును పాలించెదరు ||మహ|| === code 184 title ఆనందం మహానందం *ref ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహరం - ప్రియుని ముఖము మనోహరం *1 నశియించిన పాపిని నాకు శాశ్వతమైన కృప జూపి నా యేసుడెగా రక్షించెనుగా నా ప్రభువును సేవింతునుగా ||ఆనం|| *2 వేడుకతో విందుశాలకును తోడుకు వెళ్లును నా ప్రియుడు కోరిన ఫలములు తినిపించును కూరిమితో నా ప్రియ ప్రభువు ||ఆనం|| *3 ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుందును వాడ బారను యే నాటికి నే వరదుని బాడుచు నుండెదను ||ఆనం|| *4 ఎంతో ప్రేమతో ప్రేమించె వింతగను ప్రభు దీవించె అంతము వరకు యేసుని చెంతనే నుందును ఆనందముతోను ||ఆనం|| *5 రాజగు యేసు వచ్చునుగా రాజ్యము నాకు తెచ్చునుగా రాజ్యమునందు నే రాణినిగా రమ్యము గా నే నుందునుగా ||ఆనం|| === code 185 title ఆనంద యాత్రా *ref ఆనంద యాత్రా ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరుషలేము యాత్ర ||ఆనం|| *1 యేసు నీ రక్తము పాపము నుండి విడిపించును వేయి నోళ్ళతో స్తుతియించి నను తీర్చలేము ఆ ఋణమును ||ఆనం|| *2 రాత్రియూ పగలును పాదములకు రాయితగులకుండ మనకు పరిచర్య చేయుట కొరకై దేవ దూతలు మనకుండగా ||ఆనం|| *3 కృతజ్ఞత లేనివారు వేలకొలదిగా కూలిననూ కృపా వాక్యమునకు సాక్షులమై కృప వెంబడి కృపను పొందెదము ||ఆనం|| *4 ఆనందం ఆనందం యేసుని చూసే క్షణ మాసన్నం ఆత్మానంద భరితులమై ఆగమనయకాంక్షతో సాగెదము||ఆనం|| === code 186 title నీజల్దరు వృక్షపు నీడలలో *ref నీజల్దరు వృక్షపు నీడలలో నే నానందభరితుడనైతిని బలురక్కసి వృక్షపు గాయములు ప్రేమా హస్తములతో తాకు ప్రభు *1 నా హృదయపు వాకిలి తీయమని పలు దినములు మంచులోనిలచితివి నీ శిరము వానకు తడిసినను నన్ను రక్షించుటకు వేచితివి ||నీ|| *2 ఓ ప్రియుడా నా అతి సుందరుడా ధవళ వర్ణుడా నా కతి ప్రియుడా వ్యసనాక్రాంతుడుగా మార్చబడి నీ సొగసును నాకు నొసగితివి ||నీ|| *3 నీ పరిమళ పుష్ప సుగంధములు నా రోత హృదయమును నింపినవి ద్రాక్షారసధారల కన్న మరి నీ ప్రేమే ఎంతో అతిమధురం ||నీ|| *4 ఉన్నత శిఖరములు దాటుచును ఇదిగో అతడొచ్చుచున్నాడు నా హృదయపు తలుపులు తెరచుకొని నా ప్రియుని కొరకు కనిపెట్టెదను ||నీ|| *5 నీ విందు శాలకు నడిపించి రాజులు యాజకులతో జేర్చితివి జీవాహారము నా కందించి పరమాగీతములను నేర్పితివి ||నీ|| === code 187 title కాలము సమీపము *ref కాలము సమీపము ప్రభుయేసు వచ్చున్‌ జీతము పొందును నిజదాసుడు ఆనంద మొందెదరు ఆనంద మొందెదరు *1 బయలుపడు ప్రతి వాని క్రియలు కర్ర గడ్డి కొయ్యకాలైనను వెండి బంగారము విలువ రాళ్ళైనను అగ్నియే తేల్చును (2) ||కా|| *2 పందెమందు నీకు పాలున్నదా పొందువాడొక్కడే బహుమతిని యోధుడవై మంచి బుద్ధిని కలిగిన వాడబారని(2) కిరీటమొందెదవు ||కా|| *3 ఆత్మల కొరకై భారమున్నదా ఫలితమున్నదా నీ సేవలో ప్రభుని రాకలో అందరి ఎదుట ఆనందమహిమ(2) కిరీటమొందెదవు ||కా|| *4 సంఘము నడిపే సేవకుడా మందను నడుపుము ప్రేమతోడ ఆదర్శుండవై మందను కాచిన మహిమ కిరీటం (2) నీవు పొందెదవు ||కా|| *5 మంచి పోరాటము పోరాడుము కాపాడుకొను విశ్వాసమును తన ప్రత్యక్షత నపేక్షించుము నీతి కిరీటము (2)నీకివ్వబడును ||కా|| *6 భక్తితో బ్రతుక గోరినచో సిద్ధపడు పొంద హింసలను అంతము వరకు నమ్మిక యుంచిన జీవకిరీటము (2) పొందెదవెరుగు ||కా|| *7 దయచేయు శ్రేష్టదీవెనలు అంగీకరించు నీ ప్రార్థనలు ప్రార్థనయందు మేల్కొని యుండుము స్వర్ణ కిరీటము (2) ధరియింపజేయును ||కా|| === code 188 title యౌవనుడా సంతోషపడుమా *ref యౌవనుడా సంతోషపడుమా యౌవన కాలమున అయితే వీటిని బట్టి దేవుడు తీర్పులోనికి తెచ్చు నిన్ను జ్ఞప్తినుంచుకో *1 లేత వయసు నడి ప్రాయమును గతించిపోవునవి - గనుక నీదు హృదయములో - వ్యాకులమును తొలగించుకొనుము - యువకుడా వినుము ||యౌవ|| *2 దుర్దినములు రాబోకముందే వీటియందిపుడు సంతోషము లేదని యెడు సంవత్సరములు రాబోక ముందే చెడుగును విడుమా ||యౌవ|| *3 పశ్చాత్తాపమున పాపములను ఒప్పుకొనుచు నేడే రక్షణార్థము రక్షకుడేసును రయమున క్షమాపణ వేడిన రక్షణ నీదే ||యౌవ|| *4 మన్నయినది వెనుకటి వలెనే మంటిలో కలియున్‌ ఆత్మ దాని దయచేసిన దేవుని సన్నిధికి మరల వెళ్ళును యౌవనుడా ||యౌవ|| === code 189 title యేసుక్రీస్తు నిన్ను-పిలిచెనుగా *ref యేసుక్రీస్తు నిన్ను-పిలిచెనుగా రావేల ఓ యువకా... రావేల ఓ యువతీ నీ హృదయము ప్రభుకిమ్ము ప్రభు జీవము నీదగును *1 గురిలేని నీ బ్రతుకు ఎరయాయెను విరోధికి త్వరపడకుంటే నీకు మరి తప్పదు నరకాగ్ని ||నీ హృ|| *2 నీ దేహము దేవునిది శుద్ధాత్మకు నిలయమది ప్రభు కర్పణ చేయనిదే పడగొట్టును అపవాది ||నీ హృ|| *3 ప్రభు వనమున పనిచేయ పనివారలు కావలెను వినలేవా ప్రభు స్వరము కనలేవా ప్రభు పొలము ||నీ హృ|| *4 దుర్దినములు రాకముందే స్మరియించుము రక్షకుని ఘనమైన రక్షణను నిర్లక్ష్యము చేయుదువా ||నీ హృ|| *5 నీ యౌవన కాలమున ప్రభుకాడిని మోయవలెన్‌ మేలొందెద వీనాడే జాగేలను యువజనమా ||నీ హృ|| === code 190 title యౌవనుడా, యౌవనకాలమున *ref యౌవనుడా, యౌవనకాలమున యేసుని కృప నీ పై ఉన్నదో లేదో పరికించినావా - యోచించినావా ప్రభు యేసు కాడిని మోయలేవా *1 ఉరకలు వేసే నీ యౌవనం పరుగులు తీయును పాపానికై అందుకే అందుకే నీ జీవితం మలచుకో ||యౌవ|| *2 గాయపడిన ఆ ప్రభు చేతులు నీకై చాపె దివారాత్రులు ఎంత సేపు నిలువబెట్టి ఏడ్పింతురు విభుని ||యౌవ|| *3 పాపపు జీతము మరణమని పాపికి లేదు మోక్షమని మంచి తరుణము లేదు సమయము మోకరిల్లుము ప్రభుని చెంత ||యౌవ|| === code 191 title ఓ సోదరా... ఓ సోదరీ... *ref ఓ సోదరా... ఓ సోదరీ... యేసే నిన్ను నన్ను పిలుచుచున్నాడు నిదురమాను, మగత వీడు కన్ను విప్పి కలియ జూడు(2) *1 యెరుషలేము గుమ్మములు కాలిపోతున్నవి ప్రాకారపు గోడలు కూలిపోతున్నవి ప్రార్థనాయుధముతో పునరుత్థాన శక్తితో పునఃనిర్మాణము చేతము రండి ||ఓ|| *2 నిరాశ నిస్పృహలే ఎదురు నిలిచినా నిందలెన్నో మబ్బులుగ మనల కమ్మినా నిలిచెదం యేసుతో, నడిచెదం దీక్షతో నిరీక్షణా బలముతో సాగిపోదము ||ఓ|| *3 అపవాది బాణములు ఎన్ని విసిరినా అగ్ని గంధకముల వాన చుట్టుముట్టినా అదరము, బెదరము, అరికి మనము వెరవము అన్న యేసు సన్నిధిలో లేదిక భయము ||ఓ|| *4 సంఘమనగా క్రీస్తు యేసు దేహమే కదా చావునోడించినది ఈ దేహమే కదా సిలువ తేజస్సుతో, కరుణ మూర్తి మనసుతో సిరులు విరియు జీవితాలు నిర్మిద్దాము ||ఓ|| *5 యేసే ఈ సంఘమునకు అసలు పునాది యేసే ఈ జగత్తుకు ఆశాజ్యోతి యేసే ఆరంభము ఆయనే అంతము యేసే మన జీవితాల నవవసంతము ||ఓ|| *6 సాక్ష్యమిచ్చె సంఘమే జీవించే సంఘము జీవించే సంఘమే, సాక్ష్యమిచ్చు సంఘము సాక్ష్యము, విశ్వాసము, సఖ్యము, సహవాసము సిలువ చలువ పందిరిలో వర్థిల్లాలి||ఓ|| === code 192 title యేసుతో ఠీవిగాను పోదమా *ref యేసుతో ఠీవిగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతోడ పోదమా *1 రారాజు సైన్యమందు జేర-ను ఆరాజుదివ్యసేవచేయను యేసురాజు ముందుగా ధ్వజముబట్టినడువగా యేసుతో ఠీవిగాను వెడలను ||యేసు|| *2 విశ్వాసకవచము ధరించుచు ఆ రాజునాజ్ఞమదిని నిల్పుచు అనుదినంబు శక్తిని బొందుచున్నవారమై యేసుతో ఠీవిగాను వెడలను ||యేసు|| *3 శోధనలు మనలచుట్టివచ్చినా సాతాను అంబులెల్ని తగిలినా భయములేదు మనమిక ప్రభుని చెంత నుందుము యేసుతో ఠీవిగాను వెడలను ||యేసు|| *4 ఓ యువతీ యువకులార జేరుడి శ్రీ యేసు రాజు వార్త చాటుడి లోకమంత యేకమై లోకనాథుగెల్వను సాధనంబెవరు నీవు నేనేగా ||యేసు|| === code 193 title యెహోవా కొరకు-సహనముతో *ref యెహోవా కొరకు-సహనముతో కనిపెట్టన్‌ నాకు చెవియెగ్గి నా-మొరనాలకించెన్‌ నాశనకరమగు-గుంటలో నుండియు జిగటగల దొంగ ఊబి నుండి నన్‌ పైకెత్తెన్‌ *1 నా పాదములను-బండపై నిలిపి దానిపై నా అడు-గులు స్థిరపరచి క్రొత్త గీతమును-నా నోట నుంచెను అనేకులు యెహోవా-యందు నమ్మెదరు ||నాశన|| *2 గర్విష్టుల నబద్ధికు-లను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకొనువాడె ధన్యుండు మా దేవా మా-యెడల నీకున్న తలంపులు బహు-విస్తారములు ||నాశన|| *3 వాటిని వివరింప-నలవి కాదు నీకు సాటియైన వా-డొకడును లేడు బలి నైవేద్యము-లను కోరలేదు నీవు నాకు చెవులను-నిర్మించినావు ||నాశన|| *4 దహన బలుల పాప పరిహార బలులనైనను నీవు-తెమ్మనలేదు పుస్తకపు చుట్టలో- నన్ను గూర్చి వ్రాయబడినట్లు నేను వచ్చియున్నాను ||నాశన|| *5 నీ చిత్తమును చేయ-నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా-ఆంతర్యములో నున్నది మహా సమాజములో నీ-నీతి సువార్త ప్రకటించి యున్నా-ననుకొంటిని ||నాశన|| *6 నీ నీతిని నా-హృదయములోన దాచుకొని నే నూర-కుండలేదు నీ రక్షణ స-త్యమును కృపయును మహా సమాజమునకు నేదాచలేదు ||నాశన|| === code 194 title నా కాపరియగు ప్రభుడేసు డుండగా *ref నా కాపరియగు ప్రభుడేసు డుండగా నా కిక లేమి కలుగదుగా *1 నన్ను పచ్చిక - గల చోట్ల మేపును నడిపించును శాంత - జలముల యొడ్డున ||నా|| *2 నా ప్రాణమునకు - సేదను దీర్చును నడుపును నీతితో - తన నామమునకై ||నా|| *3 గాఢాంధకార - లోయలో సంచరించినను భయపడనొల్లనే యపాయమునకైనను ||నా|| *4 నీవు తోడైయుందువు నీ దుడ్డు కఱ్ఱయు నీ దండము నన్ను ఆదరించు నిత్యము ||నా|| *5 నా శత్రువుల యెదుట నాకు భోజనము ప్రీతితో నీవు సిద్ధ పరచుచున్నావు ||నా|| *6 నూనెతో నా తల - నంటియున్నావు నా గిన్నెయు నిండి పొర్లి దిగజారు చున్నది ||నా|| *7 నేను బ్రతుకు దినము-లన్నియు కృపా క్షేమములే నా వెంటనె వచ్చును ||నా|| *8 చిరకాలము యెహోవా మందిరములో నే నివాసము జే-సెద హల్లెలూయ ||నా|| === code 195 title ప్రభువా నే నిన్ను నమ్మి *ref ప్రభువా నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను నరులేమి చేయగలరు భయమేమి లేదు నాకు *1 గర్విష్టులైన వారు నాతో పోరాడుచుండ ప్రతిమాట కెల్లవారు పరభావ మెంచుచుండ ప్రభువా నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు ||ప్రభువా|| *2 నే నెందు బోదునన్న గమనించుచుండ వారు నా వెంట పొంచి యుండి నన్ను కృంగ నెంచ ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు ||ప్రభువా|| *3 పగబూని వారు నన్ను హతమార్పజూచియున్న మరణంబు నుండి నన్ను కడువింత రీతిగాను ప్రభువా నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు ||ప్రభువా|| *4 జీవంబు వెల్గువైన నీ సన్నిధానమందు నే సంచరించునట్లు నే జారిపోవకుండ ప్రభువా నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు ||ప్రభువా|| *5 నన్నాదుకొంటి వీవు నన్నాదరించినావు కొన్నావు నీవు నన్ను మన్నించినావు నీవు ఎన్నాళ్ళు బ్రతికియున్న నిన్నే సేవింతు దేవ ||ప్రభువా|| === code 196 title జీవనదిని నా హృదయములో *ref జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా శరీరక్రియ లన్నియూ నాలో నశియింప చేయుమయా *1 బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము ||జీవ|| *2 ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా ||జీవ|| *3 ఎండిన ఎముకలన్నియు తిరిగి జీవింప చేయుమయా ||జీవ|| *4 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ||జీవ|| === code 197 title యేసుని కొరకై - యిల జీవించెద *ref యేసుని కొరకై - యిల జీవించెద భాసురముగ నే ననుదినము దోషములన్నియు బాపెను మోక్ష నివాసమున ప్రభు జేర్చునుగా *1 నాశనకరమగు గుంటలో నుండియు మోసకరంబగు యూబి నుండి నాశచే నిలపై కెత్తెను నన్ను పి-శాచి పథంబున దొలగించెన్‌ *2 పలువిధముల పాపంబును జేసితి వలదని త్రోసితి వాక్యమును కలుషము బాపెను కరుణను బిలచెను సిలువలో నన్నాకర్షించెన్‌ *3 అలయక సొలయక సాగిపోదును వెలయగ నా ప్రభు మార్గములన్‌ కలిగెను నెమ్మది కలువరి గిరిలో విలువగు రక్తము చిందించిన ప్రభు *4 శోధన బాధలు శ్రమలు గల్గిన ఆదుకొనును నా ప్రభు వనిశం వ్యాధులు లేములు మరణము వచ్చిన నాథుడే నా నిరీక్షణగున్‌ *5 బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమైయున్నవి ప్రభునందు అద్భుతముగ ప్రభు వన్నియు నొసగి దిద్దును నా బ్రతుకంతటిని *6 అర్పించెను తన ప్రాణము నాకై రక్షించెను నా ప్రియ ప్రభువు అర్పింతును నా యావజ్జీవము రక్షకుడేసుని సేవింప *7 ప్రభునం దానం దింతును నిరతము ప్రార్థన విజ్ఞాపనములతో విభుడే తీర్చును యిల నా చింతలు అభయముతో స్తుతియింతు ప్రభున్‌ *8 యౌవన జనమా యిదియే సమయము యేసుని చాటను రారండు పావన నామము - పరిశుద్ధ నామము జీవపు మార్గము ప్రచురింప === code 198 title నమ్మకమైన నా ప్రభు *ref నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును (2) *1 కరుణతోడ పిల్చియు స్థిరపరచి కాపాడిన స్థిరపరచిన నా ప్రభున్‌ పొగడి నే స్తుతింతును ||న|| *2 ఎన్నోసార్లు నీ కృపన్‌ విడచియుంటిని ప్రభు (2) మన్నన తోడ నీదరిన్‌ జేర్చినన్‌ క్షమించితివి ||న|| *3 కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి (2) భంగపర్చు సైతానున్‌ గెల్చి విజయమిచ్చితివి ||న|| *4 నాకు ఆశ్రయ శైలమై కోటగా నీవుంటివి (2) ప్రాకారంపు శైలమై నన్ను దాచియుంచితివి ||న|| *5 సత్యసాక్షివై యుండి నమ్మదగినవాడవై (2) నిత్యుడౌ మా దేవుడా ఆమెన్‌ అంచు పాడెదం ||న|| === code 199 title ప్రభుని దర్శనమొంది సేవ *ref ప్రభుని దర్శనమొంది సేవ చేయుము దేవునికి *1 ఇండియ దేశము రక్షణకై నిన్నిదిగో రమ్మనెను పాప సముద్ర పాప సముద్ర అగాధములో ఆత్మలు మునిగెను ||ప్రభుని|| *2 సిలువపై తన ప్రాణము నిచ్చెను కలుషాత్ములకై తన హృదయ ములో తన హృదయములో ఇండియ దేశమునకు స్థలమిచ్చెను ||ప్రభుని|| *3 యౌవన జీవితము నంతటిని వ్యర్థముచేసితివి రక్షకుడేసుని రక్షకుడేసుని తక్షణమే లేచి సేవించుమా ||ప్రభుని|| *4 ఆత్మల రక్షణకై సోదరుడా ఆశతో లేచిరా విస్తారముగా విస్తారముగా కోతయున్నది నూతన బలమునరా ||ప్రభుని|| === code 200 title నేనును నా యింటివారును *ref నేనును నా యింటివారును నీతి సూర్యుని గొలుతుము దీనమనసును గలిగి దేవుని దివ్యసేవను జేతుము *1 అనుదినంబును ప్రభుని దలచుచు అలయకను ప్రార్థింతుము అనవరతమా ప్రభుని చిత్తము ననుకరింతుము పనులలో ||నేను|| *2 వేదవాక్య పఠనమందు విసుగు జెందక నుందుము ఆదరంబున దైవచిత్తము ననుసరించుచు నడుతుము||నేను|| *3 ఆశతోడను ప్రభుని దినమును నాచరింతుము మరువక విసుకు జెందక నాలయమునకు పిన్న పెద్దల దెత్తుము ||నేను|| *4 సంఘ కార్యక్రమములందు సహకరింతుము ప్రీతితో భంగపరచెడి పనులనన్నిటి కృంగ దీసెదమనిశము ||నేను|| *5 ప్రేమతోడను పొరుగు వారిని ప్రియులుగను భావింతుము క్షమయు స్నేహము నేర్పి ప్రభు కడ శాంతితో జీవింతుము ||నేను|| *6 శక్తికొలది శరీరబలమును శ్రమను క్రీస్తుకునిత్తుము భక్తితో హృదయమును పూర్తిగ ప్రభునికే యర్పింతుము ||నేను|| *7 చిన్న వారలు దైవరాజ్యపు చిఱుత వారసులంచును అన్ని వేళల వారి వృద్ధికి మిన్నగ దోడ్పడెదము ||నేను|| *8 పెద్దవారలు దైవజనులని పేర్మితో భావింతుము శుద్ధుడగు ప్రభు క్రీస్తు మనసును శ్రద్ధతోడను జూపుచు ||నేను|| *9 జీవితంబున ప్రభుని ప్రేమా శ్సీసులను ప్రసరింతుము దివ్యజ్యోతుల రీతి వెలుగుచు దివ్యసన్నిధినుందుము ||నేను|| === code 201 title నిండు మనస్సుతో నిన్నే *ref నిండు మనస్సుతో నిన్నే కొలిచేను దేవా రెండు కనులలో నిన్నే నిలుపుకొంటినయ్యా పండు వెన్నెలే మాకు నీ కరుణ కాంతి *1 పరిపక్వమైన మా పాపాలనెల్లబాపి గురిలేని మా బ్రతుకున వెలుగుబాట జూపి పరిశుద్ధమైన నీ మోక్ష మార్గమందు నడిపి దరి జేర్చి సంరక్షించు మా పాలిదైవమా ||నిండు|| *2 నీ నీతి వాక్యములనే పాటింతుమయ్యా నీ అడుగుజాడలలో పయనింతుమయ్యా నీ ఘనతనే జగతిని కీర్తింతుమయ్యా నీ చరణ దాసులమయ్యా పాలించరావయ్య ||నిండు|| === code 202 title తనువు నాదిదిగో గై - కొనుమీ యో *ref తనువు నాదిదిగో గై - కొనుమీ యో ప్రభువా నీ - పనికి బ్రతిష్ఠించు మీ దినములు క్షణములు - దీసికొనియవి నీదు వినతిన్‌ బ్రవహింప జే-యను శక్తి నీయుమీ ||తనువు|| *1 ఘనమైన నీ ప్రేమ - కారణంబున నీకై - పనిచేయ జేతులివిగో యనయంబు నీ విషయ - మై సొగసుగా జురుకు-దనముతో బరుగెత్త్త వినయ పాదములివిగో ||తనువు|| *2 స్వరమిదిగో కొనుమీ - వరరాజ నిను గూర్చి - నిరతమ్ము పాడనిమ్ము మరియు పెదవులివిగో మహనీయమైన నీ-పరిశుద్ధ వార్తతో బరిపూర్ణముగ నింపు ||తనువు|| *3 వెండి పసిడియివిగో - వీసమైనను నాకై - యుండవలెనని కోరను నిండైన నీ యిష్ట-నియమంబు చొప్పున మెండుగ వాడ బరి-మితియౌజ్ఞానంబిదిగో ||తనువు|| *4 నా యిష్ట మిదిగో యిది - నీ యిష్టముగ జేయ-నా యిష్టమిక గాదది నా యిచ్ఛ యున్నట్టి నా హృదయ మిదిగో నీ కే యియ్యది రాజ-కీయ సింహాసనమౌ ||తనువు|| *5 ఉన్న నా ప్రేమ నీ - సన్నిధానముననే నెన్నడు ధారవోయన్‌ నన్ను నీ వానిగ నాథా గైకొను మిపుడు - చెన్నుగ నీ వశమై స్థిరముగ నుండెద ||తనువు|| === code 203 title యెహోవా నా కాపరి నాకు లేమి లేదు *ref యెహోవా నా కాపరి నాకు లేమి లేదు పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్‌ *1 మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభుయేసునన్ను కరుణతో ఆదరించున్‌ ||యెహో|| *2 పగవారి యెదుట ప్రేమతో నొక విందు ప్రభు సిద్ధముచేయున్‌ పరవశమొందెదను ||యెహో|| *3 నూనెతో నా తలను అభిషేకము చేయున్‌ నా హృదయము నిండి పొర్లుచున్నది ||యెహో|| *4 చిరకాలము నేను ప్రభు మందిరములో వసియించెద నిరతం సంతసముగ నుందున్‌ ||యెహో|| === code 204 title నీ వాక్యము నా పాదములకు *ref నీ వాక్యము నా పాదములకు దీపము - దీపము నా త్రోవకు వెలుగై వెలుగై వెలుగై యున్నట్టి ఆ దీపము *1 నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము నీ న్యాయవిధులు నాకాహారం హల్లెలూయా-హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా నాథుడేసు క్రీస్తు రాజుకు హల్లెలూయా *2 మారని వాక్యము ఆరని దీపము అనాది దేవుని వాగ్దానము ||హ|| *3 జుంటి తేనియల వంటి ప్రవాహము కంటె మరికమ్మని మింటి వాక్యం ||హ|| *4 నరరూపమెత్తిన పరలోక వాక్యమా నాతో మాట్లాడుమా నా ప్రభువా ||హ|| === code 205 title నాదు జీవమాయనే నా సమస్తము *ref నాదు జీవమాయనే నా సమస్తము నా సర్వస్వము యేసుకే నాదు జీవము నాదు దైవము దివి దివ్య తేజము ||నా|| *1 కృంగిన వేళ భంగపడినవేళ అద్దరికి చేర్చెను చుక్కాని లేని నావవలె నేనుండ అద్దరికి చేర్చెను ఆత్మతో నింపెను ఆలోచన చేసెను ||నాదు|| *2 సాతాను ఖైదీనై కుములుచున్న వేళ విడిపించే శ్రీ యేసుడే రక్తమంత కార్చి ప్రాణాన్ని బలిచేసి విమోచన దయచేసెను సాతానుని అణగద్రొక్క అధికార బలమిచ్చెను ||నాదు|| *3 కారు మేఘాలే క్రమ్మిన వేళ నీతీ సూర్యుడు నడుపును తుఫానులెన్నో చెలరేగి లేచిన నడువును నా జీవితనావ త్వరలో దిగివచ్చును తరలిపోదుము ప్రభునితో ||నాదు|| === code 206 title గాఢాంధకారములో *ref గాఢాంధకారములో నేను తిరిగినను నేనేల భయపడుదున్‌ నాతోడు నీవుండగా *1 ఎన్నెన్నో ఆపదలు-నన్ను చుట్టినను నిన్ను తలచినచో-అన్ని విడనాడు (2) అన్ని కాలముల-నిన్నే స్మరియింతు ఎన్నరానివయా-నీకున్న సుగుణములు *2 నాకున్న మనుజులెల్ల-నన్ను విడిచినను నా దేవ యెపుడైనా-నన్ను విడిచితివా (2) నా హృదయ కలశమున నిను నేను నిలిపెదను (2) నీ పాదకమలముల నా దేవ కొలిచెదను *3 నా బ్రతుకు దినములలో నిన్నేల మరచెదను నీ ఘనకార్యముల నేనెపుడు స్మరియింతు (2) నీ ఉపకారముల నేనెపుడు తలచెదను (2) నా యేసు పాదముల నేనిపుడు కొలిచెదను === code 207 title యెహోవా నా కాపరి *ref యెహోవా నా కాపరి యెహోవా నా ఊపిరి నాకు లేమి లేదు లోయలలో - లోతులలో యెహోవా నా కాపరి సంద్రములో - సమరములో యెహోవా నా కాపరి *1 పచ్చికగల చోట్ల నన్ను పరుండజేయును శాంతికరమైన జలములకు నన్ను నడిపించును ||లోయ|| *2 గాఢాంధకారపు లోయలలో సంచరించినను అపాయమే కలుగదు నాకు నీతోడు నాకుండగ ||లోయ|| *3 చిరకాలము నేను యెహోవా సన్నిధిలో నివాసముండెదను నేను నిత్యము జీవింతును ||లోయ|| === code 208 title నే సాగెద యేసునితో *ref నే సాగెద యేసునితో నా జీవిత కాలమంత(2) *1 యేసుతో గడిపెద యేసుతో నడిచెద పరమున చేరగ నే వెళ్ళెద, హనోకు వలె సాగెదా... ||నే|| *2 తల్లియే మరచిన తండ్రియే విడిచిన బంధువులే నన్ను వెలివేసినా బలవంతునితో సాగెదా... ||నే|| *3 వెనుక శత్రువుల్‌ - వెంటాడినను ముందు సముద్రము ఎదురొచ్చినా మోషేవలె సాగెదా... ||నే|| *4 మరణ శాసనం - హెచ్చరించినను సింహపు బోనులో నను వేసినా దానియేల్‌ వలె సాగెదా... ||నే|| *5 లోకపు శ్రమలు - నన్నెదిరించినన్‌ కఠినులు రాళ్ళతో హింసించినా స్తెఫను వలె సాగెదా... ||నే|| *6 బ్రతుకుట క్రీస్తే - చావయినా మేలే క్రీస్తుకై హత సాక్షిగా మారిన పౌలు వలె సాగెదా... ||నే|| === code 209 title దేవుడు మీకు యెల్లప్పుడు *ref దేవుడు మీకు యెల్లప్పుడు తోడుగనున్నాడు (2) ||తోడుగ|| *1 ఏదెనులో ఆదాముతో నుండెన్‌ హనోకు తోడ నేగెను దీర్ఘ దర్శకులతో నుండెన్‌ ధన్యులు దేవుని గలవారు ||తోడుగ|| *2 దైవాజ్ఞను శిరసావహించి దివ్యముగ నబ్రహాము కన్న కొమరుని ఖండించుటకు ఖడ్గమునెత్తినయపుడు ||తోడుగ|| *3 యోసేపు ద్వేషించబడినపుడు గోతిలో త్రోయబడినపుడు శోధనలో చెఱసాలయందు సింహాసన మెక్కినపుడు ||తోడుగ|| *4 ఫరోరాజు తరిమినయపుడు ఎఱ్ఱ సంద్రపు తీరమున యోర్దానునది దాటునపుడు యెరికో కూలిన యపుడు ||తోడుగ|| *5 దావీదు సింహము నెదిరించి ధైర్యాన చీల్చినయపుడు గొల్యాతును హతమార్చినయపుడు సౌలుచే తరుమబడినపుడు ||తోడుగ|| *6 సింహపు బోనులో దానియేలు షడ్రకు మెషాకబెద్నెగో అగ్నిగుండములో వేయబడన్‌ నల్గురుగా కనబడినపుడు ||తోడుగ|| *7 పౌలు బంధించబడినపుడు పేతురు చెఱలోనున్నపుడు అపోస్తలులు విశ్వాసులు హింసించబడిన యపుడు ||తోడుగ|| === code 210 title యేసుని ప్రేమను - నేమారకను *ref యేసుని ప్రేమను - నేమారకను నెప్పుడు దలచవె యో మనసా వాసిగ నాతని - వరనామంబును వదలక పొగడవె యో మనసా *1 పాపుల కొరకై - ప్రాణము బెట్టిన ప్రభు నిల దలచవె యో మనసా శాపము నంతయు - జక్కగ నోర్చిన శాంతుని పొగడవె యో మనసా *2 కష్టములలో మన - కండగ నుండిన కర్తను దలచవె యో మనసా నష్టములన్నియు - నణచిన యా గురు శ్రేష్టుని పొగడవె యో మనసా *3 మరణతరిని మన - శరణుగ నుండెడు మాన్యుని దలచవె యో మనసా కరుణను మన క - న్నీటిని దుడిచిన కర్తను పొగడవె యో మనసా *4 ప్రార్థనలు విని - ఫలముల నొసగిన ప్రభునిక దలచవె యో మనసా వర్ధన గోరుచు - శ్రద్ధతో దిద్దిన వంద్యుని పొగడవె యో మనసా *5 వంచన లేక - వరముల నొసగిన వరదుని దలచవె యో మనసా కొంచెము కాని - కూర్మితో దేవుని కొమరుని పొగడవె యో మనసా === code 211 title దేవుని ప్రేమ యిదిగో *ref దేవుని ప్రేమ యిదిగో జనులార భావంబునం దెలియరే కేవలము నమ్ముకొనిన బరలోక జీవంబు మన కబ్బును *1 సర్వలోకము మనలను తన వాక్య సత్యంబుతో జేసెను సర్వోపకారుడుండే మన మీద జాలి పరుడైయుండెను ||దేవుని|| *2 మానవుల రక్షింపను దేవుండు-తన కుమారుని బంపెను మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే *3 యేసుక్రీస్తను పేరున రక్షకుడు వెలసి నాడిల లోపల దోసకారి జనులతో నెంతో సు - భాషలను బల్కినాడు ||దేవుని|| *4 పాప భారంబుతోడ నే ప్రొద్దు-ప్రయాసముల బొందెడి పాపులందరు నమ్మిన విశ్రాంతి- పరిపూర్ణ మిత్తుననెను ||దేవుని|| *5 చావునొందిన కొందరిన్‌ యేసుండు చక్కగా బ్రతికించెను సకల వ్యాధుల రోగులు ప్రభునంటి- స్వస్థంబు తా మొందిరి ||దేవుని|| *6 గాలి సంద్రపు పొంగులన్‌ సద్దణపి-నీళ్ళపై నడచినాడే మేలు గల యద్భుతములు ఈలాగు- వేలకొలదిగ జేసెను ||దేవుని|| *7 చేతుల కాళ్ళలోను రారాజు-చేర మేకులు-బొందెను పాతకులు గొట్టినారే పరిశుద్ధ- నీతి తా మోర్వలేకన్‌ ||దేవుని|| *8 ఇన్ని బాధలు బెట్టుచు దనుజంపు - చున్న పాప నరులను మన్నించు మని తండ్రిని యేసుండు- సన్నుతితో వేడెను ||దేవుని|| *9 రక్షకుడు శ్రమ బొందగా దేశంబు-తక్షణము చీకటయ్యెన్‌ రక్షకుడు మృతి బొందగా తెర చినిగి- రాతి కొండలు-పగిలెను ||దేవుని|| *1 మూడవ దినమందున యేసుండు మృతి గెల్చిలేచినాడు నాడు నమ్మిన మనుజులు చూచిరి నలువది దినములందున్‌ ||దేవుని|| *1 నమ్మి బాప్తిస్మమొందు నరులకు-రక్షణ మరి కల్గును నమ్మనొల్లక పోయెడు నరులకు- నరకంబు సిద్ధమనెను ||దేవుని|| === code 212 title శాశ్వతమైనది ప్రేమ *ref శాశ్వతమైనది ప్రేమ యెహోవా తండ్రి ప్రేమ ప్రేమలో భయమేమియు లేదు ప్రేమ పరిపూర్ణంబైయున్న భయమును పారగ ద్రోలున్‌ *1 దీర్ఘకాలము ప్రేమ దయచూపి సహించును మత్సరపడ దీయుత్తమ ప్రేమ డంబముగా నడువని దీ ప్రేమ ఉప్పొంగని దీ ప్రేమ ||శాశ్వత|| *2 స్వప్రయోజనమును ఎప్పుడు కోరనిదీ ప్రేమ అమర్యాదగ నడువని ప్రేమ త్వరగా కోపపడని ప్రేమ తలచదు అపకారమును ||శాశ్వత|| *3 దుర్నీతిలో గాక సత్యాన సంతోషించున్‌ అన్నిటికి తాళుకొను ప్రేమ అన్నిటిని నమ్మి యోర్చెడి ప్రేమ అన్నిటి నిరీక్షించున్‌ ||శాశ్వత|| *4 నిలుచును విశ్వాసము నిరీక్షణయు మరి ప్రేమ వీటిలో శ్రేష్టమైనది ప్రేమ ప్రేమను కల్గియుండుటకు ప్రయత్నించుడి మీరు ||శాశ్వత|| *5 ప్రేమ లేనివాడు దేవుని యెరుగనివాడు మన దేవుడు ప్రేమ స్వరూపి తన ప్రేమ మనలో సంపూర్ణ సిద్ధిని పొందవలయు ||శాశ్వత|| *6 నిన్నడుగుచున్నాడు నిను ప్రేమించిన ప్రభు యేసు నన్ను ప్రేమించుచున్నావా? వీరికంటె నాపై నీకు ఎక్కువ ప్రేమగలదా ||శాశ్వత|| *7 నను ప్రేమించినయెడల నా యాజ్ఞలను గైకొనుము మీలో మీరు ఒకరి నొకరు ప్రేమించుకొనుచున్నయెడల అదియే మహదానందం ||శాశ్వత|| === code 213 title యేసూ నన్ను ప్రేమించినావు *ref యేసూ నన్ను ప్రేమించినావు పాపినైన నన్ను ప్రేమించినావు *1 నన్ను ప్రేమింపమా నవరూప మెత్తి దానముగా జీవము సిల్వపై నిచ్చి కన్న తలిదండ్రుల యన్న దమ్ముల ప్రేమ కన్న మించిన ప్రేమతో ||యేసు|| *2 తల్లి గర్భముననే ధరియింప బడినపుడే దురితుండనై యుంటిని నా వల్ల జేయ బడెడు నెల్ల కార్యము లెప్పు డే హ్యంబులై యుండగా ||యేసు|| *3 మంచినాలో పుట్ట దంచు నీ వెరిగినన్‌ మించి బ్రేమించి నావు ఆహా యెంచ శక్యముగాని మంచి నాలో బెంచ నెంచి ప్రేమించినావు ||యేసు|| *4 నన్ను బ్రేమింప నీ కున్నకష్టములన్ని మున్నె తెలిసి యుంటివి తెలిసి నన్ను బ్రేమింప నీకున్న కారణమేమో యన్నా తెలియదు చిత్రము ||యేసు|| *5 నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు ఆహా నీవంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం బేమిలేక ||యేసు|| === code 214 title నా యేసుని ప్రేమకన్నా *ref నా యేసుని ప్రేమకన్నా మిన్న ఏమున్నది ఆ ప్రేమ కల్వరి గిరిలో సార్థకంబైనది *1 నీదు ప్రేమే నాకు జీవము నా సమస్తమును వర్ణించగలనా నీదు ప్రేమ ప్రాణ ప్రియుడా ||నా|| *2 నీవు పొందిన శ్రమలన్నియును నాదు డెందములో సాక్ష్యమిచ్చు చుండ నేను నిన్ను విడతునా ||నా|| *3 నీవు కార్చిన రక్తమే నా ముక్తి మార్గమై సిల్వలో స్రవించుచునన్‌ శుద్ధి చేయును ||నా|| *4 అర్పింతు నేను నా సమస్తము నాదు హృదయమును నీదు ప్రేమ నన్ను తొందర చేయుచున్నది ||నా|| === code 215 title ఈలాటిదా యేసు ప్రేమ *ref ఈలాటిదా యేసు ప్రేమ నన్ను - తూలనాడక తనదు జాలి జూపినదా *1 ఎనలేని పాపకూపమున నేను-తనికి మినుకుచును నే- దరిఁగానకు డన్‌ కనికరము ఁబెంచి నాయందు వేగఁ గొనిపోవ నా మేలు కొరకిందు వచ్చె ||ఈలాటి|| *2 పెనుగొన్న దుఃఖాబ్దిలోన నేను-మునిఁగి కుములుచు నేడు పునగుందునపుడు నను నీచుఁడని త్రోయలేక తనదు నెనరు నా కగు పరచి నీతిఁజూపించె ||ఈలాటి|| *3 నెమ్మిరవ్వంతైన లేక చింత-క్రమ్మి పొగలుచునుండగా నన్నుఁజూచి సమ్మతిని ననుఁబ్రోవదలఁచి కరముఁజాచి నా-చేయిపట్టి చక్కగా బిలిచె ||ఈలాటి|| *4 పనికిమాలిన వాఁడనైన నేను-కనపరచు నాదోష కపటవర్తనము మనసు నుంచక తాపపడక యింత-ఘనమైన రక్షణ-మును నాకుఁజూపె ||ఈలాటి|| *5 నా కోర్కెలెల్ల సమయములన్‌ క్రింది-లోక వాంఛల భ్రమసి లొంగెడు వేళన్‌ చేర్చి దృఢము చిత్తమునన్‌ శుభము-నాకొసంగెజీవింప నా రక్షకుండు ||ఈలాటి|| *6 శోధనలు ననుఁజుట్టినపుడు నీతి-బోధ నా మనసులోఁ బుట్టించి పెంచి బాధ లెల్లను బాపి మాపి యిట్టి యాదరణఁజూపెనా యహహ యేమందు ||ఈలాటి|| === code 216 title నన్నెంతగానో ప్రేమించెను *ref నన్నెంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించెను నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను నన్ను కరుణించెను (2) *1 సాతాను బంధాలలో జీవపు డంబాలలో పడనీయక దరి చేరనీయక తన కృపలో నిరతంబు నను నిల్పెను *2 సత్యంబు జీవంబును ఈ బ్రతుకు సాఫల్యము నేర్పించెను నాకు చూపించెను వర్ణించగా లేను ఆ ప్రభువును *3 కల్వరిగిరి పైనను ఆ సిల్వ మరణమును నాకోసమే ప్రభు శ్రమ పొందెను నా పాపమంతటిని క్షమియించెను *4 ఘనమైన ఆ ప్రేమకు వెలలేని త్యాగంబుకు ఏమిత్తును నేనేమిత్తును నను నేను ఆ ప్రభుకు సమర్పింతును === code 217 title ఆశ్చర్యమైన ప్రేమ-కల్వరిలోని ప్రేమ *ref ఆశ్చర్యమైన ప్రేమ-కల్వరిలోని ప్రేమ మరణము కంటె-బలమైన ప్రేమది నన్ను జయించె నీ ప్రేమ *1 పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించీ, ఆదరించీ, సేదదీర్చే నిత్య జీవమిచ్చే ||ఆశ్చర్య|| *2 పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి, జీవమిచ్చీ, జయమిచ్చే తన మహిమ నిచ్చే ||ఆశ్చర్య|| *3 నా స్థితి జూసిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగలించీ ముద్దాడె కన్నీటిని తుడిచె ||ఆశ్చర్య|| *4 శ్రమను సహించిన ప్రేమ, నాకై శాపము నోర్చిన ప్రేమ నను విడనాడనీ యెడబాయనీ ప్రేమదీ వాడబారదు ||ఆశ్చర్య|| === code 218 title ప్రేమామృత ధారల చిందిన మన *ref ప్రేమామృత ధారల చిందిన మన యేసుకు సమమెవరు ఆ...ఆ..ఆ ప్రేమయె తానై నిలచి ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి ప్రేమ నగరికి చనియే ||ప్రేమ|| *1 నిశ్చలమైన ప్రేమజీవికి ఇలలో తావేది ప్రేమ ద్రోహులే గాని ప్రియమున జేరరు వాని చేరిన చెలికాడగురా సమయమిదే పరుగిడరా ||ప్రేమ|| *2 ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించును రారా పాపభారముతో రారా పాదములపై బడరా పాపుల రక్షకుడేసు తప్పక నిన్ను రక్షించున్‌ ||ప్రేమ|| *3 ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసెదవేల రక్షణ దినమిదియేరా తక్షణమే కనుగొనరా ఇదియే దేవుని వరము ముదమారగ చేకొనుము ||ప్రేమ|| === code 219 title ప్రేమా యేసుని ప్రేమా *ref ప్రేమా యేసుని ప్రేమా అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భువి నందించలేనిది *1 తల్లిదండ్రుల ప్రేమ నీడవలె గతియించును కన్నబిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును ఎన్నడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ ||ప్రేమ|| *2 భార్యభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవును ||ఎన్న|| *3 బంధు మిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంతకాలమే వెలుగు నిచ్చి ఆరిపోవును ||ఎన్న|| *4 ధరలోని ప్రేమలన్నియు స్థిరముకావు తరిగిపోవును క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును ||ఎన్న|| === code 220 title ప్రభు ప్రేమ తొలికేక *ref ప్రభు ప్రేమ తొలికేక హృదయములో ప్రతి ధ్వనియించె పాపక్షమ-యేసునిలో శరణునొసంగుచు కనిపించె *1 పాపవికారము పొడసూప జీవిత విలువలు మరుగాయె పతితనుగా లోకములో బ్రతుకుటయే నా గతియాయె పలువురిలో కనబడలేక దాహముతో నే నొంటరిగా బావికని పయనింప నాథుని దర్శనమెదురాయె పావనుడు దాహముతో పానము నిమ్మని ననుగోరె ||ప్రభు|| *2 జాతిని చూడని నేత్రముతో పాపము శోకని హృదయముతో జాలిని చాటించుచునే తాకను నా మది వేదనతో జాప్యము చేయక తెమ్మనియె దాచుకొనిన నా పాపమును జడియుచునే తెలిపితిని ప్రభు వెరిగిన నా నిజస్థితిని జయమొందె నా తనువు సరిగనుడితివని ప్రభు తెలుప ||ప్రభు|| *3 దేహమునే నా సర్వముగా భావించుచు మది పూజింప దినదినము జీవితము చావుగ మారిన కాలముతో దేవునిగా నా బంధువుగా మరణ బంధములు ఛేదించి దరిచేర్చి దీవించి నూతన జన్మ ప్రసాదించె దయ్యాల కుహరమును స్తుతిమందిరముగ రూపించె ||ప్రభు|| *4 పాపము దాగొను నా బావి లోతును ఎరిగిన వారెవరు పోరాట వాటికయౌ నా బ్రతుకును జూచినదెవరు పాపికి పాపమునకును భేదము జూపిన వారెవరు పాపిని కాపాడుటకై సిలువ ధరించిన వారెవరు పరదైసు ద్వారములు ప్రేమతో-తెరచెను నా కొరకై ||ప్రభు|| *5 ఘటముతో వెడలితి నొంటరిగా పితరులు త్రావిన జలములకై కనబడెను బావికడ రక్షణయూటల ప్రభుయేసు కుండను వీడి పరుగిడితి బావిని చేకొని హృదయములో ఘనమైన శుభవార్త ఆతృతతో ప్రజలకు తెలుపా గ్రామ ప్రజా కనుగొనిరి విశ్వ విమోచకుడగు యేసున్‌ ||ప్రభు|| === code 221 title రండి సువార్త సునాదముతో *ref రండి సువార్త సునాదముతో రంజిలు సిలువ నినాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి *1 యేసే మానవ జాతి వికాసం యేసే మానవనీతి విలాసం యేసే పతిత పావన నామం భాసుర క్రైస్తవ శుభనామం ||రండి|| *2 యేసే దేవుని ప్రేమ స్వరూపం యేసే సర్వేశ్వర ప్రతిరూపం యేసే ప్రజాపతి పరమేశం ఆశ్రిత జనముల సుఖవాసం ||రండి|| *3 యేసే సిలువను మోసిన దైవం యేసే ఆత్మల శాశ్వత జీవం యేసే క్షమాపణ అధికారం దాసుల ప్రార్థన సహకారం ||రండి|| *4 యేసే సంఘములో మన కాంతి యేసే హృదయములో ఘనశాంతి యేసే కుటుంబ జీవన జ్యోతి పసి పాపల దీవెన మూర్తి ||రండి|| *5 యేసే జీవన ముక్తికి మార్గం యేసే భక్తుల భూతల స్వర్గం యేసే ప్రపంచ శాంతికి సూత్రం వాసిగ నమ్మిన జనస్తోత్రం ||రండి|| === code 222 title ఓ పాపి ప్రభు చెంతకు రా *ref ఓ పాపి ప్రభు చెంతకు రా నీ ప్రాపు యేసు ప్రభువేగా ||ఓపాపి|| *1 పాపుల వెదకుటకై వచ్చెన్‌ పాపుల రక్షింపను వచ్చెన్‌ పాపంబులకు విలపించగదే ||ఓపాపి|| *2 సిలువయె మనమరిగెడుబాట కలుషంబులు కడిగెడు చోటు విలువైన ప్రేమ గలదచట ||ఓపాపి|| *3 భారము తొలగెడి యా చోటు నేరము మన్నించెడు చోటు పరిపూర్ణ విడుదల-గనుమచట||ఓపాపి|| *4 కని విని యరుగుము యా చోటున్‌ మనమున దలపోయుము వేగ ఎనలేని ప్రేమ గలదచట ||ఓపాపి|| *5 తన ప్రాణము మనకై బెట్టెన్‌ తన జీవము మనకై నిచ్చెన్‌ మన ప్రాపు యేసు ప్రభువేగా ||ఓపాపి|| *6 తన రక్షణ మనకై దెచ్చెన్‌ మన శిక్షను తా భరియించెన్‌ మన ప్రాపు యేసు ప్రభువేగా ||ఓపాపి|| === code 223 title రమ్మనుచున్నాడేసు రాజు *ref రమ్మనుచున్నాడేసు రాజు రండి సర్వ జనులారా *1 ఇల్లు వాకిలి లేని వారలు ఇహాన నమ్మదగని వారలు తన రాజ్యము మీకిచ్చును యేసు ||ర|| *2 కరవుచే కృశించుచున్న మరణించుచున్న ప్రజలారా ఆకలి దప్పులు తీర్చును మీకు ||ర|| *3 ముండ్ల మకుటము ప్రక్క గాయము పాద హస్తములలో గాయములు పొందిన ప్రభువే పిల్చెను మిమ్ము ||ర|| *4 రయమున ప్రియులారా కూడి రండి పరీక్ష చేయండి భరియించును మీ భారములన్ని ||ర|| === code 224 title జాలమేలా జేసె దరూ *ref జాలమేలా జేసె దరూ మేలుకొని ప్రభు జేరన్‌ ప్రాలుమాలిన జీవమేల? కాలయాపనదేలా? మేలుకొనుడీ మీ మనములన్‌ జాలిగల పిలుపున్‌ మీరల్‌ విని ||జాల|| *1 ఎంత కాలము చింతలలో మునిగి యుండెదరేలా చెంతజేర రండి నేడే చింతలన్‌ దీర్చున్‌ ప్రభు వింతగ ||జాల|| *2 లోక పుటాశలు జుట్టి మనలన్‌ లోక మునకే జేర్చున్‌ లోకరక్షకుడేసే మనలన్‌ ప్రాకటము బ్రోచున్‌ వాస్తవమిదె ||జాల|| *3 సందియంబులు గలిగి నీవు గుంది యుండెదవేలా వందితుండౌ యేసు ప్రభు పాదములను-బ్రతిమాలుము ||జాల|| *4 కఠిన హృదయము కరుగదేలా? కఠిన హృదయమదేలా కుటిల వర్తనమంత వీడుము పఠన జేయుచు దైవగ్రంథము ||జాల|| *5 మోసబోకుడి దాసజనమా నాశనమె మన గతియౌ నీ సురక్షకుడేసు ప్రభువే యాశ్రయమె సుమ్మాయని నమ్ముము *6 పాప దాస్యమందు జిక్కి శాపగ్రస్తుడవౌదు పాపజీవితము మరణమౌగా కృపయే యేసుని దానము జీవము *7 మారుమనసు నొంద రండి భారములు కడద్రోసి నేరమెంచని యేసు కృపను కోరుకొని జీవింపగ రండి ||జాల|| *8 కోరుకొనుడి రక్షణంబును కోరుకొనుడి నేడే కోరువారికి జీవజలముల్‌ కోరికలు దీర నిచ్చును ప్రభు ||జాల|| === code 225 title ప్రజలార వేగమె రారె *ref ప్రజలార వేగమె రారె నిజ దైవమును కనుగొనరె ప్రతివాడు మోక్షము జేర ప్రభు యేసు కథ విని పోరె ||ప్రజ|| *1 పాపాత్ము లనబడు వారి భారంబు దీయను గోరి ప్రభు యేసు చూపిన దారి పరమందు సుఖమిడు దారి ||ప్రజ|| *2 ఏ జాతి వారల నైన ఏ దేశ వాసుల నైన ఏమైన భేదము లేక యేసయ్య బ్రోచును గాన ||ప్రజ|| *3 పాపాత్ములే తన సుతులు ప్రభు యేసుకు స్నేహితులు నీ పాపమెల్లను పోవున్‌ నీకింక మోక్షము కలుగున్‌ ||ప్రజ|| *4 యేసయ్య గాకను వేరే యెవరైన లేరిక రారె దోషంబు లెల్లను బాపి ఆశీర్వదించును గాన ||ప్రజ|| *5 ప్రయాసపడి భారమును మోసెడి ఓ ప్రజలారా ప్రభు యేసు క్రీస్తే మీకు ప్రశాంతి నిచ్చును రండి ||ప్రజ|| === code 226 title హృదయమనెడు తలుపు నొద్ద *ref హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు దట్టుచుండు సకల విధములను ||హృదయ|| *1 పరుని బోలి - నిలుచున్నాడు పరికించి చూడ - నతడు పరుడు గాడు - రక్షకుండు ప్రాణ స్నేహితుడు ||హృదయ|| *2 కరుణా శీలుండతడు గాన గాచియున్నాడు యేసు కరుణ నెరిగి గారవింప గరము న్యాయంబు ||హృదయ|| *3 ఎంతసేపు నిలువ బెట్టి యేడ్పింతురతని నాత-డెంతో దయచే బిలుచుచున్నాడిప్పుుడు మిమ్ములను *4 అతడు మిత్రుడతడు మిత్రు-డఖిల పాపులకు మీర లతని పిలుపు వింటి రేని యతడు-ప్రియుడగును ||హృదయ|| *5 జాలిచేత దన హస్తముల జాపియున్నాడు మిమ్ము-నాలింగనము సేయగోరి యనిశము కనిపెట్టు ||హృదయ|| *6 సాటిలేని దయగల వాడు సర్వేశు సుతుడు తన-మాట వినెడు వారల నెల్ల-సూటిగ రక్షించు ||హృదయ|| *7 చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీ యేసు నాధు నతడు - చేర్చు కొనుచు మీ కిచ్చును-చిరజీవము గృపను||హృదయ|| *8 బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడ గాన-బ్రతికియుండు కాలముననే ప్రభుని గొలువండి ||హృదయ|| === code 227 title పాపిగానే జీవింతువా *ref పాపిగానే జీవింతువా పాపమునందే మరణింతువా ప్రియుడా ప్రభుని ప్రేమను గుర్తింపవా ||పాపి|| *1 ఆశలు నిండిన-లోకమునందు ఆశలు ఎన్నో వుండునుగా అవి-నాశనమునకే నడుపునుగా ఆశలు త్రెంచి-ప్రేమను పెంచి ప్రభుని పథమున నడువుమా... ప్రియుడా *2 విన్న బోధ యిది-నాకు కాదుయని నిర్లక్ష్యముగా వెడలెదవా! నీవు మారు మనస్సు పొందవా రేపు యనెడి రోజున యందు మరణము సంధించగా-మోక్ష మార్గము ఇక లేదుగా... ప్రియుడా ||పా|| *3 పాపము వలన శాపము కల్గెను శాపము వలన మరణము కల్గెను మరణపు ముల్లును విరచిన యేసు పాపివైన నీ కోసరమే పాపినైన నా కోసరమే ప్రభువు సిలువ నొందెనుగా... ప్రియుడా *4 లోకము నీది కాదని తెలుసు తెలిసిన నీవు తెలియకుందువా విడుదల లేని-జీవితమునకు వేదన కలదోయీ నరక వేదన కలదోయీ ...ప్రియుడా ||పా|| *5 నీదు జీవితము స్థిరము కాదుయని యాత్రికుడవని మరచిపోతివా నీదు గమ్యము ఏదో తెలుసా తెలియకపోయినచో నీకు నరకము తప్పదుగా... ప్రియుడా ||పా|| === code 228 title ఇదియే సమయంబు రండి *ref ఇదియే సమయంబు రండి యేసుని చేరండి ఇక సమయము లేదండీరండి రక్షణ పొందండి *1 పాపుల నందరిని తన దాపున జేర్చుటకై ప్రాణము దానముగా తన ప్రాణము నిచ్చెనుగా మరణపు ముల్లును విరచి విజయము నిచ్చెనుగా ||ఇదియే|| *2 రాజులకు రాజైన యేసు రానై యున్నాడు గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి తరుణముండగానే మీరు తయ్యారవ్వండి ||ఇదియే|| *3 బుద్ధిలేని కన్యకల వలె మొద్దులుగా నుంటే సిద్దెలతో నూనె మీరు సిద్ధపడక పోతే ద్వారము మూయగనే మీకు దారి దొరకదేమో ||ఇదియే|| *4 వెలుపల నుంటేను మీరు వేదన నొందెదరు తలుపు తట్టినను మీకు తెరువడు సుమ్మండి మిమ్మును ఎరుగనూ మీరు ఎవరో పొమ్మనును ||ఇదియే|| *5 నమ్మిన వారికి క్రీస్తు నెమ్మది నిచ్చునుగా నమ్మని వారికి నిత్య నరకమె సుమ్మండి నిర్లక్ష్యము చేయకను రండి రక్షణ నొందండి ||ఇదియే|| *6 సందియ పడకండి మీరు సాకులు చెప్పకను తరుణముండగానే మీరు త్వరపడి రారండి మరణమెప్పుడొచ్చున్‌ మనకు తెలియదు సుమ్మండి ||ఇదియే|| *7 జాలము చేయకను మీరు హేళన చేయకను కులము స్థలమనుచు మీరు కాలము గడుపకను హల్లెలూయ పాటలు బాడ నెల్లరును రండి ||ఇదియే|| === code 229 title రండీ రండీ యేసుని యొద్దకు *ref రండీ రండీ యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు ప్రయాసపడి భారము మోయువారలు ప్రభుని చెంతకు పరుగిడి వేగమె *1 యేసుని పిలుపు వినియు నింక యోచింపరేల? అవనిలో అగచాట్ల పాలైన అబ్బదు శాంతి ఆత్మకు నిలలో ||రండి|| *2 కరవు మరణము రణముల జూచి కలుగదు మారుమనసు ప్రవచనములు సంపూర్ణములాయెను యూదులు తిరిగి వచ్చియున్నారు ||రండి|| *3 ప్రభు యేసు నీ కొరకై తనదు ప్రాణము నిచ్చెగదా సిలువను రక్తము చిందించియును బలియాయెను యా ఘనుడు మనకై ||రండి|| *4 యేసుని నామము నందే పరమ నివాసము దొరుకును ముక్తిని పాప విమోచనమును శక్తిమంతుడు యేసేయిచ్చును ||రండి|| *5 నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమును నేనే గాకింకెవ్వరు లేరని యెంచి చెప్పిన యేసుని యొద్దకు ||రండి|| *6 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయామెన్‌ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ||రండి|| === code 230 title తలుపులు తీయండి యేసుకు *ref తలుపులు తీయండి యేసుకు తలుపులు తీయండి హృదయమనే కోవెల తలుపులు యేసుకు తీయండి ప్రభు యేసుకు తీయండి ||తలు|| *1 దేహము దేవుని ఆలయము అది దేవుడు మలచిన మందిరము దేహమనే ఆలయమందు దేవుని నిలుపండి యేసు దేవుని నిలుపండి ||తలు|| *2 గుమ్మముల్‌ తెరవండి ఆలయ గుమ్మముల్‌ తెరవండి గుమ్మముల్‌ తెరచి గంభీరముగా గీతముల్‌ పాడండి స్తుతి గీతముల్‌ పాడండి ||తలు|| *3 మోకరించండి-అందరు మోకరించండి మోకరించి మరియా సుతునికి ప్రార్థన చెయ్యండి ప్రభువా అని వేడండి ||తలు|| === code 231 title యేది నీ యర్పణ ఏది సమర్పణ *ref యేది నీ యర్పణ ఏది సమర్పణ ఏది హృదయ మేది ఏది నీ కానుక ఏది నీ యీవి ఏది కృతజ్ఞత ఏది నీభక్తి ఏది వినయమేది *1 ఇమ్ము నీ హృదయము కానుకగా నేడే రమ్ము రక్షణ వస్త్రము ధరియించుము కుమ్మరించును విమలాత్మ వరమ్మును నమ్మి ప్రార్థించు నేడే ||ఏది|| *2 పాపుల కొరకై ప్రాణము బెట్టితి శాపము బాపి నీకు జీవము నిచ్చితి *3 చింతలు దీర్చితి భ్రాంతిని మార్చితి చెంతను జేర్చి నీ శాంతిని గూర్చితి *4 భావము నందున భక్తిని గూర్చితి జీవ జలంబుల ద్రావుటకిచ్చితి *5 రక్తము గార్చి విముక్తుల జేసితి రక్షణ పాపికి దెచ్చి నే నిచ్చితి *6 దీన దయాపరుడా నీకేమిత్తును దీనుల రక్షక నేనేమి దెత్తును గైకొనుమా నా యావజ్జీవము గొనుమిదె కానుకగా ||ఏది|| === code 232 title నీ ధనము-నీ ఘనము-ప్రభు యేసుదే *ref నీ ధనము-నీ ఘనము-ప్రభు యేసుదే నీ దశమభాగము నీయ-వెనుదీతువా *1 ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోక నాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా *2 పాడిపంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయ నో క్రైస్తవా *3 వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించె ప్రభు నీకు ఉచితంబుగా వెలిగించ ధరపైని ప్రభు నామము కలిమి కొలది ప్రభునకర్పించవా *4 కలిగించె సకలంబు సమృద్ధిగా తొలగించె పలు బాధ భరితంబులు బలియాయె నీ పాపముల కేసువే చెలువంగ ప్రభుకీయ చింతింతువా === code 233 title జగతి కేతెంచె రక్షణ కర్త *ref జగతి కేతెంచె రక్షణ కర్త పాపుల మొర వినెను యేసు *1 కృంగిన వారిని నింగికి యెత్తి పాపము శాపము ఆపదలన్ని-బాపెను యేసు ఆ...ఆ... బాపెను యేసు *2 పాపపు పాత్రను - పానము జేసి మరణపు ముల్లును విరచి జయించి తెరచె మోక్షద్వారమున్‌ ఆ...ఆ... *3 లెండి రండీపాడుచు వేగ చాటెద మెల్లెడ కోట్ల ప్రజలకు ప్రేమమయు డేసున్‌ ఆ...ఆ... === code 234 title యేసు క్రీస్తు దొరికెనేని *ref యేసు క్రీస్తు దొరికెనేని యేమి కొదువింకేమి భయము దోసకారి జనుల కెంతోఁ గ్రాసమవు నా యేసు పేరు ||యేసు|| *1 తల్లిదండ్రుల కన్న చాలాఁ దన ప్రేమ మన మీద నెల్లకాల మందు నుంచు యేసుఁడే మా తండ్రి యౌను ||యేసు|| *2 వల్లగాని వశములేని యెల్ల మేళ్ళన్నిటి నెల్లపుడు కొల్లగా మన కిచ్చెడి దేవ కొమరుఁడే వేరెవరు లేరు ||యేసు|| *3 దండియైన గండములు మెండుగాను మముఁజుట్టిన తండ్రివలె మా దరికి వచ్చి గండములను గదిమిఁ బ్రోచున్‌ ||యేసు|| *4 సత్యము మార్గము తానె నిత్య జీవ మింకా తానే భృత్యుల మన కీయ మోక్షము భువిని రక్తమంత గార్చె ||యేసు|| *5 ఎన్నరాని పాపాత్ముల కన్నులారా కనికరించి పున్నెమైన తన ప్రాణము భువిని బలి పెట్టినాఁడు ||యేసు|| *6 ఒడలు నిండా గాయములతో నడరుచుండ మరల లేచి వెడలి పరమందునుండి వేడుకలు మా కంపినాఁడు ||యేసు|| *7 ఆశతోడ ఁదన్ను నమ్ము యాత్మలకు దర్శన మిచ్చెడి యేసుతో నింకెవరు సాటి లేశమైనా లేరు సుండీ ||యేసు|| === code 235 title పరిశుద్ధ గ్రంథము చొప్పున *ref పరిశుద్ధ గ్రంథము చొప్పున నిర్దోషిగ నడచువారలు పరలోకమునకు జేరుచుందురు ప్రభు సన్నిధిలో కాన్పింతురు *1 యేసుని వాక్యములన్నిటిన్‌ నీ హృదయములో భద్రపరచుము బండమీద కట్టిన గృహమువలె భద్రముగ నుందువు సంఘమా ||పరి|| *2 ద్రాక్షావల్లియైన క్రీస్తులో తీగవైన నీవు కట్టబడిన బహుగా ఫలించుచుందువు ఫలభరితంబుగా నుందువు ||పరి|| *3 మంచి గొఱ్ఱెల కాపరియైన యేసు కాపుదల క్రింద నీవు దొడ్డిలో జీవించుచుండిన తోడేళ్ళు నిన్ను జేరలేవు ||పరి|| *4 వెలుగైన యేసు మార్గమును వెంబడించుచుండుము సంఘమా అంధకార క్రియలు నీవు చేయవు వెలుగు బిడ్డవై తేజరిల్లుమా ||పరి|| *5 పునరుత్థాన జీవమైన క్రీస్తున్‌ పూర్ణమనస్సుతో ప్రేమించు నీతిమంతుల పునరుత్థానములో నిత్యజీవములో నివసింతువు ||పరి|| *6 సత్యమూర్తియైన క్రీస్తేసు శ్రీఘ్రముగా రానైయుండె సంధించుటకు శక్తి కొరకు సత్యమార్గములో నడువు సంఘమా ||పరి|| *7 సత్య సంఘంబు లన్నియున్‌ సత్య గ్రంథంబు చొప్పున జీవించవలెనని కోరి జీవమిచ్చి పోయె నేసు క్రీస్తు ||పరి|| *8 శ్రమలెన్నో సంఘము పైకి బహు శ్రీఘ్రముగ రానైయుండె హల్లెలూయ స్తోత్రములతో ఆనందించుచు ముందుకు సాగు ||పరి|| === code 236 title క్రైస్తవ సంఘమ క్రీస్తు జనమా *ref క్రైస్తవ సంఘమ క్రీస్తు జనమా క్రీస్తును కనుగొనుమా క్రీస్తును మీ రాజుగ నభిషేకిం చుట కిదె తరుణంబు క్రీస్తుకొరకు సాక్ష్యంబులివ్వ సేవింతము లెండి-రండీ నేడే క్రీస్తుడు మనలను కొనెను గావున క్రీస్తుని వారముగా క్రీస్తుకొరకు పరిమళవాసనగా జీవింతములెండీ *1 ఇల మీ దేహంబులు మన దేవుని కాలయములు గావా వెలయిచ్చెను మనకై కలువరిపై విలువగల రక్తముతోన్‌ కలుషజాలమును పారద్రోలిన ప్రభువును - జేరగను - రండీ నేడే గొనుమిదె రక్షణ భాగ్యము మనకై దెచ్చెను మన ప్రభువే యేసుక్రీస్తు పాదార విందములు సేవింతము లెండీ ||క్రైస్తవ|| *2 దేవుని వాక్యము మీ హృదయములలో నివసింపగ నిండు దేవుని పిల్లలుగా జీవించుట భాగ్యంబే గదా దైవభక్తిగలిగి నడచుట యిల ధన్యతయే గదా మనకు నిరతం పుణ్యుని ప్రాయశ్చిత్తపు బలియె ప్రవిమలులుగ జేయున్‌ పుణ్యుడేసు పరిశుద్ధుని రక్తము పావనులుగ జేయున్‌ ||క్రైస్తవ|| *3 ప్రభు రాజ్య వ్యాప్తికి కారణ సా ధనములు గనరండి ప్రభు సామ్రాజ్యము మన మధ్యనే స్థాపింపగ బూనండి ప్రభువుల ప్రభువునకు ప్రభుడేసునకే మహిమలు చెల్లింపన్‌ లెండి రండీ- ప్రభునకు స్తుతి యాగము నర్పించుట మన విధియె కాదా స్తోత్రపాత్రుడౌ-యేసు ప్రభునకే గీతము పాడండీ ||క్రైస్తవ|| === code 237 title మన పాపము మన శాపము *ref మన పాపము మన శాపము యేసు సిలువలో మోసెను కల్వరి సిలువలో సాతాను సైన్యమున్‌-కూల్చివేసెను *1 యేసు రక్తములో ముద్రించిన వారు బూర వూదగానే లోక పునాదులు వణికెన్‌ ||మన|| *2 విజయము పొందిన రాజు సైన్యముల ముందు నిలచే భయమేల మనకు జయము మనదే నిత్యం ||మన|| *3 సకల వాద్యములతో ఆయన జయమును పాడి సంతోష గానములతో పరిశుద్ధుల మధ్య నిలచి ||మన|| *4 శత్రు సమూహములను ఎఱ్ఱ సముద్రములోన ముంచి వేయబడగా శత్రుక్రియ లికలేవు ||మన|| *5 జయము జయము జయము ఎల్లవేళల జయము యేసు నామమునకే ఎల్లవేళల జయము ||మన|| === code 238 title యేసన్న స్వరమన్నా *ref యేసన్న స్వరమన్నా నీవెపుడైనా విన్నావా ...ఆ ...ఆ *1 జనముల శబ్ధము, జలముల శబ్ధము బలమైన ఉరుములతో కలిసిన స్వరము, పిలిచిన యేసు పిలిచిన పిలుపును నీవింటివా ||యే|| *2 ఏదేను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిలిచే యెహోవా యెదుటను ఆదాము దాగెను అటులనే నీవును దాగెదవా ||యే|| *3 పనులను వదలి, జనులను విడిచి నను కనుగొనుమనగా కనిపెట్టి నందునఘనుడ బ్రాహాముకు కనిపించె మనకన్న తండ్రి యేసే ||యే|| *4 ఆనాడు దేవుడు మోషేను పిలువగ ఆలకించెను స్వరము ఈనాడు నీవును ఈ స్వరము వినగ కానాను చేరగ కదలిరావా ||యే|| *5 ఆ రీతిగానే సమూయేలు వినగా ఆశీర్వాదమరసె ధారాళముగను పరమ వరుని దరిజేరుకొని నీవు సేవించుమా ||యే|| *6 సౌలా, సౌలా నన్నేల హింసింతువు చాలించు మనె స్వరము సౌలాధిపునంత సంధించగానే సద్భక్తుడై పౌలుగా మారెగా ||యే|| *7 స్వరమును వినగా పరమార్థ జ్ఞాని స్థిరుడైన యోహాను పరమ మర్మాలు, భవిష్యద్విషయాలు ప్రకటించె ప్రతిరోజు స్మరించుమా ||యే|| === code 239 title 1. వార్తలలో యేసు సువార్త *ref *1 వార్తలలో యేసు సువార్త నరుల విమోచన శుభవార్త శరణార్థుల ఆశ్రయవార్త ధరణిని వెలసిన ఘన వార్త నిరుపమ రక్షణ మార్గముగా మర్మము దెలిపిన జ్ఞానముగా కర్మను బాపు క్షమాపణగా ధర్మమునంతటిన్‌ నెరవేర్చి తరతరములు బ్రోచు సువార్త *2 జగతినిగాయు ప్రజాపతిగా నిగమముజాటిన యాగముగా విగతుల ప్రార్థన తుదిగతిగా యుగముల నోముల బహుమతిగా ఆగ్రహుడౌ ప్రభున్‌ శాంతింప ఉగ్రతపాత్రను త్రాగుటచే అగణిత రుధిర ప్రవాహములో భగవంతుని కృప ప్రసరించి భక్తులగను సిలువ సువార్త ||వార్త|| *3 పాపికి బదులుగా మరణించి శాపఋణములను చెల్లించెన్‌ అపవాదిని ఓడించుటచే అపరాజితునిగా మృతిగెల్చెన్‌ రిపులను వారసులుగ చేసి ఆప్తునిగా విలసిల్లుటచే ఉపవాదిగ దేవుని యెదుట తపనగ విజ్ఞాపన చేయు సఫలీకృత సిలువ సువార్త ||వార్త|| *4 ధర జీవితమున అభయములు పరమార్థములో విజయములు స్వర్గములో చిర సౌఖ్యములు పరమాత్ముని స్తోత్రార్పణలు మరియ సుతుని పునరాగమము అరయుచు ప్రియులతో మురియుటయు పరిశుద్ధుల సహవాసమును వరుడగు యేసుని పరిణయము పరిపూర్ణము చేయు సువార్త ||వార్త|| === code 240 title ఓ సంఘమా-సర్వాంగమా *ref ఓ సంఘమా-సర్వాంగమా పరలోక రాజ్యపు-ప్రతిబింబమా యేసయ్యను-ఎదుర్కొనగా నీతి నలంకరించి సిద్ధపడుమా ఓ సంఘమా వినుమా *1 రాణి ఓఫిరు అపరంజితో స్వర్ణవివర్ణ వస్త్ర ధారణతో వీణ వాయిద్య తరంగాలతో ప్రాణేశ్వరుని ప్రసన్నతతో ఆనందతైల సుగంధాభిషేకము పొందితివే యేసునందు *2 క్రీస్తే నిన్ను ప్రేమించెనని తన ప్రాణమునర్పించెనని స్వస్థపరచె నిర్దోషముగా ముడత కళంకములేనిదిగా మహిమయుక్తంబుగా నిలుప గోరె యేసువా సహింతువా తీర్పునాడు ||ఓ|| *3 చీకటిలో నుండి వెలుగునకు లోకంలో నుండి వెలుపలకు శ్రీ కర్త గుణాతిశయములను ప్రకటించుటకే పిలిచెనని గుర్తించు చుంటివా క్రియలను గంటివా సజీవముగా నున్నావా ||ఓ|| *4 చల్లగానైన వెచ్చగాను నుండిన నీకది మేలగును నులివెచ్చని స్థితి నీకుండిన బయటకు ఉమ్మివేయబడుదువేమో నీ మనస్సు మార్పుకో తొలి ప్రేమ కూర్చుకో ఆసక్తితో రక్షణ పొందుమా ||ఓ|| *5 కడపటి బూర మ్రోగగానే కనురెప్ప పాటున మారెదవా వడిగ మేఘాసీనుడవై నడియాకాశము పోగలవా గొఱ్ఱెపిల్ల సంఘమా క్రీస్తు రాజు సంఘమా రారాజు నెదుర్కొనగలవా ||ఓ|| === code 241 title మా యేసుక్రీస్తుని-మఱుఁగు గల్గెనురా *ref మా యేసుక్రీస్తుని-మఱుఁగు గల్గెనురా నా యాత్మ ఘన రక్షా నగము నెక్కెనురా *1 ముందు నాలో పాప-ములు జూడబడెరా డెందము తానన్ని టిని నొప్పుకొనెరా-యందుకై బలుదుఃఖమాత్మఁజెందెనురా సందేహములు వీడు-జాడఁగన్గొనెరా *2 సువిశేష బోధనా-చెవులాలించెనురా అవివేక శాస్త్రోక్తు-లంటు వీడెనురా నవసత్క్రైస్తవ గోష్ఠి-భువి నా కబ్బెనురా వివిధములగు వేల్పు-ల్విషమైరిగదరా *3 బాధగురువుల మోము-ల్బహు లజ్జఁబడెరా-గాధ మంత్రములన్ని కడగండ్లయి చెడెరా-శోధించి నా యాత్మ-శుద్ధి గోరెనురా-సాధించి ప్రభు క్రీస్తు-శరణఁజొచ్చెనురా *4 మతిలోని లోఁతు మ-ర్మము గానబడెరా మితిలేని ఘన-మే నిండు కొనెరా హితముగా తన జీవ-మిచ్చెక్రీస్తుఁడురా మృతి చేత మన పాప వితతి గొట్టెనురా *5 కులగోత్రముల బుద్ధి కుటిలంబుఁదెగెరా బలవత్పిశాచశృంఖలము విఱిగెనురా సిలువ మోసినవాని -చిర సౌఖ్యోన్నతిరా నెలవుగ నాలోన-నిలచియున్నదిరా *6 తనపోల్కెనొరులఁగన్గొనబ్రేమయ్యెనురా మనసు దేవునికి న-ర్పణ సేయఁబడెరా ఘన కృపశాంతులు-గొనెను నెమ్మదిరా మనసు మార్పడి మోక్ష మహిమ గన్గొనెరా === code 242 title ఇదిగో మీ రాజు-ఏతెంచుచున్నాడు *ref ఇదిగో మీ రాజు-ఏతెంచుచున్నాడు మీ తలలెత్తుడి సమీపమాయె-మీ విడుదల ధైర్యము నొందుడి *1 యుద్ధములు కలహములు వైరములు నిందలు హింసలు అపవాదులు అంతము వరకు సూచనలివియే మేల్కొని యుండుము ||ఇది|| *2 అక్రమము అవినీతి-ప్రబలును అందరి ప్రేమలు చల్లారును అంతము వరకు కాపాడు కొమ్ము మొదటి ప్రేమను ||ఇది|| *3 చిగురించుచున్నది అంజూరము ఏతెంచియున్నది వసంతము ఉరి యొచ్చునట్లు అందరిపైకి అంతము వచ్చును ||ఇది|| *4 ఎల్లప్పుడు ప్రార్థన చేయుచు మత్తును చింతను వీడుము విశ్వాస ప్రేమ నిరీక్షణల్‌ ధరించియుండుము ||ఇది|| === code 243 title 1. చాటించుడి మనుష్యజాతి *ref *1 చాటించుడి మనుష్యజాతి కేసు నామము చాటించుడి యవశ్యమేసు ప్రేమసారము జనాదులు విశేష రక్షణ సునాదము - విను పర్యంతము చాటుదము-చాటుదము చాటుదము-చాటుదము చాటుదము-చాటుదము శ్రీయేసు నామము *2 కన్నీళ్ళతో విత్తెడు వార లానందంబుతో నెన్నడు గోయుదురనెడి వాగ్దత్తంబుతో మన్నన గోరు భక్తులారా నిండు మైత్రితో - మానవ ప్రేమతో చాటుదము-చాటుదము చాటుదము-చాటుదము చాటుదము-చాటుదము చక్కని మార్గము *3 సమీపమందు నుండునేమో చావుకాలము సదా నశించిపోవు వారికీ సుభాగ్యము విధంబు జూపగోరి యాశతోడ నిత్యము విన్పించుచుందుము చాటుదము-చాటుదము చాటుదము-చాటుదము చాటుదము-సత్యసువార్తను === code 244 title పైనున్న ఆకాశమందున *ref పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన ||పై|| *1 అన్ని నామములకు పైన గలదు ఉన్నతంబగు యేసు నామము యేసు నామములో శక్తిగలదు(2) దుష్టులకు శాశ్వత ముక్తిగలదు(2) ||పై|| *2 యేసు నామము స్మరియించగానే మనసు మారి నూతన మగును భేదమేమియు-లేదెవ్వరికిని (2) నాథుని స్మరియింప తరింప (2) ||పై|| *3 యేసు నామములో శక్తిగలదు శాశ్వతానంద శాశ్వత శాంతము యేసు నామములో-రోగశుద్ధి (2) విశ్వసించిన-మోక్ష సమృద్ధి(2) ||పై|| === code 245 title యేసుని స్వీకరించు *ref యేసుని స్వీకరించు క్రీస్తేసుని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును *1 కనికరముగల దేవుండు నిను వాత్సల్యముతో విమోచించును భయంకరమైన పాపము నుండి విడిపింపనిన్ను వెదకివచ్చె ||యేసు|| *2 మన్నించు సర్వ పాపములన్‌ తానే మాన్పును సర్వరోగములన్‌ కృపకనికరముల మకుటము నీకు ధరియింపజేసి ఘనపరచున్‌ ||యేసు|| *3 అంధులకు దృష్టి కలుగజేసే అంగహీనులను లేపి నడువజేసెన్‌ పలువిధములగు వ్యాధి గ్రస్తులకు స్వస్థత నిచ్చెను తక్షణమే ||యేసు|| *4 పాపపు భారము భరియించెన్‌ నీ రోగములన్నిటి తొలగించన్‌ సహించెను కొరడా దెబ్బల బాధను జయించెను అన్ని శోధనలన్‌ ||యేసు|| *5 కలువరి సిలువలో వ్రేలాడి తన రక్తము చిందించె ధారలుగా చేతులలో తన కాళ్లలో చీలలు ముండ్ల కిరీటము ధరియించె ||యేసు|| *6 జీవమిచ్చుటకు ప్రాణమిడె మరి జయించెను ప్రతి విధ శోధనలు నీ కొరకై మరణించి లేచెను శక్తిమంతుడై నిను రక్షింప ||యేసు|| === code 246 title సాటిలేనిది యేసుని రక్తము *ref సాటిలేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమునే కడుగును *1 చూడుము సోదరా దేవుడు ఎంతో ప్రేమించె నీ జగతిన్‌ ప్రియుడా ప్రేమించె నీ జగతిన్‌ సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు యేసుని పంపెను ప్రియుడా యేసుని పంపెను ||సాటి|| *2 లోకమున కరుదెంచి క్రీస్తు ప్రభువు ప్రాణము బలిగా నిచ్చె ప్రియుడా ప్రాణము బలిగా నిచ్చె లోక పాపమెల్ల సిలువలో మోసి తొలగించె శాపముల్‌ ప్రియుడా తొలగించె శాపముల్‌ ||సాటి|| *3 వినుము సోదరా ప్రభు యేసు క్రీస్తుని పరలోక వార్తను ప్రియుడా పరలోక వార్తను ఉన్నతమైన పరలోక ప్రేమను చాటించుచుంటిమి ప్రియుడా చాటించు చుంటిమి ||సాటి|| *4 యేసుని నీవు క్షమించుమనివేడు విరిగిన హృదయముతో ప్రియుడా విరిగిన హృదయముతో యేసుని అమూల్యరక్తధారలే కడుగును పాపమెల్ల ప్రియుడా కడుగును పాపమెల్ల ||సాటి|| *5 పాప భారమును మోసికొని నీవు ప్రయాస మొందెదవా ప్రియుడా ప్రయాస మొందెదవా పాపమొప్పుకొని యేసు పాదముల చెంతకు చేరుమా ప్రియుడా చెంతకు చేరుమా ||సాటి|| *6 గతించుచున్నది స్వల్ప జీవితము శీఘ్రముగా రమ్ము ప్రియుడా శీఘ్రముగా రమ్ము కర్త యేసు నందు విశ్వాసముంచి రక్షణ పొందుము ప్రియుడా రక్షణ పొందుము ||సాటి|| *7 కృప, ఆనందము, పవిత్ర ప్రేమలో భాగము పొందుము ప్రియుడా భాగము పొందుము పాప సాగరము దాటించగలడు యేసు రక్షకుడే ప్రియుడా యేసు రక్షకుడే ||సాటి|| === code 247 title దేవుని వారసులం *ref దేవుని వారసులం ప్రేమ నివాసులము జీవన యాత్రికులం యేసుని దాసులము నవయుగ సైనికులం పరలోకపౌరులము హల్లెలూయ-నవయుగ *1 దారుణ హింసలలో దేవుని దూతలుగా ఆరని జ్వాలలలో ఆగని జయములతో మారని ప్రేమ సమర్పణతో సర్వత్ర యేసును కీర్తింతుము ||దే|| *2 పరిశుద్ధాత్మునికై ప్రార్థన సలుపుదము పరమాత్ముని రాక బలము ప్రసాదింప ధరణిలో ప్రభువును జూపుటకై సర్వాంగహోమము జేయుదము ||దే|| *3 అనుదిన కూటములు అందరి గృహములలో ఆనందముతోను ఆరాధనలాయే వీనులవిందగు పాటలతో ధ్యానము చేయుచు మురియుదము ||దే|| *4 సజీవ సిలువ ప్రభు సమాధి గెలుచుటచే విజేత ప్రేమికులం విధేయ బోధకులం నిజముగ రక్షణ ప్రబలుటకై ధ్వజముగ సిలువను నిలుపుదము ||దే|| *5 గోధుమ గింజవలె క్రీస్తుడు చావగను నాధుని మరణములో శాశ్వత జీవమును నిధులుగ పండించి తేవగను మాధుర్య రక్షణ లభియించెను ||దే|| *6 హత సాక్షుల కాలం అవనిలో చెలరేగ గతకాలపు సేవ గొల్గొత గిరి చేర భీతులలో బహురీతులలో నూతన లోకము కాంక్షింతుము ||దే|| *7 ప్రభువును చూచుటకై ప్రజలందరు రాగ విభు మహిమను గాంచ విశ్వమే మముగోర శుభములు గూర్చుచు మాలోన శోభిల్లు యేసును జూపుదము ||దే|| === code 248 title ఇదిగో నేనొక-నూతన క్రియను *ref ఇదిగో నేనొక-నూతన క్రియను చేయుచున్నాను ఈనాడే అది మొలచును దాని నాలోచింపరా *1 అడవిలో త్రోవను జేసి ఎడారిలో నదులను నేను ఎల్లప్పుడు సమృద్ధిగా వ్రవహింప జేసెదను ||ఇదిగో|| *2 నాదు ప్రజలు త్రాగుటకు నే నరణ్యములో నదులు సమృద్ధిగా పారునట్లు సృషించెదను నేను *3 అరణ్యములో జంతువులు కృార పక్షులు సర్పములు ఘనపరచును స్తుతియించును దీని నాలోచించుడి ||ఇదిగో|| *4 నూతన సృష్టిగ నినుజేసి నీ శాంతిని నదివలెజేసి నను జూచి మహిమ పరచి స్తుతి పాడ జేసెదను ||ఇదిగో|| *5 నేనే దేవుడనని దెలసి నా కార్యములను నెరవేర్చి ముందున్న వాటికన్న ఘన కార్యములను జేతున్‌ ||ఇదిగో|| *6 మరుగైన మన్నానిచ్చి మరి తెల్లని రాతినిచ్చి చెక్కెదనా రాతిమీద నొక క్రొత్త నామమును ||ఇదిగో|| *7 పరలోక భాగ్యంబులు నరలోకములో మన కొసగెన్‌ కరుణా సంపన్నుండగు మన ప్రభునకు హల్లెలూయా ||ఇదిగో|| === code 249 title సువార్తను చాటింప *ref సువార్తను చాటింప సుసమయం బిదియేను శ్రీయేసుని నామంబు ఎంతో మధురము మనకు *1 సంతసమున సాగెదము పురికొల్పుచు మనసులను సంకటములు ఎన్నయిన చనిపోవుటె మేలనుచు ||సువార్త|| *2 సిలువను మోయుచు భుజమున్‌ చేత సువార్తల బూని లోకమునకు చాటెదము ప్రశాంతుండగు యేసున్‌ ||సువార్త|| *3 శ్రీ యేసునికే యిలలో జయమార్భటించెదము జయశాలులుగా మేము జగదేవత నొణికింతుం ||సువార్త|| *4 ప్రవక్తలలో ఘనుడు పరమున దూతలు బొగడున్‌ నేత్రముల కాయన తార అరుణోదయ నక్షత్రం ||సువార్త|| *5 చిరునగవులతో మేము చిందింతుము రక్తమును హృదయములు ప్రకాశించున్‌ మనసానందం బిదియే ||సువార్త|| === code 250 title నా పేరే తెలియని ప్రజలు *ref నా పేరే తెలియని ప్రజలు ఎందరొ వున్నారు నా ప్రేమను వారికి ప్రకటింప కొందరె వున్నారు ఎవరైనా మీలో ఎవరైనా ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా ||నా|| *1 నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు మీరైనా-మీలో ఒకరైనా వెళతారా-నా ప్రేమను చెబుతారా ||నా|| *2 రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా వున్నారు మారు మూల గ్రామాలలో ఊరి లోపలి వీధుల్లో ఎవరైనా-మీలో-ఎవరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా ||నా|| *3 వెళ్ళ గలిగితే మీరు తప్పక వెళ్ళండి వెళ్ళలేక పోతే వెళ్ళే వారిని పంపండి ఎవరైనా-మీలో-ఒకరైనా వెళతారా-నా ప్రేమను చెబుతారా ||నా|| === code 251 title యెరుషలేములో గొఱ్ఱెల ద్వారము దగ్గర *ref యెరుషలేములో గొఱ్ఱెల ద్వారము దగ్గర బేతెస్థ కోనేరు కలదు-అందు మంటపములైదు చుట్టు గలవు *1 కుంటివారు గ్రుడ్డివారు ఊచకాలు సేతులు కలవారు గుంపులు గుంపులుగా అక్కడ పడియుండిరి ||యెరు|| *2 దేవదూత దిగువేళ నీళ్ళు కదలును ఆ నీళ్ళు కదలు వేళ రోగం బాగు పడును ఏ రోగి ముందు దిగునో ఆ రోగి బాగుపడును ||యెరు|| *3 ముప్పది ఎనిమిది యేండ్ల నుండి రోగి ఒక్కడు స్వస్థత నొందలేక అందు పడి యుండెను యేసు వచ్చి వానిని ముట్టి స్వస్థపరచెను ||యెరు|| *4 యేసు లేక లోకమందు మేలు ఉండదు ఏ మేలు ఉన్న లోకమందు శాంతి ఉండదు యేసు ఉంటే శాంతి ఉంది కాంతి ఉంటుంది ||యెరు|| === code 252 title ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా *ref ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా చింతలన్ని తీరెనయ్యా-నిన్ను చేరినా నా చింతలన్ని తీరెనయ్యా నిన్ను చేరినా ||ఎంత|| *1 సంతోషం ఎక్కడ వుందని సమాధాన మెచ్చట నాకు దొరికేనని జగమంతా వెదికాను జనులందరి నడిగాను చివరికది నీలోనే కనుగొన్నాను ||ఎంత|| *2 ప్రేమనేది ఎక్కడ ఉందనీ క్షమ అనేది ఎచట నాకు దొరికేనని బంధువులలో వెతికాను స్నేహితులను అడిగాను చివరికది నీలోనే కనుగొన్నాను ||ఎంత|| *3 సత్యమనేది ఎక్కడ ఉందనీ నిత్య జీవమనేది ఎచట నాకు దొరికేనని ఎందరికో మ్రొక్కాను ఏమేమో చేశాను చివరికది నీలోనే కనుగొన్నాను ||ఎంత|| *4 నెమ్మదనేది ఎక్కడ ఉందని శాంతనేది ఎక్కడ నాకు దొరికేనని దిశలన్ని తిరిగాను యాత్రలెన్నో చేశాను చివరికది నీలోనే కనుగొన్నాను ||ఎంత|| === code 253 title యెహోవా నాకు వెలుగాయె *ref యెహోవా నాకు వెలుగాయె యెహోవా నాకు రక్షణాయె నా ప్రాణదుర్గమాయె నేను ఎవరికి ఎన్నడు భయపడను (2) *1 నా తల్లియు-నా తండ్రియు ఒకవేళ విడిచినను ఆపత్కాలమున-చేయి విడువకను యెహోవా నన్ను చేరదీయును ||యె|| *2 నా కొండయు-నా కోటయు నా ఆశ్రయము తానే నేనెల్లప్పుడు-ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను ||యె|| *3 నాకు మార్గమును-ఉపదేశమును ఆలోచన అనుగ్రహించి నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడుము ||యె|| === code 254 title రుచి చూచి యెరిగితిని *ref రుచి చూచి యెరిగితిని యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని ||రుచి|| *1 గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడ వీవే తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే ||రుచి|| *2 మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడా మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములన్‌ ||రుచి|| *3 మంచి తనము గల దేవా అతి శ్రేష్టుడవు అందరిలో ముదమార పాడెద నిన్ను అతి సుందరుడ వనియు ||రుచి|| *4 నా జీవిత మంతయును యెహోవాను స్తుతియించెదను నా బ్రతుకు కాలములో నా దేవుని కీర్తింతున్‌ ||రుచి|| *5 సంతోషింతు నెల్లప్పుడు కష్ట దుఃఖ బాధలలో ఎంతో నెమ్మది నిచ్చు నా రక్షకుడు నా యేసు ||రుచి|| *6 ప్రార్థింతును యెడ తెగక ప్రభు సన్నిధిలో చేరి సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని ||రుచి|| *7 కృతజ్ఞత చెల్లింతు ప్రతి దాని కొరకు నేను క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను ||రుచి|| === code 255 title జీవజల ప్రవాహములు పారుచున్నవి *ref జీవజల ప్రవాహములు పారుచున్నవి పరిశుద్ధాత్మ వరములతో సాగుచున్నవి యేసుక్రీస్తు నాయకుడై సాగుచున్నవి అదే అదే సార్వత్రిక క్రైస్తవ సహవాసము హల్లెలూయ పాటలతో అలరారుచున్నది ||జీవ|| *1 దేవుడే దీని శిల్పి యీ భువిలో ఆయనే దీనిని నిల్పి విశ్వమంత యీ జలములు ప్రవహింపగ జేసెను కులము మతము భాషాబేధములు లేనిదీ అదే అదే సార్వత్రిక క్రైస్తవ సహవాసము హల్లెలూయ పాటలతో అలరారుచున్నది ||జీవ|| *2 ఈ నది ఓరన నాటబడిన క్రైస్తవా నెలకు మూడు కాపులుగా విరబూయుమురా కలువరిగిరి సిలువ జ్వాలవై కొనసాగుమురా అదే అదే మార్గము క్రీస్తు జీవమార్గము ||జీవ|| *3 మరువబోకుమోయి మన యేసు ప్రేమను కలువరిలో చిందించిన ప్రేమామృతమును కడదాక దానిని-విడువబోకుము అదే అదే మోక్ష మార్గము పరమునకు సాక్షి మార్గము ||జీవ|| === code 256 title ఇది ప్రజ్వరిల్లుచున్న-ఉజ్జీవ జ్వాల *ref ఇది ప్రజ్వరిల్లుచున్న-ఉజ్జీవ జ్వాల ప్రభుయేసు సిలువ నుండి ప్రవహించుధార పవిత్రమై-పరిశుద్ధమై ప్రవహించు జీవధార *1 మౌన ప్రార్థన-మోకాటి ప్రార్థన కన్నీటి ప్రార్థన-ఉపవాస ప్రార్థన సిలువ శక్తితో-విలువైన భక్తితో సిలువ సాక్షిగా-శ్రీయేసు సాక్షిగా ||ఇది|| *2 విశ్వాసఘాతకుల్‌-విద్రోహ చర్యలు విచిత్ర మనుజుల-విషమైన మనసులు సాతాను యుక్తులు-సహించి నేటికి సాగిపోతుంది-సజీవసాక్షిగా ||ఇది|| *3 ఎల్లలు దాటింది శ్రీ యేసు సువార్త ఎంత ప్రయాణం-ఎంతెంత దూరము ఎన్ని మేలులు-ఎన్నెన్ని దీవెనల్‌ పొందినవారంతా-దీవించబడితిరి ||ఇది|| *4 లేచి తేజరిల్లింది ప్రభు సహవాసం ఒంటరి వాడయ్యాడు వేలమందిగా ఎండిన భూమిపై జీవజలములు దప్పిక గలవారిపై కుమ్మరించాడు ||ఇది|| === code 257 title తరుణమిదే-తరుణమిదే *ref తరుణమిదే-తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకము చేరుటకు ఆ నరకము తప్పుటకు *1 నీ ఆయువు నాలోచించుము నీ బ్రతుకును ఆలోచించుము నీ పాప ఫలితమెపుడో బహు భయంకర నరకమయా||తరు|| *2 నీ పాపపు పరుగులతో ప్రళయాగ్నిలో చేరెదవా పరలోకపు మార్గమును తిరస్కారము చేసెదవా ||తరు|| *3 నీ కొరకై శ్రీ యేసు ఆ సిలువలో బలియాయెన్‌ నీ రక్షణ గోరి సదా సువార్తను వినిపించెన్‌ ||తరు|| *4 ప్రభు యేసుని రక్తములో పరిశుద్ధుడవై ధరలో పరమానందము నొందన్‌ త్వరపడిరా ప్రార్థింపన్‌ ||తరు|| *5 కృప కాలము దాటగనే అపాయపు దినములలో మనుజాళికి మహ శ్రమలు కనిపించదు ఆశ్రయము ||తరు|| *6 నీ దేవుని సన్నిధిలో కనబడుటకు సిద్ధపడుమా నేడే రక్షణ దినము లోక కీడును విడచి రమ్ము ||తరు|| === code 258 title దొరుకుతావురా సహోదరా! *ref దొరుకుతావురా సహోదరా! దొరుకుతావురా - నీవు తరిమి తరిమి కీడు చేయ పరుగులెత్తిన గాని తుదకు *1 చిన్న చూపుచూచి తమ్ముని కన్నెరుంగక చంపినగాని అన్న కయీను దేవుని హస్తమునకు దొరికినరీతిగా ||దొరు|| *2 వరములొందిన తమ్ముని జంప వలయునని పంతము పగబట్టి నరకవచ్చి లోబడి ఏడ్చిన దురిత చరితుని ఏశావువలె ||దొరు|| *3 విగ్రహమునకు మ్రొక్కనిదైవ పిల్లల నగ్నిలో పడవైచి ఆగ్రహించిన నెబుకద్నెజరు గడ్డి మేసి దొరికిన విధముగ ||దొరు|| *4 చెడుగుచేసి పరులు దానిని చేసినారని చెప్పియున్న వడిగ దేవుని న్యాయమనెడి పరమ త్రాసులో నిలువబడి ||దొరు|| === code 259 title విశ్వాసి నీలోనీవే-విమర్శ చేసికొనుమా *ref విశ్వాసి నీలోనీవే-విమర్శ చేసికొనుమా విశ్వాస పూరిత హృదయ ముండెనో లేదో నీకు *1 సేవచేయుచుంటి వటంచు సంతసించు చుంటివేమో కొయ్యకాలు కఱ్ఱ గడ్డి కాలురీతిగా నున్నదేమో ||విశ్వాసి|| *2 పదిమంది కన్యకలేమో పిలువబడిరి పెండ్లి విందుకు పోలేక పోయి రందు ఐదుగురు అజాగ్రత్తచే ||విశ్వాసి|| *3 మునుపున్న రీతిగానే నేడుంటినని సంసోను యెరుగలేక దేవుని విడుపు పొందెనోయి అంధత్వమును ||విశ్వాసి|| *4 విస్తారమగు పనులెన్నో వేసికొనియె మన మార్తమ్మ ఉత్తమమగు దారిలో నున్నావో లేదో నీవు ||విశ్వాసి|| *5 నీ విధిని మరచి నీవు పాతిపెట్టి నావ తలాంతు దొంగ వచ్చినట్లు వచ్చి దండించు నేమో నిన్ను ||విశ్వాసి|| *6 నీ జీవిత లక్ష్యమేమి నీకున్నదీక్ష యేమి గురిలేని పోరాటములో గడచు చుండె నేమో కాలం ||విశ్వాసి|| === code 260 title ఓహో క్రైస్తవుడా-జయ జీవితమేది *ref ఓహో క్రైస్తవుడా-జయ జీవితమేది జల్లించెను సాతాను నిన్ను జారితివే మరి వేసారితివే ||ఓహో|| *1 విజయముగా బ్రతుకను వృజినమున నిజదైవము నిను సృజి యించెనుగా జారితివే వేసారితివే - వెనుకాడియు వేషము విడువవా ||ఓహో|| *2 సాతానుని ఒడిలో నిదురించి సర్వేశుని బోధలు ఎదిరించి మానసము మసిగారినను మలినమును మలుపగలేవా ||ఓహో|| *3 గద్దించెడు మనస్సాక్షిని ద్రోసి ఘనదేవుని మార్గములను రోసి దాస్యమను ధనమోహమును దాహముతో త్రాగెదవేమి? ||ఓహో|| *4 ఆత్మలో ఆనందము అణగారి ఆవేశము లేకను దిగజారి అన్నిటిలో నే నధికుడ ననుచు ఆర్భాటము చేసెదవేమి? ||ఓహో|| *5 ఎన్నో మేలులు తరుణములు యేసుడు నీకివ్వగ కరుణించి తామసము మరి జేయుదువా తండ్రి కౌగిలి జేరవా ||ఓహో|| === code 261 title ఓ మానవుండ నీ గతి *ref ఓ మానవుండ నీ గతి ఏమౌనో తెలియునా ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా? ఆహా ఆ... *1 ఆ అంత్యతీర్పున యేసూ నీ రక్షకుడే మహా భయంకరమగు సింహంబుగా నుండు ||ఆహా|| *2 లోకాలు పుట్టినప్పటి నుండి మృతులైన ఏకులజుడైన నాటికి తీర్పులో నిలుచును ||ఆహా|| *3 మృతులైన ఘనులు హీనులు యేసయ్య యెదుటను ప్రతివారు నిలచియుందురు బ్రతికినరీతిగనే ||ఆహా|| *4 గ్రంథాలు విప్పబడగ గ్రంథాలలో వారి గ్రంథంబు బట్టబయలై పొందుదురు తీర్పును ||ఆహా|| *5 నరులెల్ల క్రియల చొప్పున మరి తీర్పుపొందుదురు మరణము మృతుల లోకము గురియౌను అగ్నికి ||ఆహా|| *6 ఈనాడు నీవు కూడను యేసుని విడచినచో ఆనాడు నీవు కూడను అందుండి యేడ్చెదవు ||ఆహా|| *7 దేవుని జీవగ్రంథము దేవుడు తెరచును ఎవ్వని పేరందుండదో వాడగ్నిలో బడును ||ఆహా|| === code 262 title నీ జీవితములో గమ్యంబు ఏదో *ref నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మర్పించవా ||నీ|| *1 నీ తల్లి గర్భమున నీ వుండినపుడే నిను చూచె ప్రభు కన్నులు యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించె తన చేతులు ||నీ|| *2 నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను హృదయంబు తలుపు తెరువంగ లేవా యేసు ప్రవేశింపను ||నీ|| *3 తన చేతులందు రుధిరంపు ధారల్‌ స్రవియించె నీ కోసమే భరియించె శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా ||నీ|| *4 ప్రభుయేసు నిన్ను సంధించునట్టి సమయంబు ఈనాడెగా ఈ చోటనుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరీ ||నీ|| === code 263 title న్యాయాధిపతియైన దేవుడు *ref న్యాయాధిపతియైన దేవుడు నిను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుందువు యోచించుకో.. ఓ క్రైస్తవా *1 ఆకలితో అలమటించగా దాహముతో తపియించగా (2) రోగముతో, కృశియించగా నను చేర్చుకొనలేదు నీ వెందుకు? అని యేసు నిన్నడిగిన-యేమందువు *2 గొఱ్ఱెలనే నీతిమంతులు మేకలనే పాపాత్ములు (2) మందలుగా విభజించగా ఏ వైపున నీవు నిలిచి యుందువు? అని యేసు నిన్నడిగిన-యేమందువు? *3 గొఱ్ఱెలకు నిత్య జీవము మేకలకు నిత్య నరకము ప్రతిఫలముగా నీకొసగునుగా ఈ రెంటిలో ఏది నీ స్థానము? అని యేసు నిన్నడిగిన-యేమందువు === code 264 title 1 నరకమనునది-నిరంతముండునయో *ref *1 నరకమనునది-నిరంతముండునయో ఆ ఘోర నరకము-నందు పాపులు బాధపడుదురయో మరియు నగ్ని పురుగులందున-కొరుకుచుండును తరుగులేకను ధరణికాదిది దరియుకాదు మరణమెదికిన దొరకదందున *2 గప్పుగప్పున రగులుచుండునయ్యో ఆ ఘోరనరకము నిప్పులెగయుచు పొంగుచుండునయ్యో మబ్బువలె పొగ పైకి లేచును- అబ్బ! అబ్బని యేడ్చుచుందురు బొబ్బలిడుదురు అడ్డమొచ్చెడి అబ్బలెవ్వరు కానరందున ||నరక|| *3 నోరు నెత్తి కొట్టుకొందురయ్యో ప్రభు యేసు క్రీస్తును నమ్మనందుకు నొచ్చుకొందురయ్యో పురుగు చావదు అగ్ని ఆరదు కొరుకుచుందురు-పండ్లు పటపట తిరిగితిరిగి చూచుచుందురు- పరుగులెత్తక యేడ్చు చుందురు ||నరక|| === code 265 title ఓ మానవుడా-పాపమనే విషమున్నది *ref ఓ మానవుడా-పాపమనే విషమున్నది యీ లోకములో యేసు మాట వినరమ్ము మానవుడా *1 రాజును రారాజునని విఱ్ఱవీగకు ఈ లోక వైభవములు ఒక్క నాటికే ప్రతి మనిషి ఒకనాడు చనిపోవలెను నీ క్రియలను బట్టియే నీకు ప్రతిఫలము ||ఓ|| *2 అందము నాకున్నదని ఆర్భటించకూ నీ వయస్సు నడిప్రాయము వాడిపోవును నీవేమి చేయుచూ-తిరుగుచుంటివో నీ క్రియలను బట్టియే నీకు ప్రతిఫలము ||ఓ|| *3 ధనము ధనము ధనమని ధనములో పడిపోకుము ఒంటె సూది బెజ్జములో దూరుట సులభం ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట ఎంతో-దుర్లభము ||ఓ|| === code 266 title ఓ మానవా ఒకసారి *ref ఓ మానవా ఒకసారి ఆలోచించుము నీ జీవితం రేపు ఏమి సంభవించునో నీకు తెలియదురా వెఱ్ఱి మానవా ఓ మానవా ఆ...ఆ... ||ఓ|| *1 ఎండిపోయే గడ్డివంటా రాలిపోయే పూవువంటా చేద నుండి జారే బిందువంటా సాగిపోయే నీడవంటా త్రాసు మీద ధూళివంటా మానవా పగిలి మట్టి కుండవంటా ||ఓ|| *2 నీ జీవము కొంత సేపు కనబడే అంతలోన మాయమై పోయెను ఆవిరివంటా ఎగిరి పోదుమా కానరాని దుమ్మువంటా నీ జీవితం మాయరా మానవా నీ బ్రతుకే మాయరా ఓ మానవా ||ఓ|| *3 నీలో ఉన్న ఆత్మ మంట దేవుడు పెట్టిన దీపమంటా ఆ దీపము ఆరిపోయినా మరలా మండదురా ఏనాడైనా దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో యేసయ్యను నమ్ముకోరా మానవా పరలోకం చేరుకోరా మానవా... మానవా... === code 267 title రేయింబవళ్ళలోన వెళ్లేటి త్రోవలోన *ref రేయింబవళ్ళలోన వెళ్లేటి త్రోవలోన యేసయ్య నేల మరతువు అయ్యయ్యో... క్షణంబులో లోకంబు విడుతువు ||రేయి|| *1 ఎక్కడి కోయీ యాత్ర పోయేది నీ యిల్లు స్థిరముగాదు నీ ఒళ్ళు మరిచెదవు నీ వచ్చిన దారినే వెళ్ళిపోవాలి, మళ్ళీ పోవాలి ||రేయి|| *2 యేసయ్య దారిలో ఎడారిలేదు ఇరుకైన దారిలోన బరువైన కాడితోను ప్రార్థన ఖడ్గముతోను బయలుదేరాలి, ప్రభుని చేరాలి ||రేయి|| *3 బానిస పిల్ల మాటలు నమ్మి అన్యుడైన నయమాను అప్పుడె మార్పు నొందేనోయి లోకాశ గేహాజికి లోటు తెచ్చెనోయి గొప్ప కుష్టు తెచ్చెనోయి ||రేయి|| *4 సొదొమ, గొమొఱ్ఱా చోద్యము చూడ లోతు భార్య ఆనాడు లోకాశకు లోబడి ఊరి వెలుపల ఉప్పు స్థంభమాయె గొప్ప స్థంభమాయె ||రేయి|| *5 కయ్యమునకై కాలు దువ్వుచు గొల్యాతను శూరుడు ఆరుమూర్ల జానెడు దేవుని ధిక్కరించి ముక్క చెక్కలాయె చెక్కముక్కలాయె ||రేయి|| *6 నోవహు ఓడ నేటికి జూడ నమ్మిన వారేమైనారో నమ్మని వారేమైనారో ఆనాటి సాక్ష్యము అక్కడే ఉన్నది, కనబడుచున్నది ||రేయి|| === code 268 title అమూల్య రక్తము ద్వారా *ref అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనతా మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము *1 మన యౌవన జీవితముల్‌ శరీరాశలకు లోబరచి చెడుమాటలను పలుకుచు శాంతి లేక యుంటిమిగా ||అమూ|| *2 చెడు మార్గమున బోతిమి దాని యంతము మరణము నరక శిక్షకు లోబడుచు పాపపు ధనము పొందితిమి ||అమూ|| *3 నిత్య సత్య దేవుని నామమున మొరలిడక స్వంత నీతి తోడనే దేవుని రాజ్యము కోరితిమి ||అమూ|| *4 కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చెను ప్రాణము సిలువను బలి చేసి మనల విమోచించెను ||అమూ|| *5 తన రక్త ధారలలో మన పాపములను కడిగి మన కన్నులను తెరచి మనల నింపెను జ్ఞానముతో ||అమూ|| *6 పాపులమైన మన మీద తన యాశ్చర్య ఘన ప్రేమ కుమ్మరించెను మన ప్రభువు కృతజ్ఞత చెల్లింతుము ||అమూ|| *7 మన రక్షకుని స్తుతించెదము మనలను జేసెను ధన్యులుగా మన దేవుని కర్పించెదము ఆత్మ జీవ శరీరములన్‌ ||అమూ|| === code 269 title అలలపైనే నడచిన నాదు *ref అలలపైనే నడచిన నాదు యేసయ్యా నాదు యేసయ్యా గలిబిలిని నా కలవరములను తొలగజేసిన కలుషహారుడా ఆదుకోవయ్యా నాదు యేసయ్యా *1 శుద్ధుడా నీ పిలుపు వింటిని అద్దరికినే పయనమయితిని (2) ప్రొద్దుపోయెను భయములాయెను ఉద్ధరించగా స్వామిరావా ||ఆదు|| *2 నట్టనడి సంద్రాన రేగెను అట్టహాసపు పెనుతుఫాను (2) గట్టు చూడగా చాలా దూరము ఇట్టి శ్రమలలో చిక్కుకొంటిని ||ఆదు|| *3 అలలు నాపై విసరి కొట్టగా నావ నిండుగా నీరు చేరెను (2) బ్రతుకుటెంతో భారమాయెను రేవు చేరే దారి లేదే ||ఆదు|| *4 మాట మాత్రపు సెలవు చేత సూటిగా అద్భుతములెన్నో (2) చాలా చేసిన శక్తిమంతుడా జాలి చూపి మమ్ము బ్రోవుమా ||ఆదు|| *5 చిన్న జీవిత నావనాది నిన్నే గురిగా పయనమయినది (2) ఎన్నో శోధన లెన్నో భయములు కన్న తండ్రి కావరావా ||ఆదు|| === code 270 title గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ *ref గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండీ *1 సర్వాధికారియు-సర్వోన్నతుండైన మన తండ్రిని ఘనపరచి మనముత్సహించెదము ||గొఱ్ఱె|| *2 సిద్ధపడెను వధువు-సుప్రకాశముగల నిర్మల వస్త్రములతో నలంకరించుకొనెన్‌ ||గొఱ్ఱె|| *3 పరిశుద్ధుల నీతి-క్రియలే యా వస్త్రములు గొఱ్ఱెపిల్ల రక్తములో శుద్ధినొందినవారు ||గొఱ్ఱె|| *4 తెల్లని గుఱ్ఱముపై-కూర్చుండినవాడు నమ్మకమైయున్నట్టి పెండ్లి కుమారుడు ||గొఱ్ఱె|| *5 దేవుని వాక్యమను-నామము గలవాడు రక్తములో ముంచిన వస్త్రమున్‌ ధరియించె ||గొఱ్ఱె|| *6 పరలోక సేనలు-తెల్ల వస్త్రములతో తెల్ల గుఱ్ఱముల నెక్కి వెంబడింతురు ప్రభుని ||గొఱ్ఱె|| *7 ప్రేమించి సంఘముకై ప్రాణంబు నిడె ప్రభువు పరిశుద్ధ పరచుటకై తానప్పగించుకొనెన్‌ ||గొఱ్ఱె|| *8 శ్రీ యేసు క్రీస్తుండె సంఘమునకు శిరస్సు వాక్య ఉదకముతోడ శుద్ధి పరచుచుండె ||గొఱ్ఱె|| *9 యెహోవ రాజ్యములో భూలోకవాసులు సంతోష హృదయములతో తేజరిల్లెదరు ||గొఱ్ఱె|| *1 దేవా! యీ కార్యములు నెరవేర్చితివి నీవె నిత్యమును నీ మహిమ పాడెద హల్లెలూయ ||గొఱ్ఱె|| === code 271 title దేవర నీ దీవెనలు *ref దేవర నీ దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగ వేగమే దిగనిమ్ము పావన యేసుని ద్వారగను ||దేవర|| *1 దంపతులు దండిగ నీ ధాత్రిలో వెలయుచు సంపదలన్‌ సొంపుగ నింపుగ పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై ||దేవర|| *2 ఈ కవను నీ కరుణన్‌ ఆకరువరకును లోకములో శోకము లేకయె యేకముగా బ్రాకటముగను జేకొనుము ||దేవర|| *3 ఇప్పగిది నెప్పుడును గొప్పగు ప్రేమతో నొప్పుచు దా మొప్పిన చొప్పున దప్పకను మెప్పుగ బ్రతుకగ బంపు కృపన్‌ ||దేవర|| *4 తాపములు పాపములు మోపుగ వీరిపై రాకుండగా గాపుగ బ్రాపుగ దాపునుండి యాపద లన్నియు బాపుచును ||దేవర|| *5 సాధులుగన్‌ జేయుటకై శోధనలచే నీవు శోధింపగా కదలక వదలక ముదమున నీ పాదము దాపున బాదుకొనన్‌ ||దేవర|| *6 మెండుగ భూమండలపు గండములలో వీరుండగను తండ్రిగ దండిగ నండనుండి వెండియు వానిని ఖండించవే ||దేవర|| *7 ఇద్ధర వీరిద్దరును శుద్ధులై నిన్ను సేవించుటకై శ్రద్ధతో బుద్ధిగ సిద్ధపడన్‌ దిద్దుము నీ ప్రియ బిడ్డలుగాన్‌ ||దేవర|| *8 వాసిగ నీ దాసులము చేసిన యీ మొఱల్‌ దీసికొని మా సకలేశ్వర నీ సుతుడౌ యేసుని పేరట బ్రోవుమామేన్‌ ||దేవర|| === code 272 title మంగళమే యేసునకు *ref మంగళమే యేసునకు మనుజావతారునకు శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి ||మంగళ|| *1 పరమ పవిత్రునకు వర దివ్య తేజునకు నిరుప మానందునకు నిపుణ వేద్యునకు ||మంగళ|| *2 దురిత సంహారునకు వర సుగుణోదారునకు కరుణ సంపన్నునకు జ్ఞాన దీప్తునకు ||మంగళ|| *3 సత్య ప్రవర్తునకు సద్ధర్మ శీలునకు నిత్య స్వయంజీవునకు నిర్మలాత్మునకు ||మంగళ|| *4 యుక్త స్తోత్రార్హునకు భక్త రక్షామణికి సత్య పరంజ్యోతి యగు సార్వభౌమునకు ||మంగళ|| *5 పరమ పురి వాసునకు నరదైవ రూపునకు పరమేశ్వర తనయునకు ప్రణుతింతుము నీకు ||మంగళ|| === code 273 title క్రిస్మస్‌ పాపకు హోసన్న యనుచు *ref క్రిస్మస్‌ పాపకు హోసన్న యనుచు క్రీస్తుకు పాటలు పాడుదమా కిన్నెర వీణెల రావంబుల గుడి గంటల గజ్జెల శబ్దంబులు మహానందముతో నుప్పొంగుచును మరిగంతులు వేయుచు పాడుదమా! *1 పరమును విడిచిన ఆ బాలుడు పశు పాకలో పుట్టెను ఈ రాత్రిలో మరి వెళ్ళుదమా జోల పాడుదమా మన ప్రభువును గూడి ఆడుదమా *2 గొల్లలు జ్ఞానులు ఏతెంచిరి మ్రొక్కి బంగరు బోళములర్పించిరి సమర్పించెదమా మన హృదయములన్‌ సద్దేవుని చూచి వచ్చెదమా *3 కిన్నెర వీణెల రావంబులు గుడి గంటల గజ్జెల శబ్దంబులు మహానందముతో నుప్పొంగుచును సద్భక్తుని చూచి వచ్చెదమా === code 274 title శ్రీ యేసుండు జన్మించె రేయిలో *ref శ్రీ యేసుండు జన్మించె రేయిలో నేడు పాయక బెత్లెహేమ యూరిలో *1 కన్నియ మరియమ్మ-గర్భమందున నిమ్మానుయేలనెడి-నామమందున||శ్రీ|| *2 సత్రమందున బశువుల-సాలయందున దేవపుత్రుండు-మనుజుండాయె నందున *3 పట్టి పొత్తి గుడ్డలతో-జుట్టబడి పశుల తొట్టిలో-బరుండ బెట్టబడి ||శ్రీ|| *4 గొల్లలెల్లరు-మిగుల భీతిల్లగ దెల్పె గొప్ప-వార్త దూత చల్లగ ||శ్రీ|| *5 మన కొరకొక్క-శిశువు పుట్టెను ధరను మన దో-షముల బోగొట్టను *6 పరలోకపు-సైన్యంబు గూడెను మింట వర రక్ష-కుని గూర్చి పాడెను *7 అక్షయుండగు-యేసు వచ్చెను మనకు రక్షణంబు సిద్ధ పర్చెను ||శ్రీ|| === code 275 title వినరే యో నరులారా *ref వినరే యో నరులారా వీనుల కింపుమీర మనల రక్షింప క్రీస్తు మనుజావతారుఁడయ్యె వినరే అనుదినమును దేవుని తనయుని పద వనజంబులు మన మున నిడికొనుచును ||వినరే|| *1 నరరూపు ఁబూని ఘోర నరకుల రారమ్మని దురితముఁ బాపు దొడ్డ దొరయౌ మరియా వరపుత్రుడు కర మరుదగు క-ల్వరి గిరి దరి కరి-గి రయంబున ప్రభు కరుణను గనరే ||వినరే|| *2 ఆనందమైన మోక్ష మందరి కియ్య దీక్ష బూని తనమేని సిలువ మ్రాను నణఁచి మృతి బొందెను దీనదయాపరుఁడైన మహాత్ముఁడు జానుగ యాగము సలిపిన తెరంగిది ||వినరే|| *3 పొందు గోరిన వారి విందా పరమోపకారి యెంద రెందరి బరమా నంద పద మొందగ జేసెను అందమునన్‌ దన బొంది సురక్తము జిందెను భక్తుల డెందము గుందఁగ ||వినరే|| *4 ఇల మాయావాదుల మాని ఇతడే సద్గురు డని తలపోసి చూచి మతి ని-శ్చల భక్తిని గొలిచిన వారికి నిల జనులకు గలుముల నలరెడు ధని-కుల కందని సుఖ-ములు మరి యొసగును ||వినరే|| *5 దురితము లణఁప వచ్చి మరణమై తిరిగి లేచి నిరత మోక్షానంద సు-ందర మందిరమున కరుదుగ జనె బిరబిరమన మం-దర మా కరుణా-శరనిధి చరణమె శరణని పోదము ||వినరే|| === code 276 title రక్షకుండుదయించినాఁడట *ref రక్షకుండుదయించినాఁడట మన కొరకుఁ బరమ రక్షకుం డుదయించినాఁడట రక్షకుం డుదయించినాఁడు రారె గొల్ల బోయలార తక్షణమునఁ బోయి మన ని-రీక్షణ ఫల మొందుదము ||ర|| *1 దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు దేవుఁడగు యెహోవా మన దిక్కుఁదేరి చూచినాడు ||రక్ష|| *2 గగనము నుండి డిగ్గి ఘనుఁడు గబ్రియేలు దూత తగినట్లు చెప్పె వారికి మిగుల సంతోష వార్త ||రక్ష|| *3 వర్తమానము జెప్పి దూత వైభవమున పోవుచున్నాడు కర్తను జూచిన వెనుక కాంతుము విశ్రమం బప్పుడు ||రక్ష|| *4 పశువుల తొట్టిలోన భాసిల్లు వస్త్రముల జుట్టి శిశువును కనుగొందురని శీఘ్రముగను దూత తెల్పె ||రక్ష|| *5 అనుచు గొల్ల లొకరి కొక రానవాలు జెప్పుకొనుచు అనుమతించి కడకు ఁ క్రీస్తు నందరికిని దెల్పినారు ||రక్ష|| === code 277 title చింత లేదిక యేసు పుట్టెను *ref చింత లేదిక యేసు పుట్టెను వింతగను బేత్లెహేమందున చెంత జేరను రండి సర్వ జనాంగమా సంతస మొందుమా ||చింత|| *1 దూత దెల్పెను గొల్లలకు శుభ-వార్త నా దివసంబు వింతగా ఖ్యాతి మీరగ వారు యేసును గాంచిరి స్తుతు లొనరించిరి ||చింత|| *2 చుక్క గనుగొని జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభుని గనుగొన చక్కగా బెత్లేము పురమున జొచ్చిరి కానుకలిచ్చిరి ||చింత|| *3 కన్య గర్భమునందు బుట్టెను కరుణ గల రక్షకుడు క్రీస్తుడు ధన్యులగుటకు రండి వేగమె దీనులై సర్వ మాన్యులై ||చింత|| *4 పాప మెల్లను పరిహరింపను పరమ రక్షకుడవతరించెను దాపు జేరిన వారి కిడుగడు భాగ్యము మోక్ష భాగ్యము ||చింత|| === code 278 title సంతోషించుడి-యందరు నాతో *ref సంతోషించుడి-యందరు నాతో సంతోషించుడి యొక- వింతయగు కీర్తనఁ బాడ వచ్చితిని-సంతోషించుడి-నాతో *1 అంధకార మయమైన భూమి నా-ద్యంతము వెలిగింప దాని యావేశము దొలగింప వందితుండు క్రీస్తేసు నాథుడు వచ్చె బ్రకాశుండై భూమికి-నిచ్చె ప్రకాశంబు ||సంతో|| *2 కాన నంధకారంబు దొలగఁ ప్రకాశించెను లెండు మీరు ప్రకాశింపను రండు మానవులనుసంతోషపర్చనై మహిని నవతరించె భక్తుల మనము సంతసించె ||సంతో|| *3 మిన్ను నుండి సంతోషోదయము మిగుల ప్రకాశించె హృదయ ములఁదగుల ప్రకాశించె మున్ను జేయఁబడిన వాగ్దత్తము తిన్నగ నెరవేరె భక్తుల కన్నులాశ దీరె ||సంతో|| *4 ప్రీతియైన నీ పండుగ గూర్చి నూతన కీర్తనను గలసికొని-నాతో పాడుచును నీ తరిదూరస్థుల కీ వార్తను నే తీరున నైనఁ-దెలుపగ నాతురపడవలెను ||సంతో|| *5 పాపులపై దేవునికి గలిగిన ప్రబలమైన దయను లోకమున జూపింపగ వలెను జూపకపోయిన లోపము మనపై మోపబడును నిజము వేగము జూపుదమాపథము ||సంతో|| === code 279 title రారె గొల్లవారలారా- నేటి *ref రారె గొల్లవారలారా- నేటి రాత్రి బెత్లెహేము నూర జేరి మోక్ష దూత-కోరిదెల్పెను క్రీస్తు వారి జాడ కన్ను-లారా జూతమువేగ *1 పుట్టు చావులు లేనివాడఁట పశులతొట్టిలోపల బుట్టెనేడఁట ఎట్టి వారలను జే-పట్టి పాపములూడఁ గొట్టి మోక్షపు త్రోవఁబెట్టు వాడట వేగ *2 బహు కాలమాయెను వింటిమి నేడు మహికి వచ్చుట కనుగొంటిమి విహితముతోడ సేవించి వత్తము మోక్ష మహితుని గని దుఃఖరహితులమవుదము === code 280 title కొనియాడదరమె నిన్ను *ref కొనియాడదరమె నిన్ను కోమల హృదయ కొనియాడఁదరమె నిన్ను తన రారు దినకరుఁ బెనుతారలను మించు ఘనతేజమున నొప్పు కాంతి మంతుడ వీవు ||కొని|| *1 ఖెరుబులు సెరుపులు మరి దూతగణములు నురుతరంబుగఁగొలువ నొప్పు శ్రేష్టుడ వీవు ||కొని|| *2 సర్వలోకంబులం-బర్వు దేవుడ వయ్యు నుర్వి స్త్రీగర్భాన నుద్భవించితివి వీవు ||కొని|| *3 విశ్వమంతయు నేలు వీరాసనుఁడవయ్యు పశ్వాళితో దొట్టి పడియుంటివి నీవు ||కొని|| *4 దోసంబులను మడియు దాసాళిగరుణించి యేసు పేరున జగతి కేగుదెంచితి నీవు ||కొని|| *5 నరులయందున గరుణ ధర సమాధానంబు చిరకాలమును మహిమ పరఁగఁ జేయుదు వీవు ||కొని|| *6 ఓ యేసు పాన్పుగ నాయాత్మ జేకొని శ్రేయముగ బవళించు శ్రీ కర వరసుత ||కొని|| === code 281 title లాలిలాలి లాలి లాలమ్మ లాలీ *ref లాలిలాలి లాలి లాలమ్మ లాలీ లాలియని పాడరే బాలయేసునకు *1 పరలోక దేవుని తనయుడో యమ్మా పుడమి పై బాలుడుగ బుట్టెనో యమ్మా ||లాలీ|| *2 ఇహ పరాదుల కర్త యీతడో యమ్మ మహి పాలనము జేయు మహితుడో యమ్మా ||లాలీ|| *3 ఆద్యంతములు లేని దేవుడో యమ్మా ఆదాము దోషమున కడ్డు పడెనమ్మా ||లాలీ|| *4 యూదులకు రాజుగా బుట్టెనో యమ్మా యూదు లాతని తోడ వాదించి రమ్మా ||లాలీ|| *5 నరగొఱ్ఱెల మంద కాపరో యమ్మా గొరియల ప్రాణంబు క్రీస్తు తానమ్మా ||లాలీ|| === code 282 title ఇదిగో నీ రాజు వచ్చుచుండె *ref ఇదిగో నీ రాజు వచ్చుచుండె సీయోను కుమారి సంతోషించు యెరూషలేం కుమారి ఉల్లసించు *1 నీదు రాజు నీతితో దోషమేమియు లేకయె పాపరహితుడు ప్రభు వచ్చుచుండె *2 రక్షణ గల వాడుగ అక్షయుండగు యేసుడు దీక్షతోడ యెరూషలేం వచ్చుచుండె *3 సాత్వికుండు ఈ భువిన్‌ అత్యంత మగు ప్రేమతో నిత్య రాజు నరులకై వచ్చుచుండె *4 దీనపరుడు నీ ప్రభు ఘనత కలిగిన దేవుడు ప్రాణమీయ పాపులకై వచ్చుచుండె *5 ఇలను గాడిదనెక్కియే బాలుర స్తోత్రములతో బలుడగు నీ ప్రభు వచ్చుచుండె *6 దావీదు కుమారుడు దేవుడు పాపులకు జయగీతములతో వచ్చుచుండె *7 యేసుని ప్రేమించుచు హోసన్నా పాడెదము యేసుడిల వచ్చుచుండె హల్లెలూయ === code 283 title మనకై యేసు-మరణించె *ref మనకై యేసు-మరణించె మన పాపముల కొరకే నిత్య జీవము నిచ్చుటకే సత్యుండు సజీవుడాయె *1 తృణీకరింపబడె విసర్జింపబడెను దుఃఖాక్రాంతుడాయె వ్యసనముల భరించెను ||మనకై|| *2 మన వ్యసనముల వహించెన్‌ మన దుఃఖముల భరించెన్‌ మన మెన్నిక చేయకయే మన ముఖముల ద్రిప్పితిమి ||మనకై|| *3 మన యతిక్రమముల కొరకు మన దోషముల కొరకు మన నాథుడు శిక్ష నొందె మనకు స్వస్థత కలిగె ||మనకై|| *4 గొఱ్ఱెలవలె తప్పితిమి పరుగిడితిమి మన దారిన్‌ అరుదెంచె కాపరియై అర్పించె ప్రాణమును ||మనకై|| *5 దౌర్జన్యము నొందెను బాధింపబడెను తన నోరు తెరువలేదు మనకై క్రయధన మీయన్‌ ||మనకై|| *6 ఎదిరింప లేదెవరిన్‌ లేదే కపటము నోట యెహోవా నలుగగొట్టెన్‌ మహా వ్యాధిని కలిగించెన్‌ ||మనకై|| *7 సిలువలో వ్రేలాడెన్‌ సమాధిలో నుండెను సజీవుండై లేచెన్‌ స్తోత్రము హల్లెలూయ ||మనకై|| === code 284 title సిలువలో బలియైన *ref సిలువలో బలియైన దేవుని గొఱ్ఱెపిల్ల విలువైన నీ ప్రేమన్‌ వివరింతు శ్రీ యేసు *1 ఆనాటి యూదులే నిను జంపిరనుకొంటి కాదు కాదయ్యయ్యో నా పాప ఋణమునకే ||సిలువ|| *2 నాయతి క్రమములకై నలుగ గొట్టబడి నా దోషముల నీవు ప్రియముగను మోసితివా ||సిలువ|| *3 మృదువైన నీ నుదురు ముండ్ల పోట్లచేత సురూపమును లేక సోలిపోతివా ప్రియుడా ||సిలువ|| *4 నా రోగములు నీపై నమ్రతతో భరియించి తృణీకరింపబడి ప్రాణమర్పించితివి ||సిలువ|| *5 వ్యసనా క్రాంతుడవుగా వ్యాధి ననుభవించి మౌనము ధరించి మరణమైతివా ప్రభువా ||సిలువ|| *6 నా పాప దోషముచే నేచచ్చి యుండగనే మరణమై నా కొరకు మరి తిరిగి లేచితివి ||సిలువ|| *7 పరమున కెత్తబడిన ప్రియ యేసు రాకడకై పదిలముగ కనిపెట్టి పాడెదను హల్లెలూయ ||సిలువ|| === code 285 title భాసిల్లెను సిలువలో పాపక్షమా *ref భాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభూ నీ దివ్య క్షమా భాసిల్లెను సిలువలో పాపక్షమా *1 కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసే కలుషహరా కరుణించితివి (2) ||భా|| *2 దోషము చేసితి నేనే గదా మోసముతో బ్రతికిన నేనే గదా మోసితివా నా శాప భారం (2) ||భా|| *3 పాపము జేసి గడించితి మరణం శాపమెగా నేనార్జించినది కాపరివై నను బ్రోచితివి (2) ||భా|| *4 నీ మరణపు వేదన వృధాగాదు నా మది నీ వేదనలో మునిగే క్షేమము కలిగెను హృదయములో (2) ||భా|| *5 ఎందులకో నా పై యీ ప్రేమ అందదయా - స్వామి నా మదికి అందులకే భయమొందితిని (2) ||భా|| *6 నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడునా ప్రభుడవని నమ్మితి నీ పాదంబులను (2) ||భా|| === code 286 title ఇదిగో కలువరి సిలువ ప్రేమ *ref ఇదిగో కలువరి సిలువ ప్రేమ మరపురాని మధుర ప్రేమ యేసు ప్రేమ నా యేసు ప్రేమ యేసు ప్రేమ శ్రీ యేసు ప్రేమ *1 యేసుని సిలువకు పంపిన ప్రేమ దోషిని కరుణతో పిలిచిన ప్రేమ మరువజాలని ప్రేమ నన్ను మరువని ప్రేమ ||ఇదిగో|| *2 మహిమైశ్వర్యము బాసిన ప్రేమ నా దోషములను మోసిన ప్రేమ విడువజాలని ప్రేమ నన్ను విడువని ప్రేమ ||ఇదిగో|| *3 చెడిన నన్ను కడిగిన ప్రేమ పడిన నన్ను లేపిన ప్రేమ మరువలేని ప్రేమ మారనీ యేసు ప్రేమ ||ఇదిగో|| === code 287 title ఆహా మహాత్మ హా శరణ్య *ref ఆహా మహాత్మ హా శరణ్య హా విమోచకా దోషరహిత చంపెనిను నా - దోషమేగదా *1 వీరలను క్షమించుతండ్రి నేర మేమియున్‌ కోరి తిటులు నిన్ను జంపు కృార జనులకై ||ఆహా|| *2 ''నీవు నాతో బరదైసున నేడే యుందువు'' పావనుండ ఇట్లు బలికి పాపిగాచితివి ||ఆహా|| *3 అమ్మా! నీ సుతుడటంచు మరి-యమ్మతో బలికి క్రమ్మర 'నీ జనని' యంచు గర్త నుడివితి ||ఆహా|| *4 నా దేవా నా దేవా యేమి విడ నాడితివనుచు శ్రీ దేవసుతా పలికితివి శ్రమ చెప్పక శక్యమా ||ఆహా|| *5 దప్పిగొనుచున్నాన టంచు జెప్పితివి గదా ఇప్పగిదిని బాధనొంద నేమి నీకు హా ||ఆహా|| *6 శ్రమ ప్రమాదములను గొప్ప శబ్దమెత్తి హా సమాప్తమై నదంచు తెలిపి సమసితివి గదా ||ఆహా|| *7 అప్పగింతు దండ్రి, నీకు-నాత్మ నంచును గొప్ప యార్భాటంబు చేసి కూలిపోతివా ||ఆహా|| === code 288 title మనస యేసు మరణ బాధ *ref మనస యేసు మరణ బాధ లెనసి పాడవే-తన-నెనరు జూడవే యా ఘనునిఁగూడవే నిను మనుప జచ్చుటరసియే మరక వేఁడవే ||మనస|| *1 అచ్చి పాపములను బాప వచ్చినాడట వా-క్కి-చ్చి తండ్రితో నా-గెత్సెమందున-తా జొచ్చి యెదను నొచ్చి బాధ-హెచ్చుగనెనట ||మనస|| *2 ఆ నిశీధ రాత్రి వేళ-నార్భటించుచు నయ్యో నరాంతకుల్‌ చేఁబూని యీటెలన్‌ ఒక ఖూని వాని వలెను గట్టి కొంచుబోయిరా ||మనస|| *3 పట్టి దొంగవలెను గంత గట్టికన్నులన్‌ మరి గొట్టి చెంపలన్‌ వడిదిట్టి నవ్వుచున్‌ నిను గొట్టి రెవ్వరదియు మాకు జెప్పు మనిరట ||మనస|| *4 ముళ్ళతోడ నొక కిరీట మల్లిప్రభు తలన్‌ బెట్టి రెల్లుకఱ్ఱతో నా కల్ల జనములు రా జిల్లుమనుచుకొట్టి నవ్వి గొల్లుబెట్టిరా ||మనస|| *5 మొయ్యలేక సిల్వ భారము మూర్ఛబోయెనా ఆ య్యయ్యో జొక్కెనా యే సయ్యతూలెనా మాయయ్యనిన్‌ దలంప గుండె-లదరి పోయెనా ||మనస|| *6 కాలుసేతులన్‌ గుదించి కల్వరి గిరిపై నిన్‌ గేలిజేయుచు నీ కాళ్ల మీదను నినుప చీలలతో గ్రుచ్చి నిన్ను సిల్వ గొట్టిరా ||మనస|| *7 దేవ సుతుండవైతి వేని తీవరంబుగా దిగి నీవు వేగమే రమ్ము గావు మనుచును ఇట్లు గావరించి పల్కు వగర కరుణ జూపెనా ||మనస|| *8 తన్ను జంపు శత్రువులకు దయను జూపెనా తన నెనరు జూపెనా ప్రభు కనికరించెనా ఓ జనక ఈ జనుల క్షమించు మనుచు వేఁడెనా ||మనస|| *9 తాళలేని బాధ లెచ్చి దాహ మాయెనా నన్నేలువానికి నా పాలి స్వామికి నే-నేల పాపములను జేసి హింసపరచితి ||మనస|| *1 గోడు బుచ్చి సిలువపైన నేడు మారులు మాట్లాడి ప్రేమతో నా-నాడు శిరమును వంచి నేఁడు ముగిసె సర్వమనుచు వీడె బ్రాణము ||మనస|| *1 మరణమైన ప్రభుని జూచి ధరణి వణఁకెనా బల్‌ గిరులు బగిలెనా గుడి తెరయుఁజీలెనా దివా కరుడు చీకటాయె మృతులు తిరిగి లేచిరి ||మనస|| *1 ఇంత జాలి యింత ప్రేమ యింత శాంతమా నీ యంతఃకరుణను నేఁ జింతచేయగా నీ వింత లెల్ల నిత్యజీవ విధము లాయెనా ||మనస|| === code 289 title చూడుము యీ క్షణమె కల్వరిని *ref చూడుము యీ క్షణమె కల్వరిని ప్రేమా ప్రభువు నీకై నిలుచుండెను గొప్ప రక్షణ నివ్వ శ్రీ యేసుడు సిలువలో వ్రేలాడు చున్నాడుగా *1 మానవులెంతో చెడిపోయిరీ మరణించెదమని తలపోయక ఎరుగరు మరణము నిక్కమని నరకమున్నదని వారెరుగరూ ||చూడు|| *2 ఇహమందు నీకు కలవన్నియు చనిపోవు సమయాన వెంటరావు చనిపోయినను నీవు లేచెదవు తీర్పున్నదని ఎరుగుము ఒక దినమున ||చూడు|| *3 మనలను ధనవంతులుగ చేయను దరిద్రుడాయెను మన ప్రభువు రక్తము కార్చెను పాపులకై అంగీకరించుము శ్రీ యేసుని ||చూడు|| *4 సిలువపై చూడుము ఆ ప్రియుని ఆ ప్రేమకై నీవేమిత్తువు అర్పించుకో నీదు జీవితము ఆయన కొరకై జీవించుము ||చూడు|| === code 290 title చూడరే క్రీస్తుని జూడరే నా సఖులార *ref చూడరే క్రీస్తుని జూడరే నా సఖులార చూడరే క్రీస్తుని జూడరే చూడరేనా ముక్తి పదవికి ఱేడు యేదశ గూడినాడో ||చూడరే|| *1 మించి పొంతి పిలాతు సత్యమొ కించుకైనఁదలంప కక్కట వంచనను గొట్టించి యూదుల మంచితనమే కోరి యప్ప-గించెనా మేలు గ-ణించెనా ఇతనిగాంచి కాంచి భక్తులెట్లు స హించిరో పరికించి మీరిది ||చూడరే|| *2 మంటికిని నాకాశమునకును మధ్యమున వ్రేలాడుచుండగ నంటఁగొట్టగ సిలువ మ్రాని కప్పగించుటకొరకు నిన్ను ఁగాంచెనా యిది మది నెంచెనా హానా-కంట నే నిటువంటి యాపదఁగంటిఁ బ్రాణములుండునే యికఁ ||చూడరే|| *3 ఊటగా రక్తంబు కారుచు నుండ బల్లెపుఁ బ్రక్కపోటు మాటిమాటికిఁ జూడ దుఃఖము మరలునే తలమీద ముళ్ళకిరీటమా యితనికి వాటమా యూదులు మోటులై బాహాటమున నీ పాటులను గాటముగ జేసిరి ||చూడరే|| === code 291 title చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను *ref చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను పాడు లోకంబునకై గోడు జెందెగదా *1 నా చేతులు చేసినట్టి దోషంబులే గదా నా రాజు చేతులలో ఘోరంపు జీలలు ||చూడరే|| *2 దురితంపు దలపులే పరమగురుని శిరముపై నెనరు లేకమొత్తెనయ్యో ముండ్ల కిరీటమై ||చూడరే|| *3 పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు పరమరక్షకుని పాదములలో మేకులు ||చూడరే|| *4 పాపేచ్ఛ తోడఁగూడ నాదు చెడ్డ పడకలే పరమగురుని ప్రక్కలోని బల్లెంపు పోట్లు ||చూడరే|| === code 292 title కన్నీటి అభిషేకమూ *ref కన్నీటి అభిషేకమూ నీ సిలువ కడు ఘోరమూ నా పాపమే-నా శాపమే నీ సిలువ ఓ యేసూ (2) ||కన్నీ|| *1 నే తులువనై కడు పాపినై కఠినాత్మునై-కలుషుండనై గర్విష్టినై నిను గొట్టగా దోషుండనై పట్టించితిన్‌ ||కన్నీ|| *2 కొరడాలతో కొట్టించితిన్‌ ముళ్ళ కిరీటంబు పెట్టించితిన్‌ నా సిలువనే నీ పై పెట్టించితిన్‌ నడిపించితినా గొల్గొతకు ||కన్నీ|| *3 నీ రుధిరమే బహుగా కారెన్‌ నీ రక్తమే స్రవియించగా నీ దాహమే చేదు చిరకాయెనా నా పాపమె నీ శిక్షయై ||కన్నీ|| *4 నా క్రీస్తువా నీ రక్తము నను కడిగెను పవిత్రించెను నే చేరెదా-నీ సిలువకు నను బ్రోవవే నా రక్షకా ||కన్నీ|| === code 293 title కల్వరి ప్రేమ తలంచునపుడు *ref కల్వరి ప్రేమ తలంచునపుడు కలుగుచున్నది దుఃఖం ప్రభువా నీ శ్రమలను ధ్యానించినపుడు పగులు చున్నది హృదయం *1 గెత్సెమనె అను తోటలో విలపించుచు ప్రార్థించు ధ్వని నలువైపుల వినబడుచున్నది పగులుచున్నవి మా హృదయములు కలుగుచున్నది దుఃఖం ||కల్వరి|| *2 సిలువపై నలుగగొట్టినను అనేక నిందలు మోపినను ప్రేమతో వారిమన్నింపునకై ప్రార్థించిన ప్రియ యేసు రాజా నీ ప్రేమ పొగడెదము ||కల్వరి|| *3 మమ్మును నీ వలె మార్చుటకై నీ జీవమును ఇచ్చితివే నేలమట్టుకు తగ్గించుకొని సమర్పించితివి నీ కరములతో మమ్మును నడిపించుము ||కల్వరి|| === code 294 title కల్వరి లోని శ్రేష్టుడా *ref కల్వరి లోని శ్రేష్టుడా కరుణా భరిత యేసువా నను రక్షించుము నాథుడా సిలువలోని మిత్రుడా *1 స్తుతికి పాత్రుండగు దేవా సతతము స్తోత్రము లందుమయా సుదతి మరియ పుత్రుడా సిలువలోని మిత్రుడా ||కల్వరి|| *2 పాపులకై వచ్చినవాడా ప్రేమా కల్గిన రక్షకుడా పాదములపై బడితిమి సిలువలోని మిత్రుడా ||కల్వరి|| *3 దీవెనల నిచ్చువాడా వసుధ కేతెంచిన వాడా నీవె సుంకరులాప్తుడవు సిలువలోని మిత్రుడా ||కల్వరి|| *4 ఐదు రొట్టెలు మరి రెండు చేపలతో నైదువేల జనులను పోషించిన తండ్రి సిలువలోని మిత్రుడా ||కల్వరి|| *5 నీళ్ళను రసముగ మార్చితివి నీళ్ళ మీద నడిచితివి మేళ్ళనొసగు మా దాతా సిలువలోని మిత్రుడా ||కల్వరి|| *6 రోగుల బాగు చేయువాడా గ్రుడ్డికి నేత్రములిచ్చితివి అనాథుల నాయకుడా సిలువలోని మిత్రుడా ||కల్వరి|| *7 హల్లెలూయ కర్హుడా ఎల్లరును కొనియాడు వాడా బలముతో వచ్చు రాజా సిలువలోని మిత్రుడా ||కల్వరి|| === code 295 title ఘోర పాపము ద్రుంచ ధరణిపై కేతెంచి *ref ఘోర పాపము ద్రుంచ ధరణిపై కేతెంచి మరణమై లేచినావు మా యేసు-మమ్ముద్ధరించినావు *1 ఘోరమైన సిలువ భారంబును నీవు భరియించి మోసినావు మా కొరకు-బాధలే బొందినావు ||ఘోర|| *2 దుష్టజనులు నిన్ను దూషణములాడుచు దుష్టుడే బొడవగాను నీ ప్రక్క-రుధిరంబు నీరు గారె ||ఘోర|| *3 కలువరి గిరి పైన సిలువ బాధయు నొంది కలవరము నొందినావు నా కొరకు-కష్టములు బొందినావు ||ఘోర|| *4 కడలి పైన నీవు కడు నేర్పుతో నుండి ఒడలు నర్పించినావు నీ యొక్క వేడుకను జూపినావు ||ఘోర|| *5 మూడు గంటల వేళ యేడు మాటలు బలికి గోడున జెందినావు నీ యొక్క ప్రాణంబు విడిచినావు ||ఘోర|| *6 పరమధాముం డేసు మరణమొందగ జూచి సూర్యుండు చీకటాయె మృతులైన-పరిశుద్ధులు లేచిరి ||ఘోర|| *7 కరుణగల మా యేసు మరణమొందగ జూచి ధరగిరుల పగిలినవా మా తండ్రి-గుడితెరలు చిరిగినవా ||ఘోర|| *8 రండి రండి మీరు రక్షకుని నమ్మండి నిండు శాంతము నిచ్చును మా తండ్రి-దండి దయను జూపును === code 296 title సిలువే నా శరణాయెను-రా *ref సిలువే నా శరణాయెను-రా నీ సిలువే నా శరణాయెను రా సిలువ యందే ముక్తి బలము జూచితిరా ||నీసిలువే|| *1 సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు విలువ లేని-ప్రేమామృతము గ్రోలితిరా2 సిలువను జూచుకొలది శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగుచున్నదిరా ||నీ|| *3 సిలువను దరచి తరచి విలువ కందగరాని నీ కృప కలుషమెల్లను బాపగ-జాలునురా ||నీ|| *4 పలువిధ పథములరసి ఫలితమేమి గానలేక సిలువ యెదుటను-నిలిచి నాడనురా5 శరణు యేసు శరణు శరణు శరణు శరణు నా ప్రభువా దురిత దూరుడ-నీ దరి జేరితిరా ||నీ|| === code 297 title ఎంతో వింత యెంతో చింత *ref ఎంతో వింత యెంతో చింత యేసునాథు మరణమంత పంతముతో జేసి రంత సొంత ప్రజలు స్వామి నంత ||ఎంతో|| *1 పట్టి కట్టి నెట్టి కొట్టి తిట్టి రేసు నాథు నకటా అట్టి శ్రమల నొంది పలుక డాయె యేసు స్వామి నాడు ||ఎంతో|| *2 మొయ్యలేని మ్రాను నొకటి మోపి రేసు వీపు పైని మొయ్యలేక మ్రాని తోడ మూర్ఛబోయె నేసు తండ్రి ||ఎంతో|| *3 కొయ్యపై నేసయ్యన్‌ బెట్టి కాలు సేతులలో జీలల్‌ కఠినులంత గూడి కొట్టిరి ఘోరముగ క్రీస్తే సున్‌ బట్టి ||ఎంతో|| *4 దాహముగొన జేదు చిరక ద్రావ నిడిరి ద్రోహులకటా ధాత్రి ప్రజల బాధ కోర్చి ధన్యుడా దివి కేగె నహహా ||ఎంతో|| *5 బల్లెముతో బ్రక్కన్‌ బొడవన్‌ పారె నీరు రక్త మహహా ఏరై పారె యేసు రక్త మెల్ల ప్రజల కెలమి నొసగు ||ఎంతో|| === code 298 title సిలువ చెంత చేరిననాడే *ref సిలువ చెంత చేరిననాడే కలుషములను కడిగివేయున్‌ పౌలు వలెను-సీల వలెను సిద్ధపడిన భక్తుల జూచి *1 కొండాలాంటి బండాలాంటి మొండి హృదయంబు మండించు పండియున్న పాపులనైన పిలచుచుండె పరము జేర ||సిలువ|| *2 వంద గొఱ్ఱెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయె తొంబది తొమ్మిది గొఱ్ఱెల విడిచి ఒంటరియైన గొఱ్ఱెను వెదకెన్‌ ||సిలువ|| *3 తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయె తప్పు తెలసి తిరిగి రాగా తండ్రి యతని చేర్చుకొనెను ||సిలువ|| *4 పాపి రావా పాపము విడిచి పరిశుద్ధుల విందులో జేర పాపుల గతిని పరికించితివా పాతాళంబే వారి యంతము ||సిలువ|| === code 299 title నా జీవితానికి విలువ తెచ్చిన సిలువ *ref నా జీవితానికి విలువ తెచ్చిన సిలువ సిలువ లేనిదే నాకు లేదు విలువ అహహ హల్లెలూయ (3) *1 సింహాసనము నాకివ్వ క్రీస్తు సిలువ శ్రమలను సహించెను ముండ్ల మకుటము ధరియించి మహిమ కిరీటం నాకిచ్చెను అహహ హల్లెలూయ (3) ||నాజీవి|| *2 సిలువ వార్త నా శక్తి సామర్థ్యం నశించు వారికి వెఱ్ఱితనం సిలువ వార్తను చాటెదను సిలువను భరించెదను అహహ హల్లెలూయ (3) ||నాజీవి|| *3 సిలువ రుధిరం పాపహరణం సిలువ యాగమే జీవనరాగం సిలువ మరణం నా విజయం సాతానునికపజయం అహహ హల్లెలూయ (3) ||నాజీవి|| *4 సిలువ నాథుని బలిదానం నాదు పాప విమోచనం అపరాధములతో చచ్చిన నన్ను ధర బ్రతికించెను సిలువ అహహ హల్లెలూయ (3) ||నాజీవి|| === code 300 title సిలువలో సిలువలో *ref సిలువలో సిలువలో సిలువలో నా ప్రభువా శ్రమలలో శ్రమలలో శ్రమలలో నలిగేవా *1 సిలువలో నీ మేను నిలచేను మేకులతో బరువుతో నీ తనువు ఒరిగెను వేదనతో ||సిలువ|| *2 ముండ్లతో ఒక మకుటం అల్లి నీ తలపై చిరకతో నీ దాహం తీర్చెనూ ఈ లోకం ||సిలువ|| *3 ప్రక్కలో బల్లెముతో గ్రక్కునా బొడిచేరా రక్తమే చిందేనా శాంతమే మిగిలేనా ||సిలువ|| *4 సిలువలో యేసు ప్రభో శ్రమలలో క్రీస్తు మహా జాలిలేని నా కోసం ఏలానో ఈ సహనం ||సిలువ|| === code 301 title క్రీస్తు మన కొరకు చనిపోయెను *ref క్రీస్తు మన కొరకు చనిపోయెను యుక్త కాలమున మరణమాయెను మనుషులందరి కొరకు పాప క్షమాపణకు సిలువలో బలిగా మారెను ||క్రీస్తు|| *1 మనమింక బలహీనులమై యుండగా సోలి తూలి గాలికి కొట్టుకు పోగా సిలువలో మన కొరకు బలియాయెను మనలను బలవంతులుగా మార్చెను *2 మనమింక భక్తి హీనులమై యుండగా తండ్రి రాజ్యమునకు దూరమవ్వగా ఆయనె మనల ప్రేమించెను ప్రాణమునె దానము బలి యిచ్చెను *3 మనమింక పాపులమై బ్రతికి యుండగా దేవుని ఉగ్రతలో నిలిచి యుండగా పాపమునకు ప్రాణమును ధారపోసెను పాపపు రుణము తీర్చి వేసెను === code 302 title జయహే, జయహే *ref జయహే, జయహే జయహే, జయహే జయ జయ దేవసుతా జయ జయ విజయసుతా ||జయహే|| *1 సిలువలో పాపికి విడుదల కలిగెను విడుదల కలిగెను కలువరిలో నవ జీవన మొదవెను జీవన మొదవెను సిలువ పతాకము జయమును గూర్చెను జయమని పాడెదను నీ విజయము పాడెదను నా విజయము పాడెదను *2 మరణపు కోటలో మరణమె సమసెను ధరణిలో జీవిత భయములు దీరెను మరణములో సహ జయములు నావే *3 శోధనలో ప్రభు సన్నిధి దొరికెను వేదనలే రణభూమిగ మారెను శోధన బాధలు బలమును వీడెను *4 ప్రార్థన కాలము బహు ప్రియమాయెను సార్థక మాయెను దేవుని వాక్యము ప్రార్థనలే బలి పీఠములాయెను *5 స్వాంతములో నిజ శాంతి లభించెను భ్రాంతులు వింతగ ప్రభుపర మాయెను స్వాంతమె సిలువకు సాక్షిగ వెలసెను === code 303 title జయ జయ యేసు-జయ యేసు *ref జయ జయ యేసు-జయ యేసు జయ జయ క్రీస్తు-జయ క్రీస్తు జయ జయ రాజా-జయ రాజా జయ జయ స్తొత్రం-జయ స్తోత్రం ||జ|| *1 మరణము గెల్చిన-జయ యేసు మరణము ఓడెను-జయ యేసు పరమ బలమొసగు-జయ యేసు శరణము నీవే-జయ యేసు ||జ|| *2 సమాధి గెల్చిన-జయ యేసు సమాధి ఓడెను-జయ యేసు క్షమియించుము నను-జయ యేసు అమరమూర్తివి-జయ యేసు ||జ|| *3 బండను గెల్చిన-జయ యేసు బండయు ఓడెను-జయ యేసు బండలు తీయుము-జయ యేసు అండకు చేర్చుము-జయ యేసు ||జ|| *4 ముద్రను గెల్చిన-జయ యేసు ముద్రయు ఓడెను-జయ యేసు ముద్రలు జీల్చుము-జయ యేసు ముద్రించుము నను-జయ యేసు ||జ|| *5 కావలి గెల్చిన-జయ యేసు కావలి ఓడెను-జయ యేసు సేవలో బలమును-జయ యేసు జీవము నీవే-జయ యేసు ||జ|| *6 దయ్యాల గెల్చిన-జయ యేసు దయ్యాలు ఓడెను-జయ యేసు కయ్యము గెల్చిన-జయ యేసు అయ్యో నీవె-జయ యేసు ||జ|| *7 సాతాను గెల్చిన-జయ యేసు సాతాను ఓడెను-జయ యేసు పాతవి గతించె-జయ యేసు దాతవు నీవె-జయ యేసు ||జ|| === code 304 title లేచినాడురా సమాధి గెలిచినాడురా *ref లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేతునని తాఁజెప్పినట్లు లేఖనములో పలికినట్లు *1 భద్రముగ సమాధిపైన పెద్దరాతిని యుంచిరి భటులు ముద్రవేసి రాత్రియంత నిద్ర లేక కావలియున్న ||లేచి|| *2 ప్రభువు దూత పరము నుండి త్వరగ దిగి రాతిని దొర్లించి భళిర దానిపై గూర్చుండె భయము నొంద కావలి వారు ||లేచి|| *3 ప్రొద్దు పొడవకముందె స్త్రీలు సిద్ధపరచిన సుగంధములు శ్రద్ధతోడ తెచ్చి యేసుకు రుద్దుదామని వచ్చిచూడ ||లేచి|| *4 చూడ వెళ్ళిన స్త్రీలను దూత చూచి యిపుడు వారి తోడ లేడు గలిలయ ముందుగా పోతున్నాడు అప్పుడే లేచినాడనె ||లేచి|| *5 చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తుల కగుపడినాడు చచ్చినను నను లేపుతాడు చావు అంటే భయపడరాదు ||లేచి|| *6 నేను చేసే పనుల నెరుగు నేను నడిచే మార్గ మెరుగు నేను జెప్పిన మాట లెరుగు నేను బ్రతికే బ్రతుకు నెరుగు ||లేచి|| *7 నేను లేచిన యేసునందు మానకను మది నమ్ముకొందు తాను నాలో నుండి నందున దయను జేర్చును మోక్షమందు ||లేచి|| === code 305 title జీవోదయమై జీవము గలిగిన *ref జీవోదయమై జీవము గలిగిన జీవపు తెరలేచె జీవాధిపతి మరణపు తెరలను చీల్చివైచి లేచె ||జీవో|| *1 పరమ మందిరము ప్రవేశింపగా తెరచెను మార్గంబు పరమ శరీరపు తెర తెరచెను గుడి తెర చినిగె నిజంబు ||జీవో|| *2 ధరణియు వణకెను గిరులును గిరగిర తిరిగి బ్రద్దలాయె పరమ గురుని మరణ రంగస్థలమున మరణమె మరణించె ||జీవో|| *3 సూర్యుడు అస్త-మించెను నీతి సూర్యుడస్తమింప సూర్యోదయమిదె మూడవ దినమున జూడ రండి వేగ ||జీవో|| *4 తొలకరి వాన కాలము గాన తెలిసికొనుము లెమ్ము వెలుగును పొందుము-కడవరి వర్షా కాలమిదే రమ్ము ||జీవో|| *5 కడవరి వర్షా కాలము గనుక కనులు తెరచి చూచి అడుగుము యేసుని వర్షము కొరకు బడయు వరకు వేచి ||జీవో|| === code 306 title జయ జయంబులు పాడుడి *ref జయ జయంబులు పాడుడి జయమును పొంది లేచెను మరణపు ముల్లును విరచెను-మన యేసుని స్తుతియించుడి ||జయ|| *1 లోక పాపము మోసెను పాపికి విడుదల చేసెను త్వరపడుమా-పరుగిడుమా ప్రభుని సన్నిధి-చేరుమా ||జయ|| *2 నీవే మాకు మార్గము నీవే నిత్య జీవము స్తుతియింతుము కీర్తింతుము ఘనమైన యా ప్రభు నామమున్‌ ||జయ|| *3 తండ్రి కుమార శుద్ధాత్ముడు ఆత్మను కుమ్మరించెను నడిపించుమా-నీ సేవలో అక్షయ కిరీట మొందుమా ||జయ|| === code 307 title పరిశుద్ధాత్మను గోరుము *ref పరిశుద్ధాత్మను గోరుము జీవమ యేసు ప్రభుని పేరిట వేడుము నరులందరి మీఁద నా యాత్మ నుంతునని పరలోకపు తండ్రి పలికె వేదము నందు ||పరి|| *1 పరిశుద్ధాత్మ లేనిది వేదాగమ పఠన పఠనము గాదది నెర చీకటింట సర-కులు వెదకు రీతి ప-ల్మరు వెదకినను నిరర్థకమైపోవును వేగఁ ||పరి|| *2 పరిశుద్ధాత్మ లేనిది-వర్షము లేని పైరు చందంబె యది పర బోధకముల వ-ర్తితమైన పనులు జీ-వరహితములై యనుభ వము గానివై యుండుఁ ||పరి|| *3 పరిశుద్ధాత్మ లేనిది యేసు ప్రభుని నెరుగు టెరుగుట గాదది నరరూపుఁదాల్చి దు-ర్నరుల రక్షణ కొరకు మరణమొందిన ప్రభుని కరుణాధికము వడయు ||పరి|| *4 పరిశుద్ధాత్మ లేనిది జీవము లేని బ్రతుకే బ్రతుకు గాదది దురితేచ్ఛలను గొప్ప యురులం దగిలి భక్తి తరిగిపోవుట కద్ది దొరకనందున సుమ్మ ||పరి|| *5 పరిశుద్ధాత్మను బొందుట అన్నిటికన్న ప్రబలంబైన మేలిట నెరనమ్మి మొరబెట్టు పరమపావను డద్ది కరుణించి నీ కొసఁగు మరణాంత మగు దనుక ||పరి|| === code 308 title పరమాత్మ ప్రోక్షణం *ref పరమాత్మ ప్రోక్షణం పరిపూర్ణ పోషణం ప్రశాంత జీవిత కళా వికాసం ఆత్మ కారణం *1 పాపపు తిమిరము బాపగను అగాధములపై అల్లాడి ప్రధమ మానవుని నాసికలో నడయాడిన వూపిరిగా ప్రభవిల్లిన యా పరిశుద్ధాత్మ తండ్రి కుమారుల బహుమానం ||పర|| *2 దేవోక్తి దాయిని-ఉజ్జీవ వాహినీ ధరా తలముపై సజీవ దేవుని శక్తి రూపిణి దేశము నందలి లోయలలో ఎండిన శల్య సమూహముపై దేశపు పునరుత్థానముకై ప్రసరిల్లిన జీవాత్మా ధీమతులగు సైనికులుగ మార్చిన పరిశుద్ధాత్మయె ప్రభు దానం ||పర|| *3 అభిషేక తైలమై-విమలాత్మ జ్వాలయై విశేష వరముల నొసంగి బ్రోచెడు క్షేమమాలయై ఆముష్మిక యాభరణములౌ ఆత్మ ఫలములతో తులతూగి అలరారగ మన హృదయ నివాసిగ జీవించెడి యాత్మ ఆంతర్యములో యేసుని రూపము అలవర్చుట దైవాత్మ క్రియ ||పర|| *4 సంతోష దాతయై-సహవాస జ్యోతియై సహోదరులకిల సహాయమొసగెడి రక్షరేఖయై సంఘమనే ప్రభు వధువునకు సమస్త శోభలు సమకూర్చి శుభ కార్యముకై-ప్రభు రాకడకై వీక్షించెడి యాత్మ సతతము విజ్ఞాపనమును సలిపెడి పరిశుద్ధాత్మయె మన భాగ్యం ||పర|| === code 309 title ఇదిగో నా శిష్యులారా *ref ఇదిగో నా శిష్యులారా యెఱుకలుంచుడి మోక్ష-సదనమున కేనుబోదు-సంతోషించుడి *1 యెరూషలేమందుండి మీ-రెదురు చూడుఁడి మీ పైఁ- బరిశుద్ధాత్మయు దిగి వచ్చి పనులు దెల్పును ||ఇదిగో|| *2 దిక్కులేనట్లు మిమ్ము దిగనాడి పోను-మీతో మక్కువౌయుండఁ బరిశు-ద్ధాత్మను బంపెదను ||ఇదిగో|| *3 నిర్యాణమున మీ కొఱకై నెలవులు కల్పింతు నాతో-సర్వ కాలము నిత్య సామ్రాజ్యము నేల ||ఇదిగో|| *4 ఒకరితో నొకరు ప్రియము లొప్పియుండుడి నాదు సకలాజ్ఞలందు నిదియె సార మనుకొనుడి ||ఇదిగో|| *5 ఏదైననాపేరిటమీరించుక వేడినను-మీకు మోదముతోడ దానిముందే చేయుదును ||ఇదిగో|| *6 ఉల్లములందు గలత లెల్ల విడువుడి నేను మళ్ళి వచ్చెడి విధము-మరవకుండుడి ||ఇదిగో|| === code 310 title అదే అదే ఆ రోజు *ref అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు ఏడేండ్ల శ్రమల రోజు పాపులంతా యేడ్చే రోజు ||అదే|| *1 సూర్యుడు నలుపయ్యే రోజు చంద్రుడు ఎరుపెక్కే రోజు భూకంపం కలిగే రోజు దిక్కులేక అరిచే రోజు ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాధుడు లేడు ||అదే|| *2 వ్యభిచారులు యేడ్చేరోజు మోసగాళ్ళు మసలే రోజు అబద్ధికులు అరచే రోజు దొంగలంతా దొర్లే రోజు ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాధుడు లేడు ||అదే|| *3 పిల్ల జాడ తల్లికి లేక తల్లి జాడ పిల్లకు రాక చెట్టుకొక్కరు పుట్టకొక్కరై అనాధలై అరచే రోజు ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాధుడు లేడు ||అదే|| *4 ఓ మనిషి యోచింపవా నీ బ్రతుకు ఎలా ఉన్నదో బలము చూచి భంగ పడకుమా ధనము చూచి దగా పడకుమా ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాధుడు లేడు ||అదే|| === code 311 title రాకడ సమయంలో *ref రాకడ సమయంలో కడబూర శబ్దముతో యేసుని చేరుకొనే విశ్వాసము నీకుందా రావయ్యా యేసయ్యా వేగమె రావయ్యా (2) *1 యేసయ్య రాకడ సమయంలో ఎదురేగే రక్షణ నీకుందా లోకయాశలపై విజయం నీకుందా ||రావ|| *2 ఇంపైన ధూప వేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా యేసు ఆశించే దీన మనస్సుందా ||రావ|| *3 దినమంతా దేవుని సన్నిధిలో వాక్యము కొరకు ఆకలి నీకుందా యేసు నాధునితో సహవాసం నీకుందా ||రావ|| *4 శ్రమలోన సహనం నీకుందా స్తుతియించే నాలుక నీకుందా ఆత్మల కొరకైనా ఆవేదన నీకుందా ||రావ|| *5 నీ పాప రోత జీవితము నీ పాప హృదయం మారిందా నూతన హృదయంతో ఆరాధన నీకుందా ||రావ|| *6 అన్నిటికన్నా మిన్నగను కన్నీటి ప్రార్థన నీకుందా ఎల్ల వేళల స్తుతియాగం నీకుందా ||రావ|| === code 312 title రాజాధిరాజా రా...రా *ref రాజాధిరాజా రా...రా రాజులకు రాజువై రా...రా రాజా యేసు రాజ్యమేల రా...రా రవికోటి తేజ యేసు రా...రా ఓ మేఘవాహనంబు మీద వేగమే ఓ మించు వైభవంబు తోడ వేగమే ||రా|| *1 ఓ... భూజనంబులెల్ల తేరి చూడగా ఓ... నీ జనంబు స్వాగతంబు నీయగా నీ రాజ్య స్థాపనంబు సేయ భూ రాజులెల్ల కూలిపోవ భూమి యాకసంబు మారిపోవ నీ మహా ప్రభావమున వేగ ||రా|| *2 ఆ... ఆకసమున దూతలార్భటింపగా ఆ... ఆది భక్త సంఘ సమేతంబుగా ఆకసంబు మధ్య వీధిలోన ఏకమై మహా సభ జేయ యేసు నాధ నీదు మహిమలోన మా కదే మహానందమౌగ ||రా|| *3 ఓ... పరమ యెరూషలేము పుణ్య సంఘమా ఓ... గొఱియపిల్ల క్రీస్తు పుణ్య సంఘమా పరమ దూతలారా భక్తులారా పౌలపోస్తులారా పెద్దలారా గొఱియపిల్ల యేసు రాజుపేర క్రొత్త గీత మెత్తి పాడరారా ||రా|| === code 313 title మేఘాల మీద మన ప్రభు యేసు *ref మేఘాల మీద మన ప్రభు యేసు మహికి ఏతెంచు వేళ ఆసన్నమాయె భువికి ఏతెంచు వేళ *1 మెరుపు రథముల మీద ఉరుము బాటలపైన మన యేసుడరుదెంచగా మరణ కోటలలోన నిదురించు ప్రియులంత మహిమకాయములొందుచు మీది లోకాల మోదాంలోన ప్రియ ప్రభుని దర్శింతుము ||మే|| *2 మధ్యాకాశములోని దూత పంక్తుల నడుమ మరియ సుతుడగు పించగా మరణమొందక మిగులు రారాజు జనులంతా కాంతి దేహములు దాల్చుచూ మెరుపు దీపాలై-మహిమ రూపాలై వరుని ముఖమును గాంతురు ||మే|| *3 దేవా దేవుని మహిమ దిశలెల్ల విరబూయ దేవసుతుడరుదెంచెను దయనొందు ప్రియులంతా కొలువు దీర్చగ ప్రభువు దానములు దయచేయును ధవళ వస్త్రాలు-నీతి మకుటాలు ముదమార ధరియింతుము ||మే|| *4 కలకాలము పంట వరుడేసు పరిణయము-కమనీయముగ సాగుచూ కళ్యాణకాంతులతో దేవాలోకపు కళతో వధువు వదనము మెరియగ కనకహారాలు పుణ్యవరాలు అక్షింతలై కురియుచుండ ||మే|| === code 314 title యేసు శీఘ్రముగా వచ్చున్‌ *ref యేసు శీఘ్రముగా వచ్చున్‌ ఆశతో కనిపెట్టుడి *1 గురుతులెల్ల-లోకమంతా సరిగ చూడ కాననగున్‌ పరిశుద్ధమైన ప్రవర్తనతో ప్రభుకై కనిపెట్టుడి ||యేసు|| *2 ప్రొద్దు గ్రుంకి-వచ్చునేమో అర్థరాత్రి యందేమో ఉదయము కోడికూతలపుడు వచ్చునేమో కనిపెట్టుడి ||యేసు|| *3 సిద్ధపడుడి-మీరిలలో మీరు దేవుని సంధింప సిద్ధపడుడి-తీర్పునకై ప్రభువుకై కనిపెట్టుడి ||యేసు|| *4 పరిశుద్ధులై-జీవించుడి ప్రభుని చిత్తము చేయుడి మరణమే యేసునందు సుమ్మా మేలుకొని కనిపెట్టుడి ||యేసు|| *5 యేసువలె-జీవించుడి తీసివేయుడి మలినములన్‌ మోసంపుటాశ-లన్ని విడిచి ఆశతో కనిపెట్టుడి ||యేసు|| *6 వేషధారణ విడచి మీరు యేసు ముద్రలు ధరియించి పెండ్లి కుమారుని సంధింప అందరు కనిపెట్టుడి ||యేసు|| *7 మేఘముపై-వెళ్లిన ప్రభు వేగముగ వచ్చు నిల సకల శ్రమలను-భరించి హల్లెలూయ పాడుడి ||యేసు|| === code 315 title పరిశుద్ధ జీవిత మరయుడి ధరనిక *ref పరిశుద్ధ జీవిత మరయుడి ధరనిక ప్రభురాక చాల సమీపమాయె తండ్రి వాగ్దానములు నెరవేరెనని సిద్ధపడుద మహా *1 కరువులు యుద్ధము కాటకములు - భూ-కంపములన్‌ హతులైరి జనుల్‌ విభుపాదముల్‌ సేవింప నెగయుటకై సిద్ధపడుద మహా ||పరి|| *2 రాజ గృహంబుల-పేదల యిండ్లను ప్రజలకు స్వస్థత లేదు గదా ప్రభు రాకడ కిదియును సూచన యని సిద్ధపడుద మహా ||పరి|| *3 ఆకాశ శక్తులు-భీకరముగ దమ మూకల బాసియు శాఖలాయె యేసు రాకడ కిదియును సూచన యని సిద్ధపడుద మహా ||పరి|| *4 జీవపు డాంభికులీ వసుధను దమ జీవపు టాశలలోన బడె దైవ జీవము బొందగ నందరమును సిద్ధపడుద మహా ||పరి|| *5 సౌందర్య రాశియు చక్కని రూపియు సత్య దూతాళితో సరగ వచ్చున్‌ ప్రభు సారూప్య మొందియు నెదురేగుటకు సిద్ధపడుద మహా ||పరి|| *6 పెండ్లి కుమారుడు ప్రేమ స్వరూపుడు విడిది గదిని-సిద్ధపరచె నహా ప్రియ కడ జను పెండ్లి కుమార్తెవలెన్‌ సిద్ధపడుద మహా ||పరి|| === code 316 title యేసురాజుగా వచ్చుచున్నాడు *ref యేసురాజుగా వచ్చుచున్నాడు భూలోకమంత తెలుసుకుంటారు రవికోటి తేజుడు-రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు *1 మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు పరిశుద్ధులందరిని-తీసుకుపోతాడు లోకమంతా శ్రమకాలం విడువబడుట బహు ఘోరం ||యేసు|| *2 ఏడేండ్లు పరిశుద్ధులకు విందౌబోతుంది ఏడేండ్లు లోకం మీదికి శ్రమరాబోతుంది ఈ సువార్త మూయబడున్‌ వాక్యమే కరువగును ||యేసు|| *3 వెయ్యేండ్లు యిలపై యేసు రాజ్యమేలును ఈ లోక రాజ్యములన్ని ఆయన యేలును నీతి శాంతి వర్ధిల్లున్‌ న్యాయమే కనబడును ||యేసు|| *4 ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర సాగిలపడి నమస్కరించి గడగడలాడును వంగనీ మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును ||యేసు|| *5 క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడ కనిపెట్టి ప్రార్థనచేయి సిద్ధముగా నుండి రెప్పపాటున మారాలి యేసయ్య చెంతకు చేరాలి ||యేసు|| === code 317 title 1 శ్రీయేసుయొక్కరాకడ *ref *1 శ్రీయేసుయొక్కరాకడ ఎంతో సమీపము ఈ ప్రొద్దొరేపొ యాకడ దినంబు వచ్చును మేఘాసనంబు నెక్కి తానా నాడు వచ్చును యావత్తు సృష్టి బొత్తిగా వినాశ మొందును హా!య దెంతయో యఘోరము యాదెంతమోసు మోదము దుర్మార్గికేయ ఘోరము విశ్వాసి మోదము *2 దాదాపు గుఱుతులన్నియు నీడేరియున్నవి ఆ చివరి గుఱుతుకూడను ఈడేరనైనది ఇంకేమి యడ్డులేదిక నొకడ్డుయున్నది శ్రీ క్రీస్తు స్వామి వేడు-చే నిల్చి యున్నది ||హా|| *3 ఆకాశమో ధ్వనించుచు గతించిపోవును భూతాదులన్ని రగులుచు గరంగి పోవును ఈ భూమి నిందు నుండెడి ఈ యెల్ల పనులును దహించిపోవు నగ్నిని సమూలమైనను ||హా|| *4 మృతుల్‌ సజీవులేకమై బల్‌స్తోమమౌదురు విశిష్టల్దుష్టులందుపై విభాగమౌదురు ఆ వేళ నీవు నేనును ఆ గొప్పగుంపునన్‌ నిల్చుందుమైనదేనిలో నుండెదము తెలియునా ||హా|| *5 ఆవేళ యేసునాథుడు ఆ గొప్ప గుంపుకే న్యాయంపు దీర్పుచేయును నిత్యంబు నుంటకే శిష్టాళికెల్ల నా ప్రభు డొసంగు మోక్షము దుష్టాళికెల్లనప్పుడు విధించునరకము ||హా|| *6 ఆవేదన స్థలానకు నేదప్పునట్లుగా నీయందె నిల్చి యుండుటకు నన్‌ గావు రక్షకా! హా! ఘోరమౌనఘోరమే మహా యఘోరమౌ నిన్‌ నమ్మి విడ్చు ద్రోహికే మహా యఘోరమౌ ||హా|| === code 318 title గగనము చీల్చుకొని యేసు *ref గగనము చీల్చుకొని యేసు ఘనులను తీసుకొని వేలాది దూతలతో భువికి వేగమె రానుండె *1 పరలోక పెద్దలతో పరివారముతో కదిలి ధర సంఘ వధువునకై తరలెను వరుడదిగో ||గగ|| *2 మొదటను గొఱ్ఱెగను ముదమారగ వచ్చెను కొదమసింహపు రీతి కదిలెను ఘర్జనతో ||గగ|| *3 కనిపెట్టు భక్తాళి కనురెప్పలో మారెదరు ప్రధమమున లేచెదరు పరిశుద్ధులగు మృతులు ||గగ|| === code 319 title నమ్మవద్దు నమ్మవద్దు *ref నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయలోకం నమ్మవద్దు ఇది ఆశజూపి మోసం జేయు ఈ మాయలోకం నమ్మవద్దు *1 నిన్నుగన్న తండ్రి యేడి నిన్ను గన్న తల్లి యేది పోయినార పోయినారా నిన్ను విడిచి పోయినారా ||గనుక|| *2 నీ అక్కలేరి చెల్లెండ్లేరి నీ అన్నలేరి తమ్ముండ్లేరి వారాశతో సంపాదించిన వారాస్థి పాస్తులన్ని ఏవి ||గనుక|| *3 ధనము సంపాదించేవారు ఈ ధరణియందు నిలువబోరు వారు పామునోట కప్పవలె సాగిపోదురు సమాధికి ||గనుక|| *4 నీవు వచ్చేటప్పుడు తేలేదుగా నీవు వెళ్ళేటప్పుడు మోయలేవుగా నీవు ఒంటరిగానే వచ్చినావు నీవు ఒంటరిగానే వెళ్లవలెను ||గనుక|| === code 320 title 1 మాయలోకమాయలోనేల *ref *1 మాయలోకమాయలోనేల మున్గి తిరిగెదవు కాయము నిన్ను మోసము చేయు కాలమాయెను మరణమువచ్చున్‌ మరణము వచ్చున్‌ లోకము ముగియున్‌ మానవులకు కృపకాలము దాటిపోవును *2 పాతాళము నిన్ను మ్రింగ కాచి నిల్చెను ప్రాణనాథుడేసు నిన్ను రక్షింప వచ్చెను ||మరణ|| *3 వేద వాక్యము మారక పూర్తియగును దేవకోపము మానవులపై పోయబడును ||మరణ|| *4 లోకము దిగుల్‌ కలహములతో తత్తరిల్లును మేఘమందు యేసురాజు కనిపించును ||మరణ|| *5 యేసు నేనే మార్గము సత్యము జీవము నేనే మోసపోకు డెందుమార్గము వేరే లే దనెను ||మరణ|| *6 పాపికై మరణించిన యేసు కాచి నిల్చెను పాపి నిన్ను పిలుచుచున్నాడు చెంత చేరుమా ||మరణ|| === code 321 title పరదేశులమో ప్రియులారా *ref పరదేశులమో ప్రియులారా మన-పుర మిదిగా దెపుడు నిజముగ ||పర|| *1 చిత్ర వస్తువులు-చెల్లెడి యొక వి-చిత్రమైన సంత-లోకము ||పర|| *2 సంత గొల్లు క్షమ-సడలిన చందం బంతయు సద్దణగున్‌ నిజముగ ||పర|| *3 మాయలోక మిది-ఛాయను బోలును మాయ మాయ మాయ-అంతయు *4 స్థిరమని నమ్మకు-ధర యెవ్వరికిని పరలోకమె స్థిరము-నిజముగ ||పర|| *5 మేడలు మిద్దెలు-మేలగు సరకులు పాడై కనబడవే-నిజముగ ||పర|| *6 ధనధాన్యంబులు-దరగక మానవు పనిపాటులు పోయె నిజముగ ||పర|| *7 వచ్చితి మిచటికి-వట్టి హస్తముల దెచ్చిన దేదియు లేదు గదా ||పర|| *8 ఎట్లు వచ్చితిమి-యీ లోకమునకు అట్లు వెళ్ళవలయున్‌-మింటికి ||పర|| *9 యేసు నందు వి-శ్వాసం బుంచిన వాసిగ నిను జేర్చున్‌-బరమున ||పర|| *1 యేసే మార్గము-యేసే సత్యము యేసే జీవముగా-నిజముగ ||పర|| === code 322 title కానాన్‌ పురము కరుగుదము *ref కానాన్‌ పురము కరుగుదము ఓ నా సోదరులారా ఓ నా సోదరులారా మానితంబౌ విందు నందు మనము చేరుదము *1 ఆ మహిమ నగరమందు ఆకలిదప్పులు లేవు ఆకలిదప్పులు లేవు క్షేమ మిచ్చు రాజ్యమందు చేరుదము రారే ||కానాన్‌|| *2 కన్నీరేమి కష్టంబేమి కానారాదే యందు కానరాదే యందు యెన్నడైన చూడనట్టి ఎన్నో వింతలుండు ||కానాన్‌|| *3 రత్న వజ్ర గోమేధికము రాజిల్లు తోరణముల్‌ రాజిల్లు తోరణముల్‌ ముత్యాల హారంబులను ముచ్చటగ బొందుదము ||కానాన్‌|| *4 సుప్రశస్తమైన విందు చూడ బోదామందు చూడ బోదామందు ఆ ప్రియంబౌ దూత శ్రేణిన్‌ నానందంబు నొంద ||కానాన్‌|| *5 పరమకానాన్‌ పురమునందు పనులు మనువులులేవు పనులు మనువులు లేవు హల్లెలూయ పాటలతో ఆనందంబు నొంద ||కానాన్‌|| === code 323 title యేసులో హర్షించెదము *ref యేసులో హర్షించెదము మహిమలో హర్షింతుము నిరతరం మహిమ మహిమ మహిమలో హర్షించెదము *1 పరిశుద్ధులుహర్షింప యేసు త్వరగా రమ్మని పలుక మారువారికి శిఖరం మనస్సారగ దేవుడిచ్చున్‌ మహిమ ఘనము మహిమలో నానందింప ||యేసులో|| *2 శుద్ధ జీవులైన దేవసుతులు ప్రకాశింపన్‌ సర్వసృష్టి యొక్క మహకర్మములన్నియు తీర రాజుకు మహిమ కలుగుదినములు రాగా ||యేసులో|| *3 స్ఫటిక జీవనదియు ఇరుప్రక్కల జీవ వృక్షమును ఆకలిదప్పులు లేక నట జీవఫలముల భుజించి తినుచు త్రాగుచు యేసులో నానందింప ||యేసులో|| *4 పరిశుద్ధాత్మయు, సుతుడు చేసిన రక్షణ కార్యమును తండ్రి దూతల గణముల్‌ నట జూచి ప్రహర్షింపన్‌ క్రొత ్తకార్యము కొరకు ఆనందింప ||యేసులో|| === code 324 title ఎపుడు చేరెద తేజ గృహమే *ref ఎపుడు చేరెద తేజ గృహమే ఎపుడు చేరెద నా నివాసం ఎపుడు చేరెదను *1 దేవుడే నాకై యుంచిన వాసస్థలమే చేరెద సంతోషమంద యేసురాజు నా కొరకై సిలువనే చేర ||ఎపుడు|| *2 ఆశతీర యేసు సముఖం మధుర గానమే నిత్యమే యేసుని నామం ప్రేమించియే నేను పాడ ఆశతీరునే ||ఎపుడు|| *3 చెల్లించెదనే స్తోత్ర బలియే ఎల్లవేళలను అర్పింతు స్తుతి ఘనమహిమ పేదనైన స్తోత్రము చేయ దేవుడనుగ్రహించె ||ఎపుడు|| *4 దైవకృపయే కరుణ యిదియే నేను చాటింప గీతముల్‌ దిన దినం మ్రోగ నిత్య కాలం ప్రేమహారం యేసుకే చెల్లున్‌ ||ఎపుడు|| *5 ధ్యానించగ నా హృదయ పూర్వక కృతజ్ఞతాస్తుతులే జ్ఞప్తియే యేసుని నగరం ప్రేమించియే నేను పాడ ఆశ తీరునే ||ఎపుడు|| === code 325 title స్తోత్రము సేయరే - సోదరులార *ref స్తోత్రము సేయరే - సోదరులార మన యాత్మలతో దండ్రిన్‌ ధాత్రిని మన పరమాత్ముని వాక్కులు స్తోత్రములో గలిపి ||స్తోత్రము|| *1 ఇచ్చట ప్రేమల కిదియే కడవరి వచ్చియున్న దేమో అచ్చట మన మందరము గలిసికొని యానందింతుముగా ||స్తోత్రము|| *2 ఎక్కువ ప్రేమలు-చక్కని స్తోత్రము లక్కడ మన మంత మిక్కిలి ప్రియుడగు దేవుని కిడుదము ఒక్క మనసుతోను ||స్తోత్రము|| *3 కన్నీరుండదు-చావు కష్టము లెన్నటికుండవుగా కన్నను మన శృంగారపు బ్రతుకు లెన్న దరముగాదె ||స్తోత్రము|| *4 వాగును వీణెలు-సాగును పాటలు సతతముగా నచట రాగములెంతో-రమ్యమై యుండును బాగింతన లేము ||స్తోత్రము|| *5 మరల నిచట గూ-డుదమో లేదో మన మందరము త్వరలో మన పర-లోకపు దండ్రి తోడనుందు మేమో ||స్తోత్రము|| *6 గొఱ్ఱెపిల్ల రక్తము-విలువచ్చట గొప్పది గాంతుముగా గురుతర మగు మన దేవుని ప్రేమను కూర్మితో జూతుముగా ||స్తోత్రము|| *7 పరమ తండ్రితో-ప్రభు యేసునితో బరిశుద్ధాత్మునితో స్థిరముగ నుందుము-మరి దూతలతో బరలోకము నందున్‌ ||స్తోత్రము|| === code 326 title పరలోక పట్టణము *ref పరలోక పట్టణము పండ్రెండు గుమ్మములు పండ్రెండు ముత్యములతో పదిలముగా కట్టబడె ||పరలోక|| *1 మండితంబగు పునాది సూర్యకాంతపు రాయి రెండవది నీలము మూడవది యమునా రాయి ||పరలోక|| *2 పచ్చ వైఢూర్యము కెంపు సువర్ణము అచ్చ గోమేధికము పుష్య రాగము తోడ ||పరలోక|| *3 పదియవది సూనియము పదకొండు పద్మరాగము పండ్రెండు సుగంధము పండ్రెండు ముత్యములు ||పరలోక|| *4 శుద్ధ సువర్ణ వీధుల్‌ స్వచ్ఛమైన స్ఫటికము సుందరముగా నుండు సిద్ధపడిరండి ||పరలోక|| *5 గొఱ్ఱెపిల్ల దీపం సూర్యుడక్కరలేదు భూరాజుల్‌ తమ మహిమన్‌ తీసికొని వచ్చెదరు ||పరలోక|| *6 జీవజలముల నది ప్రవహించు చుండెను జీవంబు గల్గును జీవించుదురు ప్రజలు ||పరలోక|| *7 ఇరుప్రక్కల నదికి జీవ వృక్షముండె పండ్రెండు నెలలకు పండ్రెండు కాపులు కాయు ||పరలోక|| === code 327 title మన బలమైన దేవాది దేవుని *ref మన బలమైన దేవాది దేవుని రాజ్యము సమీపమౌచున్నది తన కృపకాలము అతి త్వరితముగా నిల గతింపనై యున్నది *1 ఆకలిదప్పులుండవచట వ్యాధి బాధలు లేవచట విలాపములకు రోదన ధ్వనులకును తావులేదచట *2 సంతోష సునాదములు నీతి సమాధానములు ఆ రాజ్యమునకు ఆధారములై అవి నిలుచు కలకాలం *3 అక్షయ రాజ్యమునీయా రక్షకుడే నిను పిలువా తక్షణమాయన సైన్యములో చేరి సాగిపోయెదవా === code 328 title ఉన్నపాటున వచ్చు-చున్నాను *ref ఉన్నపాటున వచ్చు-చున్నాను నీ పాద-సన్నిధి కో రక్షకా యెన్న శక్యముగాని పాపము లన్ని మోపుగ వీపుపైబడి యున్న నిదె నడలేక తొట్రిలు చున్నవాడను నన్ను దయగను ||ఉన్న|| *1 కారుణ్యనిధియేసు-నా రక్షకా నీ శ-రీర రక్తము చిందుట భూరి దయతో నన్ను నీ దరి జేరరమ్మని పిలుచుటయుని ష్కారణపు నీ ప్రేమ యిది మరి వేరే హేతువు లేదు నా యెడ ||ఉన్న|| *2 మసి బొగ్గువలె నా మా-ససమెల్లగప్పె దో-ష సమూహములు మచ్చలై అసితమగు ప్రతి డాగు తుడువను గడటుగడిగి పవిత్రపరపను నసుపు లిడు నీ రక్తమే యని మసల కిప్పుడు సిలువ నిదెగని ||ఉన్న|| *3 వెలుపట బహు యుద్ధ-ములు లోపటను భయము-కలిగె నెమ్మది దొలగెను-పలు విధములగు సందియంబుల-వలనబోరాట ములచే నే-నలసి యిటునటు గొట్టబడి దు-ర్భలుడనై గాయములతో నిదె ||ఉన్న|| *4 కడు బీదవాడ నం-ధుడను దౌర్భాగ్యుడను-జెడిపోయి పడి యున్నాను-సుడివడిన నా మదికి స్వస్థత జెడిన కనులకు దృష్టి భాగ్యము బడయవలసినవన్ని నీచే-బడయుటకు నా యొడయడా యిదె ||ఉన్న|| *5 నీ వాగ్దాత్తము నమ్మి-నీపై భారము పెట్టి-జీవమార్గము గంటిని కేవలంబగు ప్రేమచేతను నీవు నన్ను క్షమించి చేకొని భావశుద్ధి నోనర్చి సంతోషావసరముల నిడుదువని యిదె ||ఉన్న|| *6 దరిలేని యానంద-కరమైన నీ ప్రేమ తరమే వర్ణన చేయను తెరవు కడ్డంబైన యన్నిటి-విఱుగ గొట్టెను గాననే నిపుడరుదుగా నీవాడ నవుటకు-మరి నిజము నీ వాడ నవుటకే ||ఉన్న||